
నోటికి ప్లాస్టర్ చుట్టుకుని..
● యువకుడి ఆత్మహత్య
శ్రీకాకుళం రూరల్: నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా ముక్కులో దూది పెట్టుకున్నాడు. చేతులను కుర్చీ వెనక్కి కట్టుకున్నాడు. ఇలా ప్రాణం పోకపోతే.. ఎలాగైనా చనిపోవాలని నాలుగు రకాల కత్తులను రెడీగా ఉంచుకున్నాడు. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో దాసరి ఉమామహేశ్వరరావు (26) అనే యువకుడు సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం రూరల్ మండ లం రాగోలు గ్రామం షిర్డీ సాయినగర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
దాసరి ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో ని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిరంజీవి ఎకై ్సజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. తమ్ముడు బెంగళూరులో ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఉమామహేశ్వరరావుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒక్కడే ఇంటిలో ఉంటున్నాడు. ఏమైందో గానీ సోమవారం రా త్రి తలుపునకు గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భోజనం కోసం బంధువులు ఎంత తలుపు తట్టినా తీయకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి.. కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
బాధ తెలియకూడదనేనా..
పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించా రు. మృతుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నా రు. నొప్పి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. ముందుగా వీల్‌చైర్‌లో కూర్చుని నోటికి పది రౌండ్ల టేపును చుట్టుకున్నాడని, ముక్కులో దూది పెట్టుకుని, రెండు చేతులను కుర్చీ వెనక్కి కట్టుకునేలా ఏ ర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు వివరించారు. ఈప్లాన్ సక్సెస్ కాకపోతే మరోలాగైనా చనిపోవడానికి నాలుగు రకాల కత్తులు ఉంచుకున్నాడని పేర్కొన్నారు. మృతుడి చిన్నాన్న దాసరి ప్రభాకర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.