జీఓ ప్రకారం జీతాలు చెల్లించాలి
శ్రీకాకుళం: రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు, పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ డిమాండ్ చేశారు.
మంగళవారం శ్రీకాకుళం రిమ్స్ ముఖద్వారం వద్ద కార్మికుల నిర్వహిస్తున్న రెండో రోజు రిలే దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తున్న క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలను తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జీవో –138 ప్రకారం రూ.18,600 చొప్పున జీతం, బకాయిలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏకెఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాష్, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మామిడి క్రాంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


