
ఘజియాబాద్: దేశంలో కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవి వైద్యశాఖను, ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. కోవిడ్ -19(Covid-19) కేసులు పెరుగుతున్న దృష్ట్యా వివిధ రాష్ట్రాల్లోని వైద్య విభాగాలు అప్రమత్తమయ్యాయి. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్(Ghaziabad)లో నలుగురు కోవిడ్-19తో బాధపడుతున్నట్లు గుర్తించామని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నారని, వారికి వైద్య సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. కాగా వీరిలో ఒక బాధితురాలు ఘజియాబాద్‌లోని కుషాంబీలోగల యశోదా ఆస్పత్రిలో చేరారని స్థానిక చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేష్ మోహన్ మీడియాకు తెలిపారు.
ఆస్పత్రిలో చేరిన బాధితురాలు(18) ఘజియాబాద్‌లోని బ్రజ్‌విహార్‌కు చెందిన యువతి అని, ఆమె దగ్గు, జ్వరంతో బాధపడుతున్నదన్నారు. ఆమెకు యశోదా ఆస్పత్రిలో కోవిడ్ టెస్టు జరిగిందని, పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నదని మోహన్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఉగ్రవాదుల వేటకు భారత్-నేపాల్ సంయుక్త ఆపరేషన్