టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌.. అధికారిక ప్రకటన | India squad for England Tests out, Gill to captain | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌.. అధికారిక ప్రకటన

May 24 2025 1:40 PM | Updated on May 24 2025 5:07 PM

India squad for England Tests out, Gill to captain

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. 

అదేవిధంగా శుబ్‌మన్ గిల్ డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను నియమించారు. ఇక ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్న యువ సంచ‌ల‌నం సాయిసుద‌ర్శ‌న్‌, అర్ష్‌దీప్ సింగ్‌ల‌కు తొలిసారి భార‌త టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది. 

మ‌రోవైపు దేశ‌వాళీ క్రికెట్‌లో ప‌రుగులు వ‌రద పారిస్తున్న మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్‌ కరుణ్ నాయ‌ర్‌కు సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి నాయ‌ర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. క‌రుణ్ నాయ‌ర్‌తో పాటు శార్ధూల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి పున‌రాగ‌మ‌నం చేశాడు. ఈ జ‌ట్టులో మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం అంద‌రి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అదేవిధంగా ఆసీస్ టూర్‌లో భాగ‌మైన హ‌ర్షిత్ రాణా, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు సెల‌క్ట‌ర్లు ఈసారి మొండి చేయి చూపించారు. కాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement