Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Deputy CM Pawan Kalyan Warn TFI1
సినీ ఇండస్ట్రీకి పవన్‌ కల్యాణ్‌ బెదిరింపులు!

సాక్షి, విజయవాడ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ(TFI)పై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వంపై పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్లు, నిర్మాతలు, లీజుదార్లుపై విల్లు ఎక్కిపెట్టిన ఆయన.. వారిని టార్గెట్ చేస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేశారు. తన చిత్రం హరిహర వీరమల్లు కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) నిన్న తన మంత్రి దుర్గేష్ చేత.. థియేటర్లపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇవాళ నేరుగా తన కార్యాలయం నుండి హెచ్చరికతో కూడిన ఒక ప్రకటన విడుదల చేయించారాయన. ‘‘గతంలో అల్లుఅరవింద్, అశ్వనీదత్, దిల్ రాజు, సుప్రియ, చినబాబు, నవీన్ ఎర్నేని కలిశారు. అందరినీ రమ్మంటే ఎవ్వరూ రాలేదు. తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కూడా కలవలేదు. కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తున్నారు. ఇకమీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరపేది లేదు. వ్యక్తిగతంగా చర్చలుండబోవు... వ్యక్తిగతంగా వచ్చి టిక్కెట్ ధర పెంచమని కోరడం(Tickets Rate Hike) ఎందుకు..?. అందరినీ కలిసి రమ్మంటే ఎవ్వరూ రాలేదు..?. ఇది మాకు తెలుగు సినిమాలో కొందరు ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్. ఈ రిటర్న్‌ గిఫ్ట్‌కు తగ్గట్లే మేమూ పని చేస్తాం. సినిమా థియేటర్ల ఆదాయంపై ఆరా తీస్తున్నాం. థియేటర్లను యజమానులు నడపడం లేదు. లీజు దారులే థియేటర్లను నడుపుతున్నారు. లీజు దార్ల నుండి పన్ను వస్తుందా లేదా..? అని పరిశీలిస్తున్నాం. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ అధిక ధరలను కూడా తనిఖీ చేస్తాం. థియేటర్ల పైకి తనిఖీ బృందాలను పంపుతాం. మల్టీప్లెక్స్ లలో టిక్కెట్ల ధరలపై కూడా విచారణ జరుపుతాం. మల్టీప్లెక్స్ లలో ఆహారపదార్థాలపై కూడా తనిఖీలు చేస్తాం. ఇకమీదట కేవలం సినిమా సంఘాలతోనే చర్చిస్తాం’’ అని పవన్‌ పేరిట ప్రకటన వెలువడింది.

New Angel Comes To Light In Vizianagaram Terror Conspiracy Case2
ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు

సాక్షి, హైదరాబాద్: సిరాజ్‌ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్‌లో మకాం వేసిన సిరాజ్‌.. సమీర్‌ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్‌కు చెందిన ఫర్హాన్‌ మోయినుద్దీన్‌ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాదర్‌తో సిగ్నల్‌ యాప్‌ ద్వారా సిరాజ్‌ కాంటాక్ట్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.సిరాజ్‌ సోషల్‌ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ వీడియోలకు సిరాజ్‌ కౌంటర్‌ ఇవ్వగా.. సిరాజ్‌ కౌంటర్‌ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్‌కు ఇంకా గట్టి కౌంటర్‌ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్‌కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్‌ మీడియా చాటింగ్స్‌ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు.రాజాసింగ్‌తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన.. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సోషల్‌ మీడియా ద్వారానే సిరాజ్‌తో టచ్‌లో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్‌ను కాంటాక్ట్‌ చేసిన అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

Shah Rukh Khan As Brand Ambassador of Candere3
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Ministers Tension On Ys Jagan Prakasam District Visit4
వైఎస్‌ జగన్‌ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు

సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మంత్రుల హడావుడి మొదలైంది. వైఎస్‌ జగన్‌ దెబ్బకు మంత్రులు దిగొచ్చారు. పొగాకు రైతులతో మార్టూరులో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలువురు రైతులతో మాట్లాడారు. 28 లోపు పొగాకు కొనుగోలు జరపాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఆశ ఎక్కువ .. పంట పండించక ముందు ఆలోచించాలి. పండించాక నష్టపోయామని బాధపడకూడదంటూ వ్యాఖ్యానించారు. మార్కెట్ లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు.కాగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాలబాట పట్టించిందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన వైఎస్‌ జగన్‌ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు.

IPL 2025 PBKS vs DC Jaipur: Check Scores And Result Here5
స‌మీర్ రిజ్వీ మెరుపులు.. పంజాబ్‌పై ఢిల్లీ ఘ‌న విజ‌యం

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యంతో ముగించింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది. పంజాబ్ విధించిన 207 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడ‌టంతో ఐదు ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగులు చేసింది. అయితే, ఆరో ఓవ‌ర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి ఢిల్లీ వికెట్ న‌ష్టానికి 61 ప‌రుగులు చేసింది.ఆ త‌ర్వాతి ఓవ‌ర్ల‌లో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుట‌య్యాడు. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ క‌రుణ్ నాయ‌ర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించ‌గా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అట‌ల్ (22) ఫ‌ర్వాలేద‌నిపించాడు. ఈ క్ర‌మంలో ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దే బాధ్య‌త తీసుకున్న స‌మీర్ రిజ్వీ ధ‌నాధ‌న్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 ప‌రుగులు చేసిన అత‌డు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు.మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్స‌ర్ల సాయంతో 58 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఆఖ‌ర్లో ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ 18 ప‌రుగుల‌తో అత‌డికి తోడుగా నిలిచాడు. ఈ క్ర‌మంలో మ‌రో మూడు బంతులు మిగిలి ఉండ‌గానే ఢిల్లీ ల‌క్ష్యాన్ని అందుకుంది. ఇక పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్‌, ప్ర‌వీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై క‌న్నేసిన పంజాబ్‌ ఈ ఓట‌మితో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలోనే కొన‌సాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్ల‌తో ఉన్న పంజాబ్ ఆఖ‌రిదైన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై గెలిస్తేనే టాప్‌-2లో నిలిచే అవ‌కాశం ఉంటుంది. శ్రేయ‌స్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులుఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. జైపూర్ వేదిక‌గా శ‌నివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 206 ప‌రుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ ర‌హ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వ‌ద్ద పెవిలియ‌న్‌కు పంపాడు.అయితే, మ‌రో ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) క‌లిసి ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దారు. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లో 53 ప‌రుగులు సాధించాడు. కానీ శ్రేయ‌స్ అవుటైన త‌ర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మ‌ళ్లీ నెమ్మ‌దిగా సాగింది.నేహాల్ వ‌ధేరా (16), శ‌శాంక్ సింగ్ (11) నిరాశ‌ప‌ర‌చ‌గా.. మార్క‌స్ స్టొయినిస్ మెరుపుల‌తో పంజాబ్ 200 ప‌రుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 ప‌రుగులతో రాణించాడు. ఆఖ‌ర్లో హ‌ర్‌ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 ప‌రుగుల‌తో స్టొయినిస్‌తో క‌లిసి నాటౌట్‌గా నిలిచాడు.ఇక‌ ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ ర‌హ్మాన్ మూడు వికెట్లు తీయ‌గా.. విప్రాజ్ నిగ‌మ్‌, కుల్దీప్ యాద‌వ్ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Who is Anushka Yadav RJD Tej Pratap New Girl Friend Details Here6
గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన లాలూ కొడుకు

ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌(Tej Pratap Yadav) అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. సింగిల్‌ స్టేటస్‌కు గుడ్‌బై చెబుతూ తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంచిన ఆమెను, తన ప్రేమను ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా తెలియజేయడం గమనార్హం.అనుష్క యాదవ్‌(Anushka Yadav) అనే అమ్మాయితో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని, తాము గతకొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియక ఇలా పోస్ట్ ద్వారా తెలియజేశానని, అంతా తనను అర్థం చేసుకుంటారని వెల్లడించారాయన. ఈ పోస్ట్‌ బీహార్‌లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొందరు తేజ్‌ ప్రతాప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మరికొందరు వివాహం ఎప్పుడని ఆరా తీస్తున్నారు. ఇంకొందరు అనుష్క యాదవ్‌ నేపథ్యం కోసం తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న ఈ యువనేత.. తాను అక్కడ సింగిల్‌గా లేననే విషయాన్ని తాజా పోస్టుతో స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్‌-రబ్రీదేవి జంటకు తొమ్మిది మంది సంతానం. ఆరుగురు కూతుళ్ల తర్వాత ఏడో సంతానంగా తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ జన్మించాడు. చిన్న కొడుకు, మాజీ మంత్రి తేజస్వి యాదవ్‌ చివరి సంతానం. అయితే తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు గతంలో వివాహం జరిగింది.బీహార్‌ మాజీ మంత్రి చంద్రికా రాయ్‌ కూతురు ఐశ్వర్య(Tej Pratap Yadav Wife Aishwarya)తో 2018లో తేజ్‌ ప్రతాప్‌ వివాహం అయ్యింది. అయితే ఆ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. తనను ఐశ్వర్య పట్టించుకోవడం లేదని తేజ్‌ ప్రతాప్‌, అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఐశ్వర్య ఐదు నెలలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తుండగా.. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది.

Amid Resignation Buzz Bangladesh Muhammad Yunus Aide Reacts7
‘రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదే!’

ఢాకా: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్‌ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్‌ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్‌ యూనస్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్‌ మీడియా హౌజ్‌లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్‌ సిటిజన్‌ పార్టీ (NCP) చీఫ్‌ నహిద్‌ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్ ఉజ్‌ జమాన్‌కి యూనస్‌ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్‌ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్‌ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్‌ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్‌ పట్టుబడుతున్నారు.

UP Doctor Babu Cross Dressing Photos Videos Viral Then This Happend8
రచ్చకెక్కిన డాక్టర్‌బాబు కాపురం

ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్‌ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్‌మెంట్‌ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్‌ సంత్‌ కబీర్‌ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్‌ వరుణేష్‌ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్‌పూర్‌ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్‌ వరుణేష్‌ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్‌ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఆమె డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!.

Indian Businessman Arrives In Helicopter To Take Delivery Of Bentley Bentayga9
కారు కొనడానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియో

గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో ధనవంతులైన వ్యాపారవేత్తల సంఖ్య పెరిగింది. వారిలో చాలామంది భారతదేశంలో స్థిరపడ్డారు, మరికొందరు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లారు. వ్యాపారవేత్తల జీవన విధానం చాలా విలాసవంతంగా ఉంటుంది. కాబట్టి వీరు రోజువారీ వినియోగానికి సైతం ఖరీదైన కార్లు ఉపయోగిస్తుంటారు. ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ కారు కొనుగోలు చేయడానికి ఏకంగా హెలికాఫ్టర్‌లో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.కేరళలోని మలప్పురంలో ఉన్న ఫ్రాగ్రెన్స్ వరల్డ్ కంపెనీ ఓనర్.. 'మూసా హాజీ' హెలికాప్టర్‌లో వచ్చి.. బెంట్లీ బెంటాయెగా డెలివరీ తీసుకున్నారు. కారును మూసా హాజీ స్వయంగా డ్రైవ్ చేస్తుండగా.. కాన్వాయ్‌లో రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్లు కదిలాయి.ఇక్కడ కనిపించే బెంట్లీ కారు ఈడబ్ల్యుబీ వెర్షన్ అని తెలుస్తోంది. రోజ్ గోల్డ్ షేడ్‌లో పూర్తయిన ఈ కారు ధర రూ.6 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..బెంట్లీ బెంటయెగా ఈడబ్ల్యుబీ వెర్షన్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులోని 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌.. గరిష్టంగా 550 పీఎస్ పవర్, 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు అంబానీ ఫ్యామిలీ దగ్గర కూడా ఉంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india)

Bollywood Actor Mukul Dev Dies At 5410
బాలీవుడ్‌లో విషాదం.. రవితేజ ‘కృష్ణ’ విలన్‌ ఇక లేరు

బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్‌ దేవ్‌(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.సీరియల్‌ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ముకుల్‌ దేవ్‌ (Mukul Dev) బాలీవుడ్‌ మూవీ ‘దస్తక్‌’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు. ముకుల్‌ దేవ్‌కి టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్‌ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్‌ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్‌ ది ఎండ్‌’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘అతడు’ చిత్రాల్లో నటించిన రాహుల్‌ దేవ్‌ సోదరుడే ముకుల్‌. తల్లిదండ్రుల మరణంతో ముకుల్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.చ‌ద‌వండి: క‌న్న‌ప్ప టీమ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మంచు మ‌నోజ్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement