
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిశారు హీరోయిన్ ఆలియా భట్. నిజానికి ఈ చిత్రోత్సవాల తొలి రోజు (మే 13)నే ఆలియా ఈ వేడుకలకు హాజరు కావాల్సింది. అయితే వెళ్లలేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా –పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలియా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కాలేదనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లోని ‘లవ్ అండ్ వార్’ (రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉండటం వల్లే ఆలియా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున వెళ్లలేదట.
ఫైనల్‌గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో ఆమె రెడ్ కార్పెట్‌పై మెరిశారు. అయితే ఆలియా భట్ ధరించిన కాస్ట్యూమ్స్‌పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2017లో 70వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటి మల్లికా షెరావత్ ధరించిన కాస్ట్యూమ్ డిజైన్‌నే ఆలియా అనుకరించారని కొందరు నెటిజన్లు, ఫ్యాషన్ లవర్స్‌పోలికలు పెట్టారు. అయితే ఆలియా ఎంట్రీ అదిరిందని, చాలా క్యూట్‌గా కనిపించారనే ప్రశంసలూ ఆమెకు దక్కాయి.

ఇక కెల్లీ రిచర్డ్స్ డైరెక్షన్‌లోని ‘ది మాస్టర్ మైండ్’ సినిమాను ప్రదర్శించగా, ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఫ్రాన్స్‌లో పవర్ కట్స్ కారణంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి రోజు వేడుకల నిర్వహణకు ఇబ్బందులు ఎదరయ్యాయని, అయినా నిర్వాహకులు అనుకున్నప్లాన్ పరంగానే ఉత్సవాలు పూర్తయ్యేలా సన్నాహాలు చేశారనే వార్తలు వస్తున్నాయి.