థేమ్స్‌నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య తెప్పోత్సవం | Lord Venkateswara Swamy Teppotsavam by SVBTCC in London | Sakshi
Sakshi News home page

థేమ్స్‌నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య తెప్పోత్సవం

May 23 2025 5:00 PM | Updated on May 23 2025 5:30 PM

Lord Venkateswara Swamy Teppotsavam by SVBTCC in London

శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) విదేశీ నీళ్లపై తొలిసారి జరిపిన భక్తి పర్వదినం ‘తెప్పోత్సవాన్ని’ (దివ్య తెప్ప ఉత్సవం) ఘనంగా, భక్తిశ్రద్ధలతో టెమ్స్ నదిపై బ్రే, మైదన్‌హెడ్ వద్ద నిర్వహించింది. యుకె , యూరప్‌లో హిందూ ప్రవాసభారతీయుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఇది ఒక మైలురాయి అని నిర్వాహకులు ప్రకటించారు. 

వేద పారాయణం, భజనలు, సమూహిక అర్చనలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిన ఈ సాయంత్రానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. సుందరంగా అలంకరించబడిన తెప్పపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘గోవింద గోవింద’ నినాదాల మధ్య టెమ్స్ నదిలో విహరించారు. భారీగా హాజరైన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, రెండు విడతలుగా సాగిన ఈ భక్తి నౌక యాత్ర, బ్రిటిష్ వాతావరణంలో దక్షిణ భారతీయ ఆలయాల అనుభూతిని అందించింది. శ్రద్ధతో, సమగ్రంగా రూపొందించి ఈ ఉత్సవం భక్తి, సమాజ చైతన్యం, దైవానుగ్రహానికి అద్దం పట్టింది.

ఈ అపూర్వ ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి SVBTCC హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. “దీపమైన భక్తితో నడిచిన కల నౌకై తేలింది — సేవతో నడిచింది, స్వామి అనుగ్రహంతో సాగింది. ఇది ఎంతోమందికి అరుదైన అనుభూతి - దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన అనునిత్య సంప్రదాయాన్ని, యుకె భూమిలో నూతనంగా దర్శించుకోవడం… హృదయాలను నింపింది, ఆత్మలను ఉల్లాసపరిచింది.”  అని  SVBTCC  ఒక ప్రకటనలో తెలిపింది. 


  మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement