
భారత టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త నాయకుడొచ్చాడు. రోహిత్ శర్మ వారసుడు ఎవరో తేలిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే గిల్‌కే భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది.
దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంజాబీ క్రికెటర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పేర్కొన్నాడు.ఇక అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగిన గిల్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కదా సక్సెస్ అంటూ గిల్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ 2020లో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు.
25 ఏళ్ల వయస్సులోనే?
భారత టెస్టు జట్టుకు 17 ఏళ్ల తర్వాత యువ కెప్టెన్ వచ్చాడు. 2008లో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుంచి భారత టెస్టు జట్టు పగ్గాలను ఎంఎస్ ధోని చేపట్టాడు. అప్పటికి ధోని వయస్సు 27 ఏళ్లు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు భారత జట్టును మిస్టర్ కూల్ నడిపించాడు. అనంతరం 2014 డిసెంబరులో ధోనీ నుంచి కోహ్లికి టెస్టు కెప్టెన్సీ దక్కింది.
అప్పటికి విరాట్‌కు 27 ఏళ్లు. కోహ్లి సరిగ్గా ఏడేళ్ల పాటు రెడ్‌బాల్ ఫార్మాట్‌లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. 2021 ఆఖరిలో కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అతడి వారుసుడిగా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు.
రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యేటప్పటికి అతడి వయస్సు 34 ఏళ్లు. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్‌మన్ గిల్ 25 ఏళ్ల వయస్సులోనే కొత్త టెస్టు కెప్టెన్‌గా నియిమితుడయ్యాడు. దీంతో దిగ్గజ కెప్టెన్లు ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కంటే అతి తక్కువ వయస్సులోనే టీమిండియా నాయకుడిగా ఎంపికై గిల్ చరిత్ర సష్టించాడు.
ఓవరాల్‌గా భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంపికైన ఐదవ అతి పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. గిల్ ప్రస్తుత వయస్సు 25 సంవత్సరాల 285 రోజులు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల 77 రోజులు) అగ్రస్దానంలో ఉన్నాడు.
👉గిల్ ఇప్పటివరకు 32 టెస్టులు ఆడి 35.06 సగటుతో 1893 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 7 హాఫ్ సెంచరీలు, ఐదు శతకాలు ఉన్నాయి.
టెస్టుల్లో అతి పిన్న వయస్కులైన భారత కెప్టెన్లు వీరే..
మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల, 77 రోజులు)
సచిన్ టెండూల్కర్ -(23 సంవత్సరాల, 169 రోజులు)
కపిల్ దేవ్ (24 సంవత్సరాల, 48 రోజులు)
రవి శాస్త్రి (25 సంవత్సరాల, 229 రోజులు)
శుబ్‌మాన్ గిల్ (25 సంవత్సరాల, 285 రోజులు)
చదవండి: ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