
పునరాలోచన చేయాలి..
నేను 10 ఎకరాల్లో కొబ్బరి, జీడి సాగుచేస్తున్నాను. గత ఏడాది రూ.2లక్షల పంట రుణం బ్యాంకులో తీసుకున్నాను. మే మూడో వారంలో రెన్యువల్ చేసుకోవాలి. రూ.రెండు లక్షల అసలు, వడ్డీ రూ.14000 కలిపి మొత్తం కడితేనే లోన్ రెన్యువల్ అవుతుందని చెబుతున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇంత భారీ మొత్తం సమీకరించడానికి ప్రైవేట్ అప్పు ఒక్కటే మార్గం. ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
– ఎన్ని అశోక్, రైతు, చండిపురం,
కవిటి మండలం