
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శతక్కొట్టిన గిల్.. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో భీబత్సం సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(262)తో చెలరేగిన శుబ్‌మన్, రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో మెరిశాడు.
కానీ లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల(16,6)లోనూ విఫలమయ్యాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులో గిల్ తిరిగి అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తాడని మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. కాగా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో టెస్టులో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ఈ కీలక మ్యాచ్‌లో గిల్ ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శుబ్‌మన్ గిల్ గిల్ తన ఫామ్‌ను కొనసాగిస్తాడని నేను భావిస్తున్నాను. అతడికి ఆ సత్తా ఉంది. లార్డ్స్ టెస్టుకు మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టుకు దాదాపు ఎనిమిది రోజుల విశ్రాంతి లభించింది. దీంతో అతడు కాస్త రిలాక్స్‌గా ఉంటాడు. తన తండ్రి, స్నేహితులతో చాలా విషయాలు అతడు చర్చించి ఉంటాడు.
గిల్ తన కెప్టెన్సీ, వ్యూహాలు, ఫీల్డింగ్, బ్యాటింగ్‌పై పెట్టాలి. అప్పుడే మాంచెస్టర్‌లో గిల్ రన్‌మిషన్ తిరిగి మళ్లీ పనిచేస్తోంది. ప్రస్తుత భారత జట్టులో గిల్ పాత్ర చాలా ముఖ్యమైనది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో గిల్ బ్యాట్‌తో విఫలమయ్యాడు. దీంతో భారత్ ఓడిపోయింది. అయినప్పటికి మెన్ ఇన్ బ్లూ ఆఖరి వరకు పోరాడింది. దీని బట్టి భారత జట్టు కేవలం గిల్ ఒక్కడిపైనే ఆధారపడటం లేదని ఆర్ధమైంది అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.