
ఊరి కోసం మాటామంతీ వర్చువల్‌కార్యక్రమానికి ముందే స్క్రిప్టు
ఎవరిని అనుమతించాలి? ఏం మాట్లాడాలో ముందే రిహార్సల్
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి భవానీ థియేటర్‌లో గురువారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా నిర్వహించిన మన ఊరి కోసం మాటామంతీ కార్యక్రమం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఆయనేనని తెలుస్తోంది. ఎవరిని థియేటర్‌లోకి అనుమతించాలి? ఏం మాట్లాడాలో ముందే శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఈ కార్యక్రమానికి రావివలస గ్రామాన్ని ఎంపిక చేశారు. వర్చువల్ పద్ధతి ద్వారా ఉప ముఖ్యమంత్రి గ్రామస్తుల సమస్యలు తెలుసుకోవాలి.
అయితే ఆ గ్రామస్తులనే లోపలకు వెళ్లనివ్వకుండా రెవెన్యూ అధికారుల ఆదేశాలతో పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులనూ అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా టీడీపీ, జనసేనకు చెందిన మండల స్థాయి నాయకులనూ థియేటర్లోకి అనుమతించకపోవడం గందరగోళానికి దారి తీసింది. కొందరు పాస్‌లు ఉన్న వారినీ పోలీసులు అత్యుత్సాహంతో ఆపేశారు.
ప్రతి జిల్లాలో బయో డైవర్సిటీ పార్క్
విజయవాడ: అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో బయో డైవర్సిటీ పార్క్, ప్రతి గ్రామంలో పల్లె వనం ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.