
ఆర్టీసీ బస్సు– ఆటో ఢీ
గార: కళింగపట్నం నుంచి బందరువానిపేటకు వెళ్లే రోడ్డులో ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌తో సహా 12 మందికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బందరువానిపేటలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది కుందువానిపేట పండగకి వెళ్లి తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో కె.మత్స్యలేశం గ్రామశివారులోని మలుపు వద్ద బందరువానిపేట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్‌ను ఢీకొట్టారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను రెండు అంబులెన్సుల ద్వారా తొలుత కళింగపట్నం పీహెచ్‌సీకి, అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరిలో గనగళ్ల లక్ష్మీ, దేవిశ్రీ కాలుకు గాయాలవ్వగా.. అప్పారావుకు బలమైన గాయమైంది. డ్రైవర్‌తో పాటు మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. గార ఏఎస్‌ఐ ఎం.చిరంజీవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎం.హరికృష్ణ తెలిపారు.
డ్రైవర్‌తో సహా 12 మందికి గాయాలు