
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు. సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. కరుణ్ నాయర్, శార్థూల్ ఠాకూర్ వంటి వెటరన్ ప్లేయర్లు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. టెస్టు క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న షమీని సెలక్టర్లు ఎందుకు పక్కన పెట్టరాన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్‌కు షమీని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు.
"షమీ గత వారం రోజులగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేయించుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్ మొత్తం ఆడే సామర్థ్యం అతనికి ఇంకా రాలేదు. సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేస్తే షమీపై వర్క్ లోడ్ పడుతోంది. మా వైద్య బృందం సూచన మేరకు అతడిని ఈ సిరీస్‌కు పక్కన పెట్టాల్సి వచ్చింది.
షమీ ఈ సిరీస్‌కు ఫిట్‌గా ఉంటాడని మేము కూడా ఆశించాము. కానీ దురదృష్టవశాత్తూ అతడి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ఫిట్‌నెస్ లేని ప్లేయర్ ఎంపిక చేయడం కంటే వేరే ఆటగాడికి అవకాశమివ్వడం ఉత్తమమని భావించాము. అందుకే షమీని ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయలేదు" ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు.
షమీ తన చివరి టెస్టు మ్యాచ్.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. 34 ఏళ్ల మహ్మద్ షమీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి.. 229 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 3.30 ఉంది. ఈ ఫార్మాట్‌లో అతను 6 సార్లు 5 వికెట్ల హాల్‌తో సత్తా చాటాడు.
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన