
హాంబర్గ్: జర్మనీలోని హాంబర్గ్(Hamburg)లో ఘోరం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఒక దుండగుడు కత్తితో జరిపిన దాడిలో 12 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం హాంబర్గ్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కనీసం 12 మంది వరకూ గాయపడ్డారని జర్మనీకి చెందిన బిల్డ్ వార్తాపత్రిక పేర్కొంది. ఈ ఘటనలో అనుమానిత దుండగుడిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు.
#hh2305 #Hamburg
Nach ersten Erkenntnissen soll eine Person im #Hauptbahnhof mehrere Menschen mit einem Messer verletzt haben. Die tatverdächtige Person wurde von den Einsatzkräften festgenommen.— Polizei Hamburg (@PolizeiHamburg) May 23, 2025
ఈ దాడిలో గాయపడిన వారిలో ముగ్గురు బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. దాడికి గల కారణం ఏమిటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదని బిల్డ్ తెలిపింది. రైల్వే స్టేషన్(Railway station)లోకి అకస్మాత్తుగా చొరబడిన ఒక వ్యక్తి పలువురిని గాయపరిచినట్లు బిల్డ్ పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు హాంబర్గ్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు.
ఇది కూడా చదవండి: కొంకణ్ రైల్వే విలీనం.. ఇప్పుడేం జరగనుంది?