breaking news
Delhi
-
పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు గ్రీన్ సెస్?: ధరలు పెరిగే ఛాన్స్
డీజిల్ కార్లపై ప్రస్తుతం విధించే గ్రీన్ సెస్‌ను.. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్, CNG వాహనాలపై విధించే అవకాశం ఉంది. దీనివల్ల కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విధానం ముసాయిదాలో భాగమైన ఈ ప్రతిపాదన ప్రకారం సెస్ అమలు చేయనున్నారు. మార్చి నాటికి ఈ విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ప్రభుత్వం.. ఈవీలను ప్రోత్సహించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. డీజిల్, పెట్రోల్, CNG వాహనాల కొనుగోలును తగ్గించాలి. దీనికోసం ధరలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు.. రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.సెంట్రల్ వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. ఢిల్లీలో ప్రతి నెలా జరిగే అన్ని వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాలు 12-14% వాటా కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరం నమోదైన సుమారు 8,00,000 వాహనాలలో, దాదాపు 1,11,000 ఎలక్ట్రిక్ వాహనాలు. ఈ సంఖ్యను మరింత పెంచే యోజనలో ప్రభుత్వం కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. -
న్యూజిలాండ్ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్ సిరీస్‌కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్, ఇదే టోర్నీలో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. జనవరి 6న ఆలుర్‌లో రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు లీక్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు. ఈ జట్టులో విరాట్ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ ఫార్మాట్లో విరాట్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్ సెంచరీ (గుజరాత్‌పై 77) చేశాడు. విరాట్ రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.విరాట్ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్ సెంచరీ (65 నాటౌట్) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన విరాట్.. చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) చేసి ఫామ్‌లోకి వచ్చాడు. విరాట్ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
ఉన్నావ్ కేసు.. విచారణ వేళ ఉత్కంఠ
సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరగనుంది. ఈ కేసులో దోషిగా తేలిన ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది.ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిని కాసేపట్లో కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో సెంగార్‌కు ఇటీవల బెయిల్ లభించటం సంచలనంగా మారింది. బెయిల్‌పై అతడు బయటకు రావటంతో.. బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు ఇంటివద్ద ఉన్న తన పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.‘సుప్రీంకోర్టులో న్యాయం దక్కుతుందన్న నమ్మకముంది. అతడికి బెయిల్ రాకుండా ఉండాల్సింది. నా తండ్రిని, కుటుంబాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా పిల్లల భద్రత కూడా ప్రమాదంలో పడింది’ అంటూ బాధితురాలు వాపోతున్నారు. బాధితురాలి భద్రత దృష్ట్యా బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ విచారణలో సెంగార్ తరఫు వాదనలు ఎలా ఉండనున్నాయో అనే ఉత్కంఠ నెలకొంది. -
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం భయంకర వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోగా, మరోవైపు తీవ్రమైన చలి గాలులు నగరాన్ని తీవ్రంగా వణికిస్తున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 400 మార్కును దాటి ‘తీవ్రమైన’ శ్రేణికి చేరుకుంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ)నగరంలో ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీబీసీబీ) గణాంకాల ప్రకారం నేటి (సోమవారం) ఉదయం ఢిల్లీలో సగటు ఏక్యూఐ 404గా నమోదైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఆనంద్ విహార్, బవానా, జహంగీర్‌పురి తదితర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు 450 మార్కును దాటాయి. గాలి వేగం తగ్గడానికి తోడు తేమశాతం పెరగడం వల్ల వాహనాల ఉద్గారాలు, దుమ్ము కణాలు భూమికి సమీపంలోనే నిలిచిపోయి దట్టమైన పొగమంచులా ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రజలు శ్వాస తీసుకునేందుకు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వాయువ్య భారతం నుండి వీస్తున్న పొడి, చల్లని గాలుల కారణంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే అతి తక్కువగా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్న 48 గంటల పాటు శీతల గాలుల (Cold Wave) ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కాగా దృశ్యమానత (Visibility) 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో రోడ్డు, రైలు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. విమానాల రాకపోకల్లో కూడా జాప్యం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్)నాలుగో దశ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.‘గ్రాప్-4’లో భాగంగా నగరంలోకి అనవసరమైన ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిర్మాణ, కూల్చివేత పనులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది ఇంటి నుండే పని (Work from Home) చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు.. వాయు కాలుష్యం, చలి తీవ్రత దృష్ట్యా వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వారు బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా ఎన్-95 మాస్కులు ధరించాలని సూచించారు.ఇది కూడా చదవండి: హడలెత్తిస్తున్న రైలు ప్రమాదాలు.. గత 10 ఏళ్లలో.. -
28న ఆరావళిపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: దేశంలోని ఆరావళి పర్వత శ్రేణుల నిర్వహణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన ఆరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు డిసెంబర్ 28న విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా (స్వచ్ఛందంగా) స్వీకరించడం గమనార్హం.చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.జి. మసీహ్లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోర్టు జాబితాలో ఈ అంశాన్ని ‘ఆరావళి కొండలు-పర్వత శ్రేణుల నిర్వచనం, సంబంధిత అంశాలు’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనం చుట్టూ వివాదం నెలకొంది. ఈ కొత్త నిబంధనల కారణంగా ఈ పర్వత పర్యావరణ వ్యవస్థలో భారీగా మైనింగ్‌కు అవకాశం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విస్తారమైన ఆరావళి ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఎటువంటి శాస్త్రీయ అంచనా లేకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతానికైతే మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరావళి ప్రాంతంలో కొత్త లీజులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణం, భూగర్భ శాస్త్రం, ప్రకృతి పరిరక్షణ ఆధారంగా మైనింగ్ నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ)ని ఆదేశించింది. కేంద్రం ఇప్పటికే నిషేధించిన ప్రాంతాలకు అదనంగా ఈ జోన్లను గుర్తించాల్సి ఉంటుంది. సోమవారం సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో ఆరావళి భవిష్యత్తుపై ఎటువంటి ఆదేశాలు వెలువడుతాయనే ఆసక్తి నెలకొంది.ఇది కూడా చదవండి: ‘షార్ట్‌లతో తిరగొద్దు’.. హుకుం జారీ! -
ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లమంది కడుపు నింపిన జాతీయ ఉపాధి హామీ (మన్రే) పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రద్దు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీన్ని పేదల ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రగా అభివర్ణించారు. ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడమంటే దేశ గౌరవాన్ని కించపర్చడమే అని మండిపడ్డారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. బహుళ ప్రయోజనాలను ఆశించి నిరుద్యోగ, రైతు కూలీలు, దళిత, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో యూపీఏ ప్రభుత్వం మన్రేగా పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు.పేదలకు జీవనాధారంగా మారిన ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వారి కడుపుకొట్టిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి పేదల బాధలు పట్టవని, కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యమని ధ్వజమెత్తారు. రాష్ట్రాలపై అదనపు భారాన్ని మోపే ‘వీబీ జీ రామ్ జీ పథకం’పై జాతీయస్థాయి ఉద్యమాలే శరణ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మోదీ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.రాహుల్‌తో మాటా మంతీసీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సరదాగా సంభాషించుకున్నారు. సమావేశం ముందు, తర్వాత.. రేవంత్ అధిష్టానం పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి నడిచారు. ఈ సమయంలో రేవంత్ వారితో చాలాసేపు నవ్వుతూ మాట్లాడారు. అలాగే.. రాహుల్‌తో ప్రత్యేకంగా కొంతసేపు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు, 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల్లో విజయాలు, నామినేటెడ్ పదవులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో సీఎం రేవంత్‌రెడ్డి -
ఢిల్లీలో హై అలర్ట్.. 285 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: కొత్త ఏడాది సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక పోలీసులు చర్యలు ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పరిధిలో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఏకంగా 285 మంది నేరగాళ్లను పోలీసులు కటకటాల వెనక్కి తరలించారు. ఈ ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున మారణాయుధాలు, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో అసాంఘిక శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు ఈ మెగా డ్రైవ్ నిర్వహించారు.‘ఆపరేషన్ ఆఘాత్’ (Operation Aaghaat) పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో పోలీసులు పక్కా వ్యూహంతో నేరస్తుల అడ్డాగా పేరున్న పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 40కి పైగా అక్రమ ఆయుధాలు, లక్షలాది రూపాయల నగదు లభ్యమైంది. వీటితో పాటు భారీ పరిమాణంలో డ్రగ్స్, అక్రమ మద్యం నిల్వలను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 1,000 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేర చరిత్ర ఉన్న 285 మందిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి.న్యూ ఇయర్ వేడుకల సమయంలో గొడవలకు దిగే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల పని పట్టేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై ఆయుధ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మందు పార్టీలు చేసుకునే వారిపై, న్యూ ఇయర్ ముసుగులో రెచ్చిపోయే పోకిరీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే! -
అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
ప్రతి ఏడాది మాదిరే ఈసారీ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ మొదలైంది. అయితే, ఈసారి భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల రాకతో ఈ సీజన్‌కు పండుగ కళ వచ్చింది. ఢిల్లీ తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ బుధవారం నాటి తొలి మ్యాచ్‌లలో శతక్కొట్టారు.రెండో రౌండ్లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా.. రోహిత్ మాత్రం ఈసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రో-కో బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా దేశీ క్రికెట్ బరిలో దిగారు. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు.రూ. వెయ్యి కోట్లకు పైగానేఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్న రోహిత్- కోహ్లి.. సంపాదన ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి నెట్‌వర్త్ రూ. వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు, ఐపీఎల్లో ఆడటం ద్వారా కూడా రో-కో భారీ స్థాయిలో వేతనం పొందుతున్నారు. మరి విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ దిగ్గజాలకు లభించే మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?!..విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో లిస్ట్-ఎ మ్యాచ్‌లలో భాగమయ్యే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి.. తదనుగుణంగా ఫీజును చెల్లిస్తారు. ఆ వివరాలు ఇవీ..సీనియర్ కేటగిరీ (40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్‌కు రూ. 60 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్‌కు రూ. 30 వేల చొప్పున ఫీజుమిడ్-లెవల్ కేటగిరీ (21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్‌కు రూ. 50 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్‌కు రూ. 25 వేల చొప్పున ఫీజుజూనియర్ కేటగిరీ (0- 20 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్‌కు రూ. 40 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్‌కు రూ. 20 వేల చొప్పున ఫీజు.రోజువారీ అలవెన్సులురవాణా, భోజనం ఖర్చులు.. వసతి ఏర్పాటుప్రదర్శన ఆధారంగా బోనస్లుమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ. 10 వేల ప్రైజ్మనీప్రైజ్మనీనాకౌట్ దశకు చేరిన, ఫైనల్ ఆడిన జట్లకు ప్రైజ్‌పూల్ ఆధారంగా నజరానా ఇస్తారు.అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ వచ్చేది ఎంత?ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లుగా రోహిత్- కోహ్లి ఒక్కో వన్డేకు రూ. 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అందుకుంటారు. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో ఉన్నందుకు గానూ రూ. 60 వేలతో పాటు బోనస్, అలవెన్సులు కూడా దక్కుతాయి. ఫీజులో వ్యత్యాసం ఉన్నా.. ఆట ఒక్కటే.ఈ దేశీ టోర్నీ ద్వారానే తమను తాము నిరూపించుకున్న రో- కో వంటి ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నత స్థాయికి చేరారు. ఏదేమైనా బీసీసీఐ నిబంధనల పుణ్యమా అని రోహిత్- కోహ్లిలను మరోసారి తమ సొంత దేశీ జట్ల తరఫున ఆడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు దక్కింది. -
అది ‘పండోర బాక్స్’ తెరిచినట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫయర్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలను పక్కనపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు జీఎస్టీని తగ్గిస్తే అది ‘పండోర బాక్స్’తెరిచినట్లవుతుందని, దీనివల్ల భవిష్యత్తులో అనేక క్లిష్ట సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫయర్లను ‘వైద్య పరికరాల’జాబితాలో చేర్చాలని, ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సమాఖ్య వ్యవస్థకు ముప్పు: కేంద్రం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ వాదనలు వినిపించారు. జీఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని గుర్తు చేశారు. పన్ను రేట్ల తగ్గింపు అనేది కేంద్రం, రాష్ట్రాల చర్చల ద్వారా, ఓటింగ్ ద్వారా నిర్ణయించాల్సిన అంశమని స్పష్టం చేశారు. ’ఇప్పుడు కోర్టు ఆదేశాలతో పన్నులు తగ్గిస్తే.. రేపు ప్రతి ఒక్కరూ పిటిషన్లు వేసి పన్నులు తగ్గించమని అడుగుతారు. ఇది ఒక పండోర బాక్స్ తెరిచినట్లవుతుంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాం. కానీ పద్ధతి ప్రకారం వెళ్లాలి’అని కోర్టుకు నివేదించారు. అసలు ఈ పిటిషన్ వెనుక ఎవరున్నారో ఆరా తీయాల్సి ఉందని, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సామాన్యుడు ఎలా కొంటాడు?: హైకోర్టు ఆగ్రహం జస్టిస్ వికాస్ మహాజన్, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది. ’ఒక ఎయిర్ ప్యూరిఫయర్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేలు వరకు ఉంది. సామాన్యుడు దీన్ని ఎలా కొనగలడు? జీఎస్టీని తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తేవచ్చు కదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విషయాన్ని అత్యవసరంగా జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని గతంలోనే చెప్పామని గుర్తు చేసింది. దీనిపై సమగ్ర సమాధానం ఇచ్చేందుకు (కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు) కేంద్రం గడువు కోరడంతో, కోర్టు 10 రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 9, 2026కి వాయిదా వేసింది. సెలవుల తర్వాత వెంటనే ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు చర్చించగలదో తెలపాలని ఆదేశించింది. విలాసం కాదు.. అవసరం: పిటిషనర్ పిటిషనర్ కపిల్ మదన్ వాదిస్తూ.. ఢిల్లీలో కాలుష్యం ఎమర్జెన్సీ స్థాయికి చేరిందన్నారు. ఎయిర్ ప్యూరిఫయర్ ఇప్పుడు లగ్జరీ కాదని, ప్రాణాలను కాపాడే వైద్య పరికరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని, దీనివల్ల నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్యూరిఫయర్లను తప్పుడు కేటగిరీలో ఉంచి పన్ను వసూలు చేస్తున్నారని వాదించారు. -
వీరు దేశానికి గర్వకారణం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు స్వీకరించిన చిన్నారులు వారి కుటుంబాలకు, మొత్తం దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ పురస్కారాలు దేశవ్యాప్తంగా బాలబాలికలందరికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు. రాష్ట్రపతి శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘వీర్ బాల్ దివస్’కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహస బాలలతోపాటు సామాజిక, సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అసమాన ఘనతలు సాధించిన 20 మంది చిన్నారులకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీర్ బాల్ దివస్ ప్రాముఖ్యతను వివరించారు. 320 ఏళ్ల క్రితం గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులు సత్యం, న్యాయం కోసం పోరాడుతూ ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. చిన్న కుమారులైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లు ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశ విదేశాల్లో గౌరవాన్ని అందుకుంటున్నాయని తెలిపారు. చిన్నారుల్లోని దేశ భక్తి, ఉన్నత విలువలను బట్టి ఒక దేశం గొప్పతనాన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఇద్దరు తెలుగు బాలలకు పురస్కారాలు ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను 18 మంది పిల్లలకు, మరణానంతరం మరో ఇద్దరి తరఫున వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి ముర్ము అందజేశారు. పురస్కారాల గ్రహీతల్లో ఇద్దరు తెలుగు బాలలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. కార్తికేయ పర్వతారోహకుడు. 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సెవెన్ సమ్మిట్ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అతిపిన్న వయసు్కడిగా ఘనత సాధించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన 17 ఏళ్ల పారా అథ్లెట్ శివానీ హోసూరు ఉప్పర సైతం క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. ఈమె షాట్‌పుట్, జావలిన్ థ్రోలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో అవార్డులు సాధించారు. పురస్కార గ్రహీతలకు మెడల్, సరి్టఫికెట్‌తోపాటు రూ.లక్ష నగదు ప్రోత్పాహకాన్ని రాష్ట్రపతి అందజేశారు. పురస్కార గ్రహీతలతో ప్రధాని మోదీ భేటీ బాల పురస్కారాలు అందుకున్న చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్ మండపంలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో భాగంగా వారితో ముచ్చటించారు. చిన్న వయసులోనే ఇతరులకు స్ఫూర్తినిచ్చే విజయాలు సాధించారని ప్రశంసించారు. ఈ విజయాలు ఆరంభం మాత్రమేనని, ఇంకా సుదూర ప్రయాణం చేయాల్సి ఉందని చెప్పారు. ఈ తరంలో జని్మంచడం ఈ చిన్నారుల అదృష్టమని, వారి ప్రతిభకు దేశమంతా మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. ప్రతిభావంతులైన బాలలను మరింత ముందుకు నడిపించేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తాత్కాలిక ప్రజాదరణ, గ్లామర్‌కు ఆకర్షితులు కాకుండా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలని చిన్నారులకు ప్రధాని మోదీ సూచించారు. -
ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు.. కేంద్రం స్పందన ఇదే..
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున విచారణకు విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ప్యూరిఫైయర్లపై దాఖలైన పిల్‌ను వ్యతిరేకించారు. దీనిపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు.ఎయిర్ ఫ్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించి.. 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. న్యాయవాది కపిల్ మదన్ దాఖలు చేసిన ఈ పిటిషనుపై కేంద్రానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వెంకటరమణ శుక్రవారం వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా.. జీఎస్టీ రేట్లను సరైన ప్రక్రియ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ మాత్రమే నిర్ణయించగలదు. అలాగే, ఈ పిటిషన్‌పై స్పందించడానికి రెండు రోజుల సమయం సరిపోదన్నారు.Delhi High Court heard the PIL seeking a reduction of GST on air purifiers, but did not pass any interim order. The Centre said the plea is “not a PIL” and that GST rates can only be decided by the GST Council after due process. The Court raised concerns over public health and…— ANI (@ANI) December 26, 2025ఈ విషయంపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయడానికి పది రోజుల సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జీఎస్టీ తగ్గింపునకు ఒక ప్రక్రియ ఉందని, ఈ ప్రక్రియను అడ్డుకోలేమని కోర్టుకు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, ఇది సమాఖ్య పన్ను అని వివరించారు. ఈ ప్రక్రియలో అన్ని రాష్ట్రాలు పాలుపంచుకుంటాయని, ఏదైనా విషయంపై ఓటింగ్ జరగాలంటే అది భౌతికంగా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. పార్లమెంటరీ కమిటీ మాకు కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకుంటాము. ఇందులో రాజ్యాంగపరమైన అంశం ముడిపడి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో, తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. చనిపోతున్నా స్పందించరా?అంతకుముందు.. దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ గాలి శుద్ధి యంత్రాలపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీఎస్టీ కౌన్సిలు తక్షణం సమావేశమై గాలిశుద్ధి యంత్రాలపై పన్ను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ‘‘మనం రోజుకు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాం. అలాంటప్పుడు గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఓసారి లెక్కించండి’’ అని వ్యాఖ్యానించింది. పిటిషనుపై స్పందించేందుకు గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారింది. వేల సంఖ్యలో ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా? ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం. అది అందించలేనప్పుడు కనీసం శుద్ధి యంత్రాలనైనా అందుబాటు ధరల్లో ఉంచాలి కదా! ఇలాంటి ఎయిర్ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద తాత్కాలిక పన్ను మినహాయింపును తక్షణం ఎందుకు ఇవ్వకూడదు?’’ అని కేంద్రంపై ప్రశ్నలు కురిపించింది. ప్రజల ప్రాణాల కంటే పన్నులే ముఖ్యమా? అంటూ ప్రశ్నించింది. -
కోహ్లి, పంత్ మెరుపులు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్లు, ఢిల్లీ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ మెరుపులు మెరిపించారు. గుజరాత్‌తో ఇవాళ (డిషెంబర్ 26) జరుగుతున్న మ్యాచ్‌లో అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విరాట్ 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 77 పరుగులు చేయగా.. పంత్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. క్లిష్టమైన పిచ్‌పై విరాట్, పంత్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. విరాట్, పంత్ ఔటయ్యాక హర్ష్ త్యాగి (40) కాస్త నిలకడగా ఆడాడు. చివర్లో సిమర్జీత్ సింగ్ (15 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు.గుజరాత్ బౌలర్లలో స్పిన్నర్లు విశాల్ జేస్వాల్ (10-0-42-4), రవి బిష్ణోయ్ (10-0-50-2) ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అర్జన్ నగస్వల్లా, కెప్టెన్ చింతన్ గజా తలో వికెట్ తీశారు. మిగతా ఢిల్లీ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 1, అర్పిత్ రాణా 10, నితీశ్ రాణా 12, ఆయుశ్ బదోని 12, నవ్‌దీప్ సైనీ 6, ఇషాంత్ శర్మ 5 (నాటౌట్) పరుగులు చేయగా.. ప్రిన్స్ యాదవ్ డకౌటయ్యాడు.3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలులిస్ట్-ఏ ఫార్మాట్ అంటేనే పునకాలు తెప్పించే విరాట్ కోహ్లి గత కొంతకాలంలో ఈ ఫార్మాట్లో పీక్స్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతని ప్రదర్శనలు చెప్పనశక్యంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు.. దేశవాలీ స్థాయిలో (VHT 2025-26) సెంచరీ, హాఫ్ సెంచరీతో పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. గత 6 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌ల్లో విరాట్ స్కోర్లు..- 74*(81)- 135(120)- 102(93)- 65*(45)- 131(101)- 77(61) -
Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
టీమిండియా దిగ్గజ బ్యాటర్, ఢిల్లీ స్టార్ విరాట్ కోహ్లి శతకం చేజార్చుకున్నాడు. మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సెంచరీకి ఇరవై మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి కోహ్లి దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగిన విషయం తెలిసిందే. రోహిత్ తన సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. కోహ్లి సైతం తన జట్టు ఢిల్లీకి ఆడుతున్నాడు.ఆంధ్రపై శతక్కొట్టిన కోహ్లి..ఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్రపై శతక్కొట్టిన (101 బంతుల్లో 131) కోహ్లి.. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాడు. ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా బెంగళూరు వేదికగా గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 😎1️⃣3️⃣1️⃣ runs 1️⃣0️⃣1️⃣ balls 1️⃣4️⃣ fours 3️⃣ sixes A terrific knock from Virat Kohli as he guided Delhi to a 4️⃣-wicket victory against Andhra 👏 He also completed 1️⃣6️⃣0️⃣0️⃣0️⃣ runs in Men’s List A cricket 🫡 @IDFCFIRSTBank | @imVkohli |… pic.twitter.com/kCfdl3yux1— BCCI Domestic (@BCCIdomestic) December 24, 202529 బంతుల్లోనేఅయితే, ఆదిలోనే గుజరాత్ బౌలర్లు ఢిల్లీని దెబ్బకొట్టారు. ప్రియాన్ష్ ఆర్య (7 బంతుల్లో 1)ను కెప్టెన్ చింతన్ గజా వెనక్కి పంపగా.. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే మరో ఓపెనర్ అర్పిత్ రాణా (31 బంతుల్లో 10)ను విశాల్ జైస్వాల్ అవుట్ చేయగా.. కోహ్లి బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు.మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న కోహ్లి.. తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. మొత్తంగా 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 77 పరుగులు సాధించాడు. అయితే, విశాల్ జైస్వాల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి ఇన్నింగ్స్‌కు తెరపడింది.మిగతా వారిలో నితీశ్ రాణా (12) తేలిపోగా.. కెప్టెన్ రిషభ్ పంత్, ఆయుశ్ బదోనిలపై భారం పడింది. 27 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి ఢిల్లీ 129 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. గత ఐదు మ్యాచ్‌లలో కోహ్లి మూడు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తొలి, రెండో మ్యాచ్‌లలో శతక్కొట్టిన కోహ్లి.. ఢిల్లీ తరఫు పునరాగమనంలోనూ సెంచరీతో అలరించాడు. కింగ్ ఫామ్ చూసి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో.. ‘‘సంతోషం పట్టలేకపోతున్నాం.. పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా బెంగళూరులో కోహ్లి ఆటను చూసేందుకు ఫ్యాన్స్ చెట్లెక్కి మరీ విన్యాసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. UPDATE: కోహ్లి, పంత్ మెరుపులు.. ఢిల్లీ స్కోరెంతంటే?చదవండి: మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్! -
క్రీస్తు బోధనలతో సమాజంలో సామరస్య స్ఫూర్తి
న్యూఢిల్లీ: క్రీస్తు బోధనలతో సమాజంలో సామరస్య స్ఫూర్తి నెలకొంటోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఉదయాన్నే ‘మార్నింగ్మాస్’లో భాగంగా ఢిల్లీలోని ప్రముఖ ‘క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్’కు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఢిల్లీలోని ప్రఖ్యాత క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడమ్షన్కు ఉదయాన్నే వెళ్లా. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నా. అక్కడి సేవా తత్పరత కాలాతీత ప్రేమ, శాంతి, దయాగుణాలకు ప్రతిబింబంగా నిలిచింది. క్రిస్మస్ పండుగస్ఫూర్తి సమాజంలో శాంతి, సామరస్యాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ నా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. శాంతి, నమ్మకం, జాలితో నిండిన సంతోషదాయక క్రిస్మస్ను అందరూ జరుపుకోవాలి. ఏసు క్రీస్తు అద్భుత బోధనలు సమాజంలో సామరస్యాన్ని మరింత పటిష్టవంతం చేయాలని మనసారా ప్రారి్థస్తున్నా’’అని మోదీ అన్నారు. ఉదయం చర్చికి విచ్చేసిన సందర్భంగా ముందు వరస సీట్లో కూర్చుని క్రైస్తవులతో పాటు ప్రత్యేక గీతాలను మోదీ ఆలపించారు. చర్చిలో ఢిల్లీ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ చేసిన బోధనలను మోదీ ఆసక్తిగా విన్నారు. -
రూ. 5 లకే కమ్మటి భోజనం : అటల్ క్యాంటీన్స్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతిని పురస్కరించు కుని, ఢిల్లీ ప్రభుత్వం 'అటల్ క్యాంటీన్' పథకాన్ని ప్రారంభించింది. పేదలు, కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల ఆహారం అందించే లక్ష్యంతో 100 అటల్ క్యాంటీన్లను ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రారంభించారు. ఈ క్యాంటిన్లలో కేవలం రూ. 5కే పోషకమైన భోజనం అందిస్తారు.అటల్ క్యాంటీన్లుఢిల్లీలో ఆర్కె పురం, జంగ్‌పురా, షాలిమార్ బాగ్, గ్రేటర్ కైలాష్, రాజౌరి గార్డెన్, నరేలా, బవానా, ఇతర ప్రదేశాలలో విస్తరించి ఉన్న 45 అటల్ క్యాంటీన్లు అందుబాటులో వచ్చాయి. మిగిలిన 55 క్యాంటీన్లను రాబోయే రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లు రోజుకు రెండు పూటలా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య భోజనం మరియు సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 గంటల మధ్య రాత్రి భోజనం దాదాపు 500 మందికి అందిస్తాయి. ఈ థాలి (ప్లేట్)లో పప్పు (చిక్కుళ్ళు), బియ్యం, చపాతీ, సీజనల్ కూరగాయలు , ఒక చట్నీ ఉంటాయి.VIDEO | Delhi: On the birth anniversary of former Prime Minister and Bharat Ratna Atal Bihari Vajpayee, Atal Canteens were inaugurated across several parts of the capital, including Nehru Nagar, in the presence of Union Minister Manohar Lal Khattar. In the first phase, 45 Atal… pic.twitter.com/DKJs72OygB— Press Trust of India (@PTI_News) December 25, 2025భోజన పంపిణీ కోసం డిజిటల్ టోకెన్ వ్యవస్థఢిల్లీ ప్రభుత్వం భోజనం పంపిణీ చేయడానికి మాన్యువల్ కూపన్ల స్థానంలో డిజిటల్ టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. సీసీటీవీ కెమెరాలు ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు (DUSIB) డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని కేంద్రాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తాయి. పప్పు (చిక్కుళ్ళు), బియ్యం, చపాతీ, కర్రీ, చట్నీతో కూడిన రుచికరమైన భోజనం రెస్టారెంట్ రకం, ప్రాంతాన్ని బట్టి ఢిల్లీలో ఒక్కోథాలీ ధర రూ. 500 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది. దీని ప్రకారం ఒక్క పూటైనా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లలేని పేదలకు కేవలం పదో వంతు ధరకే సంతృప్తికరమైన భోజనం లభించనుంది. -
తగ్గిన ఎయిర్ పొల్యూషన్: ఆ వాహనాలపై నిషేధం ఎత్తివేత!
ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైన నేపథ్యంలో.. బీఎస్4 వాహనాలను నగరంలో ప్రవేశించకుండా నిషేధించారు. అయితే ఇప్పుడు ఆ ఆంక్షలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గాలి నాణ్యత మెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.డిసెంబర్ 13న, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 స్థాయిని దాటిన తర్వాత.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ IV అమలులోకి వచ్చింది. ఈ సమయంలోనే రాజధానిలో కొన్ని నిర్దిష్ట వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఇప్పుడు గాని నాణ్యత మెరుగుపడటంతో.. ఈ నిషేధం తొలగించారు.బీఎస్ 6 వాహనాలు మాత్రమే నగరంలోకి ప్రవేశించాలనే నియమం అమలు చేసిన సమయంలో.. సుమారు 1.2 మిలియన్ వాహనాలను నిషేధించారు. అయితే ఇప్పుడు ఆంక్షలు నిషేధించబడినప్పటికీ.. ఢిల్లీలో రిజిస్టర్ చేసుకున్న BS4 వాహనాన్ని కలిగి ఉంటే, మీ PUC చెల్లుబాటు అయితే, GRAP స్టేజ్ IV సమయంలో.. ఢిల్లీ NCRలో ఉపయోగించవచ్చు. ఢిల్లీలో రిజిస్టర్ కానీ బీఎస్3, బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదు. నియమాలను అతిక్రమించిన వాహనదారులు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
రాహుల్‌నే కాదు.. ప్రధానిని కూడా కలుస్తా
ఉన్నావ్ కేసు రాజకీయ మలుపు తీసుకుంటోంది. నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు బెయిల్ రావడంపై అభ్యంతరాలతో బాధితురాలు, ఆమె తల్లి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అయితే.. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వాళ్లను మీడియాతో మాట్లాడనీయకుండా.. బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. ఆ తల్లీకూతుళ్లు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. జర్మనీ పర్యటన ముగించుకుని నిన్ననే వచ్చిన రాహుల్.. ఈ కేసు పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు బెయిల్.. బాధితులను నేరస్తుల్లా చూస్తారా?.. ఇదెక్కడి న్యాయం??. భారతదేశం కేవలం మృత ఆర్థిక వ్యవస్థగా(డెడ్ ఎకానమీ) మాత్రమే కాకుండా.. మృత సమాజంగా(డెడ్ సొసైటీ) కూడా మారుతోందని అంటూ ఇండియన్ గేట్ పరిణామంపై ఓ ట్వీట్ చేశారు. क्या एक गैंगरेप पीड़िता के साथ ऐसा व्यवहार उचित है?क्या उसकी “गलती” ये है कि वो न्याय के लिए अपनी आवाज़ उठाने की हिम्मत कर रही है?उसके अपराधी (पूर्व BJP MLA) को ज़मानत मिलना बेहद निराशाजनक और शर्मनाक है - खासकर तब, जब पीड़िता को बार-बार प्रताड़ित किया जा रहा हो, और वो डर के… https://t.co/BZqrVNXMOy— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2025బుధవారం సాయంత్రం జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన బాధితురాలు, ఆమె తల్లి.. రాహుల్ గాంధీని కలిసి ఉన్నావ్ కేసు పురోగతిని.. తమకు ప్రాణహాని పొంచి ఉన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా పారామిలిటరీ సిబ్బంది తమతో ఎంత దురుసుగా ప్రవర్తించింది కూడా వివరించినట్లు తెలుస్తోంది. కుటుంబం కోసమే తానింకా బతికి ఉన్నానని.. తన పోరాటం ఆగదని బాధితురాలు రాహుల్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. ప్రతిపక్ష నేతనే కాదు.. ప్రధానిని కూడా కలిసే ప్రయత్నం చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘ప్రధాని, కేంద్ర హోం మంత్రి, రాష్ట్రపతిని కూడా కలవాలని ఉంది. వాళ్లను కలిసి మేం ఎదుర్కొంటున్న పరిస్థితులను చెప్పాలనుకుంటున్నాం. మాకు కావాల్సింది న్యాయం.. అంతే’’ అని చెప్పిందామె. కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘ఈ తీర్పుతో దేశంలోని అడబిడ్డలు తమ మానప్రాణాల కోసం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నేరానికి పాల్పడిన వ్యక్తిని మా ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని కోర్టు ఆదేశించింది. అంటే.. మేం ఇంటిలోనే బంధీగా ఉండాలని కోర్టు ఉద్దేశమా?’’ అని ఆందోళన వ్యక్తం చేసిందామె. అయితే తమ ఆశలు చావలేదని.. సుప్రీం కోర్టులో న్యాయం దక్కుతుందనే ఆశ నెలకొందని బాధితురాలు అంటోంది. ఇదిలా ఉంటే.. సెంగర్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో బాధితురాలు ఓ పిటిషన్ వేసింది.2017లో ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆనాడ.. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్, ఆపై ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఈ ఘటనతో పార్టీ అంతేకాదు.. ఈ కేసు వెలుగులోకి వచ్చాక ఆమె తండ్రి హత్యకు గురికావడంతో పాటు బాధితురాలిపైనా హత్యాయత్నం జరిగాయి. అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడగా ఇద్దరు బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. సీబీఐ దర్యాప్తు అనంతరం.. ఈ అభియోగాలన్నింటిని నిజాలుగా నిర్ధారించుకున్న ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్లో సెంగర్‌కి జీవితఖైదు విధించింది. ఆ సమయంలో పార్టీ ఆయన్ని బహిష్కరించింది. అయితే ఈ శిక్షను సెంగర్ సవాల్ చేయగా.. మంగళవారం(డిసెంబర్ 23, 2025) ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. దీంతో నిందితుడు బయటకు వస్తే తమకు ప్రాణహాని తప్పదని ఆ తల్లీకూతుళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరుగుతుండడం.. సెంగార్ వర్గ ఓట్లను ఆకర్షించేందుకే కుల్దీప్ను బయటకు తెచ్చారనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మంత్రి వ్యాఖ్యల దుమారంఉన్నావ్ బాధిత కుటుంబం నిరసన తెలపకుండా ఢిల్లీ ఇండియన్ గేట్ వద్ద పారామిలిటరీ సిబ్బంది అడ్డుకోవడంపై ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు వెటకారంగా స్పందించారు. ‘‘ఆమెది ఉన్నావ్ కదా.. ఢిల్లీలో ఏం పని?’’ అంటూ యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ బిగ్గరగా నవ్వారు. ఈ వీడియో నెట్టింటకు చేరడంతో జనం ఆయన్ని తిట్టిపోస్తున్నారు. -
వాయు కాలుష్యం.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో ఇన్ని రోజుల పాటు విధించిన కఠిన నిబంధనలను(GRAP-4) ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వాయు నాణ్యత కొంత మెరుగుపడిన నేపథ్యంలో నిబంధనలు ఎత్తి వేస్తున్నామని.. పరిస్థితులు పునరావృతం అయితే మళ్లీ విధించక తప్పదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.ఢిల్లీలో గత కొద్ది రోజులుగా వాయకాలుష్యం తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నెల 13 త తేదీన వాయునాణ్యత తీవ్ర ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 దాటడంతో గ్రాఫ్-4 కింద కఠిన ఆంక్షలను ప్రభుత్వం విధించింది. నర్సరీ నుండి ఐదవతరగతి వరకూ పాఠశాలలను మూసివేసింది. ఆపైతరగతులకు హైబ్రీడ్ మోడ్ ( ఆన్లైన్లో) క్లాసులు నిర్వహించాలని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి అని తెలిపింది.అయితే బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 271గా నమోదవడంతో కఠిన ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సాధారణ ఆంక్లలు కొనసాగనున్నట్లు ప్రకటించింది. కాగా ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని అరికట్టేలా తగిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఇది వరకే పలుమార్లు హెచ్చరించింది. కాలుష్యాన్ని నియంత్రించేలా తగిన ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ 10, 11, 12, 13, 14, 15 వేల పరుగులను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. విరాట్ 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని కేవలం 343 మ్యాచ్‌ల్లో తాకాడు.విరాట్‌కు ముందు భారత్ తరఫున సచిన్ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. సచిన్ 551 మ్యాచ్‌ల్లో 21999 పరుగులు చేసి, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రహాం గూచ్ (22211), గ్రేమ్ హిక్ (22059) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 16000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో తొలి పరుగు పూర్తి చేయగానే విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ కూడా చేశాడు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్య ఛేదనలో 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ జట్టు ఢిల్లీ గెలవాలంటే ఇంకా 79 పరుగులు చేయాలి. విరాట్‌తో పాటు నితీశ్ రాణా (37) క్రీజ్‌లో ఉన్నాడు. 27.4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 220/2గా ఉంది. అంతకుముందు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ప్రియాంశ్ కేవలం 44 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆంధ్ర తరఫున రికీ భుయ్ (122) సెంచరీ చేశాడు. ఆ జట్టు కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23 పరుగులకు ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. -
ఉన్నావ్ బాధితుల్ని ఈడ్చిపడేశారు!
దేశరాజధానిలో జరిగిన మంగళవారం రాత్రి జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎనిమిదేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ లైంగికదాడి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది తెలిసిందే. ఈ కేసు నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని నిరసిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగగా.. భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపడేశారు. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్ దక్కడంపై నిరసనగా బాధితురాలు, ఆమె తల్లి ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టబోయారు. ఆ సమయంలో యోగితా భయానా అనే యాక్టివిస్ట్ వాళ్లతో పాటు ఉన్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడమంటే తమ ప్రాణాలకు గ్యారెంటీ లేదంటూ ఆ తల్లీకూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది వాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేసి అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లి బస్సు నుంచి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. తొలుత ఇండియా గేట్ వద్ద, ఆ తర్వాత మండీహౌజ్ వద్ద బాధితుల్ని సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వాళ్లను బలవంతంగా తమ వాహనాల్లో తరలించారు. ఆ రెండు చోట్లా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేదని అధికారుల తెలిపారు. JUSTICE DETAINEDRapist's Sentence SuspendedUnnao rape victim dragged into police van by @AmitShah's Delhi Police, protesting against suspension of sentence of former @BJP4India MLA RAPIST-MURDERER Kuldeep Singh Sengar#KuldeepSinghSengar#StockMarketIndia #PlaneCrash pic.twitter.com/vYApILE9kN— Taj INDIA (@taj_india007) December 24, 20252017లో వెలుగు చూసిన ఉన్నావ్ కేసులో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి (Unnao rape case) పాల్పడడంతో పాటు ఆమెను అమ్మేసే ప్రయత్నం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు.. బాధితురాలి తండ్రి మరణానికి కూడా కారణమయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో.. ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ 16న 2019 దోషిగా తేల్చి.. డిసెంబర్ 20న జీవిత ఖైదు విధించింది. అయితే.. సెంగర్‌కు శిక్ష పడక ముందే.. ఎన్నో పరిణామాలు జరిగాయి. అదే ఏడాది కేసు సీబీఐ విచారణ జరుగుతుండగానే.. బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి బాధితురాలు బయటపడగా.. ఆమె ఇద్దరు బంధువులు మరణించారు. జీవిత ఖైదు పడడంతో 2020 నుంచి సెంగర్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేసి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2027 అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే కుల్దీప్కు బెయిల్ దక్కిందని రాజకీయ ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు.. తర్వాత పోయేది తన ప్రాణమేనంటూ బాధితురాలు, ఆమె తల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు న్యాయం జరగలేదు. నా కుమార్తెను బంధించారు. మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. అధికారులు (సీఆర్పీఎఫ్)సిబ్బంది బాధితురాలిని బలవంతంగా తీసుకెళ్లి, తాను రోడ్డుపై పడేశారు.సెంగర్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బాధిత కుటుంబానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అతను సంచరించకూడదని.. వాళ్లను బెదరించే ప్రయత్నం చేసినా బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. అయినప్పటికీ.. నిందితుడికి బెయిల్ రావడంపై అభ్యంతరాలతో నెట్టింట చర్చ నడుస్తోంది. ఉన్నావ్ కేసు టైమ్లైన్జూన్ 4, 2017 – 17 ఏళ్ల బాలిక ఉన్నావ్ జిల్లా, మఖి గ్రామంలో కనిపించకుండా పోయింది. ఆమెను కుల్దీప్ సింగ్ సేంగర్, అతని సోదరుడు అటుల్ సింగ్ ఇతరులు అత్యాచారం చేశారు.జూన్ 21, 2017 – బాధితురాలు ఔరయ్యలో ప్రత్యక్షమైంది.. పోలీసులు ఆమెను రక్షించారుజూన్ 22, 2017 – పోలీసులు IPC సెక్షన్లు 363, 366 కింద కేసు నమోదు చేశారు.ఏప్రిల్ 3, 2018 – బాధితురాలి తండ్రిని సేంగర్ సోదరుడు అటుల్ మరియు అనుచరులు కొట్టి, తర్వాత జైలులో మరణించాడు.ఏప్రిల్ 8, 2018 – బాధితురాలు లక్నోలో CM యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. దీని తర్వాత కేసు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.ఏప్రిల్ 2018 – CBI దర్యాప్తు ప్రారంభమైంది.జూలై 2019 – బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బంధువులు మరణించారు.డిసెంబర్ 16, 2019 – ఢిల్లీ కోర్టు సేంగర్ను అత్యాచారంలో దోషిగా తేల్చింది.డిసెంబర్ 20, 2019 – సేంగర్కు జీవితఖైదు శిక్ష విధించారు.2020–2024 – సేంగర్ జైలులో శిక్ష అనుభవించాడుడిసెంబర్ 23, 2025 – ఢిల్లీ హైకోర్టు సేంగర్ జీవితఖైదు శిక్షను కొట్టేసి.. కండిషన్ బెయిల్ ఇచ్చింది -
ఆరావళి: కొండల్ని తవ్వితే వాళ్లకు చేటు కాదా?
ప్రపంచంలోనే పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులపై వివాదం రాజుకుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆరావళి పర్వత శ్రేణులకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి వాయవ్య భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో దాదాపు 700 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల్లోని అత్యధిక ఎత్తు 1,722 మీటర్లు. ఇవి ముడత పర్వతాలు. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నప్పుడు, వాటి మధ్య ఉన్న భూభాగంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఆ భూభాగం పైకి లేచి ముడతలు పడుతుంది. ఆరావళి పర్వత శ్రేణులు ఇలాగే ఏర్పడ్డాయి.రాజస్థాన్‌లోని మౌంట్ అబూ సమీపంలో 5,650 అడుగుల ఎత్తులో ఉండే గురుశిఖర్ ఆరావళి పర్వత శ్రేణులలోనిదే. రాజస్థాన్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు నియంత్రణలో ఉండేందుకు, జల భద్రతకు ఈ పర్వతాలు అత్యంత కీలకమైనవి. ఇవి రాజస్థాన్‌లోని థార్ ఎడారి వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని నేలలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం కనీసం అప్పుడప్పుడు అయినా తగ్గుతోందంటే అందుకు కారణం ఆరావళి పర్వతాలే. ఈ శ్రేణులు, కేవలం రాళ్లతో నిండిన గుట్టలు మాత్రమే కావు. అవి ఉత్తర భారత దేశపు పర్యావరణ వ్యవస్థకు ఊపిరితిత్తుల వంటివి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశంలోని సారవంతమైన భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అయితే, గడచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, ఈ పర్వత శ్రేణులలో దాగి ఉన్న విలువైన ఖనిజ సంపద ఇప్పుడు వాటి పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది.अरावली सिर्फ़ पहाड़ नहीं, राजस्थान की सांस है। हज़ारों सालों से ये पर्वतमाला हमारी ज़मीन, पानी और जीवन की रक्षा करती आ रही है। इसे बचाना मतलब आने वाली पीढ़ियों को बचाना। #SaveAravalli pic.twitter.com/Yf0RAdPzW5— Tribal Army (@TribalArmy) December 19, 2025సుప్రీంకోర్టు ఏం చెప్పింది?ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ, మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది నవంబరు 20న కీలక తీర్పు ఇచ్చింది. ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్వచనాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. దీని ప్రకారం, ఆరావళి పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు (328 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఒకటికిపైగా ఆరావళి పర్వతాలు, పక్కపక్కనే సగటున 500 మీటర్ల దూరంలో ఉంటే వాటి మధ్యనున్న భూమిని కూడా ఆరావళి పర్వతశ్రేణిగానే పరిగణిస్తారు. ఈ పర్వతశ్రేణుల పరిధిలో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మైనింగ్‌ను సుప్రీం కోర్టు పూర్తిగా నిషేధించింది. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక (ఎంపీఎస్ఎం) సిద్ధమయ్యే వరకు ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ అటవీ పరిశోధన, విద్యా మండలి (ఐసీఎఫ్ఆర్ఈ) ద్వారా మొత్తం ఆరావళి శ్రేణికి సంబంధించి ఒక సమగ్ర సుస్థిర మైనింగ్ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆర్డర్ ఇచ్చింది. ఆరావళి శ్రేణులు థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకునే సహజ రక్షణ కవచమని, భూగర్భ జలాల రీఛార్జ్, వాతావరణ సమతుల్యతకు ఇవి అత్యంత అవసరమని కోర్టు నొక్కి చెప్పింది.కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదేంటి? ఆరావళి పర్వత శ్రేణుల భౌగోళిక స్వరూపంపై స్పష్టత కోసమే, వాటికి ఒక నిర్దిష్ట నిర్వచనాన్ని ఇచ్చాం. ఆ పర్వతాల్లో అక్రమ మైనింగ్ జరగకుండా నిలువరించడానికే ఈ చర్యను చేపట్టాం. ఆరావళి పర్వతాలను రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ పర్వత శ్రేణుల్లో క్షీణించిన ప్రాంతాలను పునరుద్ధరించడానికి మేం ఇప్పటికే 'గ్రీన్ ఆరావళి వాల్' ప్రాజెక్టును మొదలుపెట్టాం. సుప్రీంకోర్టు ఇటీవలే ఆమోదించిన నిర్వచనం ప్రకారం ముందుకు సాగుతాం. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఆరావళి పర్వత శ్రేణులను రక్షిస్తాం. ఆరావళి పర్వత ప్రాంతాల్లో 0.19 శాతం మాత్రమే మైనింగ్‌కు అనుమతి ఉంటుంది. వాటిలో కొత్త గనులకు మేం అనుమతులు ఇవ్వలేదు. దాదాపు 90 శాతం ఆరావళి పర్వత శ్రేణులకు రక్షణ కొనసాగుతోంది. ఈవిషయంలో ఎలాంటి సడలింపును మేం ఇవ్వలేదు. దీనిపై కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు'' అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. जब अरावली बचेगी ..तभी जल, जंगल और जीवन बचेगा !!⛰️#SaveAravalli pic.twitter.com/BYG2bM0IdP— Ronak Choudhary (@Ronak_choudhry) December 19, 2025పర్యావరణవేత్తల ఆందోళన.. ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనంలోని 100 మీటర్ల ఎత్తు నిబంధనపై పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి శ్రేణులలోని దాదాపు 91 శాతం పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ కొత్త నిబంధన వల్ల దాదాపు 91 శాతం ఆరావళి పర్వత శ్రేణులు చట్టపరమైన రక్షణను కోల్పోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎత్తులు, కొలతల ప్రాతిపదికన పర్వత శ్రేణుల లాంటి భారీ పర్యావరణ వ్యవస్థలను నిర్వచించలేమని పర్యావరణవేత్తలు అంటున్నారు. కొండలు, అడవులు, పరీవాహక ప్రాంతాలు అనేవి ఒకదానితో ఒకటి పరస్పరం అనుసంధానితమై ఉంటాయని, వాటిని వేరుచేసి చూడలేమని గుర్తు చేస్తున్నారు. అన్ని ఎత్తుల ఆరావళి పర్వతశ్రేణులతో పాటు వాటి పరిసర ప్రాంతాలను రక్షిత జోన్లుగా పరిగణించాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. 100 మీటర్ల ఎత్తు నిబంధన మైనింగ్, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల నిర్మాణ కంపెనీలకు వెసులుబాటును కల్పించేలా ఉందని ఆరోపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే ఆరావళి పర్వత శ్రేణులు దెబ్బతిన్నాయని అంటున్నారు.గుజరాత్లో నిరసనలుప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలోనూ ఆరావళి పర్వత శ్రేణులు ఉన్నాయి. 100 మీటర్ల ఎత్తు నిబంధనపై ఈ జిల్లాలోని విజయనగర్‌లో ఉన్న దద్వావ్ ఏరియా ప్రజలు మండిపడ్డారు. పెద్దసంఖ్యలో స్థానికులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. తమ ప్రాణాలను త్యాగం చేసైనా ఆరావళిని కాపాడుకుంటామని వారు ప్రకటించారు. తమ సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వారసత్వంలో కీలక భాగమైన ఆరావళి పర్వత శ్రేణులను పరిరక్షించుకుంటామని తేల్చి చెప్పారు. సబర్కాంత జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భావి తరాలు ఆరావళి శ్రేణులను పోస్టర్లలో చూసుకోవాల్సిన పరిస్థితిని తేకూడదని సూచిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర సర్కారుకు విన్నవిస్తున్నారు.అధ్యయనాలు ఇలా.. ఇక, తాజా విశ్లేషణ ప్రకారం గత ఎనిమిది సంవత్సరాలలో ఆరావళిలో పచ్చదనం క్రమంగా కోతకు గురైంది. వృక్షసంపద దాదాపు మూడింట ఒక వంతు తగ్గింది. దశాబ్దం కంటే తక్కువ కాలంలోనే దాదాపు 11,392 చదరపు కిలోమీటర్ల నుండి 7,521 చదరపు కిలోమీటర్లకు అటవీ ప్రాంతం తగ్గిపోయింది. మరోవైపు.. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ (CURaj) పరిశోధకులు 1975, 2019 మధ్య ఉపగ్రహ చిత్రాలు అధ్యయనం చేసి అంచనాలను రూపొందించారు. వారు విశ్లేషించిన డేటా ప్రకారం 44 సంవత్సరాల కాలంలో 5772.7 చదరపు కిలోమీటర్లు లేదా ఆరావళి శ్రేణులు దాదాపు 8 శాతం చదును చేయబడ్డాయని పేర్కొంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్ #సేవ్ఆరావళిఆరావళి పర్వతశ్రేణుల భద్రతపై భారత ప్రజల ఆందోళన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎంతోమంది పర్యావరణ వేత్తలు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, న్యాయవాదులు, పర్యావరణ సంస్థలు #సేవ్ఆరావళి హ్యాష్‌ట్యాగ్‌తో 'ఎక్స్' వేదికగా ట్వీట్లు చేస్తున్నాయి. శ్రేణుల భద్రతను బలహీనపర్చొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆరావళికి ఏదైనా జరిగితే తిరిగి పొందలేమని, ఇప్పుడే ఆ పర్వతశ్రేణుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.ఆరావళికి గండం వస్తే నష్టాలివే.. ఆరావళి పర్వతశ్రేణుల భద్రతకు భంగం కలిగితే, వాటిలోని జీవరాశులు, గిరిజన, ఆదివాసీ జాతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రత్యేకించి ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గాలి నాణ్యత మరింత తగ్గుతుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. రాజస్థాన్‌లోని థార్ ఎడారి వేగంగా విస్తరిస్తుంది.All eyes on Aravali …Reminder - Nature belong to everyone #SaveAravalli pic.twitter.com/g5LcSdfQSH— Tsering Gaphel ༅༎ཚིི་ཪིང་དགའ་འཕེལ།། (@Tsering_gaphel) December 24, 2025 -
ఆగ్రహ జ్వాలలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడు దీపూచంద్ర దాస్‌ను అల్లరిమూకలు కొట్టి చంపడం పట్ల విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ మారణకాండను ఖండించడం పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. వందలాది మంది కార్యకర్తలు కాషాయం జెండాలు చేతబూని బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లను దాటుకొని ముందుకు దూసుకొచి్చన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంస్థలు ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ హైకమిషన్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏడు అంచెల బారికేడ్లు సిద్ధంచేశారు. పారా మిలటరీ బలగాలను మోహరించారు. ప్రజా రవాణా సంస్థ బస్సులను సైతం వలయంగా నిలిపి ఉంచారు. హైకమిషన్‌కు 800 మీటర్ల దూరంలోనే నిరసనకారులను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిందువులకు రక్షణ కల్పించాలి యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య పట్ల బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ సిటీలో వ్రస్తాల పరిశ్రమలో పనిచేసే దీపూచంద్ర దాస్(25)ను ఈ నెల 18న దుండగులు కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. దైవ దూషణకు పాల్పడినందుకే దీపూచంద్ర దాస్‌ను శిక్షించినట్లు దుండగులు ప్రకటించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. హిందూ కార్మికుడి హత్యను పలు దేశాలు ఖండించాయి. భారత్‌లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ సర్కార్ తీరును ఖండించారు. దీపూచంద్ర దాస్‌ను పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బంగ్లాదేశ్‌లోని హిందువులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలని చెప్పారు. పొరుగు దేశంలోని హిందూ కుటుంబాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిరసనకారులు హనుమాన్ చాలీసా పఠించారు. మతపరమైన నినాదాలతో హోరెత్తించారు. భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం పట్ల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్‌లోని తమ కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు ఇరుదేశాల దౌత్య సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేయడం పది రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. హిందూ కుటుంబం ఇల్లు దహనం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చట్టోగ్రామ్‌లో హిందూ కుటుంబం ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఇంట్లో జయంతి సంఘా, బాబు షుకుశీల్ కుటుంబాలు నివసిస్తున్నాయి. దుండగుల దుశ్చర్యకు ఇల్లు చాలావరకు దహనమైపోయింది. ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు శునకాలు మరణించాయి. హిందువులను హెచ్చరిస్తూ దుండగులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అందులో హెచ్చరించారు. కోల్‌కతాలో నిరసనలు బంగ్లాదేశ్‌లో మైనారీ్టలైన హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది హిందూ సంఘాల సభ్యులు ‘బోంగియో జాగరణ్ మంచ్’ఆధ్వర్యంలో నగరంలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద VHP ఆందోళనలు
-
ఢిల్లీలో ఉద్రిక్తత.. బంగ్లా హైకమిషన్ వద్ద హిందూ సంఘాల నిరసనలు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరససగా వీహెచ్‌పీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్‌పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణాలు, దీపూ చంద్ర దాస్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద బారికేడ్లు తోసుకుంటూ వీహెచ్‌పీ నేతలు లోపలికి వెళ్లే యత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో హిందూ సంఘాలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. #WATCH | Delhi | Members of Vishva Hindu Parishad and other Hindu organisations protest near the Bangladesh High Commission over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh pic.twitter.com/0nrtZ3XWYG— ANI (@ANI) December 23, 2025దీపు చంద్రదాస్ హత్య చేసిన వారిని శిక్షించాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యూనస్ ప్రభుత్వం రాడికల్స్ మద్దతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, హిందువులపై అత్యాచారాలు నిరోధించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని హిందువులను రక్షించాలని కోరారు. 1971 తరహాలో తప్పు చేయవద్దని ఇండియాలో బంగ్లాదేశ్‌ను కలపాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. అనంతరం.. ఆందోళకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలిసింది. మరోవైపు.. బంగ్లాదేశ్‌పై ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 జరగాలంటూ వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. #WATCH | Delhi | Vishva Hindu Parishad and other hindu organisations protest near the Bangladesh High Commission against the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das pic.twitter.com/aKo0T3BUs2— ANI (@ANI) December 23, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్‌లో సైతం హిందు సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భోపాల్‌లో బజరంగ్ దళ్ నేతలు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. #WATCH | Bajrang Dal and other Hindu organisations protest over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh, in BhopalA Bajrang Dal member says,"Bajrang Dal has protested against the Bangladesh government today. We demand that… https://t.co/O134zU9B9p pic.twitter.com/1xVG722dxQ— ANI (@ANI) December 23, 2025 -
26న చీఫ్ సెక్రటరీల సదస్సు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ వారంలో జరిగే చీఫ్ సెక్రటరీల 5వ జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు కొనసాగుతుందని అధికారులు సోమవారం తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సదస్సుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేసే యువ జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు అధికారులు సైతం ఇందులో పాల్గొనే అవకాశముందని చెప్పారు. -
భరతం పట్టిన బార్ కోడ్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఒక హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించిన తీరు ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. అది డిసెంబర్ 15వ తేదీ.. కరోల్ బాగ్‌లోని అజ్మల్ ఖాన్ పార్కులో ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సరదాగా ఇన్‌స్టా రీల్స్ షూట్ చేసుకుంటున్నాడు. పక్కనే మద్యం తాగుతున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. గొడవకు కారణమేమిటంటే.. నిందితులు బాధితుడిని అగ్గిపెట్టె అడిగారు. లేదన్నందుకు అతని జేబులు వెతకడం మొదలుపెట్టారు. అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఆవేశంలో ఒక నిందితుడు బీర్ సీసాను పగులగొట్టి, బాధితుడి తలపై బలంగా బాదాడు. బాధితుడు రక్తపు మడుగులో పడిపోగా, నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. క్లూ దొరికిందిలా.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా, దాడికి ఉపయోగించిన పగిలిన బీర్ సీసా దొరికింది. దానిపై ’బార్ కోడ్’ చెక్కు చెదరకుండా ఉంది. అదే ఈ కేసులో కీలక మలుపు.. ఆ బార్కోడ్ ఆధారంగా పోలీసులు సమీపంలోని వైన్ దుకాణాలన్నీ గాలించారు.72 గంటల గాలింపు బార్కోడ్ మ్యాచ్ అయిన వైన్ దుకాణం దగ్గర సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించగా, నిందితులు వాడిన స్కూటర్ బయటపడింది. వరుస సీసీటీవీలను పరిశీలించిన స్పెషల్ టీమ్, కేవలం 72 గంటల్లోనే నిందితుల చిరునామా కనిపెట్టి వారిని చుట్టుముట్టింది.అసలు నిందితులు వీరే! డిసెంబర్ 18న హమ్మద్ అలియాస్ రిజ్వాన్ (22), కామ్రాన్ (24), ఫర్జాన్ (24) అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో హమ్మద్ అనే వ్యక్తి సాధారణ నేరస్తుడు కాదు.. అతనిపై ఇప్పటికే 20 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అగ్గిపెట్టె కోసం మొదలైన గొడవలో.. ఒక చిన్న బార్కోడ్ ఆధారం నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టింది. -
ఢిల్లీలో పెద్ది
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు.ఈ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. చేతిలో సంచితో మాస్ లుక్‌లో నడుచుకుంటూ వెళుతున్న రామ్ చరణ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి...’పాట 150 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, కెమెరా: ఆర్. రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్. -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. గాలి నాణ్యత ‘తీవ్ర’స్థాయికి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి నగరాన్ని ఘనమైన పొగమంచు, చల్లటి వాతావరణం కమ్మేసింది. దీంతో గాలి నాణ్యత సూచిక (AQI) తీవ్ర స్థాయికి చేరువైంది. శనివారం రాత్రి 11 గంటలకు గాలి నాణ్యత (AQI)410కి చేరి తీవ్ర స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు AQI 396గా నమోదైంది. ప్రభావిత ప్రాంతాలు.. చాంద్ని చౌక్ – 455, వజీర్పూర్ – 449, రోహిణి – 444, జహాంగీర్‌పురి – 444, ఆనంద్ విహార్ – 438 , ముండ్కా – 436కి గాలి నాణ్యత చేరడంతో ఈ ప్రాంతాలన్నీ తీవ్ర కాలుష్యం వర్గంలోకి చేరాయి. దాంతో భారత వాతావరణ శాఖ (IMD) ఘనమైన పొగమంచు హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. చల్లటి వాతావరణం,తక్కువ గాలి వేగం, ఉష్ణోగ్రత మార్పులు కాలుష్యాన్ని నేలమట్టం వద్దే నిలిపేశాయి. ఈ నేపధ్యంలో రోడ్డు, రైలు, విమాన రవాణాపై అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపునులు పేర్కొన్నారు.తక్కువ గాలి వేగం, ఉష్ణోగ్రత ఇన్వర్షన్ కారణంగా కాలుష్యం నేలమట్టం వద్దే నిలిచిపోతుందని నిపుణులు తెలిపారు. శీతాకాలం మరింతగా పెరుగుతున్న కొద్దీ ఢిల్లీలో గాలి కాలుష్యం సమస్య మళ్లీ మళ్లీ తలెత్తుతుందని హెచ్చరించారు. ఢిల్లీలో గాలి నాణ్యత సమస్యపై దీర్ఘకాలిక పరిష్కారాలు, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
నాకీ బిడ్డ వద్దు!
