యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన
రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస రైతు సేవా కేంద్రం, రణస్థలం మండలం వెల్పురాయి గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా రబీ 2025–26 సీజన్‌లో పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు పూర్వ అభ్యాస గుర్తింపు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకుడు సీహెచ్ వెంకటరావు మాట్లాడుతూ మొక్కజొన్న, వరి పంటలలో ఎరువుల యాజమాన్యం, పురుగు తెగుల యాజమాన్య పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి.ఉదయ్ బాబు, రణస్థలం డివిజన్ ఏడీఏ వి.శ్రీనివాసరావు, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి వై.సురేష్, రణస్థలం, లావేరు మండలాల వ్యవసాయాధికారులు డి.విజయభాస్కర్, డి.మహేష్‌నాయుడు, మాజీ సర్పంచ్ ముప్పిడి మురళీమోహన్, ఏఈవోలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.


