
ఒక నైజీరియన్ వ్యక్తి భారతదేశంలోనే ఎందుకు ఉన్నాడో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరో దేశానికి ఎందుకు వెళ్లాలనపించలేదో కూడా వివరించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యిన వెంటనే భారత్‌లో అడగుపెట్టి ఇక్కడే ఉండిపోయానని..అంతగా ఈ దేశం తనలోకి కలుపుకుందంటూ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అంతేగాదు ఇక్కడే ఉండిపోవాలనిపించేంతగా ఇష్టం పెరగడానికి గల కారణాలేంటో కూడా షేర్ చేసుకున్నాడు. మరి అవేంటో చూద్దామా..!
పాస్కల్ ఒలాలే అనే నైజీరియన్ వ్యక్తి భారతదేశం తనకెంత సౌకర్యవంతంగా అనిపించిందో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తాను 2021 లాగోస్ విశ్వవిద్యాలయం నుంచి బయటకు రాగానే నేరుగా భారతదేశంలో అడుగుపెట్టానని, ఆ క్షణం నుంచే ఈ దేశం నుంచి కాలు బయట పెట్టలేదని, తిరిగి ఏ విదేశాలకు వెళ్లలేదని చెప్పుకొచ్చాడు.
ఇక్కడ ఆహారం, భద్రత, బస, వివక్ష వరకు అన్నింటిల్లోనూ స్వచ్ఛమైన స్వేచ్ఛను పొందానని ఆనందంగా చెబుతున్నాడు ఒలాలే. అంతేగాక తాను ఇక్కడే ఉండిపోవడానికి గల ప్రధాన కారణాలను కూడా వివరించాడు.
ఇక్కడ ప్రతి ఉదయం ఆందోళనతో మేల్కొను, ఎలాంటి టెన్షన్‌లేని ప్రశాంత జీవనం గడుపుతాను
అలాగే నా చర్మం రంగు కారణంగా బెదరింపులు ఎదుర్కొనడం అనేవి ఇక్కడ ఉండవు.
ఇక్కడ హాయిగా జీవించొచ్చు, ఎలాంటి హడావిడి కల్చర్ ఉండదు
ప్రజలు ముక్కుసూటిగా ఉంటారు, మంచి నిజాయితీ ఉంటుంది
తనది నల్లజాతి అని తన జాతిని నిరంతరం గుర్తు చేసేలా వివక్షకు తావుండదు.
అలాగే యూఎస్‌లో కంటే ఇక్కడ రాత్రిపూట వీధుల్లో సురక్షితంగా వెళ్లగలను
ఇంటి అద్దె చౌక, ఆహారం సహజమైనది, ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
స్వేచ్ఛ అనేది చాలా దేశాల్లో అది కాగితాలకే పరిమితమై ఉంది, కాని ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
నా ఆహార్యాన్ని బట్టి కాకుండా కేవలం ఒక వ్యక్తిగా గౌరవం లభిస్తుంది.
అందువల్లే ఏ విదేశాలకు వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోయానని, ఇదొక స్వర్గసీమ అంటూ కితాబులిచ్చేశాడు. అందుకు సంబంధిచిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మిస్టర్ ఓలాలే మా దేశానికి స్వాగతం, మీ మాటలు వింటుంటే ఒక భారతీయుడిగా చాలా గర్వపడుతున్నా..అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: జస్ట్ 32 ఏళ్లకే కోటీశ్వరురాలిగా యూట్యూబర్.! ఆ సీక్రెట్ ఇదే..)