breaking news
Trinbago Knight Riders
-
నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా సీఎస్కే దిగ్గజం
త్వరలో ప్రారంభం కానున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఐపీఎల్ ఫైవ్ టైమ్ ఛాంపియన్ సీఎస్కేకు చెందిన దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావోను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ మేరకు నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ ఇవాళ (జూన్ 20) అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత సీజన్ వరకు నైట్‌రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా ఫిల్ సిమన్స్ ఉండేవాడు. సిమన్స్ బంగ్లాదేశ్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండటంతో ఈ పదవి నుంచి తప్పుకున్నాడు.నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా ఎంపిక కావడంపై బ్రావో హర్షం వ్యక్తం చేశాడు. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న ఈ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా పని చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా సిమన్స్ ఈ ఫ్రాంచైజీని అద్భుతంగా ముందుండి నడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా కొత్త సవాళ్లు స్వీకరించేందుకు సిద్దమని అన్నాడు.బ్రావో కోచింగ్ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం..2022లో ఐపీఎల్ నుంచి రిటైరైన బ్రావో.. కోచ్‌గా తన ప్రయాణాన్ని సీఎస్కేతోనే మొదలుపెట్టాడు. 2023 సీజన్లో అతను సీఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేశాడు. ఆతర్వాత 2024 సీజన్లో ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబి నైట్‌రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు కేకేఆర్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. ఈ మధ్యలో బ్రావో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేశాడు. అతని ఆథ్వర్యంలో ఆ జట్టు 2024 టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్ వరకు చేరి చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ ఘనతలో బ్రావో పాత్ర చాలా కీలకంగా ఉండింది.పొట్టి క్రికెట్లో దిగ్గజ ఆల్‌రౌండర్ అయిన బ్రావోకు స్వదేశంలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్‌లో బ్రావో 107 మ్యాచ్‌ల్లో 129 వికెట్లు తీసి నేటికీ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. -
CPL 2025: ప్రపంచ ప్రమాదకర బ్యాటర్లంతా ఒకే జట్టులో.. బౌలర్లకు దబిడిదిబిడే..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ డ్రాఫ్ట్ (వేలం) జూన్ 18న జరిగింది. ఇందులో ప్రపంచవాప్తంగా ఉన్న చాలామంది స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఆరు ఫ్రాంచైజీలు (ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్, బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్, సెయింట్ లూసియా కింగ్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్) తమకు నచ్చిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.డ్రాఫ్ట్‌కు ముందే పలువురు హై ప్రొఫైల్ ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారారు. ప్రీ డ్రాఫ్ట్ పిక్స్‌లో భాగంగా జేసన్ హోల్డర్, అలిక్ అథనాజ్ బార్బడోస్ రాయల్స్ నుంచి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు తరలి వెళ్లారు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ బదులుగా ఈ వర్తకం జరిగింది. ఇలాంటి మార్పులు డ్రాఫ్ట్‌లో చాలా చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది డ్రాఫ్ట్‌లో ఓ కొత్త డెవలెప్మెంట్ చోటు చేసుకుంది. డ్రాఫ్ట్ చివరి మూడు రౌండ్లలో వెస్టిండీస్ బ్రేక్అవుట్ లీగ్‌లో (లోకల్ లీగ్) పాల్గొన్న ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి.డ్రాఫ్ట్ ముగిసిన అనంతరం అన్ని ఫ్రాంచైజీలు తమతమ జట్లను ప్రకటించాయి. అన్ని జట్లను పరిశీలించాక ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచంలోని అతి ప్రమాదకర బ్యాటర్లంతా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టులో ఉన్నారు. ఈ ఫ్రాంచైజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్‌కు సిస్టర్ ఫ్రాంచైజీ. ఇందులో కీరన్ పోలార్డ్, నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, అలెక్స్ హేల్స్, కొలిన్ మున్రో లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. వీరిని చూస్తే ప్రపంచంలో ఎంతటి గొప్ప బౌలర్‌కు అయిన వణుకు పట్టాల్సిందే.సీపీఎల్ 2025 డ్రాఫ్ట్ అనంతరం పూర్తి జట్లు ఇలా ఉన్నాయి..ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ : కీరాన్ పొలార్డ్ , ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్, అలెక్స్ హేల్స్, అకేల్ హోసేన్, మహ్మద్ అమీర్, కాలిన్ మున్రో, ఉస్మాన్ తారిక్, అలీ ఖాన్, డారెన్ బ్రావో, యానిక్ కరియా, కీసీ కార్టీ, టెర్రెన్స్ హిండ్స్, మెక్కెన్నీ క్లార్క్, జాషువా డా సిల్వా, నాథన్ ఎడ్వర్డ్సెయింట్ లూసియా కింగ్స్ : టిమ్ డేవిడ్, అల్జరి జోసెఫ్, జాన్సన్ చార్లెస్, టిమ్ సీఫెర్ట్, రోస్టన్ చేజ్, తబ్రైజ్ షంసి, డేవిడ్ వైస్, డెలానో పోట్గీటర్, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖారీ పియరీ, జావెల్లె గ్లెన్, మికా మెకెంజీ, షడ్రక్ డెస్కార్టే, జోహన్ జెరెమియా, కియోన్ గాస్టన్, అకీమ్ అగస్టేగయానా అమెజాన్ వారియర్స్: ఇమ్రాన్ తాహిర్, షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, షాయ్ హోప్, గ్లెన్ ఫిలిప్స్, గుడాకేష్ మోటీ, మోయిన్ అలీ, షమర్ జోసెఫ్, కీమో పాల్, డ్వైన్ ప్రిటోరియస్, షమర్ బ్రూక్స్, కెమోల్ సావరీ, హసన్ ఖాన్, జెడియా బ్లేడ్స్, కెవ్లాన్ ఆండర్సన్, క్విన్టిన్ సాంప్సన్, రియాద్ లతీఫ్బార్బడోస్ రాయల్స్ : రోవ్‌మన్ పావెల్, బ్రాండన్ కింగ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వింటన్ డి కాక్, ముజీబ్ ఉర్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, జోమెల్ వారికన్, కదీమ్ అలీన్, షక్కెరె ప్యారిస్, కోఫీ జేమ్స్, నైమ్ యంగ్, రివాల్డో క్లార్క్, జీషన్ మొటారా, జోహన్ లేన్, రామోన్ సిమ్మండ్స్ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్ : ఇమాద్ వసీం, షకీబ్ అల్ హసన్, ఫాబియన్ అల్లెన్, నవీన్-ఉల్-హక్, ఒబెద్ మెక్కాయ్, జస్టిన్ గ్రీవ్స్, బెవాన్ జాకబ్స్, జేడెన్ సీల్స్, అల్లా గజాన్ఫర్, రహకీమ్ కార్న్‌వాల్, ఓడియన్ స్మిత్, జ్యువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్, అమీర్ జాంగూ, కరీమా గోర్, కెవిన్ విఖం, జాషువా జేమ్స్సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ : కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, రిలీ రోసౌవ్, ఎవిన్ లూయిస్, ఫజల్హాక్ ఫరూకీ, కార్బిన్ బాష్, వకార్ సలామ్ఖైల్, ఆండ్రీ ఫ్లెచర్, అలిక్ అథనాజ్, మొహమ్మద్ నవాజ్, డొమినిక్ డ్రేక్స్, మిఖైల్ లూయిస్, అష్మద్ నెడ్, జెర్మియా లూయిస్, జైడ్ గూలీ, నవీన్ బిడైసీ, లెనికో బౌచర్కాగా, ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్ అగస్ట్ 14 నుంచి సెప్టెంబర్ 21 వరకు జరుగుతుంది. -
కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా బార్బడోస్ రాయల్స్
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ ఛాంపియన్‌గా బార్బడోస్ రాయల్స్ నిలిచింది. నిన్న (ఆగస్ట్ 29) జరిగిన ఫైనల్లో రాయల్స్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఏడాది టైటిల్ సొంతం చేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. జెనీలియా గ్లాస్గో (24), శిఖా పాండే (28), కైసియా నైట్ (17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆలియా అలెన్ 4 వికెట్లు తీసి నైట్‌రైడర్స్‌ను భారీ దెబ్బకొట్టింది. హేలీ మాథ్యూస్ 2, చినెల్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు.94 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. చమారీ ఆటపట్టు (39 నాటౌట్) రాణించడంతో 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హేలీ మాథ్యూస్ (13), క్యియాన జోసఫ్(14), లారా హ్యారిస్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సమారా రామ్‌నాథ్ 2, అనిసా మొహమ్మద్, జెస్ జొనాస్సెన్, శిఖా పాండే తలో వికెట్ పడగొట్టారు. నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బకొట్టిన ఆలియా అలెన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన హేలీ మాథ్యూస్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
సూపర్ ఓవర్లో నైట్‌రైడర్స్ విజయం
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇరు జట్లు 128 పరుగులకు పరిమితం కాగా.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన అమెజాన్ వారియర్స్ ఆరు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి ఐదు పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా నైట్‌రైడర్స్ విజయబావుటా ఎగురవేసింది.వివరాల్లోకి వెళితే.. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్-4లో ఇవాళ గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. డియెండ్రా డొట్టిన్ (53) అర్దసెంచరీతో రాణించగా.. హర్షిత మాధవి (18), శిఖా పాండే (25), నైట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. వారియర్స్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, ఎరిన్ బర్న్స్, రామ్హరాక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. క్లో టైరాన్ ఓ వికెట్ దక్కించుకుంది.129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్స్.. ఆది నుంచి నిదానంగా ఆడి విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి నైట్‌రైడర్స్ చేసినన్ని పరుగులే చేసింది. ఎరిన్ బర్న్స్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. షెమెయిన్ క్యాంప్‌బెల్ (25), లారెన్ హిల్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో జైదా జేమ్స్, గ్లాస్గో, సమారా రామ్‌నాథ్ తలో వికెట్ పడగొట్టారు. -
10 బంతులు.. ఆరు సిక్సర్లు!
సెయింట్ కిట్స్: ట్వంటీ 20 క్రికెట్ లో విధ్వంసకర ఆట తీరు ఎలా ఉండాలో మరోసారి రుచి చూపించారు న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్, వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రేవోలు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ 20లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. డారెన్ బ్రేవో 10 బంతుల్లో ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడగా, మెకల్లమ్ 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. బ్రేవో అజేయంగా 38 పరుగులు, మెకల్లమ్ 40 నాటౌట్ లు విశేషంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాట్రియాట్స్ 13 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్(93;47 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. అయితే ఆపై ట్రింబాగో నైట్ రైడర్స్ ఆటగాళ్లు మెకల్లమ్, బ్రేవో దాటికి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి జోరుకు 5.2 ఓవర్లలో (డక్ వర్త్ లూయిస్) రెండు వికెట్లు కోల్పోయిన నైట్ రైడర్స్ 88 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రధానంగా చివరి 13 బంతుల్లో మెకల్లమ్, బ్రేవోలు ఇద్దరూ కలిపి ఎనిమిది సిక్సర్లు సాధించడంతో నైట్ రైడర్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.