శ్రీకాకుళం
న్యూస్‌రీల్
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?రెండేళ్లు దాటుతున్నా చంద్రబాబు హామీలు అమలు కాలేదు. వంశధార నిర్వాసితులకు ఇబ్బంది తప్పడం లేదు. –8లో
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
శ్రీకూర్మ నాథునికి హారతి
అరసవల్లిలో తిరువీధి
శ్రీకాకుళం మొండేటివీధిలో..
న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు
శ్రీకాకుళం క్రైమ్ : కొత్త ఏడాది సందర్భంగా ఎక్కడ ఈవెంట్ చేసుకున్నా పోలీసుల అనుమ తి పక్కాగా ఉండాలని, జనసంఖ్య, సాంస్కృతిక కార్యక్రమ వివరాలను తెలపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో మద్యం సరఫరాకు సంబంఽధించి బార్ అనుమతులు తప్పనిసరని, ఎకై ్సజ్ శాఖతో పాటు సంబంధిత ఇతర శాఖల అనుమతులు ఉండాలన్నారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ అనుసరించి డెసిబుల్స్ అధికం కాకుండా సౌండ్‌సిస్టమ్ పెట్టుకోవాలన్నారు. ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం వరకు ఉన్న హైవేతో పాటు పట్టణాలు, మండలాలు, ముఖ్య కేంద్రాలు, కూడళ్లలో కచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు డిసెంబర్ 31న నిర్వహిస్తామన్నారు. ఇంట్లో తాగినా, ఈవెంట్లో తాగినా, ఎక్కడ తాగినా.. రోడ్డుమీద తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రిమాండ్‌కు (జైలు) పంపడం ఖాయమని, లైసెన్సులు రద్దు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సెలబ్రేషన్ ముఖ్యమే కాని ఎదుటివారిని ఇబ్బంది పడితే సహించేది లేదని, రాత్రి ఒంటి గంట తర్వాత అన్నీ బంద్ చేయాలని ఎస్పీ అన్నారు.
షీటర్లపై మరింత నిఘా..
144 రౌడీషీట్లు, 204 సస్పెక్ట్ షీట్లు 2025లో తెరిచామని, 1870 హిస్టరీ షీటర్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని న్యూ ఇయర్ వేడుకల్లో గానీ, పండగ సమయాల్లో గానీ వీరి ఆగడాలు మీరితే సహించేది లేదన్నారు.
న్యూసెన్స్ కేసులో
నలుగురికి జైలు శిక్ష
శ్రీకాకుళం క్రైమ్ : నగరంలోని మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన దువ్వు సాయిపవన్, గంగారావు, రాజశేఖర్, అంబటి తరుణ్‌లు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి న్యూసెన్సు చేసినందుకు కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించిందని ఒకటో పట్టణ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
టెక్కలి డివిజన్‌లోకి నందిగాం మండలం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని నందిగాం మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్‌లోకి మారుస్తూ ప్రభుత్వం మంగళవారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. పరి పాలనా సౌలభ్యం, అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ప్రతిపాదించిన మార్పులపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం గవర్నర్ పేరిట ఈ గెజిట్ వెలువడింది. ఈ మార్పు డిసెంబరు 31, 2025 నుంచి అమలులోకి రానుంది. దీనితో టెక్కలి డివిజన్‌లోని మండలాల సంఖ్య 10కి చేరగా, పలాస డివిజన్‌లో 7 మండలాలు ఉండనున్నట్లు పేర్కొన్నారు.


