గుజరాత్‌లో పాకిస్థాన్‌ గూఢచారి అరెస్ట్‌ | Gujarat Man Arrested For Spying For Pak Shared Key Info On Air Force | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో పాకిస్థాన్‌ గూఢచారి అరెస్ట్‌

May 24 2025 4:02 PM | Updated on May 24 2025 6:49 PM

Gujarat Man Arrested For Spying For Pak Shared Key Info On Air Force

కచ్‌: సరిహద్దు భద్రతా దళం (BSF), భారత వైమానిక దళం (IAF)కు సంబంధించిన కీలక రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని గుజరాత్‌లోని కచ్‌లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అరెస్ట్‌ చేసింది. ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్న సహ్‌దేవ్ సింగ్ గోహిల్‌ అనే వ్యక్తి,.. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్‌ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకోగా.. ఆమె పాకిస్థాన్‌ ఏజెంట్‌ అని అతనికి ఆ తర్వాత తెలిసింది.

కొత్తగా నిర్మిస్తున్న బీఎస్‌ఎఫ్‌, ఐఏఎఫ్‌ సైట్‌ల ఫోటోలు వీడియోలు ఆమె అడగటంతో వాట్సాప్‌ ద్వారా వాటిని పంపించాడని గుజరాత్ ఏటీఎస్‌ సీనియర్‌ అధికారి కే సిద్ధార్థ్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో గోహిల్ తన ఆధార్ వివరాల ద్వారా ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశాడని.. పాక్‌ మహిళా ఏజెంట్‌తో సంప్రదింపుల కోసం వాట్సాప్‌ను యాక్టివేట్ చేశాడు.

ఆ తర్వాత పాకిస్థాన్‌ ఏజెంట్ ఉపయోగిస్తున్న ఆ నంబర్ నుంచి బీఎస్‌ఎఫ్‌, ఐఏఎఫ్‌ సదుపాయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్  చేశాడు. గూఢచార చర్యకు పాల్పడిన గోహిల్‌కు గుర్తు తెలియని వ్యక్తి రూ.40,000 చెల్లించినట్లు నిర్ధారించిట్లు ఏటీఎస్‌ అధికారి తెలిపారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement