
భారతదేశంలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ ఆరోగ్య సంరక్షణపై నెట్టంట షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకోవడమే కాదు చర్చనీయాంశంగా మారింది. అంతేగాదు అక్కా మీరు చాలా బాగా చెప్పారంటూ ఆము ప్రశంసల వర్షం కురింపించారు నెటిజన్లు. అంతేగాదు అత్యంత నిజాయితీగా మాట్లాడిన తీరు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె పోస్ట్‌లో ఏం రాసిందంటే..
భారతదేశంలో గత కొన్నేళ్లుగా నివశిస్తున్న క్రిస్టెన్ ఫిషర్ భారతదేశం, అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల తీరు ఎలా ఉంటుందో సోష్‌ల మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇరు దేశాల్లోని ఆస్పత్రులు, వైద్యులు, మందులు పరంగా ఆరోగ్య సంరక్షణ ఏ దేశంలో బాగుంటుందో వెల్లడించింది. ఖర్చు, ఔషధాల పరంగా భారతదేశం బెటర్ అని, అదే యూఎస్‌లో ఈ పరంగా రోగిపై అత్యధిక భారం పడుతుందని తెలిపింది.
అలాగే అపాయింట్‌మెంట్ దొరకడం కూడా కష్టం అని అన్నారు. భారత్‌లో అపాయింట్‌మెంట్‌తో పనిలేకుండానే క్లినిక్‌కి వెళ్లగలం, పైగా సమయం కూడా ఎక్కువ పట్టదని అంటోంది. అలాగే డాక్టర్లు వైద్యుడిని పర్యవేక్షించే విషయంలో కూడా భారత్ బెటర్ అని, ఎందుకంటే క్షుణ్ణంగా అతడిని విచారించి..చికిత్స అందిస్తుందని, యూఎస్‌లో రోగితో డాక్టర్ స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, పైగా అంత సమయం కేటాయించేందుకు ఇష్టపడరనికూడా పేర్కొంది.
ఇక ఆస్ప్రతిలో అందించే భోజనం పరంగా అమెరికా బెటర్ అని, కానీ రోగికి ఇచ్చే మెనూ ఆధారంగా వారి పర్యవేక్షకులకు అదే ఆహారం ఉంటుందని, అంత మెరుగ్గా లేదని అన్నారామె. మొత్తంగా చూస్తే ఆరోగ్య సంరక్షణ భారత్‌లోనే బాగుంటుంది, ఇక్కడ వైద్య ఖర్చు తక్కువే, పైగా మందులు కూడా సులభంగా దొరుకుతాయంటూ పోస్ట్‌లో తన అభిప్రాయాన్ని రాసుకొచ్చిందామె. ఈ పోస్ట్ నెట్టింట చర్చకు దారితీయడమే గాక, నిజాయితీగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
అదీగాక మా దేశాన్ని అభినందిస్తుందన్నందుకు అక్కా మీపై రోజురోజుకి గౌరవం పెరిగిపోతుందోందటూ పోస్ట్‌లు పెట్టారు నెటిజన్లు. కాగా, ఆమె గతంలో కూడా పలు విషయంలో భారత్‌లోనే పిల్లలు మంచిగా పెరుగుతారని, ఈ నేల నివశించడానికి అనువైనదని, ఎవ్వరినైనా తనలో కలిపేసుకునే ఆకర్షణ ఈ ప్రదేశంలో ఉందంటూ భారత్‌పై పొగడ్తల వర్షం కురిపించింది కూడా.
(చదవండి: ఆర్మీ ఆఫీసర్‌గా అందాలరాణి..!)