
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్‌మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.
ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.
‘‘నా భర్త నన్ను గోరఖ్‌పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.
అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన.
‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్‌ను హ్యాక్ చేసి ఆమె డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించింది.
.. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.
భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!.