నో బ్రా.. నో ఎగ్జామ్‌!! | Shocking Video Viral University staff Touching Female Students | Sakshi
Sakshi News home page

నో బ్రా.. నో ఎగ్జామ్‌!!

Jun 19 2025 8:35 PM | Updated on Jun 19 2025 8:37 PM

Shocking Video Viral University staff Touching Female Students

ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం

ఆ అమ్మాయిలంతా పరీక్ష రాసేందుకు క్యూ లైన్‌లో నిలబడ్డారు. ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తున్న క్రమంలో.. వాళ్ల ముఖంలో హవభావాలు మారిపోతున్నాయి. తనిఖీల పేరుతో అక్కడి సిబ్బంది ఇబ్బందికరంగా తాకుతుండడమే అందుకు కారణం. అదీ అధికారిక పద్ధతిలోనే కావడం ఇంకా దారుణం. 

ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఓ వీడియోపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెతుతున్నాయి. పరీక్షా హాల్‌లోకి ప్రవేశించే ముందు మహిళా విద్యార్థులను బ్రా ధరించారా? లేదా? అని ఛాతీ భాగాన్ని తాకుతూ కనిపించారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో వ్యక్తిగత గౌరవం, మానవ హక్కులు, మరియు లైంగిక సమానత్వం వంటి అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది.  

నైజీరియాలోని ఒలాబిసీ ఒనాబంజో యూనివర్సిటీలో (Olabisi Onabanjo University - OOU) చోటు చేసుకుంది. పరీక్షకు హాజరయ్యే బాలికలు, విద్యార్థినుల కోసం డ్రెస్‌ కోడ్‌ రూల్స్‌ పెట్టింది. కురచ దుస్తులు వేసుకున్నా.. శరీర భాగాలు కొంచెం కనిపించినా అది వర్సిటీ నైతికతను దెబ్బ తీసే అంశమని పేర్కొంది. పైగా ఎదుటివాళ్లను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని తెలిపింది. ఈ క్రమంలో నో బ్రా.. నో ఎంట్రీ ఫర్‌ ఎగ్జామ్‌ రూల్‌ను కఠినంగా అమలు చేయించింది. 

📌 ఘటనపై యూనివర్సిటీ పెద్దలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. No bra, no exam అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముయిజ్ ఒలాటుంజీ ఈ విధానంపై మిశ్రమ స్పందన తెలియజేశారు. అయితే.. 

⚖️ మానవ హక్కుల సంఘాల ప్రతినిధి హరునా అయాగీ మాత్రం ఇది విద్యార్థుల హక్కులను ఉల్లంఘించే చర్యగా పేర్కొంటూ, చట్టపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించారు.

🎓 చేదు అనుభవం ఎదురైన ఆ విద్యార్థినులు మాత్రం.. ఈ విధానాన్ని లైంగిక వేధింపుగా అభివర్ణించారు. 

👉గమనిక: పై వీడియో కేవలం వార్తకు అనుగుణంగా సమాచారం అందించడానికి మాత్రమే. అశ్లీలతను పెంపొందించడం కోసమో లేదంటే ఎవరినీ అగౌరవపర్చడం కోసమో కాదు

Advertisement
 
Advertisement
Advertisement