నకిలీ బిల్లులపై విచారణేదీ?
జిల్లాలో నాలుగైదు పర్యాయాలు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నకిలీ బిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న లారీలు పట్టుబడ్డాయి. జాయింట్ కలెక్టర్ దగ్గరి నుంచి సీఐ స్థాయి అధికారి వరకు నకిలీ బిల్లుల బాగోతాన్ని కళ్లారా చూశారు. దొరికినాక రెండు రోజులు సంబంధిత లారీలను పట్టుకుని, ఆపై మైనింగ్ అధికారులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అసలు నకిలీ బిల్లుల సృష్టికర్త ఎవరు? ఎక్కడి నుంచి నకిలీ బిల్లులు వస్తున్నాయి? ఏ డివైజ్ నుంచి నకిలీ బిల్లులు సృష్టించారు? ప్రభుత్వం జారీ చేసిన బిల్లుల మాదిరిగా నకిలీ బిల్లులు ఉండటం వెనక కారణమేంటి? దీనికంతటికీ వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్ ఏమిటీ? ఇలా లోతుగా విచారణ చేసిన దాఖలాలు కనిపించలేదు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుండగా.. అక్రమార్కులు రూ.వందల కోట్లు వెనకేసుకుంటున్నారు.


