
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.ద్వాదశి సా.4.14 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: రేవతి ప.10.58 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: ఉ.8.44 నుండి 10.14 వరకు, శని త్రయోదశి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.23.
మేషం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
మిథునం: శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనులలో పురోగతి. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
కర్కాటకం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
సింహం: కుటుంబంలో సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య: శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ధనలబ్ధి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు ఫలిస్తాయి.
వృశ్చికం: రుణాలు తీరుస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. దైవదర్శనాలు. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులు.
ధనుస్సు: రాబడికి మించిన ఖర్చులు. బంధుమిత్రులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. పనులు కొన్ని విరమిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.
మకరం: పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కుంభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
మీనం: చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.