
మరిడమ్మకు ప్రత్యేక పూజలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్‌లో వెలసి ఉన్న మరిడమ్మ తల్లికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని మొక్కుతీర్చుకున్నారు. ఏటా వైశాఖమాసంలో మరిడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రీకాకుళం నుంచి
సాలూరుకు ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: సాలూరులో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ప్ర యాణికుల సౌకర్యార్థం ఈ నెల 18 నుంచి 21 వరకు పాలకొండ, పలాస, టెక్కలి, శ్రీకాకుళం–1, శ్రీకాకుళం 2వ డిపోల నుంచి 356 బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మే రకు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. వీటిలో శ్రీకాకుళం నుంచి రాజాం వరకు 80 బస్సులు, రాజాం నుంచి సాలూరు వరకు 180 బస్సులు, బొబ్బిలి నుంచి సాలూ రు వరకు 96 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. పండగ కోసం బస్సులు వేసినందున జిల్లాలోని పలు సర్వీసులు రద్దవుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గ్రహించి ఆర్టీసీ అధికారులకు సహకరించాలని కోరారు.
లోపాలు ఉంటే సహించబోము
● గ్రానైట్ క్వారీల యాజమాన్యాలను హెచ్చరించిన ఆర్డీఓ కృష్ణమూర్తి
టెక్కలి: గ్రానైట్ క్వారీల నిర్వహణలో లోపాలు ఉంటే సహించేది లేదని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి హెచ్చరించారు. ఇటీవల మెళియాపుట్టి మండలం ధీనబందుపురం సమీపంలో గ్రానైట్ క్వారీలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఆదివారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో క్వారీ యాజమానులతో పాటు మైన్స్, రెవె న్యూ అధికారులు, పోలీస్ సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల పలు మండలాల్లో గ్రానైట్ క్వారీ నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల క్వారీ లో సంభవించిన సంఘటనలో యాజమాన్యం తప్పుదోవ పట్టించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగుపాటు వల్ల కార్మికులు మృతి చెందారని మొదట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆ తర్వాత తమ దర్యాప్తులో బ్లాస్టింగ్ వలన చనిపోయినట్లు గుర్తించామని ఆర్డీఓ గుర్తు చేశారు. ఇకపై రెవెన్యూ, మైన్స్, పోలీస్, పంచాయతీ అధికారులతో ఒక బృందంగా ఏర్పడి క్వారీల్లో తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. తనిఖీలు జరిగిన అనంతరం క్లియరెన్స్ ధ్రువీకరణం పత్రం పొందిన తర్వాతే కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశా రు. డివిజన్ పరిధిలో సుమారు 170 వరకు గ్రానైట్ క్వారీలు ఉంటే, వాటిలో సుమారు 70 వరకు క్వారీల్లో నిబంధనలు పాటించడం లేదని ప్రాథమికంగా తెలిసిందన్నారు. క్వారీ ల్లో పని భద్రత లేకపోవడం, కనీస వేతనాలు అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా పేలుడు పదార్థా లు వినియోగించడం, కనీస భద్రత పాటించకుండా రోడ్లపై గ్రానైట్ బ్లాక్‌లను తరలించడంపై మండిపడ్డారు. సమావేశంలో ఏఎస్పీ శ్రీనివాసరావు, మైన్స్ ఏడీ విజయలక్ష్మి తో పాటు డివిజన్ పరిధిలో తహసీల్దార్లు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజినీరింగ్ కార్మికుల గౌరవాధ్యక్షుడు టి.తిరుపతిరావు, అధ్యక్ష, కార్యదర్శులు వై.శ్యామలరావు, ఆర్.సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు కనీసం పెన్షన్ రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగర జనాభాకనుగుణంగా ఇంజనీరింగ్ కార్మికుల సంఖ్య పెంచాలన్నారు.

మరిడమ్మకు ప్రత్యేక పూజలు