
సాక్షి బెంగళూరు/ శివాజీనగర: గ్యాంగ్ రేప్ కేసులో జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నిందితులు విజయ యాత్ర జరుపుకొన్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిని మళ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని హావేరిలో జరిగింది.
వివరాల ప్రకారం.. కర్ణాటకలో 2024 జనవరి 8న హానగల్ శివార్లలో ఓ వివాహితపై (26) గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో జైలుపాలైన 19 మందిలో 12 మందికి 10 నెలల క్రితమే బెయిల్ వచ్చింది. ప్రధానమైన ఏడుగురు నిందితులు అఫ్తాద్ చందన కట్టి, మదార్‌సాబ్ మండక్కి, సమీవుల్లా లాలనవర్, మొహమ్మద్ సాదిక్ అగసిని, షోయబ్ ముల్లా, తౌసిఫ్ చోటి, రియాజ్ సెవికేరిలకు మూడు రోజుల క్రితమే బెయిల్ మంజూరైంది.
ఈ నేపథ్యంలో సబ్‌జైలు నుంచి విడుదలై తమ ఊరు హక్కి ఆలూరుకు వెళ్లారు. బంధుమిత్రులతో కలిసి ఐదు కార్లలో ఊరేగింపు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరలయ్యాయి. దారుణాలకు పాల్పడి ఉత్సవాలు చేసుకుంటారా? అంటూ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు బెయిల్ నిబంధనలను అతిక్రమించారంటూ ఏడుగురు నిందితులకుగాను ఐదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
🚨 SHAMEFUL! Gang rape accused celebrate in a victory procession after securing BAIL in Haveri.
Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/ceSw4oiedL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 23, 2025