ట్రేడ్‌టెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం
ఎచ్చెర్ల : ఉపాది, శిక్షణా శాఖ(విజయవాడ) ఆదేశాల మేరకు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (ప్రైవేటు) 2026 సంవత్సరానికి గాను ఐటీఐ ప్రైవేటు అభ్యర్థులుగా ఎన్‌టీసీ సర్టిఫికెట్ పొందే పరీక్ష రాసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 28లోగా సమీప ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఎచ్చెర్ల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్ విద్యార్హత కలిగి ఉండి, 21 ఏళ్లు నిండి, సంబంధిత ట్రేడ్‌లో మూడేళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలన్నారు.
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
మెళియాపుట్టి: హీరాపురం గ్రామానికి చెందిన కిల్లి శ్యామసుందరరావు(65) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయన ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినప్పటికీ.. భార్య లలిత అన్నీ తానై వ్యవహరించి భర్త చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది.


