జోష్
మార్కెట్‌కు న్యూ ఇయర్
● ఆర్డర్లతో కిటకిటలాడుతున్న బేకరీలు, మిఠాయి దుకాణాలు
● నోరూరిస్తున్న విభిన్న కేకులు
శ్రీకాకుళం కల్చరల్: మార్కెట్‌లో న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. పండ్లు, పూల బొకేలు, పూలు, ప్లాస్టిక్ పూల బొకేలు, రకరకాల గ్రీటింగు కార్డులు, డైరీలు కొనుగోళ్లతో బజార్లు హడావుడిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్లాస్టిక్ బొకేలకు కాలం చెల్లి పోయింది. నిజమైన పూలన్నీ ఒక గుచ్చంగా చేసి లైవ్ బొకేలను విక్రయిస్తున్నారు. వీటి కోసం పూలను ప్రత్యేకంగా బెంగళూరు నుంచి అనేక రంగులతో రకాలు తెప్పిస్తున్నారు. గుభాళిస్తున్న సువాసనలతో రూపొందించిన బొకేలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పూలతో కాకుండా పండ్లను ఒక బుట్టలో పెట్టి అందంగా ప్యాక్ చేసి వాటిని కూడా అమ్ముతున్నారు. డైరీలు, క్యాలెండర్లు కూడా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. పేర్లు, ఫొటోలతో సహా డైరీలను తయారు చేయిస్తుండడం గమనార్హం.


