పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గార: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. మంగళవారం గొంటి పంచాయతీ సచివాలయం వద్ద పర్యావరణ పరిరక్షణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రకృతిని పెంపోందించే కార్యక్రమంలో భాగంగా దీపావళి గ్రామంలో ప్రతి ఇంటి వద్ద మొక్క నాటాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్ చల్ల శ్రీనివాసరావు, ఎన్జీవో ఎం.సింహాచలం, వీఆర్‌వో కిరణ్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


