చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు | IMD Says Southwest Monsoon Set Reached Kerala | Sakshi
Sakshi News home page

చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

May 24 2025 12:16 PM | Updated on May 24 2025 2:51 PM

IMD Says Southwest Monsoon Set Reached Kerala

తిరువనంతపురం: దేశంలో రైతులకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కన్నా 8 రోజులు ముందుగానే ఈ రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రుతు పవనాల ఎఫెక్ట్‌తో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ఇక, నైరుతి రుతుపవనాలు రాకతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో, మున్సిపల్‌ శాఖ సిబ్బంది రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement