
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ బ్యాట్‌తో రాణించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్ధూల్.. 88 బంతులు ఎదుర్కొని 41 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం మరోసారి లార్డ్ ఠాకూర్ తేలిపోయాడు.
ఇప్పటివరకు 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ వికెట్ ఏమీ తీయకుండా 35 పరుగులు సమర్పించుకున్నాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో విఫలమం కావడంతో శార్ధూల్‌పై టీమ్‌మెనెజ్‌మెంట్‌పై వేటు పడింది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ఈ ముంబై ఆల్‌రౌండర్.. తిరిగి మళ్లీ మాంచెస్టర్ టెస్టులో ఆడేందుకు అతడికి ఛాన్స్ లభించింది.
అయితే బౌలర్‌గా శార్ధూల్ సేవలను టీమిండియా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో బౌలర్‌గా అద్బుతంగా రాణిస్తున్న ఠాకూర్‌కు మొదటి టెస్టులో కేవలం 16 ఓవర్లు మాత్రమే వేసే అవకాశం దక్కింది.
ఇప్పుడు మాంచెస్టర్ టెస్టులో కూడా కేవలం 5 ఓవర్లు మాత్రమే శార్ధూల్‌తో గిల్ బౌలింగ్ చేయించాడు. తాజాగా ఇదే విషయంపై శార్ధూల్ ఠాకూర్ స్పందించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని బౌలింగ్ చేయాలనేది కెప్టెన్ ఇష్టమే అని ఠాకూర్ తెలిపాడు.
"ఒక బౌలర్‌కు బౌలింగ్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అది కెప్టెన్ నిర్ణయం. అది నా చేతుల్లో లేదు. బౌలింగ్‌లో ఎప్పుడు ఎవరిని ఎటాక్‌లోకి తీసుకురావాలో కెప్టెన్ నిర్ణయిస్తాడు. ఈ మ్యాచ్‌లో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను" అని రెండో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో ఠాకూర్ పేర్కొన్నాడు.
ఇక మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది.