
పీటలపై వధువు మొండిపట్టు
వివాహ వేడుక భగ్నం
హాసన్‌లో విడ్డూరం
యశవంతపుర(కర్ణాటక): సినిమాలో మాదిరిలో తాళి కట్టే సమయంలో ఆటంకం ఏర్పడింది, వధువు ఈ పెళ్లి చేసుకోనని మొండికేయడంతో వరునితో సహా అందరూ అవాక్కయ్యారు. హాసన్ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఆదిచుంచనగిరి కళ్యాణ మంటపంలో పల్లవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేణుగోపాల్ అనే వధూవరులకు ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది.
అన్నిశాస్త్రాలను పూర్తి చేశారు. వధూవరులను పెళ్లి వేదికపై తీసుకొచ్చి మాంగళ్య ధారణ పూర్తి చేసే సమయంలో వధువు ఈ పెళ్లి వద్దని స్పష్టంచేసింది. వేరే యువకున్ని ప్రేమిస్తున్నాను, అతనినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి, తన గదిలోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు బుజ్జగించారు, పోలీసులకు తెలిసి వారు కూడా వచ్చి రాజీ చర్చలు చేశారు. కానీ పెళ్లికూతురు మెట్టు దిగలేదు.
ముందే చెప్పి ఉంటే..
ఇంత జరగడంతో వరుడు వేణుగోపాల్‌కు కూడా అవమానం జరిగినట్లు కావడంతో ఈ వివాహం చేసుకోనని చెప్పేశాడు. ఈ పరిణామాలతో వధువు తల్లిదండ్రులు ఎంతగానో విలపించినా పల్లవి మనసు కరగలేదు. ఆమె ప్రేమ విషయం తెలియదు. తెలిసి ఉంటే పెళ్లిని కుదిర్చేవాళ్లమే కాదు అని బంధువులు తెలిపారు. తల్లిదండ్రులు షాక్‌లో ఉండటం వల్ల ఏమి మాట్లాడలేక పోతున్నారు. లక్షలాది రూపాయలను పెళ్లికి ఖర్చు చేశారు. అన్ని రకాలుగా నష్టపోయారు. ఇక పెళ్లికొడుకు వారు కూడా బాగా వ్యయం చేశారు, ఆ మొత్తం పెళ్లికూతురు కుటుంబం నుంచి ఇప్పించాలని పోలీసులను కోరారు. పరువు తీశావు కదే అని బంధువులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు.
*ಹಾಸನ: ಮಾಂಗಲ್ಯಧಾರಣೆ ವೇಳೆ ಬಂತು ಪ್ರಿಯಕರನ ಕರೆ…! ಮದುವೆ ನಿಲ್ಲಿಸಿ ಎಂದು ಕುಸಿದುಬಿದ್ದ ವಧು…!*https://t.co/XvQIrQfQlS
*Download the App and know your city news* - https://t.co/HTbKZOoDTa pic.twitter.com/ZhmWNnEAGF— PublicNext (@ElectReps) May 23, 2025