
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు విధ్వంసకర హాఫ్ సెంచరీలు సహా పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అతను.. తాజాగా మరోసారి రెచ్చిపోయాడు.
గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 7) జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లోనే అర్ద శతకం బాదాడు. మొత్తంగా 18 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. పోలార్డ్ బ్యాట్‌తో బీభత్సం సృష్టించినప్పటికీ ఈ మ్యాచ్‌లో అతని జట్టు ఓడిపోయింది.
🚨 KIERON POLLARD SMASHED 54* FROM JUST 18 BALLS IN CPL 🚨
- 50 runs came through Boundaries. 🤯🔥 pic.twitter.com/hpY3SoQ2Zt— Johns. (@CricCrazyJohns) September 7, 2025
ఈ సీజన్‌లో ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరిన నైట్‌రైడర్స్ గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పోలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నైట్‌రైడర్స్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది.
కీసీ కార్టీ (34 బంతుల్లో 29 రిటైర్డ్ ఔట్), డారెన్ బ్రావో (35 బంతుల్లో 33) టెస్ట్ మ్యాచ్‌ను తలపించేలా బ్యాటింగ్ చేసి నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌కు డ్యామేజ్ చేశారు. విధ్వంసకర ఆటగాళ్లు కొలిన్ మున్రో (17), అలెక్స్ హేల్స్ (7), పూరన్ (13) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. వారియర్స్ బౌలర్లలో మొయిన్ అలీ (4-0-11-1), ఇమ్రాన్ తాహిర్ (4-0-38-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్ గెలుపు కోసం శ్రమించింది. అకీల్ హొసేన్ (4-0-35-2), సునీల్ నరైన్ (4-0-12-2), నాథన్ ఎడ్వర్డ్స్ (4-0-30-1) ఉస్మాన్ తారిక్ (4-0-36-1) రాణించడంతో మరో బంతి మాత్రమే మిగిలుండగా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
ఓ పక్క వికెట్లు పడుతున్నా, డ్వేన్ ప్రిటోరియస్ (26 నాటౌట్) చివరి దాకా క్రీజ్‌లో నిలబడి వారియర్స్‌ను గెలిపించాడు. అంతకుముందు షాయ్ హోప్ (53), షిమ్రోన్ హెట్‌మైర్ (49) వారియర్స్ గెలుపుకు పునాది వేశారు.