
చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించాలని, లక్షాధికారి కావాలనే అనుకుంటారు. అయితే ఎక్కడో ఒకచోట అంచనా తప్పడం, ఆ తర్వాత డబ్బులు చాలక ఇక్కట్లుపడటం జరుగుతుంటుంది. ఒక్కోసారి పక్కాప్లాన్‌తో ఆర్జించడమే ధ్యేయంగా ప్రయత్నించినా కూడా..అందిరికీ అంత ఈజీగా వర్కౌట్ కాదు. దాంతో సంపాదనలో వెనుకబడుతుంటారు. మధ్యతరగతి లేదా ఓ మోస్తారుగా ఇంటి అవసరాలకు సరిపోయే డబ్బును మాత్రమే కూడబెట్టగలుగుతుంటారు. అలా ఇబ్బందిపడుతున్న వాళ్లకి ఈ యూట్యూబర్ చెప్పే అమోఘమైన ఆర్థిక పాఠాలు ఉపయోగపడొచ్చు. అయితే ఆమె చెబుతున్న విషయాలు వింటే..ఇదేంటి ఈమె ఇలా అంటోందేంటీ అని విస్తుపోవడం మాత్రం ఖాయం. అయితే మనం తేలిగ్గా చూసేవి మన సంపాదనకు అత్యంత కీలమైనవని ఆమె ఆర్థిక చిట్కాల ద్వారా తెలుస్తుంది. ఇంతకీ అదేంటంటే..
యూట్యూబ్‌లో మంచి ఆర్థిక విద్యావేత్తగా పేరు తెచ్చుకున్న మాజీ వాల్‌స్ట్రీట్ వ్యాపారి రోజ్ హాన్ అద్భుతమైన ఫైనాన్షియల్ పాఠాలను చెబుతోంది. మనం అంతంగా పట్టించకోనివే..మన డబ్బు సంపాదనకు అత్యంత కీలకం అంటోందామె. మనం సాధారణంగా ఖర్చు చేసే వాటిపై దృష్టిపెట్టం. మనం గనుక ఆ బిల్లులపై ఫోకస్ పెట్టి చవకగా పొందే ప్రయత్నం చేస్తే..కోట్లాధికారి కావడం ఈజీ.
ఇదేంటీ అనుకోకండి..మనం చేసే కొనుగోళ్లపై కాస్త జాగురకతతో వ్యవహరించమని అంటోంది. ఒక వేళ్ల మీరు కొనాలనుకున్న వస్తువు రేటు చూసి..కాస్త మంచిగా బేరమాడాలి. అతడు మన ప్రపోజల్‌ని అంగీకరించేలా మన వాక్‌ఛాతుర్యం ఉండాలట. ఇలాంటిదే తక్కువ ధరకు చూశానని ఒప్పించాలి. అలాగే ఒక వస్తువుని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాననేది వివరించాలి. అలాగే ఈ ప్రొడక్ట్ పై ఉన్న అభిమానం గురించి చెప్పి ఇంప్రెస్ చేసి తక్కువ ధరకే వస్తువుని పొందే ప్రయత్నం చేస్తే..సగం వృధా ఖర్చులు ఆదా అవుతాయట.
వాటిలోకి ఇంటర్నెట్, ఫోన్ ప్లాన్‌లు, బీమా, క్రెడిట్ కార్డ్ APRలు, స్ట్రీమింగ్ సేవలు, వైద్య బిల్లులు తదితరాలన్ని ఉంటాయి. అయితే ఇలాంటి వాటికి బ్రదర్ కాస్త తగ్గించి వేయమని అడగలేం కదా అని భావించకూడదని అంటోంది రోజ్‌హాన్. అధిక మొత్తంలో సేవింగ్స్ చేయాలనుకున్నా లేదా డబ్బుని ఆర్జించాలన్నా..ఈ మాత్రం జాగ్రత్త ఉండాలంటోంది. అలాగే సదరు ఓనర్ పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకుని, మాటలతో అతడి మనసుని గెలుచుకునే ప్రయత్నం చేస్తే..మనకు నచ్చిన వస్తువు తక్కువ ధరకే లభిస్తుందని చెబుతోందామె.
ఒకవేళ మీ మాటలకు అతడు పడ్డట్లు కనిపించలేదంటే.అతడి సూపర్‌వైజర్ లేదా రిటెన్షన్ విభాగాన్ని అడగండి. తప్పక మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. అదే సమయంలో ఒక్కోసారి విభిన్నకరమైన ఫలితాలు కూడా రావొచ్చు. కానీ ఏదోరకంగా మనీ సేవింగ్ అనేదే వారి లక్ష్యం అయితే..కచ్చితంగా ఇలాంటి వాటిపై ఫోకస్ పెడితే మంచి ఫలితాలను సత్వారంగా అదుకుంటారని చెబుతోందామె. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారి చర్చలకు తెరలేపాయి.
కాగా, కొరియన్ అమెరికన్ రోజ్ హాన్ 32 ఏళ్లకే సుమారు రూ. 88 లక్షల విద్యార్థి రుణాన్ని చెల్లించి స్వీయ నిర్మిత కోటీశ్వరురాలు అయ్యిందామె. ఆమె ఇలాంటి ఆర్థిక పాఠాలతో యూట్యూబ్‌లో ఫేమస్ అవ్వడమే కాదు, ఆ నేపథ్యంలోనే ఆమె ఛానెల్‌కి మిలయన్‌కిపైగా ఫాలోవర్లు ఉండటం విశేషం.
(చదవండి: కైరాన్ అంటే మాటలు కాదు!)