
న్యూఢిల్లీ: పాకిస్తాన్ విమానాలపై విధించిన గగనతల నిషేధాన్ని కేంద్రం శుక్రవారం జూన్ 23వ తేదీ వరకు పొడిగించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల నడుమ కొనసాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ విమానాలపై గగనతల నిషేధం విధించడం తెల్సిందే.
దీని ప్రకారం..పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు లేదా లీజు/అద్దె విమానాలతోపాటు మిలటరీ విమానాలు సైతం భారత గగనతలంలోకి ప్రవేశించరాదు. భారత్‌లో రిజిస్టరయిన, భారతీయులు నిర్వహించే విమానాలేవీ జూన్ 24వ తేదీ ఉదయం వరకు తమ గగనతలంలోకి ప్రవేశించరాదంటూ అంతకుముందు పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.