గోరఖ్‌పూర్ (యూపీ): నమ్మిన భర్త నట్టేట ముంచాడన్న ఆవేదన.. అండగా ఉండాల్సిన సమయంలో మరో మహిళతో చెక్కేశాడన్న ఆగ్రహం.. ఆవేదన కలగలిసిపోయాయి. అవన్నీ ఆమెకు పుట్టిన పసికందుకు శాపంగా పరిణమించాయి. తనను మోసం చేసిన వ్యక్తి ఆనవాళ్లు బిడ్డలో ఉన్నాయి కాబట్టి.. పుట్టిన నవజాత శిశువును అంగీకరించేందుకు ఒక తల్లి నిరాకరించింది. గోరఖ్‌పూర్‌లో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలివి.రైలు ప్రయాణంలో ప్రసవంఢిల్లీలో పనిమనిషిగా జీవనం సాగిస్తున్న ఒక మహిళ, నిండు గర్భిణిగా ఉన్నప్పుడు భర్త తనను వదిలేసి వెళ్లిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. రైలు ప్రయాణంలో ఉండగా పురిటి నొప్పులు రావడంతో, రైల్వే పోలీసుల సాయంతో జిల్లా ఆసుపత్రిలో చేరింది. మగబిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, భర్తపై ఉన్న కోపంతో ఆ పసివాడికి పాలివ్వడానికి కూడా ఆమె నిరాకరించింది.కౌన్సెలింగ్‌తో కరిగిన మనసుఆసుపత్రి సిబ్బంది గంటల తరబడి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఆమెలో తల్లి మేలుకుంది. ‘వాడికి నా భర్త పేరు పెట్టను.. బిడ్డను నేనే పెంచుకుంటాను’.. అంటూ మనసు మార్చుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని, బిడ్డ ఆరోగ్యం మెరుగవ్వగానే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ జై కుమార్ తెలిపారు. -
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దాడి చేసిన ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ పాయింట్ వద్ద క్యూను పట్టించుకోకుండా కొందరు ఎయిరిండియా ఉద్యోగులు వెళ్లిపోవడంపై తలెత్తిన వివాదంతో ఈ గొడవ జరిగినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అంకిత్ దివాన్ అనే ప్రయాణికుడు శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎయిర్‌పోర్టులోని టెరి్మనల్–1 వద్ద కొందరు సిబ్బంది క్యూలో ఉన్న వారిని నెట్టేసి ముందుకు వెళ్తుండగా, తాను అభ్యంతరం తెలిపానని ఆయన పేర్కొన్నారు. దీంతో, వేరే విమానంలో అక్కడికి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ ఒకరు నానాదుర్భాషలాడుతూ తనపై చేయిచేసుకున్నారని, పక్కనే ఉన్న తన కూతురు ఈ ఘటన చూసి షాక్‌కు గురైందని అంకిత్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చూశాకనే తమకు తెలిసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై విమానాశ్రయం అధికారులు, ఎయిరిండియా సిబ్బందితోపాటు బాధితుడి నుంచి కూడా ఫిర్యాదు రాలేదని వివరించారు. ఒక వేళ వస్తే, ఘటనకు దారి తీసిన పరిస్థితులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా ఉండగా, ప్రయాణికుడిపై దాడి చేసినట్లుగా భావిస్తున్న పైలట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించామని ఎయిరిండియా తెలిపింది. అంతర్గత దర్యాప్తు చేపట్టామని పేర్కొంది. కాగా, ఆరోపణలను ఎదుర్కొంటున్న పైలట్..ఘటన అనంతరం ఇండిగో విమానంలో బెంగళూరు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
‘నో పీయూసీ– నో ఫ్యూయెల్’.. వాహనాలకు ఇంధన నిరాకరణ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా చేపట్టిన ‘నో పీయూసీ.. నో ఫ్యూయెల్’ అమలు గురువారం ప్రారంభమైంది. మొదటి రోజునే 2,800 వాహనాలకు చమురు నిరాకరించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 210 ఎన్ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేశారు.ఇక, పోలీసులతో కలిసి ఎన్ఫోర్స్ మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. డ్రైవ్‌లో భాగంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలవరకు పీయూసీ (పొల్యూషన్ అండ్ కంట్రోల్) నిబంధనలు ఉల్లంఘించిన వారికి 3,746 చలాన్లు జారీ చేసినట్లు తెలిపారు. గురువారం నుంచి ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’అమలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ప్రకటించిన తరువాత నో పీయూసీ సర్టిఫికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. డిసెంబర్ 17న 31వేలకు పైగా సర్టిఫికెట్లు జారీ చేశారు. -
చిమ్మచీకట్లలోనే ఢిల్లీ
ఉత్తర భారతంపై పొగమంచు దుప్పటి కమ్మేసుకుంది. దేశ రాజధాని సహా పంజాబ్, హర్యానా, ఇటు ఉత్తర్‌ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్ సహా బిహార్ రాష్ట్రాలపై ప్రభావం చూపెడుతోంది. ఢిల్లీలో శనివారం తెల్లవారు ఝామున 8గం. సమయంలోనూ చిమ్మచీకట్లు నెలకొన్నాయి. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి కనిపించింది. వాయు కాలుష్యానికి పొగమంచు తోడు కావడంతో ఊపిరి సైతం పీల్చుకోలేని స్థితిలో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెడ్ అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్‌కు మార్చింది వాతావరణ శాఖ. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు రోజంతా నెలకొంటాయని నగర వాసులను హెచ్చరిస్తోంది. మరోవైపు.. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్లలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను కంటిన్యూ చేస్తోంది. రాజధానిలో ఇవాళ ఉదయం 7గం. సమయంలో ప్రగతి మైదాన్ భైవర్ మార్గ్ వద్ద ఏక్యూఐ 433గా రికార్డు కావడం గమనార్హం. ఐటీవోలో 439, ఆనంద్ విహర్లో 423, జహంగీర్‌పూరీలో 420, నెహ్రూ నగర్లో 418, వాజిర్‌పూర్‌లో 417, పంజాబీ బాగ్‌లో 423, రోహిణిలో 407గా ఏఐక్యూ నమోదు అయ్యింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ మొత్తంగా 380గా ఉండి ‘వెరీ పూర్’ కేటగిరీలో కొనసాగుతోంది. #WATCH | Delhi | Dense layer of toxic fog engulfs the national capital. Visuals from Bhairav Marg near Pragati Maidan. CPCB claims that the AQI in the area is at '433', categorised as 'Severe'. pic.twitter.com/1D79ZqKSeG— ANI (@ANI) December 20, 2025పొగమంచు కారణంగా రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో.. రహదారుల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాజధాని రీజియన్ నుంచి 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంచువల్ల ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేయొద్దని.. విమాన ప్రయాణాల అంతరాయాల విషయంలో తగిన మార్గదర్శకాలు పాటించాలని ఇటు పౌర విమానయాన శాఖ.. అటు డీజీసీఏ ఎయిర్‌లైన్స్‌లకు హెచ్చరికలు జారీ చేశాయి. -
రోహిత్ శర్మ యూటర్న్!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు వార్తా సంస్థ PTIకి వెల్లడించాయి.కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma).. తొలుత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు.. అనంతరం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని వన్డే కెప్టెన్సీ తప్పించింది బీసీసీఐ.మునుపెన్నడూ లేని విధంగాఈ క్రమంలో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన రోహిత్ శర్మ.. దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. మునుపెన్నడూ లేని విధంగా మరింత ఫిట్‌గా మారి.. ఆసీస్ గడ్డ మీద శతకంతో చెలరేగిన హిట్‌మ్యాన్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, ప్రస్తుతం రోహిత్‌తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2027కి సిద్ధమయ్యే క్రమంలో రో-కో మ్యాచ్ ప్రాక్టీస్ గురించి చర్చలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బీసీసీఐ భారత జట్టులోని ప్రతి సభ్యుడు కచ్చితంగా కనీసం రెండు దేశీ మ్యాచ్‌లు అయినా ఆడాలని ఆదేశించింది. రో-కోలకే కాకుండా ప్రతి ఒక్క ఆటగాడికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లి అయితే, ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ శుక్రవారం మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ముంబై జట్టుకు అందుబాటులో లేడని తెలిపాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీకి ప్రకటించిన జట్టులో తొలి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది. ఈ పరిణాల క్రమంలో శుక్రవారం రాత్రి ఎంసీఏ వర్గాలు మరోసారి రోహిత్ శర్మ విషయంపై స్పందిస్తూ.. అతడు కనీసం రెండు మ్యాచ్‌లకు అవైలబుల్గా ఉంటాడని స్పష్టం చేశాయి. కోహ్లి పేరు ప్రకటన తర్వాత రోహిత్ సైతం ఈ మేర యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముంబై జట్టుకు చెందిన టీమిండియా స్టార్లు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ శివం దూబే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. టీ20 ప్రపంచకప్-2026 దృష్ట్యా వారిద్దరికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ముంబై మాజీ కెప్టెన్ అజింక్య రహానే అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత జట్టుతో చేరే అవకాశం ఉంది. కాగా డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మొదలుకానుంది.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్.. ఈ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ఇక మరో టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా వీలు చిక్కినపుడు మ్యాచ్‌లకు వస్తాడని తెలిపిన డీడీసీఏ.. భారత మాజీ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ, నవదీప్‌సైనీ కూడా ఈసారి జట్టులో భాగం కానున్నారని తెలిపింది. కాగా పంత్ డిప్యూటీగా ఆయుశ్ బదోని వ్యవహరించనుండగా.. తేజస్వి సింగ్ వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.2010లో చివరిసారిగాకాగా 2010లో చివరిసారిగా విరాట్ కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. వన్డే క్రికెట్లో రారాజుగా వెలుగొందుతూ అత్యధిక సెంచరీల (53) వీరుడిగా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్ బరిలో దిగనున్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్‌లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ముంబై తరఫున ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదని ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తాజాగా వెల్లడించాడు.విజయ్ హజారే ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని (వైస్ కెప్టెన్), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్ కీపర్), హర్ష్ త్యాగి, సిమర్జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ఆయుశ్ దొసేజా, దివిజ్ మెహ్రా, వైభవ్ కంద్పాల్, రోహన్ రాణా, అనూజ్ రావత్. చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం!
ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సిర్సా, దేశ రాజధానిలో వాహన కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను ప్రకటించారు. డిసెంబర్ 18 నుంచి బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదని వెల్లడించారు.ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS4, BS3 వాహనాల ప్రవేశంపై కఠినమైన పరిమితులను విధించారు. పాత పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వల్ల పెరుగుతున్న గాలి నాణ్యత సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ సామగ్రిని రవాణా చేసే ట్రక్కులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తన ప్రకటనలో హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడితే ఈ వాహనాలపై జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. స్వాధీనం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.లక్షల వాహనాలపై ప్రభావం!ప్రధానంగా.. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS-VI కాని వాహనాల ప్రవేశాన్ని అక్కడి ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షల వాహనాలు ఢిల్లీలో ప్రవేశించకుండా చేస్తుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పాత పెట్రోల్ వాహనాలను కలిగి ఉన్న రోజువారీ ప్రయాణికులు ఈ నిషేధం వల్ల ప్రభావితమవుతారు.బీఎస్6 ప్రమాణాలు తప్పనిసరిఇప్పుడు ఢిల్లీలో తిరగాలంటే.. మీ వాహనం బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఉండాల్సిందే. 2020 ఏప్రిల్ తరువాత ఈ బీఎస్6 రూల్స్ అమలులోకి వచ్చాయి. కాబట్టి 2020 తరువాత తయారైన దాదాపు అన్ని వాహనాలు దీనికి అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. బీఎస్6 వాహనాలు (పెట్రోల్, డీజిల్) మాత్రమే కాకుండా.. CNG, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు నగరంలో తిరగవచ్చు.మోటారు వాహనాల చట్టం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తారు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే.. వాహనాలను జప్తు చేస్తారు. అంతే కాకుండా చెల్లుబాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
ఎవరీ రీసైకిల్ కింగ్ కరణ్? ఏకంగా 400 టన్నుల..
ఢిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కరణ్ తన ‘ఫినోబాదీ’ స్టార్టప్ ద్వారా 450 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేశాడు. 3,318 మొక్కలను నాటాడు. డైబ్భై మందికి పైగా కార్మికులకు స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని కల్పిస్తున్నాడు...‘స్టెబిలిటీ–క్లారిటీ–డిగ్నిటీ’ నినాదంతో ‘ఫినోబాదీ’ అనే రీసైకిలింగ్ కంపెనీని ప్రారంభించాడు కరణ్ కుమార్. కరణ్ తండ్రి అయిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆస్తిపాస్తులు లేవు. కష్టాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషించాడు. ‘నాన్నకు చదువు లేదు. ఆస్తి లేదు. అయినా సరే ఏదో రకంగా జీవనోపాధిని సృష్టించుకోగలిగాడు. ఇది చూసిన తరువాత శూన్యం నుంచి అవకాశాన్ని సృష్టించుకోవచ్చు’ అనే విషయాన్ని నేర్చుకున్నాను అంటాడు కరణ్.ఎందుకు? ఏమిటి? ఎలా?రకరకాల గాడ్జెట్స్‌కు సంబంధించి ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆసక్తి కరణ్‌లో ఉండేది. అవి ఎలా పనిచేస్తాయనేది తెలుసుకోవాలనుకునేవాడు. చేతికి దొరికిన ప్రతి గ్యాడ్జెట్‌ను విడదీసి, తిరిగి వాటిని యథాతథ స్థితిలోకి తీసుకువచ్చేవాడు. ఇది సరదా కోసం చేసిన పని కాదు. వాటి అంతర్గత పనితీరు తెలుసుకోవడానికి చేసింది. ఏదైనా గ్యాడ్జెట్ పనిచేయకపోతే దాన్ని బాగు చేసి పనిచేసేలా చేసేవాడు. దీంతో ఇరుగు పొరుగు వారు రిపేర్ పని ఏదైనా ఉంటే కరణ్ దగ్గరికి వచ్చేవారు. పాకెట్ మనీకి కరణ్‌కు లోటు ఉండేది కాదు.నేర్చుకున్న తొలిపాఠంకోవిడ్ టైమ్‌లో తండ్రి వర్క్‌షాప్ మూతబడడంతో తమ్ముడితో కలిసి చిన్నపాటి ‘డోర్–టు–డోర్ మిల్క్ డెలివరీ సర్వీస్’ ప్రారంభించాడు కరణ్. అయితే దీంతో నష్టమే తప్ప లాభం రాలేదు. ‘వ్యాపారం అనేది సమస్యను పరిష్కరించేలా ఉండాలి. సమస్యను కొని తెచ్చుకునేలా ఉండకూడదు అనే పాఠాన్ని ఆ అనుభవం నుంచి నేర్చుకున్నాను’ అంటాడు కరణ్.ఇంటర్మీడియెట్ చేస్తున్నప్పుడు దిల్లీ ప్రభుత్వ భాగస్వామ్యంతో, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ‘ఉద్యమ్ శిక్ష’ అనే కార్యక్రమంలో చేరాడు కరణ్. నిజజీవిత సమస్యలు పరిష్కరించడానికి విద్యార్థులకు ఉపకరించే శిక్షణా కార్యక్రమం ఇది.‘ఉద్యమ్ శిక్షలో చేరిపోవడం నా జీవితాన్ని మార్చేసింది. నేను కొత్త వారితో మాట్లాడేవాడిని కాదు. మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడిని. అయితే ఉద్యమ్ శిక్ష నాలోని బెరుకును పోగొట్టింది. బయటకు వెళ్లి ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోమని చెప్పింది. ఈ క్రమంలోనే నాలో చిన్నగా ఆత్మవిశ్వాసం మొదలైంది’ అంటాడు కరణ్.ఫిన్ ప్లస్ కబాదీఢిల్లీలో చెత్తకుప్పల సమస్య తీవ్రంగా ఉండేది. చెత్తకుప్పలను కాల్చడం వల్ల విషపూరిత పొగలు విడుదలయ్యేవి. ఇది చూసి షాక్ అయ్యాడు కరణ్. ఈ చెత్త కుప్పలను కాల్చడం ద్వారా విషవాయువులు విడుదలవుతాయి అనేది ఒక కోణం అయితే, మరో కోణం వాటిని పునర్వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోవడం. సమస్య తీవ్రతను తెలుసుకోవడానికి కబాదీవాలాస్(స్క్రాప్ డీలర్లు)తో మాట్లాడాడు కరణ్. వారి పని విధానం ఎలా ఉంటుందో, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో తెలుసుకున్నాడు. ‘విలువ లేని వస్తువులను విలువైన వస్తువులుగా మారుస్తాం’ అని వారు చెప్పిన మాట కరణ్‌ను ఆకట్టుకుంది. వారి మాటల స్ఫూర్తితో ‘ఫినోబాదీ’ పేరుతో రీసైక్లింగ్ కంపెనీ మొదలు పెట్టాడు కరణ్. ఫిన్ (ఫైనాన్స్), కబాదీ(స్క్రాప్) అనే రెండు మాటలు ఒక దగ్గర చేర్చి తన కంపెనీకి ‘ఫినోబాదీ’ అనే పేరు పెట్టాడు.ఆ మొక్కలు లక్ష్యాన్ని గుర్తు తెస్తాయిస్కూలు ఫ్రెండ్స్‌తో కలిసి ఢిల్లీలోని చంచల్ పార్క్‌లో పునర్వినియోగపరచదగిన వస్తువులను సేకరించడం మొదలుపెట్డాడు కరణ్. అయితే వారు పనికొస్తాయనుకున్న వస్తువులలో పనికిరాని వస్తువులే ఎక్కువ! ‘ఈ అనుభవంతో ప్లాస్టిక్, మెటల్, పేపర్‌కు సంబంధించి సూక్ష్మస్థాయిలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఏ వస్తువు పనికొస్తుంది, ఏది పనికి రాదు అనే విషయంలో స్పష్టత తెచ్చుకున్నాం’ అంటాడు కరణ్. ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ ‘బిజినెస్ బ్లాస్టర్స్ ప్రోగ్రాం’ ద్వారా సీడ్ క్యాపిటల్ సంపాదించాడు.కంపెనీ పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. యాప్ తీసుకువచ్చాడు. గల్లీలో మొదలైన ‘ఫినాబాదీ’ ఢిల్లి అంతటా విస్తరించింది. నోయిడా, గురుగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. వంద కిలోల వ్యర్థాలను రీసైకిల్ చేసిన ప్రతిసారి ఒక మొక్క నాటడం సంప్రదాయంగా చేసుకుంది ఫినోబాదీ. ‘మనం ఈ పని ఎందుకు చేస్తున్నామో ఆ మొక్క గుర్తు తెస్తుంది’ అంటాడు కరణ్ కుమార్.(చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..! అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే..) -
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ చాలా తగ్గిపోయింది. రేపటి వరకు తీవ్రస్థాయిలో పొగమంచు కొనసాగుతుందని ఢిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఉత్తరాఖండ్లపై కూడా దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, త్రిపురలో రేపటి వరకు కూడా పొగమంచు కప్పేస్తుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది.కాగా, పొగమంచు కారణంగా ఢిల్లీలో వాహనాలూ కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో రాజధానిని పొగమంచు కప్పేసినట్లు ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. జాతీయ రాజధానిలో సగటు గాలి నాణ్యత సూచిక (AQI) ఇవాళ ఉదయం 7 గంటలకు 387గా నమోదైంది. నిన్న (గురువారం) వాయు నాణ్యత (AQI) 373గా నమోదైంది. ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు కారణంగా 27 విమానాలు రద్దు కాగా.. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.కాగా, ఢిల్లీ ప్రభుత్వం పలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది. గ్రాప్ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ- ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో నిర్వహణ, మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల వాహనాలు మినహా ఢిల్లీలోకి డీజిల్ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించారు. గడువు ముగిసిన వాహనాలపై నిషేధం అమలు చేస్తున్నారు. ఢిల్లీ పొల్యూషన్ నేపథ్యంలో 5వ తరగతి వరకు ఆన్లైన్లలో మాత్రమే తరగతులు నిర్వహించాలని.. 6 నుంచి 12వ తరగతి వరకు హైబ్రిడ్ విధానంలో క్లాసులు చేపట్టాలని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. -
వాయు కాలుష్యం ఎన్నాళ్లు?
మనం పీల్చే ప్రాణవాయువు కొంచెం కొంచెంగా మన ప్రాణాన్ని తోడేస్తున్నదంటే నమ్మబుద్ధి కాదు. ఈ సంగతి కొన్ని దశాబ్దాలుగా తెలుస్తూనే ఉన్నా ప్రతి ఏటా దేశ రాజధాని పౌరులు చలికాలం ఉన్నన్నాళ్లూ శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఏటికేడాదీ అది తప్పడం లేదు. కాకపోతే శీతకాలంలో మాత్రమే మన వ్యవస్థలన్నీ మేల్కొంటాయి.సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలూ, ప్రభుత్వాల నియమ నిబంధనలూ, విపక్షాల విమర్శలూ, సామాన్యుల అరణ్య రోదనలూ... అన్నీ అప్పుడే! బీసీసీఐ సైతం దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయన్న సంగతే మరిచి ఇదే సీజన్లో ఢిల్లీలో, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో క్రికెట్ సంబరాల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది.ఈసారి కూడా రివాజు తప్పకుండా ఇవన్నీ ఒకదాని వెంబడి మరోటి సాగుతున్నాయి. పొగమంచు కమ్మేస్తున్న పర్యవసానంగా ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం మంది ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మొదలైంది. ఉద్యోగులు సొంత వాహనాల్లో కాక, ‘కార్ పూలింగ్’ ద్వారా వచ్చేలా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రాజధాని వెలుపల రిజిస్టరై, బీఎస్–4 ప్రమాణాలు లేని వాహనాల రాకపోకల్ని నిషేధించారు. కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ లేని వాహనాలకు ఇంధనం విక్రయించరాదంటూ పెట్రోల్ బంకులకు ఆదేశాలు పోయాయి. 16 రోజుల పాటు అమల్లో ఉండేలా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 విధించారు.ఈ సమయమంతా నిర్మాణ పనులు నిలిచిపోవాలి. బీఎస్–3 పెట్రోల్, బీఎస్–4 డీజిల్ వాహనాలను అనుమతించబోరు. ఇవి 12 లక్షల వరకూ ఉంటాయని లెక్కేస్తున్నారు. మొత్తంగా ఉండే కోటిన్నర వాహనాల్లో ఇవి ఏపాటి? నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికులు ఆంక్షల కారణంగా పనులు కోల్పోతే రూ. 10,000 చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అలా నమోదైన వారు కేవలం 2.57 లక్షలమంది మాత్రమే.ఇంతకు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారని అంచనా. ఇవన్నీ మెచ్చదగ్గ చర్యలే. కానీ అసలు ఢిల్లీ సవ్యంగా ఉన్నదెప్పుడు? ఇటీవలికాలంలో అది నిరంతరం కాలుష్యంలోనే మునిగి తేలుతోంది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధాంశాలన్నట్టు ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కేంద్రీకృత నగర వ్యవస్థల వల్లనే ఈ అవస్థలన్నీ దాపురిస్తున్నాయని తెలిసినా వాటిని మానుకోవడం లేదు.ఢిల్లీలో వాయునాణ్యత అతి తీవ్ర స్థాయిలో... అంటే సగటు వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) 400కు మించి ఉన్నదని తేలింది. ఇది వరుసగా మూడు రోజులుండగా, ఆ తర్వాత అది ‘దయనీయ స్థితి’(వెరీ పూర్)కి... అంటే ఏక్యూఐ 300–400 పరిధిలో కొచ్చింది. కాలుష్యం గురించి దీపావళి పండుగకు ముందో, పంజాబ్‌లో పంట కోతల సమయంలోనో గుర్తుకురావటం వల్లే ఈ సమస్యంతా!కొన్నాళ్లపాటు మొత్తంగా టపాసులు కాల్చటానికి వీల్లేదని నిషేధం విధిస్తే ‘మా పండుగకే ఇలాంటివి గుర్తొస్తాయా?’ అనే తర్కం తలెత్తదు. బ్యాంకుల ద్వారా వాయిదాల్లో వాహనాల కొనుగోలును కొన్నాళ్లు ఆపేస్తే ఇంత చేటు కాలుష్యం ఉండదు. అసలు ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ఠం చేస్తే అత్యధికులు వాహనాల జోలికిపోరు. పరిశ్రమలు వెదజల్లుతున్న ఉద్గారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటే కాలుష్య భూతం అదుపులో ఉంటుంది.ఇవన్నీ పట్టన ట్టు నవంబర్– జనవరి మధ్య క్రికెట్ మ్యాచ్‌లకు బీసీసీఐ ఉత్తరాదిని ఎంచుకుని నగుబాటు పాలవుతోంది. లక్నోలో వాయునాణ్యత 400 మించటంతో శుక్ర వారం జరగాల్సిన మ్యాచ్‌ను రద్దుచేశారు. ఇప్పుడే కాదు... 2017లో ఢిల్లీలో భారత– శ్రీలంక మ్యాచ్ సమయంలో పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఆటగాళ్లకు శ్వాసకోశ సమస్య లొచ్చాయి. కొందరైతే ఆడుతూ వాంతులు చేసుకున్నారు.2019లో భారత–బంగ్లా మ్యాచ్ సమయంలోనూ ఇంతే! రెండేళ్ల క్రితం బంగ్లా–శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ చివరి నిమిషంలో రద్దయింది. కనీసం ఈ సమయంలోనైనా దక్షిణాదిని ఎంచుకుందా మని బీసీసీఐకి తోచదు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రవర్తించకుండా ప్రభుత్వ విభాగా లన్నీ సమన్వయంతో పనిచేస్తే, ఏడాది పొడవునా అమలయ్యే చర్యలుంటే ఢిల్లీ కాస్త యినా మెరుగుపడుతుంది. కాలుష్య భూతాన్ని నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతుంది. -
Delhi: కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఢిల్లీ వాసులు
-
‘బీజింగ్‌కు సాధ్యం.. ఢిల్లీకి అసాధ్యమా?’.. చైనా ‘మాస్టర్ క్లాస్’
న్యూఢిల్లీ: ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు, వాయు కాలుష్యంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, చైనా తన విజయగాథను భారత్‌తో పంచుకుంది. ఒకప్పుడు ‘ప్రపంచ స్మోగ్ రాజధాని’గా పేరుగాంచిన బీజింగ్, కేవలం దశాబ్ద కాలంలోనే వాయు కాలుష్యాన్ని ఎలా తరిమికొట్టిదో వివరిస్తూ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వరుస పోస్ట్‌లు చేశారు. 2013లో 101.7 ug/m3గా ఉన్న బీజింగ్ వార్షిక PM 2.5 సగటు, 2024 నాటికి ఏకంగా 30.9 ug/m3కు పడిపోవడం గమనార్హం.బీజింగ్ అనుసరించిన వ్యూహాలివే!వాయు కాలుష్య నివారణకు వాహన ఉద్గారాల నియంత్రణే మొదటి మెట్టు అని జింగ్ పేర్కొన్నారు. యూరో 6 ప్రమాణాలకు సమానమైన 'చైనా 6NI' నిబంధనలను కఠినంగా అమలు చేయడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించడం ద్వారా బీజింగ్ గణనీయమైన మార్పు సాధించింది. కేవలం నిబంధనలే కాకుండా, లైసెన్స్ ప్లేట్ లాటరీలు, బేసి-సరి వంటి కఠినమైన ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తూనే.. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో, బస్సు నెట్‌వర్క్‌లను నిర్మించింది. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని వేగవంతం చేయడం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.మరోవైపు పారిశ్రామిక పునర్నిర్మాణం ద్వారా బీజింగ్ విప్లవాత్మక మార్పులు చేపట్టింది. సుమారు 3000కు పైగా భారీ పరిశ్రమలను నగరం నుండి తొలగించడం లేదా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా చైనాలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘షోగాంగ్’ను వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా గాలిలోని హానికారక కణాలు ఒక్కసారిగా 20 శాతం తగ్గాయి. ఖాళీ అయిన కర్మాగారాల స్థలాలను పార్కులుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చగా, మాజీ షోగాంగ్ సైట్ 2022 వింటర్ ఒలింపిక్స్‌కు వేదిక కావడం విశేషం.అయితే భారత్‌లో కూడా ఇటువంటి ప్రణాళికలు చర్చల్లో ఉన్నప్పటికీ, వాటి అమలు తీరులోనే ప్రధాన తేడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మన వద్ద BS6 ప్రమాణాలు ఉన్నా, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు’ అని పర్యావరణ విశ్లేషకులు సునీల్ దహియా పేర్కొన్నారు. కేవలం కాలుష్యం పెరిగినప్పుడు మాత్రమే అత్యవసర చర్యలు తీసుకోవడం కాకుండా, బీజింగ్ మాదిరిగా ఏడాది పొడవునా కఠినమైన పారిశ్రామిక మార్పులు అమలు చేయాలి. ఇంధన పరివర్తన చేపట్టినప్పుడే ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్ సుతార్ కన్నుమూత -
ఇంకా గ్యాస్ చాంబర్‌లానే ఢిల్లీ!
న్యూఢిల్లీ: నివారణ చర్యలు చేపట్టినా కూడా రాజధానిలో వాయు కాలుష్యం తగ్గడం లేదు. ఢిల్లీలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసి, దృశ్యమానత గణనీయంగా తగ్గిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం గురువారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) 358 వద్ద నమోదైంది. ప్రస్తుత ఏక్యూఐ చాలా పేలవమైన విభాగంలోకి వస్తుంది. ఢిల్లీలోని 39 మానిటరింగ్ స్టేషన్లలో నాలుగు తీవ్రమైన కేటగిరీలో AQI నమోదు కాగా, మరికొన్ని ఇంకా కింద ఉన్నాయి. బుధవారం 24 గంటల సగటు AQI 334గా నమోదైంది. NCRలోని నోయిడా (331), గ్రేటర్ నోయిడా (310), గురుగ్రామ్ (279)లో కూడా గాలి నాణ్యత దారుణంగా ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఉదయం వేళల్లో వాయువ్య దిశ నుండి గంటకు 10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళల్లో గాలి వేగం 15 కి.మీ వరకు పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో పశ్చిమ దిశ నుండి 10 కి.మీ కంటే తక్కువకు పడిపోతుంది. ఈ గాలి మార్పులు పొగమంచును వెదజల్లడంలో సహాయపడతాయి. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండదు, తరువాతి రోజుల్లో 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని IMD అంచనా వేసింది. రాకపోకలకు అంతరాయమే..ఢిల్లీ విమానాశ్రయం తక్కువ విజిబిలిటీ కారణంగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక జారీ చేసింది. విమాన కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నప్పటికీ, ప్రయాణికులు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్స్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ కూడా ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. తాజా నిబంధనలతో గుర్గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుంచి ఎంటర్ అయ్యే 12 లక్షల వాహనాలపై ప్రభావం పడనుంది. ఈ వాహనాల తనిఖీ కోసం 126 చెక్ పాయింట్ల వద్ద 580 మంది పోలీసుల మోహరించారు. పెట్రోల్ బంకుల వద్ద ట్రాన్స్పోర్ట్, ఎం సి డి ,ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారుల మోహరించారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేతఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది గ్రాప్ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. గ్రాఫ్ ఫోర్ నిబంధనల నేపథ్యంలో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మిగిలిన తరగతులకు హైబ్రిడ్ మోడ్ క్లాసులు జరగనున్నాయి. పీయూసీసీ (Pollution Under Control Certificate) లేని వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేయబడుతుంది. BS-VI నిబంధనల కంటే తక్కువ ఉన్న ఢిల్లీయేతర వాహనాలు రాజధానిలోకి ప్రవేశించకుండా నిరోధించబడ్డాయి. పార్లమెంట్లో నేడు చర్చఢిల్లీ-ఎన్సీఆర్లో పొగమంచు, వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో AQI చాలా దారుణమైన స్థాయికి పడిపోతుందని ఓ అంచనా. ఢిల్లీ వాయు కాలుష్యంపై నేడు లోక్ సభలో చర్చ జరగనుంది. విపక్షాల నుండి చర్చ ప్రారంభించనున్న ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్. బీజేపి తరపున చర్చలో నిషికాంత్ దూబే, బన్సూరీ స్వరాజ్ పాల్గొననున్నారు. -
వాయు కాలుష్యం పీఎం 2.5 : లంగ్ కేన్సర్, అకాల మరణాల ముప్పు
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వాయుకాలుష్యం భూతం వేయి కాళ్లతో విస్తరిస్తోంది. రోజురోజుకూ పెనుభూతంలా మారుతున్న కాలుష్యం కారణంగా వాయు నాణ్యత రికార్డ్ స్థాయిల్లో క్షీణిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో నివేదిక కంటే 18 రెట్లు ఎక్కువగా ఢిల్లీలోని సూక్ష్మ కణిక పదార్థం (PM2.5) 2.5 గా ఉందని అంచనా. ఫలితంగా ఢిల్లీలో రోగాలతో ఆస్పత్తుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముసురుకుంటున్న కాలుష్య మేఘాల కారణంగా అనే రోడ్డు ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా నమోదవుతున్నాయి. తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడం, ఊపిరితిత్తుల పనితీరు బలహీనం కావడం ఇలాంటి సమస్యలతో పాటు,అకాల మరణాలకు దారితీస్తుంది. ఢిల్లీ కాలుష్యంతో లంగ్ క్యాన్సర్ ముప్పు ఉందని శాస్త్రీయ పరిశోధనలలో వెల్లడైంది. పీఎం 2.5, నైట్రోజన్ డయాక్సైడ్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పీఎం 2.5 పెరుగుదలతో లంగ్ క్యాన్సర్ ముప్పు 14శాతం పెరుగుతుందని డబ్ల్యుహెచ్వో నివేదిక ద్వారా తెలుస్తోంది. ఎక్కువసేపు బయట పని ప్రదేశంలో ఉంటున్న యువతీ యువకులపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపుతోంది.వాయు కాలుష్యం ఆరోగ్యం పై ప్రభావంవాయు కాలుష్యానికి స్వల్ప మరియు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల స్ట్రోక్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ట్రాకియా, బ్రోంకస్ ,ఊపిరితిత్తుల క్యాన్సర్లు, తీవ్ర ఆస్తమా ,దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు లాంటి పలు వ్యాదులు వస్తాయి. వాయు కాలుష్యానికి గురికావడంవల్ల టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, దైహిక వాపు, అల్జీమర్స్ వ్యాధి , చిత్తవైకల్యానికి దారి తీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తేల్చింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వాయు కాలుష్యాన్ని, ముఖ్యంగా PM2.5ని క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా వర్గీకరించింది. దీర్ఘకాలికంగా ఈ కాలుష్యం బారిన పడితే శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుందని, ఇది ఇప్పటికే ఉన్న అనారోగ్య పరిస్థితులనుమరింత తీవ్రతరం చేస్తుందని మరొక ప్రపంచ సమీక్ష కనుగొంది.ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న పిల్లలు,కౌమారదశలో ఉన్న వారిపై మరింత హానికరమైన ప్రభావం ఉటుంది. వాయు కాలుష్యం బాల్యంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జీవితంలో తరువాతి కాలంలో వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.EEA లెక్కలుయూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ (EEA) తాజా అంచనాల ప్రకారం సూక్ష్మ కణ పదార్థం (PM 2.5) ఆరోగ్యానికి గణనీయ మైన ప్రభావాలను కలిగిస్తూనే ఉంది.2021లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వాయు కాలుష్యం మానవ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో చూపించే తాజా శాస్త్రీయ ఆధారాలను క్రమబద్ధంగా సమీక్షించిన తర్వాత కొత్త గాలి నాణ్యత మార్గదర్శకాలను ప్రచురించింది. దీని ప్రకారం 2050 నాటికి గాలి, నీరు మరియు నేల కాలుష్యాన్ని ఆరోగ్యానికి మరియు సహజ పర్యావరణ వ్యవస్థలకు హానికరం కాని స్థాయికి తగ్గించడానికి ఒక దార్శనికతను నిర్దేశించింది. దీంతోపాటు జీరో పొల్యూషన్ యాక్షన్ ప్లాన్ 2030కి లక్ష్యాలను నిర్దేశించింది. 2005తో పోలిస్తే వాయు కాలుష్యం (అకాల మరణాలు) ఆరోగ్య ప్రభావాలను 55శాతం కంటే ఎక్కువ తగ్గించడం.2005తో పోలిస్తే జీవవైవిధ్యానికి ముప్పుగా మారుతున్న ఈయూ పర్యావరణ వ్యవస్థల వాటాను 25శాతం తగ్గించడం. యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ (EEA) అంచనా ప్రకారం 2023లో, పట్టణ జనాభాలో 94.4శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ఆరోగ్య ఆధారిత మార్గదర్శక స్థాయి కంటే ఎక్కువ సూక్ష్మ కణాల సాంద్రతలకు గురయ్యారు.27 EU సభ్య దేశాలలో 182,000 అకాల మరణాలు సంభవించాయి.ముప్పు గుప్పిట్లో హైదరాబాద్ మరోవైపు ఢిల్లీ నగరం మాత్రమే కాదు హైదరాబాద్‌లో కూడా కాలుష్యం తీవ్రంగానే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో వాయుకాలుష్యంతో పాటు, నీటి కాలుష్యం, శబ్ద, ఆహార కాలుష్యం ఇలా పలు రకాలతో కూడిన కాలుష్య భూతం నగరవాసుల పాలిట ప్రమాదకరంగా పరిణమించి ప్రమాద ఘంటికలను మోగిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని పర్యావరణ వేత్తలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఢిల్లీ వాయు కాలుష్యం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ట్రాఫిక్ సమస్య కూడా ప్రధాన కారణమని కోర్టు తెలిపింది. ఢిల్లీ వాయుకాలుష్యంపై బుధవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉన్న తొమ్మిది టోల్‌ప్లాజాలను వేరే చోటుకు మార్చాలని ఎన్హెచ్ఐఏకు నోటీసులు జారీ చేసింది.ఢిల్లీ వాయుకాలుష్యంపై నమోదైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. వాయు కాలుష్య నివారణకు సరైన నిర్ణయం త్వరతగతిన తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీనగరంలోని 9టోల్‌ప్లాజాల తాత్కాలిక సస్పెండ్‌కు వారంలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ "మాకు టోల్‌గేట్స్ ద్వారా మీరు సంపాదించే ఆదాయం వద్దు. కానీ మీరు ఖచ్చితంగా ఈ టోల్స్ వల్ల సమస్యలు సృష్టిస్తున్నారు. టోల్‌ప్లాజా లేకుండా ఖచ్చితమైన ప్లాన్ జనవరి 31లోగా రూపొందించాలి" అని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. కాగా ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్యానికి గత ఆప్ ప్రభుత్వమే కారణమని ఆరాష్ట్ర మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న వాయుకాలుష్య పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి కాలుష్యం అనే జబ్బు అంటించింది కేజ్రీవాల్ సర్కారేనన్నారు. అయితే వాయు కాలుష్యానికి బాధ్యత వహించాల్సిందిపోయి ఇప్పుడు ఆ అంశంపై కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారన్నారని మంత్రి ఆరోపించారు. -
ఢిల్లీ వాయు కాలుష్యం.. చైనా కీలక ప్రకటన
ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్ర ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యం పరిమితికి మించి ఉండడంతో ప్రభుత్వం సైతం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో చైనా, భారత్‌కు ఒక ఆఫర్ ఇచ్చింది. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని మెలకువలు పాటించాలని తెలిపింది. వాటిని ఒక్కొక్కటిగా వివరిస్తూ బీజింగ్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.ఢిల్లీ వాయుకాలుష్యం రోజురోజుకి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. గాలికాలుష్యం నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఢిల్లీలో పనిచేసే అన్ని సంస్థలకు 50శాతం వర్క్‌ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆంక్షలతో పనులు చేయలేకపోతున్న నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వం రూ. 10 వేలు పరిహారం అందిస్తుంది. అయినప్పటికీ గాలి నాణ్యత మెరుగవుతుందన్న ఆశలు పూర్తిస్తాయిలో లేవు.ఈ విషయమై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి సైతం తొమ్మిది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించలేమని అది సాధ్యమయ్యే ప్రక్రియ కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా ఢిల్లీకి ఒక సజేషన్ ఇచ్చింది ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్‌లో కూడా తీవ్రమైన వాయుకాలుష్యం ఉండేదని అయితే తగిన చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఆపరిస్థితులు మారాయని తెలిపింది.ప్రస్తుతం చైనా-భారత్ రెండు దేశాలు పట్టణీకరణ కారణంగా విపరీతమైన వాయు కాలుష్యాన్ని ఎదురుకుంటున్నాయని చైనా ఎంబసీ స్పోక్స్ పర్సన్ యూ జింగ్ పేర్కొన్నారు. అయితే చైనా గత దశాబ్దకాలంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు. భారత్ సైతం కొన్ని నియామాలు పాటిస్తే గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు.బీఎస్ 6 వెహికల్స్ మాత్రమే అనుమతించాలి.సర్సీస్ పూర్తి చేసుకున్న వాహనాలకు అనుమతి నిరాకరణ.కార్లపై పెరుగుదలపై ఆంక్షలు విధించాలి.వాహనాలు రోడ్డుపై రావడానికి సరిసంఖ్య, బేసిసంఖ్యలతో లాటరీ సిస్టమ్ తీయాలిమెట్రో నెటెవర్క్‌ను విస్తరించాలి.బస్సు సదుపాయాలని మెరుగుపరచాలి.ప్రస్తుత వాహనాలను ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చాలి.అంతేకాకుండా కాలుష్య నియంత్రణకు బీజింగ్‌తో కలిసి పనిచేయాలని యూ జింగ్ తెలిపారు. డిసెంబర్ 15న ఢిల్లీ, బీజింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌కు సంబంధించిన చిత్రాలను ఆమె ఎక్స్‌లో షేర్ చేసింది. దీనిలో ఢిల్లీ AQI 447గా ఉండగా, బీజింగ్ AQI 67 గా ఉంది. అయితే భారత్ 2020 ఏప్రిల్ 1నుండే ఢిల్లీలో బీఎస్6 వాహనాల వాడకం తప్పనిసరి చేసింది. -
బీజేపీ టార్గెట్ సోనియా, రాహుల్... కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
-
అన్ని సంస్థల్లో 50 శాతం వర్క్ ఫ్రం హోం : ధిక్కరిస్తే చర్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం నగర వాసులు అతలాకుతలం చేస్తోంది. ఎటు చూసినా కాలుష్య మేఘాలు దట్టంగా కమ్మేశాయి. రోజు రోజుకీ అత్యంత దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత మధ్య చిన్నా, పెద్దా అంతా పలు రకాల శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని సంస్థలకు 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేసింది.ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ కంపెనీలు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేయాలని తెలిపింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని కూడా హెచ్చరించింది.అలాగే తాజా ప్రకటన ప్రకారం, ప్రస్తుత కాలుష్య నిరోధక ఆంక్షల కింద నిర్మాణ కార్యకలాపాలను నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుతం పని చేయలేని రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10,000 పరిహారం అందిస్తుంది.ఇదీ చదవండి: మెస్సీకి అనంత్ అంబానీ సర్ప్రైజ్ గిఫ్ట్, ఖరీదెంతో తెలుసా?కాగా గత కొన్నేళ్లుగా కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరంలోడిసెంబర్ 15న సీజన్లో అత్యంత దారుణమైన వాయు నాణ్యత నమోదైంది. వాయు నాణ్యత AQI 'తీవ్రమైన ప్లస్' కేటగిరీలో 498గా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, అంతకు ముందు రోజు నుంచే AQI క్షీణించడం కొనసాగింది. వాయు నాణ్యత ఇంత దిగజారి పోవడం ఇదే తొలిసారి. శనివారం నుండి సోమవారం వరకు రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో, పలు రోడ్డు ప్రమాదాలు, వాహనాల గుద్దు కోవడాలు, విమానాల రద్దు, లేదా ఆలస్యాలు జరిగాయి. దీన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగాఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) త్వరగా రాజధాని అంతటా అత్యంత కఠినమైనకాలుష్య నిరోధక ఆంక్షలను అమలు చేస్తోంది. -
మసక మసక చీకటిలో..
ముంబై: ఢిల్లీ విమానాశ్రయంలో తక్కువ దృశ్యమానత(విజిబిలిటీ) కారణంగా విమానాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీని ఫలితంగా మంగళవారం మొత్తం 131 విమానాలను రద్దు చేసినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అధికారి తెలిపారు. రద్దయిన 131 విమానాలలో 52 బయలుదేరే విమానాలు కాగా, 79 వచ్చే విమానాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో, ఎయిర్ ఇండియా ప్రధాన కేంద్రమైన ఢిల్లీలో, దట్టమైన పొగమంచు కారణంగా తక్కువ దృశ్యమానత నెలకొంది. దీని ప్రభావం మొత్తం నెట్‌వర్క్‌లోని విమాన షెడ్యూల్‌పై పడింది. ఈ సంవత్సరం శీతాకాలం కోసం, ఏవియేషన్ రెగ్యులేటర్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) డిసెంబర్ 10 నుండి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు అధికారిక ‘పొగమంచు విండో’గా ప్రకటించింది. ఈ అంతరాయాల కారణంగా, ఎయిర్‌లైన్ ఇండిగో తన నెట్‌వర్క్‌లో ఏకంగా 113 విమానాలను రద్దు చేసింది. అంతేకాకుండా, ఢిల్లీ వాతావరణం కారణంగా బుధవారం కూడా 42 విమానాలను నడపబోమని ఇండిగో ప్రకటించింది. -
ఢిల్లీ వాయు కాలుష్యంపై మంత్రి కీలక ప్రకటన
ఢిల్లీ కాలుష్య తీవ్రతపై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి స్పందించారు. కేవలం తొమ్మిది, పది నెలల్లో ఢిల్లీలోని కాలుష్య తీవ్రతను తగ్గించడం ఎన్నికైన ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలు తమ ప్రభుత్వాన్ని క్షమించాల్సిందిగా మంత్రి మంజీందర్ సింగ్ సిస్రా ప్రజలను కోరారు.ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత రోజురోజూకి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రాజధానిలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సైతం గాలి కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలని ఆదేశించింది. అయితే గత మూడురోజులుగా ఢిల్లీలోని వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు.మంత్రి మంజీందర్ సింగ్ మాట్లాడుతూ "పర్యావరణ కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రజలకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. తొమ్మిది లేదా పది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడం ఎన్నికైన ఏప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే వాయు కాలుష్యాన్ని నివారించడానికి గత ప్రభుత్వంతో పోల్చితే మెరుగైన చర్యలు మేము తీసుకుంటున్నాం" అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిందని దానిని నివారించడానికి మేము సరైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అయితే ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం 400 పాయింట్ల కంటే అధిక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బొగ్గు,కట్టెలతో తందూరి వంటకాలను తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లపై బ్యాన్ విధించింది. ఇది వరకే కాలుష్య కారకాలకు సంబంధించిన పలు కారకాలపై నిషేధాజ్ఞలు విధించింది. -
అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!
"నిస్వార్థమెంత గొప్పదో…నీ పదము రుజువు కట్టదా..సిరాలు లక్ష ఓంపదాచిరాక్షరాలు రాయదా".. అనే పాట గుర్తుకొస్తుంది ఈ వ్యక్తిని చూస్తే. ఎందుకంటే..ఈ వ్యక్తి ని ప్రమాదంలో కోల్పోయి తీరని దుఃఖంలో కోరుకుపోయాడు. చివరికి విధి భార్యను తీసుకుపోయి ఒంటిరిగా చేసింది. కానీ అతడు ఆ బాధలో మగ్గిపోకుండా తనలా విధి వంచితులవ్వకూడదని..ట్రాఫిక్ పోలీసులా ఉచితంగా సేవ చేస్తున్నాడు. కాలక్రమేణ అందరూ అతడని ట్రాఫిక్ పోలీసనే అనుకునేవారు, అతడిని పలకరిస్తే గానీ అసలు విషయం తెలిసేది కాదు. కానీ అతడి నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు రావడమే కాదు..చుట్టుపక్కల స్థానికులు సైతం అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఎవరా ఆ వ్యక్తి..ఏమా కథ తెలుసుకుందామా..!ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 79 ఏళ్ల వృద్ధుడు లాఠీతో నిలబడి ఉంటాడు. ఈ ఏజ్‌లో కూడా అక్కడ వాహనాలను నియంత్రిస్తూ డ్యూటీ చేస్తున్న ఆ వ్యక్తిని చూస్తే ఎవ్వరికైనా కుతూహలం కలుగుతుంది. ఇంకా రిటైర్ కాలేదా..ఉచితంగా సర్వీస్ అందిస్తున్నాడా..అన్న అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. అతడి పేరు గంగారాం. ఓ విషాదం తన జీవితాన్ని ఇలా మార్చేసిందంటాడు. తన కొడుకు తాను కలిసి టివీ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపైర్ షాపు నడిపేవారు. ఒకరోజు అనుకోకుండా కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ దఃఖం అతడ్ని తీవ్రంగా కుంగదీసేసింది. చివరికి అతడి భార్య సైతం ఆ బాధను జీర్ణించుకోలేక అతడిని ఒంటిరి చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఒక్క దుర్ఘటన తన కుటంబాన్ని ఇంతలా చిన్నాభిన్నం చేయడంతో గంగారాం..ఇలాంటి భాధ పగవాడికి కూడా వద్దు అని స్ట్రాంగ్ ఫిక్స్ అవ్వుతాడు. ఆ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు మాదిరిగా డ్రెస్ వేసుకుని ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలను నియంత్రిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా ఆ జంక్షన్ వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి జీతంభత్యం లేకుండా పనిచేశాడు. అలా రోజుకి సుమారు పది గంటలకు పైగా డ్యూటీ చేస్తుండేవాడు. మొదట్లో అతడిని కొందరు మోసగాడని తప్పుగా భావించేవారు, కాలక్రమేణ అతడి "నిస్వార్థ సేవ"ను గుర్తించడం ప్రారంభించారు. ఎవ్వరైనా అతడికి ఉచితంగా ఆహారం, డబ్బులు ఇచ్చినా నిరాకరించేవాడు. అలా ఏళ్ల తరబడి నిస్వార్థంగా ఎలాంటి జీతం తీసుకోకుండా ట్రాఫిక్ పోలీసులా సేవలందించాడు. అంతేగాదు రోడ్డుపై క్రమశిక్షణతో మెలిగితేనే ప్రాణాలను సురక్షితమనేది గంగారాం ప్రగాఢ నమ్మకం. దాన్నే ప్రజలకు పదే పదే చెబుతుండే వాడు కూడా. వయసు సహకరించకపోయినా, అనారోగ్యంగా ఉన్నా.. తన డ్యూటీకి మాత్రం విరామం ఇచ్చేవాడు కాదు. కనీసం కరోనా మహమ్మారి, సమయంలో ప్రభుత్వం సీనియర్ సిటీజన్లను పదే పదే ఇంట్లో ఉండమని విజ్ఞప్తి చేసినా..తన దినచర్యకు కట్టుబడి ఉండేవాడు గంగారామ్. ఆఖరికి వర్షం, భగభగ మండే వేసవిలో సైతం అతడి డ్యూటీకి బ్రేక్ వేయలేకపోయాయి.ఆ సేవ వృధాగా పోలేదు..ఏళ్ల తరబడిచేస్తున్న అతడి సేవలు పోలీసులు, సామాజికి సంస్థలు గుర్తించి అనేక పతకాలు, గౌరవాలతో సత్కరించింది. తరుచుగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవాలలో అతడిని పిలిచి మరి తన సేవకు తగిన సత్కారం చేసి అభినందించేవారు. చివరగా 2018లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని అధికారికంగా ట్రాపిక్ సెంటినల్‌గా నియమించి, దశాబ్దాలులగా ఉచితంగా అందిస్తున్న సేవకు తగిన గుర్తింపు అందించారు. అంతేగాదు అతనికి మొబైల్ ఫోన్ కూడా అందించి,తగిన వేతనం అందేలా చేసిందిఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు గంగారామ్ సగర్వంగా యూనిఫాం ధరించి తన విధులను ఈ ఏజ్‌లో కూడా నిర్వర్తిస్తూ..తరతరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
ఢిల్లీలో రోజు రోజుకు పడిపోతున్న గాలి నాణ్యత
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం
-
ఢిల్లీలో ఈ ఎమర్జెన్సీ.. ఇంకెన్నేళ్లో?
తీవ్ర వాయుకాలుష్యానికి తోడయ్యే దట్టమైన పొగమంచు.. ఎటు చూసినా మాస్కులు ధరించిన ప్రజలు.. కరోనా కానరాకుండా పోయినా శీతాకాలంలో మన దేశరాజధాని వీధుల్లో కనిపించే దృశ్యాలివే!. వాహనాల గొట్టాలు కక్కే పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే ప్రాణాంతక వాయువులు, నిర్మాణాలు వెదజల్లే ధూళి.. పంట అవశేషాల దహనాలు .. ఇవన్నీ కలగలిసిపోయి ఢిల్లీని ఓ గ్యాస్ చాంబర్‌గా మార్చేస్తున్నాయి.. ప్రతి సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ III, స్టేజ్ IV లాంటి ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటోంది. ఆ సమయంలో కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తారు. డీజిల్, పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెడతారు. స్కూల్స్ మూసేస్తారు. ఆఫీసులను హైబ్రిడ్.. మరింత దిగజారితే వర్క్‌ఫ్రమ్ హోంకు పరిమితం చేస్తారు. గాలి మందగించి, పొగమంచు కమ్ముకుని, ప్రజలు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ ఏడాది పరిస్థితి మరింతగా ముదిరింది. పిల్లలను కనీసం బయట కూడా తిరగొద్దని కోర్టులు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం వల్ల ఎమర్జెన్సీనే నార్మల్‌గా మారింది. పాలసీ ఫాటీగ్(మానసిక, భావోద్వేగ అలసట) పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కూడా ఈ చర్యలను సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. ఢిల్లీ కాలుష్యం కథ ఒక నిరంతర యుద్ధం. ప్రతి సంవత్సరం అదే దృశ్యం.. అదే చర్యలు.. అదే విఫలత. కానీ ఈసారి ప్రశ్న వేరుగా ఉంది. దేశరాజధానికి ఊపిరి ఇవ్వాలంటే.. సిస్టమ్ మొత్తాన్ని రీడిజైన్ చేయగలమా? లేదంటే ఎమర్జెన్సీని నార్మల్‌గా అంగీకరించేస్తూ పోతారా?.. ఢిల్లీలోనే ఎందుకంటే.. ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ ఎందుకు పడిపోతోంది?. ఎందుకంటే.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ. ఎన్సీఆర్లో ప్రధానంగా ఉండే కోల్ ఆధారిత పవర్ప్లాంట్లు.. ఫ్యాక్టరీలు ప్రమాదకరమైన వాయువుల్ని విడుదల చేస్తుంటాయి. చుట్టుపక్కల పంజాబ్, హర్యానాల రైతులు పంటలని కాల్చడంతో ఆ పొగ కాలుష్యానికి తోడవుతోంది. వీటన్నింటికి తోడు.. నిరంతరాయంగా కొనసాగే నిర్మాణ పనులతో ఆ ధూళి గాల్లో కలిసి కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. శాశ్వత పరిష్కారం ఉండవా?దేశరాజధానిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజల అవసరాలకు తగ్గట్లు పెంచాలి. మెట్రో లైన్లు విస్తరించినా.. బస్సుల సంఖ్య తక్కువ. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు. పంట అవశేషాల దహనం ఆపడానికి రైతులకు ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి, కానీ సపోర్ట్ సిస్టమ్ బలహీనంగా ఉంది. రైతులు తక్కువ ఖర్చుతో పంట అవశేషాలను కాల్చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ కాలుష్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. WHO ప్రమాణాల కంటే 10–15 రెట్లు ఎక్కువ టాక్సిక్ లెవెల్స్ ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో శ్వాస సమస్యలు, కంటి ఇర్రిటేషన్, గుండె సంబంధిత సమస్యలతో రోగులు పెరుగుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా విఫలమవుతున్నదనే సూచన.ప్రైవేట్ రంగం, స్టార్టప్‌లు కాలుష్య నివారణ కోసమంటూ ముందుకు వస్తున్నాయి. కార్‌పూలింగ్ యాప్‌లు, ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, క్రాప్ రెసిడ్యూ ప్రాసెసింగ్ వంటి పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఇవి చిన్న స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ లాంటి మహానగరానికి ఇవి సరిపోవు. పెద్ద స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వ మద్దతు, ప్రజల సహకారం కచ్చితంగా అవసరం.అంటే ఢిల్లీ పొల్యూషన్ కేవలం వాతావరణ సమస్య కాదు.. ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్‌కి ప్రతీక. ఇది ప్రభుత్వ పాలసీల లోపం, అమలు బలహీనత, ప్రజల ప్రవర్తన, ఆర్థిక ఒత్తిళ్లు అన్నీ కలిసిన విఫలత. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, రైతులకు ప్రత్యామ్నాయాలు, ఇండస్ట్రీలపై కఠిన నియంత్రణ, ప్రజల అవగాహన.. మొత్తం వ్యవస్థనే మార్చగలిగినప్పుడు మాత్రమే ఢిల్లీ మళ్లీ మంచి ఊపిరి తీసుకోగలుగుతుంది. -
ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రస్థాయి వాయు కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావొద్దని అధికార యంత్రాగం జాగ్రత్తలు సూచిస్తోంది. ఇప్పటికే పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీ పొగమంచు రవాణా వ్యవస్థపై వరుసగా రెండో రోజు కూడా ప్రభావం పడింది. విజిబులిటీ పడిపోవడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఒక్క సోమవారం నాడే 200కి పైగా విమానాలు రద్దయ్యాయి. AQI(గాల్లో వాయు నాణ్యత) తీవ్రత నిన్న 500 మార్కును దాటింది. అయితే ఈ రోజు ఉదయం నమోదైన డేటా ప్రకారం ఇది సుమారు 370గా ఉంది. లోధి కాలనీ, పూసా రోడ్ వంటి నిర్దిష్ట ప్రాంతాలలో స్థాయిలు సుమారు 350గా నమోదయ్యాయి. కాలుష్య స్థాయిలో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ, నివాసితులు ఈ సంక్షోభంతో పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. నర్సరీ నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు క్లాసులను ఆన్లైన్లోనే కొనసాగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. ప్రమాదానికి కారణమిదే!
ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారు ఝామన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనకు పొగమంచు కారణంగా తెలుస్తోంది. భారీ పొగమంచులో తొలుత రెండు వాహనాలు వేగంగా ఢీ కొట్టుకోగా.. ఆ వెంటనే మిగతా వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టి మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం వేకువజామున 4గం. ప్రాంతంలో ఆగ్రా-నోయిడా లేన్ 127వ మైలురాయి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మూడు కార్లు వరుసగా ఢీ కొట్టకున్నాయి. ఆ తర్వాత ఏడు బస్సులు ఢీ కొట్టుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సుల్లో ఒకటి ఆర్టీసీ ఉండగా.. మిగతా ఆరు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సులు. మొత్తం 7 బస్సులు.. నాలుగు కార్లు మంటల్లో చిక్కకుని బూడిదయ్యాయి.ఇప్పటిదాకా నాలుగు మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం నుంచి పలువురు సురక్షితంగా బయటపడగా.. నిద్రలో ఉండడం, ఒక్కసారిగా మంటల ఎగసి పడడం, వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి బయటపడలేని స్థితిలో పలువురు సజీవ దహనం అయ్యి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రంగంలోకి దిగిన 11 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ ఘోర ప్రమాదంతో ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.#WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/k8LdYmBOC1— ANI (@ANI) December 16, 2025#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited.#firemishap #buses #DelhiAgraExpresswayANI pic.twitter.com/kKqC31C7MR— Argus News (@ArgusNews_in) December 16, 2025ఇదిలా ఉంటే.. నిన్న ఢిల్లీ-ముంబై రహదారిపైనా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నుహ్(హర్యానా) వద్ద సోమవారం ఉదయం 5గం. ప్రాంతంలో వాహనాలు భారీ పొగమంచు కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకున్నాయి. రెండు ఓవర్‌లోడెడ్ డంపర్లు యాక్సిడెంట్‌కు గురి కాగా.. ఆ వెనక 20 దాకా వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. సుమారు 20 మంది దాకా గాయాలయ్యాయి. పొగ మంచు వరుస ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వాహనదారులకు సూచిస్తున్నాయి. -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
ఉత్తర ప్రదేశ్ ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. పొగమంచు కారణంగా.. మంగళవారం వేకువ జామున పలు కార్లు, బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుని మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలుత నలుగురు మరణించారని ప్రకటించిన అధికారులు.. సహాయక చర్యల అనంతరం ఆ సంఖ్యను 13గా వెల్లడించారు. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పలు వాహనాలు మంటల్లో చిక్కుకుని 13 మంది మృతి చెందారు. సుమారు 65 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, మథుర ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘యమునా ఎక్స్‌ప్రెస్‌వే 127వ మైల్ స్టోన్ వద్ద ఏడు బస్సులు, మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. వాహనాల నుంచి మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఫైర్ బృందాలు రెండు గంటలు శ్రమించి మంటల్ని అదుపు చేశాయి’’ అన్నారు. #WATCH | Mathura, UP | SSP Mathura, Shlok Kumar says, "... An accident took place at the Yamuna Expressway Milestone 127. The reason was low visibility... 7 buses and 3 cars collided as a result of which, a fire broke out in all the vehicles... The rescue operation is nearing… https://t.co/fcMTyQjWBk pic.twitter.com/RY8vdxLqVi— ANI (@ANI) December 16, 2025ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తొలుగ మూడు కార్లు మరొకటి ఢీ కొట్టాయి. అనంతరం ఆ వెనకాలే ఏడు బస్సులు ప్రమాదానికి గురై మంటలు అంటుకున్నాయి. అలా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో పలువురు ఫోన్లలో తీసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P— ANI (@ANI) December 16, 2025 #WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/qvKDqAT5T1— ANI (@ANI) December 16, 2025 👉ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవే (యమునా ఎక్స్‌ప్రెస్‌వే) పొడవు 165.5 కిలోమీటర్లు. 2012 ఆగస్టు 9న ప్రారంభించబడింది. ఇది గ్రేటర్ నోయిడా నుండి ఆగ్రా వరకు విస్తరించి, ఆరు లేన్లతో నిర్మించబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం పాత ఢిల్లీ–ఆగ్రా జాతీయ రహదారి (NH-2)లోని ట్రాఫిక్‌ను తగ్గించడం. 👉ఈ హైవే గ్రేటర్ నోయిడా, జేవర్, వృందావన్, మథుర, హత్రాస్ వంటి పట్టణాలను కలుపుతూ ఆగ్రాకు చేరుస్తుంది. భారతదేశంలో ఆరో పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తించబడింది. అయితే.. అధిక వేగం, డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం, పొగమంచు కారణంగా తరచూ ఈ హైవేపై ప్రమాదాలు జరుగుతుంటాయి. 👉2012–2023 మధ్య జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రైవర్లు నిద్రపోవడం వల్ల జరిగాయి!. ఎక్స్‌ప్రెస్‌వే పొడవుగా, సూటిగా ఉండటం వల్ల డ్రైవర్లు వేగంగా దూసుకెళ్తుండడంతో నియంత్రణ కోల్పోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక.. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం జరుగుతుంది. అందుకే ఇటీవలే వేగ పరిమితిని 75 kmphకి తగ్గించారు. తాజా ప్రమాదం పొగమంచు కారణంగానే జరిగి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. -
మెస్సీ భాయ్.. మరి నీ లంగ్స్‌కు ఇన్సూరెన్స్ చేయించావా?
ఫుట్‌బాల్ రారాజు లియోనెల్ మెస్సీ భారత పర్యటన చివరి అంకానికి చేరుకుంది. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా దేశ రాజధానిలో ఇవాళ ఈ స్టార్ ప్లేయర్ పర్యటించబోతున్నారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న వేళ.. ఈ పర్యటనపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఢిల్లీ పొల్యూషన్ గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో.. విద్యాసంస్థలకు, ఆఫీసులకు ఊరట ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది అక్కడి అధికార యంత్రాంగం. ఈ తీవ్ర వాయుకాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. చాలా చోట్ల జీరో విజిబిలిటీతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల మధ్య అర్జెంటీనా ఫుట్‌బాల్ వీరుడు రావడంపై జోకులు ఇలా ఉన్నాయి.. 🤧మెస్సీ బాయ్.. ఢిల్లీకి మీకు స్వాగతం. మీ ఎడమ కాలిని 900 మిలియన్ డాలర్లకు((దాదాపు ₹7,500 కోట్లకు పైగా) ఇన్సూరెన్స్ చేయించారని విన్నా. ఇంతకీ మీ ఊపిరితిత్తులకు ఇన్సురెన్స్ చేయించారా?😬విరాట్ కోహ్లి.. మెస్సీ.. ఇది గోట్లు కలిసి చేయబోయే సందడి కోసం ఢిల్లీ ఎదురు చూస్తోంది. కానీ, ఆ దృశ్యం ఇలా ఉండొచ్చు.. అంటూ మసకగా ఉన్న ఇద్దరి ఫొటోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడుFans are waiting to see Virat Kohli and Leo Messi together in Delhi.Meanwhile, this is how the photo would probably look in Delhi air. 😭 pic.twitter.com/xvln8edSu8— Selfless⁴⁵ (@SelflessCricket) December 14, 2025😓మెస్సీ తన కెరీర్లో ఇప్పటిదాకా 896 గోల్స్ చేశారు.. ఇప్పుడు ఢిల్లీ ఏక్యూఐ(వాయు నాణ్యత) ఆ రికార్డును బద్ధలు కొడుతుందేమో! 😎మెస్సీకి పొగ తాగే అలవాటు లేదు. కానీ, ఈ ఒక్కరోజే ఆయన 20 సిగరెట్లు తాగుతారేమో!.. అంటూ ఢిల్లీ పొల్యూషన్‌ను అన్వయించి సెటైర్లు వేస్తున్నారు. కోల్‌కతా మినహాయించి హైదరాబాద్, ముంబైలో మెస్సీ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఫుట్‌బాల్ అభిమానుల కోలాహలం నడుమ స్టేడియంలో మెస్సీ సందడి చేశాడు. ఇక్కడి అభిమానానికి ముగ్దుడైనట్లు ప్రకటించాడు. నేటితో ఈ టూర్ ముగియనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ ఈవెంట్‌కు ప్రధాని మోదీ సైతం హాజర కావొచ్చనే ప్రచారం వినిపించినప్పటికీ.. విదేశీ పర్యటనల నేపథ్యంలో అది జరగకపోవచ్చనే తెలుస్తోంది.లియోనెల్ మెస్సీ ఎడమ కాలికి సుమారు 900 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన ఎడమ కాలే ఆటలో ప్రధాన బలం. గోల్స్, ఫ్రీకిక్స్, డ్రిబ్లింగ్ అన్నీ ఎక్కువగా ఎడమ కాలుతోనే చేస్తారు. ఒకవేళ ఏదైనా గాయమై ఆట కొనసాగించలేని పరిస్థితి వస్తే.. క్లబ్‌లు, స్పాన్సర్లకు ఆర్థిక రక్షణ లభించేందుకు ఇంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించారు. అసలు ఈ భారీ ఇన్సూరెన్స్ కారణంగా, మెస్సీ ఇండియా టూర్ 2025లో పూర్తి మ్యాచ్ ఆడలేకపోతున్నారు. ఎందుకంటే.. ఆయనకు అనుమతి ఉన్నది కేవలం అర్జెంటీనా జాతీయ జట్టు, తన క్లబ్ (Inter Miami) తరఫున మాత్రమే పూర్తి మ్యాచ్‌లు ఆడటానికి. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు లేదా ఇతర ఈవెంట్లలో పూర్తి స్థాయిలో ఆడితే, ఇన్సూరెన్స్ నిబంధనలు ఉల్లంఘన అవుతాయి.మెస్సీ మాత్రమే కాదు.. ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర క్రీడాకారులకు కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్ హీరోలు క్రిస్టియానో రొనాల్డో తన కాళ్లకు, డేవిడ్ బెక్‌హమ్ తన ముఖానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే.. మెస్సీ ఎడమ కాలు ఇన్సూరెన్స్ విలువ ప్రపంచంలోనే అత్యధికంగా భావించబడుతోంది. -
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు స్వల్ప అంతరాయం
న్యూఢిల్లీ: నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సిన ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేయడంతో, ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన కోసం వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ప్రధాని వాస్తవానికి ఉదయం 8:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత (విజిబిలిటీ) గణనీయంగా పడిపోవడంతో ఆయన పర్యటనలో ఆలస్యం చోటుచేసుకుంది. ఈ పర్యటనలో ప్రధాని ముందుగా జోర్డాన్‌ను సందర్శించనున్నారు. ‘ముందుగా నేను జోర్డాన్‌ను సందర్శిస్తాను. హిజ్ మెజెస్టి కింగ్ అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ఈ చారిత్రాత్మక పర్యటన ఉండబోతోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు అయ్యింది’ అని ప్రధాని తన విదేశీ పర్యటనకు ముందు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నడూ లేనంత దట్టమైన పొగమంచుఢిల్లీ నగరాన్ని సోమవారం దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది. ఫలితంగా ఉదయం వేళ ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ దట్టమైన పొగమంచు దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఉదయం ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో నగరం అంతటా చలి వాతావరణం నెలకొంది. ఈ సీజన్లో ఇంత దట్టమైన పొగమంచు కమ్మడం ఇదే మొదటిసారి.విమానాలకు తీవ్ర అంతరాయంఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు ఈ పొగమంచు తీవ్ర అంతరాయం కలిగించింది. దృశ్యమానత బాగా తగ్గిపోవడంతో, సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి విమానయాన సంస్థలు తమ షెడ్యూల్‌లను సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. ఫలితంగా అనేక విమానాలు ఆలస్యం అయ్యాయి. ఈ అంతరాయం కారణంగా ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.ప్రయాణికులకు సూచనప్రస్తుత పరిస్థితిపై ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులకు ఒక సలహాను జారీ చేసింది. ‘దట్టమైన పొగమంచు కారణంగా విమానాల కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడవచ్చు. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు మేము భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. అప్డేట్ల కోసం ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలి’ అని సూచించింది.ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు -
బీజేపీ డీఎన్ఏలో ఓటు చోరీ
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యం, ఓట్ల చోరీ బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలోనే ఉన్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సత్యం, అహింస అనే నినాదంతో బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రతిన బూనారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీతోపాటు ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ విచుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వారంతా బీజేపీ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అధికారం అండతో విచ్చలవిడిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించేవారి డీఎన్ఏలో సత్యం ఉంటుందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలో మాత్రం అసత్యం, ఓట్ల చోరీ మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం ‘‘సత్యమే మన ఆయుధం. సమయం పట్టొచ్చు గానీ ఎప్పటికైనా సత్యానిదే విజయం. ప్రపంచం సత్యాన్ని పట్టించుకోదని, అధికారాన్ని, బలాన్ని మాత్రమే చూస్తుందని ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ చెప్పడం దారుణం. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తున్న సంగతి నిజం కాదా? ఎన్నికల కమిషనర్లను కాపాడేందుకు ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారు. మేమే వచ్చాక ఈ చట్టాన్ని తప్పనిసరిగా మారుస్తాం’’ అని అన్నారు. దొంగతనమే వారి డీఎన్ఏ దొంగతనం బీజేపీ డీఎన్ఏలో ఉందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. డబ్బు దొంగతనం, భూమి దొంగతనం, వ్యవస్థల దొంగతనం, హక్కుల దొంగతనం, ఉద్యోగాల దొంగతనం, ప్రజా తీర్పును దొంగిలించడం, ప్రభుత్వాన్ని దొంగిలించడం, ఎన్నికలను, ఓట్లను దొంగిలించడం బీజేపీకి అలవాటేనని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకొని అధికారం అనే నిచ్చెనపైకి ఎగబాకడం బీజేపీ విధానమని దుయ్యబట్టారు. ప్రజల కోసమే రాహుల్ పోరాటం: ఖర్గే ప్రజల కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయనను బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ చోర్–గద్దీ ఛోడ్ ధర్నాలో ఖర్గే ప్రసంగించారు. రాహుల్ గాం«దీకి మద్దతు ఇవ్వకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. దేశాన్ని, ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమంతా కలిసి పోరాటం చేయాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, భావజాలం దేశాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హిందూమతం, హిందుత్వం పేరుతో పేదలను బానిసలుగా మార్చడానికి ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశ ద్రోహులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలకు, ఓట్ల దొంగలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి మరింత బలోపేతం చేయాలని ప్రజలకు ఖర్గే విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్లతో గెలిచే దమ్ముందా?బ్యాలెట్ పేపర్లతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి గెలిచే దమ్ముందా? అని బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా సాగుతోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం సహకరించకపోతే ఎన్నికల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గలేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోదీ సర్కార్ ఎదుట మోకరిల్లుతున్నాయని ఆరోపించారు. -
తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు?
తీహార్ జైలు.. దీనిని అధికారికంగా తీహార్ కారాగార ప్రాంగణం(Tihar Prison Complex) అని పిలుస్తారు. ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ఈ జైలు.. ఖైదీల సంస్కరణ నిలయంగానూ ప్రసిద్ధి చెందింది. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ హయాంలో దీనికి ‘తీహార్ ఆశ్రమం’ అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ కరుడుగట్టిన నేరస్తులు మొదలుకొని, పేరుపొందిన రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల వరకు పలువురు నేరస్తులు శిక్షలు అనుభవిస్తుంటారు. ఖైదీలకు వృత్తి విద్య, ఆధ్యాత్మిక శిక్షణ, యోగా, తీహార్ బ్రాండ్ కింద వివిధ ఉత్పత్తులను తయారుచేసే అవకాశాలు కల్పిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తీహర్ జైలు త్వరలో తరలిపోతున్నదనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తాజాగా నగరంలోని తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.తీహార్ గ్రామంలో..తీహార్ జైలు అనేది కేవలం ఒకే భవనం కాదు. పలు కేంద్ర జైళ్లతో కూడిన ఒక అతిపెద్ద సముదాయం. అధికారికంగా దీనిని ‘తీహార్ జైళ్లు’ అని పిలుస్తారు. ఇది పశ్చిమ న్యూఢిల్లీలోని తీహార్ గ్రామంలో 1958లో నెలకొల్పారు. తొలుత ఈ కేంద్ర జైలు 1,273 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యంతో ప్రారంభమైంది. జైలు పరిపాలనా నియంత్రణ మొదట్లో పంజాబ్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత 1966లో ఢిల్లీ పరిపాలనకు జైలు బదిలీ అయ్యింది. తీహార్ జైలు ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద జైలుగా పేరొందడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జైలు వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.సామర్థ్యానికి మించి..కాలక్రమేణా తీహార్ జైలు సముదాయం భారీగా విస్తరించింది ప్రస్తుతం ఇందులో 10 వేర్వేరు కేంద్ర జైళ్లు (CJ-1 నుండి CJ-10 వరకు) ఉన్నాయి. ఈ జైలు అధికారికంగా దాదాపు 10,000 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, దీనిలో సామర్థ్యానికి మించి 15,000 నుండి 19,000 మంది ఖైదీలు ఉంటుంటారు. ఈ అధిక రద్దీ తీహార్ జైలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఈ సముదాయం శిక్ష పడిన ఖైదీలు, విచారణలో ఉన్న ఖైదీలు మహిళా ఖైదీల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.కిరణ్ బేడీ సంస్కరణలతో..1990లలో కిరణ్ బేడీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు)గా పనిచేసిన సమయంలో తీహార్ జైలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమె నాయకత్వంలో జైలులో పలు మానవతా సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీటిలో ఖైదీల కోసం ధ్యానం, యోగా, వృత్తిపరమైన శిక్షణ, విద్యా కార్యక్రమాలు ప్రధానమైనవి. ఈ సంస్కరణలు జైలు వాతావరణాన్ని మెరుగుపరచడంలో, ఖైదీలలో సానుకూల మార్పులు తీసుకురావడంలో సహాయపడ్డాయి. ఈ సంక్షేమ కార్యక్రమాల కారణంగా తీహార్ జైలు కేవలం ఖైదీలను నిర్బంధించే స్థలంగానే కాకుండా, సంస్కరణల కేంద్రంగా కూడా పేరు పొందింది.హింస, గ్యాంగ్ వార్ ఘటనలతో..తీహార్ జైలును తరలించడానికి ఇక్కడ పెరుగుతున్న ఖైదీల సంఖ్య, భద్రతా సమస్యలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. సుమారు 10 వేల మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉన్న జైలులో ప్రస్తుతం 19 వేల మందికి పైగా ఖైదీలు ఉండటంతో భద్రత, నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ఈ జైలు నివాస ప్రాంతాలకు దగ్గరగా (తిలక్‌నగర్, హరినగర్ వంటి జనావాసాలకు సమీపంలో) ఉండటం వల్ల, చుట్టుపక్కల ప్రజల భద్రత, రక్షణ కోసం దీనిని నరేలా వంటి నగర శివారు ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తున్నది. ఇటీవల జైలులో ఖైదీల మధ్య హింస, గ్యాంగ్ వార్ లాంటి సంఘటనలు పెరగడం కూడా ఈ యోచనకు ఒక కారణంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: Monkey Day: అడవులను సృష్టించే ‘కోతి చేష్టలు -
తల్లీకుమారుల ఆత్మహత్య.. లేఖలో గుండె పగిలే నిజాలు!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 52 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమారులు (32-27 ఏళ్లు) ఆత్మహత్య చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులతో పాటు ఒక బెయిలిఫ్ వారి నివాసానికి చేరుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. పోలీసులు తలుపులు పదేపదే తట్టినా, లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, వారు నకిలీ తాళంచెవి సహాయంతో ఇంట్లోకి ప్రవేశించారు. లోపల తల్లి, ఆమె ఇద్దరు కుమారులు ఒకే గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.చేతిరాత లేఖలో..ఘటనా స్థలంలో లభ్యమైన ఒకటిన్నర పేజీల చేతిరాత లేఖ ఈ సామూహిక మరణాలకుగల గల కారణాలను వెల్లడించింది. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ లేఖలో బాధిత ఆ కుటుంబం చాలా కాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనే సమచారం ఉంది. ఆ లేఖలో బాధితులు తమ మానసిక వేదన, ఆర్థిక ఒత్తిడులే తమ ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఆ లేఖలోని వివరాల ప్రకారం ఆ కుమారులిద్దరూ నిరుద్యోగులు. నిరాశలో కుంగిపోయిన కారణంగా ఏ పనీ చేయలేకపోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. మరణించిన ఇద్దరు సోదరులలో చిన్నవాడు(27 ఏళ్లు) యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.అద్దె బకాయిలు, అప్పుల ఊబిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వారు కొని నెలలుగా నెలవారీ రూ. 25,000 అద్దెను కూడా చెల్లించలేకపోయారు. ఫలితంగా ఇంటి యజమాని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బాధిత కుటుంబం 2023, డిసెంబర్లో ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నది. నాడు ఆ మహిళ భర్త బతికే ఉన్నాడు. అతను ఒక ప్రాపర్టీ డీలర్‌గా పనిచేశాడు. అతను పరిచయస్తుల దగ్గర రుణాలు తీసుకున్నాడు. అతను 2024లో మరణించగా, ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కొంత కాలంగా ఆ కుటుంబంలోని వారు బయటకు రాకుండా ఆ ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. ప్రాథమిక విచారణలో, రెండు నెలల క్రితం కూడా ఆ ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాలను ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటన వెనుక గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వారికి లభ్యమైన ఆత్మహత్య లేఖ, ఇతర పత్రాలు, డిజిటల్ పరికరాలను పరిశీలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు! -
‘గోవా కలెక్టర్ ఫోన్ చేసి..’ బిగ్గరగా రోదించిన బాధితురాలు..
న్యూఢిల్లీ: గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఢిల్లీకి చెందిన భావనా జోషి అయినవారిని కోల్పోయి, తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నారు. గత శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె తన భర్త వినోద్ కుమార్ (43)తో పాటు తన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. కమలా జోషి (42), అనితా జోషి (41), సరోజ్ జోషి (39)లను కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 25 మంది మృతిచెందగా, భావన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్లబ్‌లోని అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చూస్తున్నంతలోనే ఎగసిపడి, కొందరి జీవితాలను బుగ్గిపాలు చేశాయి. క్లబ్లో నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, పైరోగన్ల వాడకం, గడ్డితో కూడిన పైకప్పు, పలు భద్రతా లోపాల కారణంగా మంటలు నిముషాల వ్యవధిలోనే అంతటా చుట్టుముట్టాయి.నృత్య కార్యక్రమం సందర్భంగా వెలిగించిన విద్యుత్ పైరోగన్లే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్లబ్లో తగినన్ని నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, మండే పదార్థాల వాడకం, మద్యం సీసాల నిల్వలు మొదలైనవి మంటల తీవ్రతను పెంచి, ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేస్తామని గోవా కలెక్టర్ కార్యాలయం నుండి తనకు కాల్స్ వస్తున్నాయని భావనా జోషి తెలిపారు. అయితే తమకు ఎలాంటి పరిహారం అవసరం లేదని, న్యాయం కావాలని అని ఆమె కోరారు. వారు ఇచ్చే రెండు లక్షలు నా కుటుంబాన్ని తిరిగి తీసుకువస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. పరిహారం కంటే న్యాయమే తనకు ముఖ్యమని ఆమె రోదిస్తూ తెలిపారు.మృత సోదరీమణుల తల్లి మీనా మీడియాతో మాట్లాడుతూ ‘నేను నా పిల్లలను కోల్పోయాను. అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయాను. నేరస్థులు బెయిల్‌పై లేదా జరిమానాతో తప్పించుకోకుండా కఠిన శిక్షలు ఎదుర్కొనేలా చూడాలని’ ఆమె డిమాండ్ చేశారు. కమల భర్త నవీన్ కూడా అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తూ.. పలు రెస్టారెంట్లు, క్లబ్‌లలో నిబంధనలు పాటించడం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలావుండగా నైట్‌క్లబ్ సహ యజమానులు, ఢిల్లీకి చెందిన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ నుండి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. వారిని భారతదేశానికి తీసుకురావడానికి దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.నిందితులు గోవాలో ఈ క్లబ్ నిర్వహణకు భూ ఒప్పందపు నకిలీ కాపీని ఉపయోగించారని పోలీసు దర్యాప్తులో తేలింది. కాగా నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఢిల్లీ కోర్టు దానిని తిరస్కరించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ నిందితులను త్వరలోనే సంయుక్త దర్యాప్తు బృందం భారతదేశానికి తిరిగి తీసుకువస్తుందన్నారు. ఈ విచారణను కేవలం క్లబ్ యజమానులే కాకుండా, కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా ఎదుర్కొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు -
నటుడు ధర్మేంద్ర సంతాప సభలో కేంద్ర మంత్రులు (ఫోటోలు)
-
పీల్చేగాలి.. ధనికులకే సొంతమా?
భారత్.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అలాంటి దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. శీతాకాలం మరింత విషాన్నికలిపి, గాలి నాణ్యతను మరింత దిగజార్చుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పీల్చే గాలి కూడా ధనికులకే సొంతమా? కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం ఊపిరి ఆడని పరిస్థితిని ఎదుర్కొంది. ముఖ్యంగా ఆస్పత్రిలో పడకలకోసం సామాన్యులు నానా ఇబ్బందులూ పడుతూ.. ఆక్సిజన్ లేక రోడ్లపైనే చనిపోతున్న సమయంలో.. ధనికులు ఆక్సిజన్ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో ప్రాణాలు నిలుపుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ వాసులు నాటి కోవిడ్-19 పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల స్థాయిలు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విశ్లేషణలో తేలింది. దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. వాయు కాలుష్య కారకాలను తగ్గించడం, కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పని వేళల తగ్గించడం,కార్యాలయాల్లో 50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని (ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు) కల్పించడం, అనవసర నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించడం, ఐదవ తరగతిలోపు ఉన్న అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల మూసివేయడం, రైల్వే, మెట్రో, విమానాశ్రయాలు, రక్షణ రంగాలకు సంబంధించిన నిర్మాణాలు మినహా ఇతర నిర్మాణాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కానీ అప్పటికే విషవాయువుల ప్రభావం అక్కడి ప్రజలపై ప్రతాపం చూపించింది. నగర ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్ల మంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితిని చాలా తీవ్రమైనదిగా అభివర్ణించింది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోవని వ్యాఖ్యానించింది.ఢిల్లీ నగరంలో గాలి విషపూరితమై, జీవనమే ప్రశ్నార్థకమవుతున్న ఈ సమయంలో ధనికులు తమ ఇళ్లను ‘క్లీన్ ఎయిర్ బబుల్స్’గా మార్చుకుంటున్నారు. ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలు, పదుల సంఖ్యలో ఎయిర్ ప్యూరిఫయర్లు, డీహ్యూమిడిఫయర్లు ఇలా లగ్జరీ సీల్డ్ హోమ్స్‌లో వారు తమకోసమే ఒక మైక్రో క్లైమేట్ సృష్టించుకున్నారు. బయట గాలి ఎంత విషపూరితమైనా.. ఇంటి లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని పీల్చేలా వాతావారణాన్ని కల్పించుకుంటుకున్నారు.క్లీన్ ఎయిర్ బుడగలుసంపన్న కుటుంబాలు తమ ఇళ్లలోకి ప్రవేశించే ముందు బయట గాలిని ఫిల్టర్ చేసే ప్రత్యేక వెంటిలేషన్, ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థలు ఇంటి లోపల శుభ్రమైన గాలిని ఉంచి, కలుషిత గాలి లోపలికి చొరబడకుండా అడ్డుకుంటాయి.ఎయిర్ ప్యూరిఫయర్లుకొన్ని అపార్ట్మెంట్లలో యజమానులు 10–12 ఎయిర్ ప్యూరిఫయర్లను ఉపయోగిస్తున్నారు. లోపలి గాలి శ్వాసించదగిన స్థాయిలో ఉండేందుకు ఫిల్టర్లను సంవత్సరంలో అనేకసార్లు మార్చుతున్నారు.డీహ్యూమిడిఫయర్లుఇళ్లను పూర్తిగా సీల్ చేయించుకున్న వారు తలుపులు, కిటికీలను మూసివేసి ఉంచుతారు. తేమ పెరగకుండా, గాలి కలుషితం కాకుండా ఉండేందుకు డీహ్యూమిడిఫయర్లను కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు.లగ్జరీ సీల్డ్ ఇళ్లుఢిల్లీలోని పలువురు ధనికులు బయట గాలి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విధంగా వారు నియంత్రిత మైక్రోక్లైమేట్‌లను సృష్టించి, బయట వాతావరణం కంటే లోపల గాలి నాణ్యతను చాలా మెరుగ్గా ఉంచుతున్నారు.కానీ ఈ సౌకర్యం పేదలకు మాత్రం అందని ద్రాక్షాల మారింది. ఖరీదైన పరికరాలు, నిర్వహణ ఖర్చులు.. మధ్యతరగతి,పేద కుటుంబాలకు దూరమైంది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోకపోవడంతో విషపూరిత గాలిని పీల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. అదే సమయంలో ధనికులు, పేదల మధ్య అంతరం మరింత పెరిగిపోతుంది. ధనికులు శుభ్రమైన గాలిని పీలుస్తుంటే.. సాధారణ ప్రజలు విష వాయుల్ని పీల్చి దినదినగండంగా కాలం వెళ్లదీయడం ప్రశ్నార్ధకంగా మారింది.ఢిల్లీలో గాలి సంక్షోభం ఇప్పుడు సామాజిక అసమానతకు ప్రతీకగా మారింది. ధనికులు తమ ఇళ్లలో బబుల్స్ సృష్టించుకుంటే, పేదలు విషవాయువులను పీల్చి జీవించాల్సి వస్తోంది. గాలి పీల్చడం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో కాకుండా..దీర్ఘకాలిక పరిష్కారాలు తీసుకురావాలి. లేకపోతే ఢిల్లీ గాలి సంక్షోభం, అసమానత సంక్షోభంగా మారిపోతుంది. -
హైదరాబాద్ టు ఢిల్లీ
చిన్న బ్రేక్ తర్వాత పెద్ది’ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తర్వాత ‘పెద్ది’ టీమ్ చిన్న బ్రేక్ తీసుకుంది. కొత్త షెడ్యూల్ మళ్లీ హైదరాబాద్లోనేప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించేందుకు ‘పెద్ది’ టీమ్ ప్లాన్ చేసింది.జనవరి నెలాఖరు వరకు ఈ షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యేలా టీమ్ ప్లాన్ చేసింది. ‘‘పెద్ది’ షూటింగ్ అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. -
తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
ఢిల్లీ: తెలంగాణ బీజేపీ ఎంపీలు మరింత యాక్టివ్‌గా ఉండాలంటూ వారికి ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం మిస్సయింది. అది నాకు చాలా ఆవేదన కలిగించిందంటూ ఎంపీలతో మోదీ అన్నారు.తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడింది. 8 మంది ఎంపీలు ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? అంటూ ప్రధాని మోదీ ప్రశ్నలు గుప్పించారు. ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉన్నా నాయకులు పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. గ్రూపు తగాదాలు వీడి ఐకమత్యంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడేలా దూకుడుగా పని చేయాలని సూచించారు.ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. నిత్యం ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండాలంటూ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ఎంపీలకు ప్రధాని మోదీ హితబోధ చేశారు.కాగా, ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసంలో విందు కార్యక్రమం జరగనుంది. విందు ఏర్పాట్లను కేంద్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఎంపీలను సమన్వయం చేసే బాధ్యతలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి అప్పగించారు.విందు కార్యక్రమంలో 54 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కేంద్రమంత్రి కూర్చునే ఏర్పాట్లు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రధాని.. ఎన్డీఏ భాగస్వామి పక్షాల మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై మోదీ మాట్లాడనున్నారు. -
జర జాగ్రత్త.. వాయు కాలుష్యం డేంజర్ బెల్స్
వాతావరణ మార్పులతో ప్రపంచ దేశాలన్నీ సతమతమవుతున్నాయి. భారత్ సహా అనేక దేశాల్లో నాణ్యమైన గాలి, మంచి ఆహారం దొరకడం గగనమైతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా ఏటా 20 లక్షల మంది వరకు చనిపోతున్నారని ది లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్‌లో ఓ అధ్యయనం పేర్కొంది. రానున్న రోజుల్లో వాయు కాలుష్యం కారణంగా మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.నివేదిక ప్రకారం.. దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురికావడంతో 2009 నుంచి 2024 మధ్య భారత్‌లో ఏటా 15 లక్షల నుంచి 20 లక్షల మరణాలు సంభవించాయని పేర్కొంది. దేశంలో 140 కోట్ల మంది జనాభాలో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్దేశించిన ప్రమాణం (ఏడాదికి ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాములు) కంటే ఎక్కువ పీఎం2.5 వాయుకాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారని తెలిపింది. జాతీయ గాలి నాణ్యత ప్రమాణం (ఘనపు మీటరుకు 40 మైక్రాన్లు) కంటే ఎక్కువగా.. వార్షిక సగటు పీఎం2.5 స్థాయి వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో దేశ జనాభాలోని సుమారు 82 శాతం మంది నివసిస్తున్నట్లు పరిశోధన బృందం గుర్తించింది. ఏటా ఈ కాలుష్యం పెరుగుదల 8.6 శాతంగా ఉందని తెలిపింది. ఈ కారణంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.రాష్ట్రాల వారీగా ప్రభావం ఇలా.. (2025 AQI డేటా ఆధారంగా)అధిక ప్రభావం ఉన్న రాష్ట్రాలు / ప్రాంతాలుఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్. పంట అవశేషాల దహనం, ట్రాఫిక్, పరిశ్రమల ఎమిషన్స్, కన్స్ట్రక్షన్ ధూళి ప్రధాన కారణాలు. ఢిల్లీలో 2023లో జరిగిన మొత్తం మరణాల్లో దాదాపు 15%కి పైగా వాయు కాలుష్యం సంబంధం ఉందని పలు అధ్యయనాలు తెలిపాయి. మధ్యస్థ ప్రభావం ఉన్న రాష్ట్రాలుమహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్ము & కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు).మెట్రో నగరాలు: ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె ఉన్నాయి. హైదరాబాద్‌లో PM2.5, NO₂ స్థాయిలు WHO గైడ్‌లైన్స్‌ను అధిగమిస్తున్నాయి. ముఖ్యంగా హై ట్రాఫిక్ కారిడార్లు, పరిశ్రమ ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆమీర్‌పేట్ వంటి ప్రాంతాలు వాయు కాలుష్యం పెరిగినట్టు ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేశాయి.వాయు కాలుష్య కారకాలు..PM2.5 సూక్ష్మకణాలు: ఇవి ఊపిరితిత్తుల్లోకి లోతుగా వెళ్లి రక్తంలోకి చేరి గుండె, మెదడు మీద ప్రభావం చూపుతాయి. PM2.5 స్థాయిలు WHO సూచించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా 10 ప్రధాన నగరాల్లో కనిపిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది.ఓజోన్ (O₃), నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్: ట్రాఫిక్, పవర్ ప్లాంట్లు, పరిశ్రమల వల్ల వస్తాయి. ఇండోర్ కాలుష్యం: వంట కోసం ఘన ఇంధనాలు (wood, dung, coal) ఉపయోగించే ఇళ్లలో, ఎక్కువగా గ్రామీణ మహిళలు, పిల్లలు ప్రభావితం అవుతున్నారు.కార్బన్ డయాక్సైడ్: గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన వాయువు కార్బన్ డయాక్సైడ్. శిలాజ ఇంధనాలు పూర్తిగా దహనం కాకపోవడం వల్ల; విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది. కేవలం శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ఏటా సుమారు 2.5 × 10*13 టన్నుల కార్బన్డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తోంది.కార్బన్ మోనాక్సైడ్: ఇది చాలా ప్రమాదకర విషవాయువు. శిలాజ ఇంధనాలు అసంపూర్తిగా దహనమవడం, వంట చెరకును మండించినప్పుడు, బొగ్గును కాల్చినప్పుడు ఎక్కువగా విడుదలవుతుంది. దీన్ని పీల్చడం వల్ల రక్తంలోని ‘హీమోగ్లోబిన్’ ఆక్సిజన్‌కు బదులు, ఈ వాయువుతో ఆక్సీకరణం చెంది ‘కార్బాక్సీ హీమోగ్లోబిన్’గా మారుతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. దీన్నే ‘హైపోక్సియా’ అంటారు. ఇంకా మెదడు దెబ్బతినడం, కంటిచూపు మందగించడం, మతి భ్రమించడం లాంటి మస్తిష్క వ్యాధులకు దారితీస్తుంది.సల్ఫర్‌డయాక్సైడ్: ప్రధానంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు, మోటారు వాహనాల నుంచి విడుదలవుతుంది. దీనిస్థాయి వాతావరణంలో 1 PPM దాటినప్పుడు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల ఆమ్లవర్షాలు కురుస్తాయి. ఫలితంగా చర్మక్యాన్సర్లు రావచ్చు. ఈ వ్యాధికారక గాలి మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి.నైట్రోజన్ ఆక్సైడ్: పెట్రోల్, డీజిల్‌తో నడిచే మోటారు వాహనాలు; విద్యుత్తు జనరేటర్లు, పంట పొలాల్లో వాడిన నత్రజని ఎరువుల వాడకం ద్వారా సాధారణంగా నైట్రోజన్ ఆక్సైడ్ గాలిలో కలుస్తుంది. దీనివల్ల గ్రీన్హౌస్ వాయువులు విడుదలై భూతాపానికి (గ్లోబల్ వార్మింగ్) కారణమవుతున్నాయి. కాలేయం, మూత్రపిండాలకు నష్టం కలగడం, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.క్లోరోఫ్లోరో కార్బన్లు: మస్కిటో కాయిల్స్, ఫ్రిజ్‌లు, అత్తరు నుంచి ఇవి విడుదలై భూతాపాన్ని పెంచుతున్నాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడం; అధిక రక్తపోటు, ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి. వీటితో పాటు భార లోహలైన మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం లాంటివి వాతావరణంలోకి విడుదలై కేంద్ర నాడీవ్యవస్థ, మెదడు దెబ్బతింటాయి. కాడ్మియం నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. మెర్క్యూరీ ప్రభావంతో జింజివాటా, మినిమాటా లాంటి వ్యాధులు వస్తాయి.నివారణ పద్ధతులు..వాహనాల్లో సీసం లేని పెట్రోల్‌ను వాడాలి.సంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా బయోడీజిల్, బయోగ్యాస్, బయోమాస్ లాంటివి వినియోగించాలి.థర్మల్ విద్యుత్తు పరిశ్రమల నుంచి వెలువడే రేణు రూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అనే ఫిల్టర్లను తప్పనిసరిగా వాడాలి.పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని సూక్ష్మ రేణువుల్లాంటి వాయుకాలుష్య కారకాలను తీసివేయడానికి స్క్రబ్బర్ వాడాలి. అంటే సున్నపురాయి తెట్టు లేదా సిమెంట్ బూడిద స్లర్రీ వినియోగించాలి.వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, వాయు నాణ్యత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయడానికి భారత్/యూరో ఇంధన ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలి. ఇప్పటివరకు యూరో - 6 ప్రమాణాలు అమల్లో ఉన్నాయి.ఇళ్లలో వంటచెరకుగా పిడకలు, కర్రలకు బదులుగా ఎల్పీజీ గ్యాస్ వాడకం పెంచాలి. శీతలీకరణ యంత్రాల్లో సి.ఎఫ్.సి. లకు బదులుగా ద్రవ నత్రజని వినియోగించాలి.రవాణా రంగంలో చమురు ఆధారిత పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కంప్రెసర్, నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) హైడ్రోజన్ ఇంధనం, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలి.వాయు ఉద్గారాల్లో 20 శాతం మేరకు ఉద్గారాలను భారీ స్థాయిలో చెట్ల పెంపకం ద్వారా కార్బన్ సింక్ చేయవచ్చని యూఎన్ఓ చెబుతోంది. దీనికోసం UNO - REDD (Reducing Emissions from deforestation and Degradation) అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. భారీ స్థాయి అటవీకరణ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను తొలగించే ప్రక్రియను కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు.కాలుష్య బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం అనే ‘పొల్యూటర్ పే’ సూత్రాన్ని పర్యావరణ చట్టం (1986)లో చేర్చాలని సుప్రీంకోర్టు 1996లో సూచించింది. ఈ సూచనను అన్ని మంత్రిత్వ శాఖల్లో అమలుచేయాలి.వాహనాల పొగ గొట్టాల్లో కెటాలిటిక్ కన్వర్టర్లను అమర్చాలి. వీటితోపాటు ఇంకా అనేక శాస్త్రీయ విధానాలు అమలు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తేనే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాస అందుతుంది.ప్రభుత్వ స్థాయి చర్యలు..పరిశ్రమల నియంత్రణఎమిషన్ స్టాండర్డ్స్ కఠినతరం చేయడంకాలుష్య నియంత్రణ పరికరాలు (Electrostatic Precipitators, Scrubbers) తప్పనిసరివాహనాల నియంత్రణBS-VI నిబంధనలు అమలుపాత వాహనాల స్క్రాప్ పాలసీపబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణనిర్మాణ ధూళి నియంత్రణరోడ్లపై నీటి పిచికారీగ్రీన్ బఫర్ జోన్లు ఏర్పాటువ్యక్తిగత స్థాయి చర్యలు..ప్రయాణ అలవాట్లు మార్చడంకార్పూలింగ్, సైక్లింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగంఇంటి వద్ద LPG/PNG లేదా ఇండక్షన్ వంట వాడటంచెత్త దహనం పూర్తిగా నివారించడం. -
ప్రైవేటీకరణ ఆపండి నిర్మలా సీతారామన్‌కు YSRCP ఎంపీల ఫిర్యాదు
-
దీపావళికి విశ్వ కిరీటం
న్యూఢిల్లీ: భారతదేశ సాంస్కృతిక వైభవానికి, తరతరాల జీవన సంస్కృతికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. చీకటిని చీల్చే దివ్య కాంతుల పండుగ దీపావళి.. బుధవారం యునెస్కో సాంస్కృతిక వారసత్వ నిధిగా ప్రపంచ వేదికపై ఘనంగా ఆవిష్కృతమైంది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరుగుతున్న యునెస్కో కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో కమిటీ కీలక చర్చల అనంతరం దీపావళిని గౌరవప్రదమైన ఈ జాబితాలో చేర్చినట్లు ప్రకటించగానే, ప్రాంగణమంతా ‘జై హింద్’, ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో మారుమోగింది. వేదిక ముందు సంప్రదాయ వస్త్రధారణతో కళాకారులు ప్రదర్శనలు ఇవ్వగా, భారీ తెరపై దీపావళి పండుగ చిత్రాలు కనువిందు చేశాయి. జాబితాలో 16వ అంశంగా దీపావళి యునెస్కో యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో భారత్ నుంచి చేరిన 16వ అంశం దీపావళి. ఈ జాబితాలో ఇప్పటికే కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌కు చెందిన గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణం ఇతిహాసం సంప్రదాయ ప్రదర్శన అయిన రామలీల వంటి 15 ఇతర అంశాలు ఉన్నాయి. దీపావళి లోతైన భావోద్వేగం యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితా ఖరారుకు ఏర్పాటు చేసిన కమిటీ 20వ సమావేశంలో దీపావళిని ఎంపిక చేసినట్లు ప్రకటన వెలువడిన వెంటనే.. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశం తరపున కీలక ప్రకటన చేశారు. ‘ప్రతి భారతీయుడికి, దీపావళి అనేది లోతైన భావోద్వేగం, ఇది తరతరాలుగా అనుభూతి చెందుతోంది, జీవిస్తోంది, ఆస్వాదిస్తోంది’.. అని షెకావత్ తన ప్రసంగంలో అభివర్ణించారు. ఈ గుర్తింపు ద్వారా, ‘యునెస్కో పునరుద్ధరణ, శాంతి, మంచికి విజయం సాధించాలనే శాశ్వత మానవ వాంఛను గౌరవిస్తోంది’.. అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కుమ్మర్ల నుంచి కళాకారుల వరకు లక్షలాది చేతులు ఈ వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నాయని స్పష్టం చేశారు. 🔴 BREAKINGNew inscription on the #IntangibleHeritage List: Deepavali, #India🇮🇳.Congratulations!https://t.co/xoL14QknFp #LivingHeritage pic.twitter.com/YUM7r6nUai— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 10, 2025భారత్ ఆతిథ్యం ఇదే తొలిసారి యునెస్కో అంతర–ప్రభుత్వ కమిటీ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోట సముదాయంలో డిసెంబర్ 8 నుంచి 13 వరకు ఈ 20వ సమావేశం జరుగుతోంది. దీపావళిని యునెస్కో జాబితాలో చేర్చినందుకు పాకిస్తాన్ దౌత్యవేత్త షోయబ్ సర్వార్ భారత్‌కు అభినందనలు తెలిపారు. దాదాపు వారం రోజులుగా యునెస్కో నిర్వహిస్తున్న ఈ కీలక సమావేశంలో 80 దేశాలు సమరి్పంచిన మొత్తం 67 నామినేషన్లను పరిశీలిస్తున్నారు. మంగళవారం, బంగ్లాదేశ్ నుండి వచ్చిన తంగైల్ సంప్రదాయ చీర నేతకళ, ఆఫ్గానిస్తాన్ నుంచి బెహజాద్ శైలిలో సూక్ష్మ చిత్రలేఖనాన్ని యునెస్కో జాబితాలో చేర్చారు. పురుషుల అబా (గావున్) అయిన ’బిష్త్’ తయారీ నైపుణ్యాలు, అభ్యాసాలు కూడా ఈ జాబితాలో చేరాయి. ఇరాక్, జోర్డాన్, కువైట్ దేశాలకు చెందిన సాంస్కృతిక అంశాలు కూడా బుధవారం యునెస్కో జాబితాలో స్థానం పొందాయి.Unesco says Diwali is most asthetic festival in the world. Nothing comes close pic.twitter.com/A6sNlHJDaw— Lala (@lala_the_don) December 10, 2025 (చదవండి: గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!) -
కొన్ని గాల్లో.. ఇంకొన్ని నేలపై
న్యూఢిల్లీ/ముంబై: గత రెండు రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వరుసగా ఎనిమిదో రోజు సైతం విమానాల రద్దు పర్వం కొనసాగింది. మంగళవారం మరో 422 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే 152 విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 121, హైదరాబాద్‌లో 58, చెన్నైలో 50, ముంబైలో 41 విమానాలు రద్దయి హ్యాంగర్లకే పరిమితమయ్యాయి.సంక్షుభిత ఇండిగో మాత్రం తమ సర్వీసులు దాదాపు మళ్లీ సాధారణస్థాయికి చేరుకుంటున్నాయని ప్రకటించింది. ఈ మేరకు ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ మంగళవారం ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ఇండిగో మళ్లీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. గతంలో విమానాల రద్దు ఘటన విషయంలో మరోసారి ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నా. మా వెబ్సైట్లో కనిపించే దాదాపు ప్రతి విమానం షెడ్యూల్ సమయానికి రాకపోకలు సాగించేలా శతథా కృషిచేస్తున్నాం’’ అని ఆయన అన్నారు. ఇండిగో సర్వీసులపై కేంద్రం కోతతరచూ విమానాలు రద్దవడంతో ఇండిగో టికెట్లు కొన్న ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ఈ కంపెనీ టికెట్లు కొని అవస్థలు పడకుండా నివారించేందుకు దేశవ్యాప్త షెడ్యూల్లో సంస్థకు చెందిన 5 శాతం సర్వీసులపై మోదీ ప్రభుత్వం కోత విధించింది. ఆ మేరకు 5 శాతం షెడ్యూల్ స్లాట్‌ను ఇతర కంపెనీలకు కేటాయించింది. ముఖ్యంగా అత్యంత రద్దీ ఉండే, ప్రధాన రూట్లలో ఈ 5 శాతం షెడ్యూల్‌ను ఇతర కంపెనీలకు కేటాయించింది. దేశీయ పౌరవిమానయాన రంగంలో 65 శాతం వాటాను ఆక్రమించిన ఇండిగోపైనే పూర్తిగా ఆధారపడకుండా ఇతర కంపెనీలకూ అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో వాటికి 5 శాతం స్లాబ్‌ను కేటాయించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అనుమతించిన షెడ్యూల్లో విమానాలను నడపలేక విఫలమైన ఇండిగోకు ప్రభుత్వం ఇలా స్లాట్ కోత రూపంలో పాక్షికంగా శిక్షించింది. -
ఢిల్లీలో గోవా పోలీసుల తనిఖీలు
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదం సంభవించిన గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేట్’నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూథ్రా, సౌర భ లూథ్రాల న్యూఢిల్లీ నివాసానికి పోలీసు బృందం సోమవారం చేరుకుంది. హడ్సన్ లే న్లోని వారి ఇంట్లో తనిఖీలు చేయగా లూథ్రా సోదరులు కనిపించలేదు. వారి ఆచూకీని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. నైట్ క్లబ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే భరత్ కోహ్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గోవా పోలీసులు ఇప్పటివరకు క్లబ్ చీఫ్ జనరల్మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సింఘానియా, గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్లను అరెస్టు చేశారు. క్లబ్ మేనేజర్‌ను విచారిస్తుండగా భరత్ కోహ్లీ ప్రస్తావన రావడంతో.. ఆయనను అరెస్టు చేశారు. -
భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, ఢిల్లీ: రాజధాని విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి సీజ్ చేశారు. పట్టుకున్న విదేశీ గంజాయి విలువ దాదాపు రూ. 15 కోట్లు ఉంటుందని తెలిపారు.గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. అధికారులు ఎంతగా కట్టడి చేసినప్పటికీ నిందితులు ఎదో రకంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ గంజాయి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. కాగా గతంలోనూ ఢిల్లీలో ఎయిర్ ఫోర్టులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన స్మగ్లర్ల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.47 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు. -
తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!
న్యూఢిల్లీ: గోవాలో ఎంజాయ్ చేసేందుకు తొలిసారిగా వెళ్లిన ఢిల్లీకి చెందిన ఒక కుటుంబానికి తీరని విషాదం ఎదురయ్యింది. జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందాలని ఆశపడుతూ, సాగిన వారి పర్యటన చివరికి వారిని మృత్యు ఒడికి చేర్చింది. ఆదివారం తెల్లవారుజామున ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్, ఆయన భార్య భావన, ఆమె సోదరీమణులు అనిత, కమల, సరోజ్లతో పాటు కమల భర్త నవీన్, పిల్లలు కలిసి గోవా ట్రిప్‌కు బయలుదేరారు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున క్లబ్లో సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో టిఫిన్ చేసి, తిరిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఎలాగోలా బయటకు పరుగుపెట్టిన భావన, తన సోదరీమణులు లోపల చిక్కుకోవడాన్ని గమనించి ఉలిక్కిపడింది.మరోవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెడుతున్న జనాన్ని చూసి కూడా.. భావన తన అక్కాచెల్లెళ్లను కాపాడేందుకు ధైర్యంగా మంటల్లోకి వెళ్లారు. వినోద్ కుమార్ కూడా ఇదే ప్రయత్నంలో భావన వెంట వెళ్లారు. అంతకంతకూ ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగకు తోడు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో వారు కూడా ఆ మంటల మధ్యలో చిక్కుకున్నారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు సోదరీమణులు.. అనిత, కమల, సరోజ్, భావన భర్త వినోద్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. భావన మాత్రం ఎలాగోలా బయటపడగలిగారు.కుటుంబంలో నలుగురు మరణించిన విషయం తెలియడంతో ఢిల్లీలోని కరావాల్ నగర్‌లోని వారి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ విషయాన్ని ఆ ఇంటి పెద్ద అయిన వృద్ధురాలికి ఇంకా చెప్పలేదని కుటుంబ స్నేహితుడు హరీష్ సింగ్ తెలిపారు. ‘వారు గోవాకు వెళ్లడం ఇదే మొదటిసారి. వారంతా చాలా ఉత్సాహంగా వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వారి తల్లి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఆమెకు ఈ విషయం చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాం’ అని సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు -
కమీషన్లమయంగా కాంగ్రెస్ సర్కార్: ఎంపీ ధర్మపురి సెటైర్లు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్లమయంగా మారిపోయిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. టోకెన్‌కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.ఢిల్లీ వేదికగా.. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్‌కు ప్రజలకు మంచి చేయాలనే కనీస ఉద్దేశం లేదు. లాటరీ తగిలింది.. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లమయంగా మారింది. టోకెన్‌కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారు. గత రెండేళ్లలో 790 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు లక్షల రుణమాఫీ సరిగా చేయలేదుఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా అంటున్నారు. ఫుట్‌బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?. కేంద్రం నుంచి నిధులు వస్తున్న వాటిని సరిగా వినియోగించడం లేదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులందరూ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50% ఖాళీలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. బీజేపీలో మేమంతా ఒక్కటే.. తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మేము అంతా ఒక్కటే.. మా మధ్య సఖ్యత ఉంది. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు నాకు పెద్దన్న లాంటి వారు. ఆయన నాయకత్వంలో పని చేస్తాం. రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాము అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ వాసులకు తీపి కబురు
సాక్షి ఢిల్లీ: తీవ్రమైన గాలి కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసులకు కొంత ఉపశమనం లభించింది. ఆదివారం గాలి నాణ్యత కొంత మేర మెరుగుపడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 305పాయింట్ల వద్ద ఉందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే గాలి నాణ్యత కొంతమేర మెరుగుపడినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా తెలిపింది.దేశ రాజధాని ఢిల్లీ నగరం గాలి నాణ్యత సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వాయు కాలుష్యం విపరీతంగా పెరగడంతో అక్కడ ప్రజల దైనందిన జీవితం దెబ్బతినడంతో పాటు వారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పలు సర్వేలు నివేదించాయి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సైతం కేంద్రాన్ని ఆదేశించింది.కాగా ప్రస్తుతం ఢిల్లీలో వాయుకాలుష్యం కొంతమేర తగ్గినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెబుతోంది. ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 305గా నమోదైనట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలిపింది. మెుత్తంగా 39 మానిటరింగ్ స్టేషన్లలో 26 స్టేషన్లు వెరీపూర్ క్యాటగిరీలో ఉండగా 13 స్టేషన్లు పూర్ క్యాటగిరీలో ఉన్నట్లు పేర్కొన్నాయి. వీటిలో 365 పాయింట్లతో ముండక స్టేషన్ వెరీపూర్ క్యాటగిరీలో ఉన్నట్లు పొల్యూషన్ బోర్డు తెలిపింది.ఢిల్లీ వాయుకాలుష్యంలో వాహనాల వల్ల అధికంగా 14.8శాతం కాలుష్యం సంభవిస్తుండగా ఇండస్ట్రీస్ 7.3శాతం, గృహాలు 3.6శాతం, నిర్మాణ రంగం 2శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయని నివేదికలు తెలిపాయి. అదే విధంగా ఢిల్లీ పరిసరాల్లోని ఝజ్జర్ జిల్లా 13.9 శాతం, రోహ్తక్ 5.2శాతం వాయు కాలుష్యానికి కారకాలుగా నిలుస్తున్నాయని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది -
‘మోదీ జీ.. దయచేసి నాకు న్యాయం చేయండి’
ఇస్లామాబాద్: మోదీ జీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి.. అంటూ ఓ పాకిస్తానీ మహిళ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తన భర్త తనను పాకిస్తాన్లో వదిలేసి.. భారత్‌లో రహస్యంగా మరో పెళ్లికి సిద్దమవుతున్నాడని వీడియోలో పేర్కొంది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని ఆమె అభ్యర్థించింది. బాధితురాలు నిఖితా నాగ్దేవ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ మూలాలున్న విక్రమ్ నాగ్దేవ్ దీర్ఘకాలిక వీసాపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా, పాక్‌లోని కరాచీకి చెందిన నిఖితతో విక్రమ్‌కు 2020 జనవరి 26న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. అయితే, వివాహం జరిగిన నెల తర్వాత, ఫిబ్రవరి 26న ఆమెను భారత్‌కు తీసుకొచ్చారు. అనంతరం, కొన్ని నెలలకే వీసాలో సాంకేతిక సమస్య ఉందని చెప్పి, 2020 జూలై 9న అటారీ సరిహద్దు వద్ద నుంచి విక్రమ్.. నిఖితను బలవంతంగా పాకిస్తాన్‌కు పంపించేశాడు. అప్పటి నుంచి ఆమెను తిరిగి భారత్‌కు తీసుకువెళ్లలేదని నిఖిత తెలిపారు.అంతేకాకుండా.. అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకే వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు తన బంధువుల్లో ఒకరితో వివాహేతర సంబంధం ఉందని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం తన మామకు చెబితే.. అబ్బాయిలకు ఇలాంటివి సహజం, ఏమీ చేయలేం అని అన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాజాగా తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని నిఖిత ఆరోపించారు. ఢిల్లీకి చెందిన మరో మహిళను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ విషయం తనకు తెలియడంతో 2025 జనవరి 27న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు నిఖిత చెప్పుకొచ్చారు.ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుచే అధికారం పొందిన సింధీ పంచ్ మధ్యవర్తిత్వ, న్యాయ సలహా కేంద్రం ముందుకు వచ్చింది. విచారణ అనంతరం మధ్యవర్తిత్వం విఫలమైంది. భార్యాభర్తలిద్దరూ భారత పౌరులు కాకపోవడంతో ఈ కేసు పాకిస్తాన్ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ, విక్రమ్‌ను పాక్‌కు బహిష్కరించాలని ఆ కేంద్రం 2025 ఏప్రిల్ 30న సిఫార్సు చేసింది. అలాగే, 2025 మే నెలలో ఇండోర్ సోషల్ పంచాయితీ కూడా విక్రమ్‌ను దేశం విడిచి పంపాలని సిఫార్సు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు ధృవీకరించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ తనకు న్యాయం చేయాలని నిఖిత వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే, న్యాయవ్యవస్థపై మహిళలకు నమ్మకం పోతుంది. దయచేసి తనకు అండగా నిలవండి అని ఆమె అభ్యర్థించారు. -
సామాన్యుల కోసమే సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అంటే సామాన్య ప్రజల కోసమేనని, తాను ఇవ్వాలనుకుంటున్న సందేశం అదేనని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంచేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు. ఇందుకోసం స్పష్టమైన టైమ్‌లైన్, ఏకీకృత జాతీయ జ్యుడీషియల్ విధానం తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ప్రజలకు న్యాయం సులభంగా అందాలన్నారు. లిటిగేషన్ వ్యయాన్ని తగ్గించడం దృష్టి పెట్టానని చెప్పారు. నిర్దేశిత గడువులోగా కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నానని, తద్వారా కక్షిదారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పెండింగ్ కేసులన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయని తాను చెప్పడం లేదని, కేసుల పరిష్కారం అనేది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. పాత కేసులను తొలుత పరిష్కరించాలి న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. మన రాజ్యాంగం మూడు కీలక విభాగాల మధ్య స్పష్టమైన అధికారాల విభజన చేసిందని వివరించారు. శాసన వర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ వేటికవే స్వతంత్రంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ అతిగా జోక్యం చేసుకోకుండా రాజ్యాంగం ఏర్పాట్లు చేసిందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కొత్త కేసుల కంటే పాత కేసుల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మధ్యవర్తిత్వం కీలకమైన అస్త్రం అవుతుందన్నారు. మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. పాత కేసులను మొదట పరిష్కరించే దిశగా రాబోయే రోజుల్లో కొన్ని సంస్కరణలు చేపట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇందుకోసం తనకు సహకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి కేసులను విచారించడానికి న్యాయ వ్యవస్థను ఆధునీకరించాలని వివరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులకు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. -
ఢిల్లీ–సికింద్రాబాద్ రైలు టికెట్ రూ.10,200!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో విమా న సర్వీసుల రద్దు నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా రైళ్లలో ప్రయాణిస్తుండగా వారి అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ వ్యక్తి శుక్రవారం సాయంత్రం ఇండిగో ఫ్లైట్‌లో తిరిగి హైదరాబాద్‌కు టికెట్ బుక్ చేసుకోగా ఆ సర్వీసు రద్దయింది. దీంతో చెన్నై వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకోగా అది కన్ఫం కాలేదు. టీసీని బతిమిలాడగా సాధారణ చార్జీతోపాటు తనకు కొంత ముట్టజెప్పాలని ప్రయాణికుడిని కోరినట్లు తెలిసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీసీకి ఆ వ్యక్తి మొత్తం రూ. 10,200 నగదు చెల్లించాడు. ఇండిగో విమానాల రద్దుతో ఢిల్లీ–సికింద్రాబాద్ రైళ్లన్నీ కిటకిటలాడుతుండటంతో ప్రయాణికుల వెయిటింగ్ లిస్టే వందల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్ఏసీ కన్ఫర్మేషన్ కావడం కష్టమంటూ కొందరు టీసీలు ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలిసింది. ఓ ప్రయాణికుడు నిలబడి వెళ్లేందుకు అనుమతించినందుకు టీసీ రూ. 5 వేలు వసూలు చేశాడని సమాచారం. థర్డ్ ఏసీ వెయిటింగ్ లిస్టు ప్రయాణికుడి నుంచి దండుకున్న టీసీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులను దోచుకుంటున్న వైనం -
బానిస మనస్తత్వం ఇంకెన్నాళ్లు?
న్యూఢిల్లీ: మన మెదళ్లలో ఇంకిపోయిన బానిస మనస్తత్వాన్ని రాబోయే పదేళ్లలో పూర్తిగా వదిలించుకోవాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధిలో దేశం పని తీరును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా అభివరి్ణస్తూ మన భారతీయ నాగరికతకు మచ్చతెచ్చే కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ మనదేశం గొప్ప ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన ప్రగతి ప్రయాణం ఎక్కడా ఆగడం లేదని హర్షం వ్యక్తంచేశారు. భారత్ కొత్త చరిత్రను లిఖిస్తోందని ఉద్ఘాటించారు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ దేశం కూడా ముందుకు సాగలేదని తేల్చిచెప్పారు. నేడు అన్ని రంగాల్లో వలసవాద మనస్తత్వాన్ని క్రమంగా వదిలించుకుంటున్నామని వివరించారు. స్వశక్తి, స్వయంకృషితో ఎన్నో ఘనతలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టంచేశారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధనకు వలసవాద, బానిస మనస్తత్వం పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. అందుకే ఆ మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి చెందే దిశగా మన దేశం అడుగులు వేస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఇండియాను ప్రపంచ దేశాలు ‘గ్లోబల్ గ్రోత్ ఇంజిన్’గా గుర్తిస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఆ ఘనతను దేశానికి గర్వకారణంగా భావించడం లేదన్నారు. బానిస మనస్తత్వమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రతి అంశంపైనా మత ముద్ర ‘‘మన దేశం రెండు శాతం, మూడు శాతం ఆర్థిక వృద్ధి కూడా సాధించలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే మాట పుట్టించారు. ఆర్థిక ప్రగతిని ప్రజల విశ్వాసంతో ముడిపెట్టారు. మన సమాజాన్ని పేదరికానికి పర్యాయపదంగా మార్చారు. హిందూ నాగరికతకు సంబంధించిన పరిణామాల వల్లనే ఆర్థిక ప్రగతి జరగడం లేదని నిందించారు. పుస్తకాల్లో, పరిశోధన గ్రంథాల్లో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్‌ను చేర్చారు. కుహన మేధావులు నేడు ప్రతి అంశాన్నీ మతం దృష్టితో చూస్తున్నారు. మత ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్న మేధావులు గత ప్రభుత్వాల హయాంలో నమోదైన తక్కువ వృద్ధిరేటు గురించి మాట్లాడడం లేదు. దేశంలో బానిస మనస్తత్వం అనే విత్తనాలు నాటిన మెకాలే విధానానికి 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయి. అంటే మరో పదేళ్లు మిగిలి ఉన్నాయి. ఈ పదేళ్లలో బానిస మనస్తత్వం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించాలి. మౌలిక మార్పునకు ప్రతీక ఆర్థిక వృద్ధితో మనకు తిరుగులేదు. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం మన బలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి సాధించాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే గ్రోత్ డ్రైవర్. ప్రపంచ వృద్ధి రేటు 3 శాతమే ఉంది. జీ7 దేశాల సగటు వృద్ధిరేటు 1.5 శాతమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం 8.2 శాతం వృద్ధిరేటు సాధించడం సామాన్య విషయం కాదు. ఇది కేవలం అంకెలకు సంబంధించిన సంగతి కాదు. గత పదేళ్లలో మనం తీసుకొచ్చిన మౌలిక మార్పునకు ప్రతీక’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
రోడ్డుపై రాయి.. రూ.5 వేల ధర ఎలా పలికిందంటే..!
రోడ్డు మీద రాయిని చూడగానే కాలితో తన్నడమో చూసిచూడనట్లు వదిలేయడమో చేస్తాం. కానీ ఈ యువకుడు రోడ్డుపై పడి ఉన్న రాయికి రూపం ఇచ్చాడనాలో లేక దానికి విలువనిచ్చాడనలో తెలియదు గానీ అద్భుతం చేశాడు. టాలెంట్‌కి కాదేది అనర్హం అన్నట్లుగా ఓ రాయిని అద్భతమైన వస్తువుగా తీర్చిదిద్ది ప్రశంసలందుకోవడమే కాదు వేలల్లో డబ్బుని కూడా ఆర్జించాడు. ఢిల్లీకి చెందిన ఒక యువకుడు రాయిని ఇంటి అలంకరణకు ఉపకరంగా ఉండే వస్తువుగా మార్చాడు. అతడి నైపుణ్యానికి అంతా విస్తుపోయారు కూడా. రోడ్డుమీద పడి ఉన్న రాయిని అద్భుతమైన గడియారంగా మార్చాడు. రాయి చివరి అంచులను పాలిష్ చేసి అందంగా మార్చాడు. గడియారం సూదిని అటాచ్ చేసేందుకు, ఇతర పరికరాలను సెట్ చేసేందుకు రంధ్రాలు చేశాడు. అలాగే ఆకర్షణీయంగా కనిపించేలా పెయింట్ వేశాడు. చివరగా సూది, బ్యాటరీ చొప్పించి.. రాతితో రూపుదిద్దుకున్న ఫంక్షనల్ గడియారాన్ని డిజైన్ చేశాడు. ఆ తర్వాత ఆ గడియారాన్ని పలువురికి చూపించినా..ఎవరూ ప్రశంసించలేదు, కొనేందుకు ఆసక్తి కూడా చూపించలేదు. దాంతో మరికొన్ని మార్పులు చేసి అమ్మకానికి పెట్టగా కూడా పరిస్థితి అలానే ఉంది. దాంతో ఆ యువకుడి గడియారంతో రోడ్డుపై నిలబడి అమ్మేందుకు ప్రయత్నించగా..చాలామంది రూ. 460కి అడగారు. మరి అలా అడగటం నచ్చక..ఇది రాయితో తానే స్వయంగా చేతితో చేసిన గడియారం అని చెబుతుంటాడు. అది విని ఆసక్తిగా ఒక వ్యక్తి ఆ యువకుడి వద్దకు వచ్చి ధర ఎంత అని అడగగా రూ. 5 వేలు అని చెప్పగానే మారుమాట్లడకుండా డబ్బు చెల్లించి మరి ఆ గడియారాన్ని కొనుగోలు చేశాడు. అంతేగాదు ఆ రాయిని సేకరించడం దగ్గర నుంచి గడియారంగా మార్చడం వరకు మొత్తం తతంగాన్ని రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఆ యువకుడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Sabke Bhaiya JI (@deluxebhaiyaji) (చదవండి: వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!) -
వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!
సాధారణంగా వివాహంలో సప్తపది అనే తంతు ఉంటుంది. ధర్మేచ, కామేచ అంటూ వధువరులు చేత ఏడు ప్రమాణాలు చేయిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ వరుడు వెరైటీగా ఎనిమిదో ప్రమాణం చేయిస్తాడు. పాపం ఆ వధువుకి అంగీకరించక తప్పలేదు. ఇంతకే ఏంటా ప్రమాణం అంటే..ఢిల్లీలో జరిగి వివాహ వేడుకలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మయాంక్ దియా అనే వధువరుల వివాహం అంగరంగ వైభవంగా సాగుతుంది. సరిగ్గా సప్తపది తంతు వచ్చింది. అందరి వధువరులానే ఈ జంట ఆ ప్రమాణాలు చేసింది. కానీ ట్వీస్ట్ ఏంటంటే వీటి తోపాటు ఇంకో ప్రమాణం కూడా చేద్దాం అనగానే ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఎనమిదో వచనం(ప్రమాణంగా) ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుదాం అని చెబుతాడు. సాంప్రదాయ హిందూ వివాహంలో జంట సాధారణంగా పవిత్ర అగ్ని చుట్టూ తిరుగుతూ..ఏడు పవిత్ర ప్రమాణాలు చేస్తారు. దీనని సప్తపది అంటారు. అయితే మయాంక్ ఎనిమిదో వచనంగా చెప్పించిన ప్రమాణం ఆ వధువుకి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం కదూ..!. మయాంక్ ఈ పెళ్లి వేడుకలో సడెన్‌గా మైక్ తీసుకుని మరి తన కాబోయే భార్యతో ఈ ఎనిమిదో ప్రమాణం చేయించడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్రో భార్యను అడగకుండానే ఈ ప్రమాణం చేయించావే..ముందే గ్రిప్‌లో పెట్టుకుంటున్నావా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shaadi Reelz | Wedding Content Creator (@shaadireelz) (చదవండి: పేరు మార్చేసుకున్న ఇండిగో?! వైరల్‌గా హర్ష్ గోయెంకా పోస్ట్) -
విమాన టికెట్ల ధర పెంపుపై కేంద్రం సీరియస్
ఇండిగో సంక్షోభంతో గగనతల ప్రయాణం ఒక్కసారిగా ఖరీదుగా మారింది. అయితే విమాన టికెట్ల ధరల పెంపుపై కేంద్రం సీరియస్ అయ్యింది. సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని ఎయిర్‌లైన్స్‌లకు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. నిర్దేశించిన ఛార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుతో.. మిగతా ఎయిర్‌లైన్స్ క్యాష్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలు రూట్లలో దాదాపు 10 రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అయితే మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ దోపిడీ ప్రభుత్వం దృష్టికి చేరింది. అయితే.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణికులను కొన్ని విమానయాన సంస్థలు దోచుకోవడం సరికాదని కేంద్రం చెబుతోంది. అడ్డగోలుగా రేట్లు పెంచితే చూస్తూ ఊరుకోబోమని.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ జారీ చేసింది.మరోవైపు.. ఇండిగో సంక్షోభంగా ఐదో రోజుకి అడుగపెట్టింది. దేశంలోని పలు ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల వద్ద ప్రయాణికుల నిరీక్షణ కొనసాగుతోంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ఎయిర్‌లైన్స్ ఘోరంగా విఫలం అయ్యిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. విమానాల రద్దు గురించి తెలీక.. సరైన సమాచారం లేక.. ఎయిర్‌పోర్టులలో హెల్ప్‌డెస్క్‌ల వద్ద ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇండిగో సిబ్బంది తమతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ‘‘క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?’’ అంటూ ఎయిర్‌లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భారత్ - రష్యా మధ్య కీలక ఒప్పందాలు
-
భారత్‌కు రష్యా నిజమైన స్నేహితుడు: మోదీ
ఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్‌లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మోదీ-పుతిన్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఇరుదేశాల సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగింది.పుతిన్‌కు ప్రధాని మోదీ శాంతి సందేశం ఇచ్చారు. ఇది శాంతియుగం.. భారత్ శాంతిపక్షమేనన్నారు. భారత్-రష్యా మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయని మోదీ అన్నారు. భారత్‌కు రష్యా నిజమైన స్నేహితుడన్న ప్రధాని మోదీ.. పుతిన్ విజన్‌ను అభినందించారు.వరుస భేటీతో పుతిన్ షెడ్యూల్ ఇవాళ (శుక్రవారం) బిజీబిజీగా సాగుతోంది. పుతిన్‌కు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలికాయి. పుతిన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో సదస్సులో పాల్గొన్నారు. ఇదే భవనంలో పుతిన్‌కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఏర్పాటు చేశారు.సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్‌ను పుతిన్ ప్రారంభిస్తారు. భారత్ మండపంలో ఫిక్కి, రాస్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. అనంతరం పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పుతిన్ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు. -
రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు ఘన స్వాగతం
-
పుతిన్‌తో మోదీ సమావేశం..
Putin India Tour Updates..పుతిన్‌తో మోదీ సమావేశం..భారత్ శాంతి వైపే ఉందన్న ప్రధాని మోదీ భారత్ తటస్థంగా లేదని శాంతి పక్షాన ఉందని మోదీ వెల్లడిహైదరాబాద్ హౌస్‌లో ఇరుదేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని స్పష్టీకరణనమ్మకం ఆధారంగా భారత్-రష్యా సంబంధాలు కొనసాగుతున్నాయని పుతిన్ వెల్లడి.#WATCH | In his meeting with PM Narendra Modi, Russian President Vladimir Putin says, "Over the past years, you have done a great deal of work to develop our relationship...We open additional areas for cooperation, including hi-tech aircraft, space exploration and artificial… pic.twitter.com/OH5WuWVgP2— ANI (@ANI) December 5, 2025#WATCH | Delhi | PM Narendra Modi and Russian President Vladimir Putin held bilateral talks at the Hyderabad House. EAM Dr S Jaishankar, NSA Ajit Doval, Principal Secretary to the Prime Minister, Shaktikanta Das, and other top officials were present.Source: DD pic.twitter.com/AqQYHAjsjF— ANI (@ANI) December 5, 2025రాజ్‌ఘాట్‌లో పుతిన్ నివాళులు.. రాజ్‌ఘాట్‌లో గాంధీజీ సమాధి వద్ద నివాళులర్పించిన రష్యా అధినేత పుతిన్అంతకు ముందు రాజ్ భవన్ వద్ద త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్#WATCH | Delhi | Russian President Vladimir Putin lays a wreath at the Rajghat and pays tribute to Mahatma Gandhi.(Video: DD) pic.twitter.com/BsAyDTlKRr— ANI (@ANI) December 5, 2025👉విజిటర్స్ బుక్‌లో పుతిన్ సంతకం..#WATCH | Delhi | Russian President Vladimir Putin signs the visitors' book at the Rajghat, where he paid tribute to Mahatma Gandhi. pic.twitter.com/x6q74a6P6T— ANI (@ANI) December 5, 2025రాష్ట్రపతి భవన్‌కు పుతిన్రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.పుతిన్‌కు స్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్. #WATCH | Delhi | Russian President Vladimir Putin and President Droupadi Murmu shake hands at the forecourt of Rashtrapati Bhavan. The Russian President and PM Narendra Modi also shake hands. pic.twitter.com/Uuv9d3dCuq— ANI (@ANI) December 5, 2025 #WATCH | Russian President Vladimir Putin receives a Guard of Honour at the Rashtrapati Bhawan.Source: DD pic.twitter.com/ZcHc5EMI6y— ANI (@ANI) December 5, 2025 👉 రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన మోదీ. కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ #WATCH | Delhi | PM Narendra Modi arrives at the Rashtrapati Bhawan ahead of the ceremonial welcome that is to be accorded to Russian President Vladimir Putin. EAM Dr S Jaishankar welcomes him. pic.twitter.com/SPjlY4YIyE— ANI (@ANI) December 5, 2025 #WATCH | PM Narendra Modi welcomes President Droupadi Murmu to the Rashtrapati Bhawan forecourt ahead of the ceremonial welcome that is to be accorded to Russian President Vladimir Putin. pic.twitter.com/EYAVYcatVR— ANI (@ANI) December 5, 2025👉భారత్ చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా నేడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.షెడ్యూల్ ఇలా..ఉదయం 11 గంటలకు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం11:30 గంటలకు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పించనున్న పుతిన్ఉదయం 11:50 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్‌లో పుతిన్ సమావేశంమధ్యాహ్నం 1.50 గంటలకు మోదీ, పుతిన్ మీడియా సమావేశంమధ్యాహ్నం 3:40కి భారత రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న పుతిన్రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో పుతిన్‌కు విందు ఇవ్వనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాత్రి 9:30 గంటలకు తిరిగి మాస్కో వెళ్లిపోనున్న పుతిన్#WATCH | Delhi: All preparations in place at Rajghat where Russian President Vladimir Putin will arrive this morning, to pay tribute to Mahatma Gandhi. pic.twitter.com/jyhRaoP3bE— ANI (@ANI) December 5, 2025కీలక చర్చలు..రక్షణ, వాణిజ్య, పౌర అణు ఇంధనం, ముడిచమురు తదితర రంగాలలో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్న దేశాధినేతలుఎస్-400, 5 జనరేషన్ ఫైటర్ జెట్స్, సబ్‌మెరైన్స్, ఆయుధాల తయారీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంశాలపై ఒప్పందాలు కుదిరే అవకాశం ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశంఅమెరికా ఆంక్షలు నేపథ్యంలో రష్యా ముడిచమురు దిగుమతిని కొంతమేర తగ్గించిన భారత్ -
కాలుష్యంపై విపక్షాల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కాలుష్య రాజధానిగా పరవుమాసినా మోదీ ప్రభుత్వంలో ఇంచు కూడా చలనం లేదంటూ విపక్ష పార్టీలు పార్లమెంట్ వేదికగా ఆందోళనకు దిగారు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రభుత్వ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని, నల్ల మాస్క్‌లు ధరించిన విపక్ష పార్టీల సభ్యులు మకరద్వారం వద్ద నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలిరోజు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ చేసిన ‘‘ శీతాకాల సుందర ప్రకృతిని ఆస్వాదించండి’ వాక్యాలను పెద్ద బ్యానర్‌పై రాసి ఎంపీలంతా ప్రదర్శించారు. ‘‘ఓవైపు పిల్లలు కాలుష్య వాయువు కారణంగా చనిపోతుంటే ఇకనైనా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి. నాలాంటి వృద్ధులు సైతం ఎంతో బాధపడుతున్నారు’’ అని సోని యాగాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఢిల్లీవాసులంతా ఎందుకింతగా కష్టపడాలి? అని మోదీని ప్రశ్నిస్తే ఆయనేమో శీతాకాలం ఎంత బాగుందోకదా అని మాట్లాడుతున్నారు. వాయుకాలుష్యంపై బీజేపీ నిర్లక్ష్య వైఖరిపై పార్లమెంట్ వేదికగా నిలదీస్తాం’’ అని ఖర్గే అన్నారు. ‘‘ రాజకీయంగానీ ఈ వాయుకాలుష్యం సమస్యపై తక్షణం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలి. ఈ అంశం పార్లమెంట్లో చర్చకు రావాలి. చర్యల విషయంలో మేం ప్రభుత్వానికి మద్దతిస్తాం’’ అని ప్రియాంకాగాంధీ అన్నారు. -
భారత్‌లో పుతిన్ (ఫోటోలు)
-
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత, కుమార్తె భావోద్వేగం
న్యూఢిల్లీ : మిజోరం మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్ (డిసెంబర్ 4 శుక్రవారం) కన్నుమూశారు ఆయనకు 73 సంవత్సరాలు. స్వరాజ్ కౌశల్ మాజీ విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ భర్త . అలాగే బీజేపీ ఎంపి బన్సూరి స్వరాజ్ తండ్రి. లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ విభాగం ప్రకటించింది. కౌశల్‌కు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా, పలువురు బీజేపీ నేతలు ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు.VIDEO | Delhi: Swaraj Kaushal, senior BJP leader and husband of the late former External Affairs Minister Sushma Swaraj, passed away on Thursday. Visuals from the cremation ground show his daughter and BJP MP Bansuri Swaraj performing rituals.(Full video available on PTI Videos… pic.twitter.com/bMzs5Nxaz8— Press Trust of India (@PTI_News) December 4, 2025తిరిగి అమ్మ దగ్గరికేబన్సూరి స్వరాజ్ తన తండ్రి మరణంపై ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు. తండ్రిగారు ఇక లేరని చెప్పడానికి చింతిస్తున్నాను అంటూ ఇలా రాశారు ‘‘ మీ నిష్క్రమణ చాలా బాధిస్తోంది. మీరు ఇప్పుడు దేవుని సన్నిధిలో, శాశ్వత శాంతితో తల్లితో తిరిగి కలిశారనే ఈ నమ్మకం. అపరిమితమైన ఓర్పు నా జీవితానికి వెలుగు మీ కుమార్తె కావడం నా జీవితంలో గొప్ప గర్వం,, మీ వారసత్వం, మీ విలువలు , మీ ఆశీర్వాదాలు ముందుకు సాగే ప్రతి ప్రయాణానికి పునాదిగా ఉంటాయి." అంటూ బన్సూరి స్వరాజ్ తన తండ్రికి నివాళులర్పించారు.पापा स्वराज कौशल जी, आपका स्नेह, आपका अनुशासन, आपकी सरलता, आपका राष्ट्रप्रेम और आपका अपार धैर्य मेरे जीवन की वह रोशनी हैं जो कभी मंद नहीं होगी।आपका जाना हृदय की सबसे गहरी पीड़ा बनकर उतरा है, पर मन यही विश्वास थामे हुए है कि आप अब माँ के साथ पुनः मिल चुके हैं, ईश्वर के सान्निध्य… pic.twitter.com/imqpUb2DMS— Bansuri Swaraj (@BansuriSwaraj) December 4, 2025ఎవరీ స్వరాజ్ కౌశల్ జూలై 12, 1952న సోలన్‌లో జన్మించిన స్వరాజ్ కౌశల్ 1990లో 37 సంవత్సరాల వయసులో మిజోరాం గవర్నర్‌గా నియమితులయ్యారు. భారతదేశంలో నియమితులైన అతి పిన్న వయస్కుడైన గవర్నర్‌గా నిలిచారు. సుప్రీంకోర్టు ఆయనను కేవలం 34 ఏళ్ల వయసులో సీనియర్ న్యాయవాదిగా నియమించింది. స్వరాజ్ కౌశల్ - సుష్మా స్వరాజ్ 1975లో వివాహం చేసుకున్నారు. కౌశల్ పార్లమెంటులో హర్యానాకు ప్రాతినిధ్యం వహించారు. 1998 నుండి 2004 వరకు హర్యానా వికాస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. -
రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక.. ఢిల్లీలో హై అలర్ట్..
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా గురువారం రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వీవీఐపీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై-అలర్ట్‌లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్)బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లు, త్వరిత-ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ-స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.పుతిన్ రాక మొదలుకొని వెళ్లే వరకూ ఆయన కదలికలన్నింటినీ బహుళ భద్రతా ఏజెన్సీలు ట్రాక్ చేయనున్నాయి. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు అమలులో ఉండగా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేయనున్నారు. రాజధాని నగరంలో మోదీ-పుతిన్ చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 23వ భారత్-రష్యా వార్షిక వ్యూహాత్మక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.ఈ సమావేశం కేవలం దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహపడనుంది. ఈ అధికారిక చర్చలకు ముందు, ప్రధాని మోదీ తన నివాసంలో పుతిన్‌కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా పుతిన్ సమావేశం కానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం అజెండా విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పారిశ్రామిక సహకారం, వినూత్న సాంకేతికతల బదిలీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. శాంతియుత అంతరిక్ష అన్వేషణ, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ, కార్మిక వలస కార్యక్రమాలలో కొత్త 'ఆశాజనక ప్రాజెక్టులు' కూడా చర్చల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ, ఈ పర్యటన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది.ఇది కూడా చదవండి: స్మార్ట్‌ఫోన్ ముట్టని పుతిన్.. షాకిచ్చే కారణం -
చాట్‌జీపీటీ సాయంతో స్కామర్‌నే బోల్తా కొట్టించి..
డిజిటల్ అరెస్టులు.. ఆన్లైన్ స్కాములు నిత్యం వింటున్నాం. ఆన్లైన్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే ఏం చేస్తారు? ఎక్కడైనా ఫిర్యాదు చేస్తారు లేదా ఆ సైట్లోకి వెళ్లడం మానేస్తారు. అయితే ఒక యువకుడు ఈ తరహా స్కామ్‌ను ఏఐ చాట్ జీపీటీ పవర్‌తో తిప్పికొట్టాడు. తనను మోసం చేయాలని చూసిన స్కామర్‌ను ట్రాక్ చేసి, అతని వివరాలు సేకరించి, చివరకు ‘నన్ను వదిలేయండి.. మహా ప్రభో’ అని వేడుకునేలా చేశాడు. ఈ ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.ఢిల్లీకి చెందిన ఒక యువకుడు ఆన్లైన్ మోసగాడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తన కాలేజీ సీనియర్‌గా, ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్న ఒక స్కామర్ తక్కువ ధరలకు ఫర్నిచర్ అమ్ముతున్నానని చెబుతూ, డబ్బు కొట్టేయాలని ప్రయత్నించాడు. ఈ మెసేజ్‌లో ఏదో తేడా ఉందని గ్రహించిన బాధితుడు, ఈ స్కామర్‌ను టెక్నాలజీ సాయంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారాన్ని ఒక ఏఐ ఆధారిత ఆపరేషన్‌గా మార్చి, చివరకు ఆ స్కామర్‌ను తన ట్రాప్‌లో పడేలా చేశాడు. ఇందుకోసం ఆ యువకుడు చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. స్కామర్‌కు నగదు పంపడానికి వీలుగా, చెల్లుబాటు అయ్యే విధంగా ఒక నకిలీ చెల్లింపు పోర్టల్‌ను రూపొందించాలని ఏఐకి ఆదేశించాడు. అయితే, ఈ వెబ్‌పేజీ ముఖ్య ఉద్దేశ్యం డబ్బు స్వీకరించడం కాదు.. అది క్లిక్ చేసిన వారి జియో లొకేషన్, ఐపీ అడ్రస్, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాతో వారి ఫొటోను రహస్యంగా సంగ్రహించడం. ఏఐ కొద్ది నిమిషాల్లోనే ఈ మోడల్‌కు అవసరమైన కోడ్‌ను రూపొందించింది. ఇది ఆన్లైన్ దొంగను పట్టుకోవడానికి వేసిన ఒక తెలివైన డిజిటల్ వలగా మారింది.ట్రాకర్ పేజీ సిద్ధమైన తర్వాత బాధితుడు స్కామర్‌కు ఆ లింక్‌ను పంపాడు. క్యూఆర్ కోడ్‌ను అప్లోడ్ చేయడం ద్వారా చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయవచ్చని నమ్మబలికాడు. అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో స్కామర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. అంతే ఆ నకిలీ పోర్టల్‌కు స్కామర్ ఉంటున్న ఖచ్చితమైన స్థానం, ఐపీ అడ్రస్, స్పష్టంగా' ఉన్న అతని సెల్ఫీ అందాయి. వెంటనే బాధితుడు ఆ వివరాలను తిరిగి స్కామర్కే పంపడంతో కథ ఊహించని మలుపు తిరిగింది.తన వివరాలు బయటపడటంతో స్కామర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే, వేర్వేరు నంబర్ల నుండి బాధితుడికి పదేపదే కాల్స్ చేసి.. ఈ పనిని ఇకపై చేయను అంటూ క్షమాపణలు కోరడం మొదలుపెట్టాడు. ఆ యువకుడు షేర్ చేసిన స్క్రీన్షాట్లు చూసి స్కామర్ వణికిపోయాడు. ఈ మొత్తం వ్యవహారం గురించి సదరు యువకుడు ‘రెడిట్’లో పోస్ట్ చేస్తూ, చివర్లో.. ‘దొంగను బోల్తా కొట్టించడంలో ఆ తృప్తే వేరు’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఘటన సైబర్ మోసాలను ఎదుర్కోవడంలో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో నిరూపించింది. ఇది కూడా చదవండి: అమ్మకానికి పాక్ ఎయిర్‌లైన్స్.. గుంటనక్క చేతికే! -
IndiGo: భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గగనతల ప్రయాణాల సంక్షోభం కొనసాగుతోంది. వివిధ ఎయిర్‌లైన్స్ విమానాల సర్వీసులు రద్దు అవుతున్నాయి. అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇందుకు కారణమైన ఆ కొత్త రూల్స్ ఏంటో తెలుసా?.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల అవస్థలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వెల్లగక్కతున్నారు. రీఫండ్ విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఇండిగో మీద ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, ప్రతికూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. అయితే.. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. ఏంటా కొత్త రూల్స్.. ?FDTL కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. వాటి ప్రకారం.. రాత్రి సమయంలో (రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు) డ్యూటీ గంటలు తగ్గించబడ్డాయి. వరుసగా ఎక్కువ గంటలు పని చేయకుండా, మధ్యలో ఎక్కువ విరామం తప్పనిసరి. కేబిన్ సిబ్బందికి ల్యాండింగ్స్ పరిమితం చేశారు. 11 గంటల డ్యూటీలో గరిష్టంగా 6 ల్యాండింగ్స్ మాత్రమే ఉండాలి. అలాగే.. 11.30 గంటల డ్యూటీలో గరిష్టంగా 5 ల్యాండింగ్స్ ఉండాలి. ఇక14 గంటల డ్యూటీలో (9 గంటల ఫ్లైయింగ్) కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేశారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో.. ఎయిర్‌లైన్స్ తమ షెడ్యూల్‌లను కొత్త నియమాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట నడిపించే విమానాలు, అధిక ఫ్రీక్వెన్సీ రూట్లలో అంతరాయానికి దారి తీస్తోంది. ఇలాగే ఇంకొన్ని గంటలురెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. అయితే పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రూల్స్ నుంచి పశమనం కోరుతూ డీజీసీఏను ఆశ్రయించింది. ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఆహ్వానం లేకుండా ఢిల్లీకి వెళ్లను
మంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు పై ఊహాగానాలు కొనసాగుతుండగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఓ పెళ్లికి హాజరుకావ డంతోపాటు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. బుధవా రం ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళూరు వచ్చిన సిద్ధరామయ్యతో.. డీకే పర్యటన గురించి మీడియా ప్రశ్నించగా.. అధికారికం ఆహ్వానం లేకుండా ఢిల్లీకి వెళ్లబోనని స్పష్టం చేశారు. ‘ఆయనను వెళ్లనివ్వండి. ఎవరైనా ఆయనకు నో చెప్పారా? నేను ఆహ్వానించినప్పుడే వెళ్తాను. నన్ను ఆహ్వానించలేదు, కాబట్టి నేను వెళ్లడం లేదు.’అని స్పష్టం చేశారు. మంగళూరు విమానాశ్రయంలో డీకే డీకే అంటూ మద్దతుదారులు నినాదాలు చేయడంపై ఆయన..‘ఇందులో తప్పేముంది? గత పదేళ్లుగా ప్రజలు ‘డీకే డీకే’అని నినాదాలు చేస్తున్నారు. కొంతమంది ‘మోదీ మోదీ’అని అరుస్తారు. మరికొందరు ‘రాహు ల్ రాహుల్’, ఇంకొందరు ’సిద్దూ సిద్ధూ’అని జపిస్తారు. అందులో తప్పేమీ లేదు. వారు ప్రేమతో నినాదాలు చేస్తారు. దానిని మనం క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి’అని అన్నారు. -
సంచార్ సాథీ యాప్.. కేంద్రం యూటర్న్
ఢిల్లీ: సంచార్ సాథీ యాప్ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. మెబైల్స్‌లో ప్రీ-ఇన్స్టాలేషన్ నిబంధనను కేంద్రం వెనక్కి తగ్గింది. ఫోన్లలో ప్రీ-ఇన్స్టాలేషన్ తప్పనిసరికాదని కేంద్రం తెలిపింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం విభాగం ఇవాళ(డిసెంబర్ 3, బుధవారం) ప్రకటించింది.సంచార్ సాథీ యాప్ ప్రీ ఇనస్టాలేషన్‌ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ఈ నిర్ణయం తీసుకుందంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాగా, కొత్త మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్‌ని ప్రీ–ఇన్స్టాల్ చేయాలంటూ హ్యాండ్సెట్ కంపెనీలకిచ్చిన ఆదేశాలపై విమర్శలు రావడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది కూడా.. యూజర్లు కావాలంటే దీన్ని అట్టే పెట్టుకోవచ్చని, వద్దనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.Government removes mandatory pre-installation of Sanchar Saathi AppThe Government with an intent to provide access to cyber security to all citizens had mandated pre-installation of Sanchar Saathi app on all smartphones. The app is secure and purely meant to help citizens from…— PIB India (@PIB_India) December 3, 2025సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించే ఈ యాప్ గురించి చాలా మందికి ఇంకా తెలియదని, వారందరికీ దీన్ని చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టే ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ‘ఈ యాప్‌ని అందరికీ చేరువ చేయడం మా బాధ్యత. మీరు డిలీట్ చేయదల్చుకుంటే చేయొచ్చు. వాడకూడదనుకుంటే రిజిస్టర్ చేసుకోవద్దు. రిజిస్టర్ చేసుకుంటే యాక్టివ్‌గా ఉంటుంది. లేకపోతే ఇనాక్టివ్‌గా ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు.మోసాలపై సత్వరం ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్‌ను కొత్తగా తయారు చేసే అన్ని మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ–ఇన్స్టాల్ చేయాలని, ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలని హ్యాండ్సెట్ల తయారీ సంస్థలను టెలికం శాఖ (డాట్) ఆదేశించిన సంగతి తెలిసిందే. సంచార్ సాథీ యాప్‌కి సంబంధించి తీవ్ర విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. -
మూడేళ్లలో 2 లక్షల తీవ్ర కేసులు : ప్రభుత్వ షాకింగ్ డేటా
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం కాలుష్య కాసారంగా మారిపోతుంది. విషపూరితమైన వాయు కాలుష్యంపై ప్రభుత్వం షాకింగ్ డేటాను కేవలం 3 సంవత్సరాలలో 6 ప్రధాన ఆసుపత్రులలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత కేసులు నమోదైనట్టు పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం వెల్లడించింది. దీర్ఘకాలిక వాయు కాలుష్య సంక్షోభ తీవ్రత, ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై చూపిస్తున్నప్రభావాన్ని ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) బహుళ-నగర అధ్యయనంలో శ్వాసకోశ వ్యాధుల సంఖ్య చాలా తీవ్రంగా ఉందని పేర్కొంది. ఐదు ప్రదాన ఆసుపత్రుల్లలో కేవలం 3 సంవత్సరాలలో 6 ప్రధాన ఆసుపత్రులలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఢిల్లీలోని ఆరు ప్రధాన కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు 2022 మరియు 2024 మధ్య అత్యవసర విభాగాలకు 2,04,758 తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ARI) కేసులను నమోదు చేశాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో, 30,420 మంది రోగులు - దాదాపు 15శాతం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడింది. రాజ్యసభ ఎంపీ డాక్టర్ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నే (నామినేట్ చేయబడిన) లేవనెత్తిన ప్రశ్న నం. 274 కు సమాధానంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ ఈ డేటాను సమర్పించారు. సాహ్నే అడిగిన ప్రశ్నలు పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం మరియు శ్వాసకోశ వ్యాధుల మధ్య సంబంధాన్ని మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిందా?శ్వాసకోశ వ్యాధులలో వాయు కాలుష్యం పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ విధాన జోక్యాలను ప్లాన్ చేస్తుందా? సంవత్సరం వారీగా 6 ఆసుపత్రుల్లో AIIMS, సఫ్దర్‌జంగ్, LHMC గ్రూప్, RML, NITRD, VPCI) నమోదవుతున్న కేసులు, 2022-2025 నుండి మెట్రో నగరాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో ఉబ్బసం, COPD , ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల కారణంగా అవుట్ పేషెంట్ మరియు ఆసుపత్రిలో చేరేవారి పెరుగుదల వివరాలు? ప్రభుత్వం అందించిన డేటా2022: 67,054 అత్యవసర కేసులు. 9,874 అడ్మిషన్లు2023: 69,293 అత్యవసర కేసులు. 9,727 అడ్మిషన్లు2024: 68,411 అత్యవసర కేసులు. 10,819 మంది అడ్మిషన్లు2024లో మొత్తం ఎమర్జన్సీ కేసుల సంఖ్య స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, అడ్మిషన్ అవసరమైన రోగుల సంఖ్య బాగా పెరిగింది, ఇది ఆసుపత్రులకు వచ్చే కేసులు, తీవ్రంగా పరిణమిస్తున్న వైనాన్నిసూచిస్తుంది. అయితే వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులు, సంబంధిత వ్యాధులకు ప్రేరేపించే కారకాల్లో ఒకటి అయినప్పటికీ, అని ఆహారం, వృత్తి, సామాజిక-ఆర్థిక స్థితి మరియు ముందుగా ఉన్న పరిస్థితులతో సహా బహుళ కారకాలు ఆరోగ్య ప్రభావాలను ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. -
ప్రధానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ఆహ్వానం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ప్రధానికి ఆయన ఆహ్వానం అందించారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేవంత్ వెంట ఉన్నారు.సుమారు అరగంటపాటు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. డిసెంబర్ 8,9వ తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే.. రీజినల్ రింగ్ రోడ్డు, బెంగళూరు చెన్నై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని సీఎం ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. అంతకు ముందు తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ బృందం.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్‌లను కలిసింది. సదస్సుకు రావాల్సిందిగా కేంద్ర మంత్రులకు ఆహ్వానం అందించింది. ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీల బృందం కలిసింది. రాష్ట్ర రాజకీయాలతో పాటు సదస్సు గురించి వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
విరాట్ కోహ్లి అభిమానులకు పిచ్చెక్కించే వార్త
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానులకు ఇది బంపర్ బొనాంజా లాంటి వార్త. కింగ్ త్వరలో జరుగబోయే దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులగా ఈ విషయమై సందిగ్దత నెలకొని ఉండింది. కోహ్లి స్వయంగా తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని చెప్పడంతో అతడి అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి.. దేశవాలీ టోర్నీ ఆడనుండటం క్రికెట్ అభిమానులకు నిజంగా పండుగే. కోహ్లి తన సొంత దేశవాలీ జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీ ఆడేందుకు కోహ్లి సంసిద్దత వ్యక్తం చేసిన విషయాన్ని ఢిల్లీ క్రికెట్ ఆసోసియేషన్ చీఫ్ రోహన్ జైట్లీ ధృవీకరించారు.ఈ విషయాన్ని ఆయన క్రిక్‌బజ్ మాధ్యమంగా వెల్లడిస్తూ.. అవును.. కోహ్లి విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న మాట వాస్తవమే. అయితే అతడెన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడన్న విషయం ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు జరుగుతుంది.కాగా, జాతీయ జట్టు పరిగణలో ఉండాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక రాణించాల్సి ఉంటుందని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కోహ్లి ఈ నిర్ణయం 2027 ప్రపంచకప్ ఆడాలనుకున్న అతని బలమైన సంకల్పాన్ని సూచిస్తుంది.కోహ్లి చివరిగా 2009-10 విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. ఈ టోర్నీలో అతను 14 మ్యాచ్‌లు ఆడి నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 819 పరుగులు చేశాడు. ఈ గణంకాలు చూస్తే చాలు ఈ టోర్నీలోనూ కింగ్ హవా ఎలా కొనసాగిందో చెప్పడానికి.ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో కోహ్లి సూపర్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత కోహ్లి అత్యుత్తమ టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. చూడచక్కని డ్రైవ్‌లు, షాట్లు ఆడి అభిమానులకు అలరించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో కోహ్లి తన కెరీర్ అత్యున్నత స్థితిని గుర్తు చేశాడు. -
ఆగని పసిడి పరుగు.. ఒకే రోజు రూ.3 వేలు పెరుగుదల
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరింది. ఇటీవలే నమోదైన జీవితకాల గరిష్ట ధర రూ.1,34,800కు చేరువైంది. మరో రూ.600కు పైగా పెరిగితే పసిడి ధరల్లో కొత్త రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడంతో డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు, ఇది ధరలకు మద్దతునిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర సైతం వరుసగా ఐదో రోజు ర్యాలీ చేసింది. కిలోకి రూ.5,800 పెరిగి రూ.1,77,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 42 డాలర్లు ఎగసి (ఒక శాతం) 4,262.52 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర (స్పాట్ మార్కెట్) ఔన్స్‌కి 3 శాతానికిపైగా ర్యాలీ చేసి 59 డాలర్లకు చేరింది. గత వారం రోజుల్లోనే వెండి ధర 16.7 శాతం పెరగడం గమనార్హం. అంతేకాదు 2025లో వెండి ధర రెట్టింపైంది. 2024 డిసెంబర్ 31న ఔన్స్ ధర 28.97 డాలర్ల వద్ద ఉంది. ‘‘యూఎస్ డాలర్ బలహీనపడడం, యూఎస్ ఫెడ్ వచ్చే వారంలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల నుంచి పసిడి కొనుగోళ్లు బలంగా కొనసాగుతుండడం ధరలను మరింత గరిష్టాల దిశగా నడిపిస్తోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
నేడు ఢిల్లీకి సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నా రు. ఉదయం గాందీభవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తి రిగి వస్తారు.రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్తా రని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాందీలను కలుస్తారు. ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు హాజరు కావాల్సిందిగా ఆహా్వనిస్తారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పలుకుతారు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి హుస్నాబాద్‌లో జరిగే ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి. -
సింగపూర్ చూపుతున్న మార్గం
ఢిల్లీలో ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన ఉగ్ర దాడి, భారత్ ఎదుర్కొంటున్న ఆంతరంగిక భద్రతా సవాళ్ళపైకి మరోసారి దృష్టిని మరల్చింది. ఈ దాడిలో 13 మంది చనిపోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీలో హైకోర్టు వద్ద 2011లో జరిగిన బాంబు పేలుడు తర్వాత, అంతటి భీతావహమైన దాడి చోటుచేసుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. ముంబయిలో 2008 నవంబర్ 26న భారత్ పెద్ద ఉగ్ర దాడిని చవిచూసింది. ఆ దాడిలో పాల్గొన్నవారిలో ఒకడైన కసబ్‌కు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధం స్పష్టంగా వెల్లడైంది. వైట్ కాలర్ ఉగ్రవాదంఅయితే, ఢిల్లీ ఘటన ఇస్లామీయ ర్యాడికలైజేషన్‌లో వచ్చిన పెద్ద మార్పునకు అద్దం పడుతోందని చెబుతున్నారు. అది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పాకింది. వృత్తి నిపుణులు (ఈ కేసులో డాక్టర్లు) తమకు తాము ఉగ్రవాదులుగా మారుతున్నారు. వారు డిజిటల్ సాధనాలను, సంస్థాపరమైన సౌలభ్యాన్ని వినియో గించుకుంటున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తదనంతర దర్యాప్తులో అనేక సంగతులు వెల్లడయ్యాయి. ఊహకందని ఉగ్ర సాలెగూడు జమ్ము–కశ్మీర్, హరియాణా, ఉత్తర ప్రదేశ్‌లను మించి విస్తరించినట్లు తేలింది. ఒక వైట్–కాలర్ ఉగ్ర వ్యవస్థ బయటపడింది. దానికి పాకిస్తాన్‌లోని జైష్–ఏ–మహమ్మద్ (జెమ్), అన్సార్ గజవత్ ఉల్– హింద్‌తో సంబంధాలున్నాయి. వారు అనుసరించిన ఎత్తుగడలు హమాస్ నుంచి స్ఫూర్తి పొందినవిగా కనిపిస్తున్నాయని కూడా ప్రాథ మిక నివేదికలు సూచించాయి. విదేశీ సూత్రధారుల (ఉదాహరణకు తుర్కియేలోని ‘ఉకాస’) ఆదేశాలను పాటించినట్లు కూడా వెల్లడవు తోంది. దానికి వారు సెషన్, టెలిగ్రామ్ వంటి యాప్‌లను వాడు కున్నారు. సోదాలలో 2,900 కిలోల పేలుడు పదార్థాలు, డిటొ నేటర్లు, అసాల్ట్ రైఫిళ్ళు, (42 వీడియోలతో సహా) ప్రాపగాండా సామగ్రి దొరికాయి. ‘జెమ్’ వంటి ఉగ్ర తండాలు, వాటి అనుబంధ వర్గాలు స్లీపర్ సెల్స్ సృష్టించేందుకు, విద్యావంతులైన యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అందుకు సామాజిక మాధ్యమా లను వాడుకుంటున్నాయని తేటతెల్లమైంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితులు, అశాంతి ఈ వ్యవహారాలలో ఒక వారధిగా పనిచేయడానికి అవకాశం కల్పించి ఉండవచ్చునని కూడా అను మానిస్తున్నారు.సింగపూర్‌కూ తప్పని సంకటంఇటీవలి నా సింగపూర్ సందర్శన సందర్భంగా నాకు కొన్ని నిగూఢమైన అంశాలు తెలిసి వచ్చాయి. సోషల్ మీడియా, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజె¯Œ ్స ఆధారిత ఇస్లామీయ ర్యాడికలైజేషన్ విసురు తున్న సవాల్, అది ఆ నగర రాజ్యంలోని యువ వర్గాలపై చూపు తున్న ప్రభావం దిగ్భ్రమకు గురిచేశాయి.సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్భంధంలోకి తీసుకుంటున్న యువ ర్యాడికల్ సింగపూరియన్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోందని మరిన్ని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెక్యూరిటీ ఏజెన్సీలు జాగు చేయకుండా వెంటనే నివారణ చర్యలకు దిగడం వల్ల చాలా ప్రమాదకర ఘటనలు తప్పిపోయాయి. సింగపూర్‌లో తుపాకీ నిరోధక చట్టాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటిని తప్పించుకుని ఒక ఆయుధాన్ని తయారు చేసేందుకు, 17 ఏళ్ళ ఓ యువకుడు 3–డి ప్రింటింగ్‌ను వినియోగించుకునే ప్రణాళికలో ఉన్నాడు. కానీ, ఆంతరంగిక భద్రతా విభాగం (ఐఎస్డీ) ఈ ఏడాది మార్చిలో అతడిని నిర్బంధంలోకి తీసుకోగలిగింది. అతడి నుంచి రాబట్టిన విషయాలు మరింత ఆశ్చర్యం గొలిపాయి. అతడు ఆ ఆయుధాన్ని ఉపయోగించి స్థానిక మసీదు ఒక దానిలో కనీసం 100 మందిని చంపేసి, తనను తాను కాల్చుకుని చనిపోయే ఆలోచనలో ఉన్నాడు. దీనికి ముందు, ఫిబ్రవరి నెలలో, ఐఎస్డీకి ఓ 15 ఏళ్ళ అమ్మాయిపై అనుమానం కలిగింది. ఆమె కదలికలపై నిఘా పెట్టి, తర్వాత నిర్భంధంలోకి తీసుకుంది. ఆంతరంగిక భద్రతా చట్టం కింద సింగపూర్‌లో ఓ అమ్మాయిని అరెస్టు చేయడం అదే మొదటి సారి. ఆమె ‘ఐసిస్’ సభ్యుడిని పెళ్ళి చేసుకుని, దానికి అనుకూ లమైన కుటుంబాన్ని పెంచాలని భావిస్తోంది. సిరియాలో పోరాటంలోకి దిగి, అమర వీరురాలిగా మారాలని కలలు గంటోంది. అరికట్టే చర్యలు ఈ పెడ ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు సింగపూర్ ప్రభుత్వం రెలిజియస్ రీహ్యాబిలిటేషన్ గ్రూప్ (ఆర్.ఆర్.జి.) పేరుతో 2005లోనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవస్థీకృత ఉగ్ర తండాల సభ్యుల నుంచి పొంచి ఉన్న బెడదను ఎదుర్కోవడాన్ని అది మొదట లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా జెమా ఇస్లామియా (జేఐ) నుంచి ఉన్న ముప్పును నివారించే పనిలోపడింది. కాలక్రమంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఆర్.ఆర్.జి. తన కార్యాచరణను మార్చుకుంటూ వచ్చింది. అసలు మతం ఉద్దేశాలు, ఆశయాల గురించి యువతకు సక్రమ అవగాహన కల్పించే పనిని ప్రశంసనీయమైన రీతిలో కొనసాగిస్తూ వచ్చింది. యువతలో కొందరు ఆవేశం, నిరాశా నిస్పృహలతో హింసకు దిగడాన్ని గమనించి అది పరిష్కారం కాదని పరివర్తనకు దారి చూపింది. అది సత్ఫలితాలను ఇచ్చినట్లు ఒక విస్తృత సర్వేలో తేలింది. సింగపూర్ ఐ.ఎస్.ఏ. కింద Výæడచిన దశాబ్దంలో కేవలం 17 మంది మాత్రమే అరెస్టు అయ్యారు. ముఖ్యంగా, ఆ నగర రాజ్యంలో పెద్ద ఉగ్ర ఘటన ఏదీ చోటుచేసుకోలేదు. అయితే, సింగపూర్ ముస్లిం వ్యవహారాల మంత్రి ప్రొఫెసర్ ఫైజల్ ఇబ్రహీం తాజా ర్యాడికలై జేషన్‌ను గమనించకపోలేదు. ‘‘దేశాల మధ్య అనుసంధానకత్వం పెరిగిపోతున్న ప్రపంచంలో ఉగ్ర సామగ్రి తేలిగ్గా అందుబాటులోకి వస్తోంది. డిజిటల్ సాధనాలలో సైద్ధాంతిక ప్రబోధాలు ప్రతిధ్వని స్తున్నాయి. యువత ఇంటర్నెట్లోనే ఎక్కువ సమయం గడుపు తూండటం వల్ల ర్యాడికలైజేషన్కు వెసులుబాటు ఏర్పడడమే కాక, ఆ ప్రక్రియ వేగం పెరుగుతోంది’’ అన్నారు.అయితే, భారతదేశాన్ని ఆ నగర రాజ్యంతో పోల్చుకోలేం. సింగపూర్ జనాభా అరవై లక్షలు మాత్రమే. భారత్ జనాభా ఇంచు మించు 150 కోట్లు. వైవిధ్యంతో కూడిన భారతీయులు దాదాపు 800 జిల్లాలలో విస్తరించి ఉన్నారు. వివిధ మతాలు, భాషలు, కులాలకు చెందిన వారి సామాజిక–సాంస్కృతిక మిశ్రమత్వం మరింత జటిలమైంది. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఏఐ ఆధారిత ర్యాడికలైజేషన్ తీరుతెన్నులకు సరిహద్దులు లేవు. సింగ పూర్ ఆర్.ఆర్.జి. నమూనాను సమీక్షించి, భారతదేశానికి తగ్గ విరుగుడు కార్యక్రమాలను రూపొందించుకోవచ్చు.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
ప్రాణాలు పోతుంటే చర్యలు తీసుకోరా?
ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని నొక్కిచెప్పింది. గాలి నాణ్యత కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటే సుప్రీంకోర్టు చూస్తూ ఉండాలా అని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ని ప్రశ్నించింది.ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. గాలి నాణ్యత ఎంత తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుతుంటే ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ తో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ను ప్రశ్నించింది. వాయు కాలుష్యంతో లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే సుప్రీం కోర్టు చూస్తూ ఉండాలా అని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. పంట వ్యర్థాల కాల్చివేత ఒక్కటే ఈ సమస్యకు కారణం కాదని అది కేవలం ఇందులో ఒక భాగమేనని తెలిపింది.జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ "సుప్రీంకోర్టు ఈ సమస్యపై చూస్తూ ఉండలేదు. "పంటవ్యర్థాల కాల్చివేత ఈ సమస్యకు కారణమైతే కోవిడ్-19 సమయంలో మనం ఆకాశంలోని నక్షత్రాలను చూడగలిగేవారిమా? ఈ సమస్యను రాజకీయంగా చూడకూడదు. ఢిల్లీ వాతావరణ కాలుష్యం కేవలం పంట వ్యర్థాల వల్ల ఏర్పడింది కాదు. దీనిని నిర్మూలించడానికి మీరు తీసుకున్న చర్యలేంటో చూపండి". అని చీఫ్ జస్టిస్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ని ప్రశ్నించారు.ఈ సమస్యను పరిష్కరించే అంశం కోర్టుల పరిధిలోనిది కాదని నిపుణులతో కూడిన కమిటీ వాయు కాలుష్య సమస్యకు పరిష్కారం కనుగొనాలని తెలిపారు. కోర్టులు ఈ సమస్యలను రూపుమాపవు కాని దానికి కావాల్సిన వేదికను ఏర్పాటు చేయగలవు. అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గాలి కాలుష్యాన్ని పరిష్కరించడానికి స్పష్టమైన సమయాన్ని నిర్దేశించుకొని తగిన ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. -
పరాజయాన్ని ఒప్పుకోలేరు.. ప్రతిపక్షాలకు మోదీ చురకలు
-
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
-
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
-
బ్రేక్‌ఫాస్ట్‌తో కుర్చీ పోరుకు బ్రేక్!
సాక్షి బెంగళూరు/బెంగళూరు (శివాజీనగర): కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై కొద్ది రోజులుగా సాగుతున్న పోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ఢిల్లీకి వెళ్లకుండానే.. ఢిల్లీలో సోనియా గాంధీ నాయకత్వంలో ఏఐసీసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వారిద్దరూ ఐక్యతారాగం ఆలí³ంచారు. శుక్రవారం దాకా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ.. పరోక్షంగా బల ప్రదర్శన చేస్తూ.. మరోవైపు హై కమాండ్ నిర్ణయమే శిరోధార్యమని చెబుతూ వచ్చిన వారు.. శనివారం అల్పాహార విందులో సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అధిష్టానం నుంచి అందిన ఆదేశాలో.. లేక ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్యో.. మొత్తానికి తమ లక్ష్యం 2028 ఎన్నికల్లో గెలవడమేనని స్పష్టం చేశారు.కర్ణాటక సమస్యను పరిష్కరించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాలు పలుమార్లు చర్చించి చివరికి నిర్ణయాన్ని ఆ పార్టీ అధినేత్రి సోనియాకి వదిలేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఢిల్లీలో సోనియా నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది.ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. శనివారం సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ద్వారా ప్రస్తుతానికి పరిస్థితిని శాంతింపజేసినట్లు నేతలు సోనియా దృష్టికి తీసుకొచ్చారు. కర్ణాటక రాజకీయ పరిణామాలపై మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీకి ప్రత్యేకంగా నివేదించారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు కర్ణాటకలోని బెళగావిలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోసీఎం, డీసీఎంలు చర్చించుకుని, కుర్చీ పోరుకు తాత్కాలికంగా స్వస్తి చెప్పేలా అధిష్టానం చక్రం తిప్పడంలో విజయం సాధించింది. కలిసికట్టుగా పని చేస్తాంతనకు సీఎం సిద్ధరామయ్యతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తమపై ఆశలు పెట్టుకున్నందున, తామంతా కలసికట్టుగా పని చేయాల్సి ఉందన్నారు. 2028 ఎన్నికలే తమ లక్ష్యం అని చెప్పారు. ‘నేను ఏనాడూ గ్రూపు రాజకీయం చేయను. ఎప్పుడూ ఢిల్లీకి ఒక్కడినే వెళతాను. 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నాయకులే. ఎవరినీ చిన్నచూపు చూడను. గతంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఆఖరిరోజు వరకు ఎంతో ప్రయత్నం చేశాననేది ఆయన తండ్రికి తెలుసు. ఇప్పుడు విమర్శలు చేస్తుంటే చేసుకోనీ. నేను కోపగించుకోను. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన విషయాలు బయటకు చెప్పలేను’ అని తెలిపారు. -
సంక్షోభంలో ఏపీ రైతాంగం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్సార్సీపీ ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమస్యలను కేంద్రం దృష్టికి తెచ్చారు. ‘పలు సమస్యలపై మాట్లాడేందుకు సభలో సమయం ఇవ్వాలి. మేము లేవనెత్తిన ప్రతి ఒక్క అంశంపై కేంద్రం పరిష్కారాన్ని చూపాలి. జాతీయ స్థాయిలో 2023–24లో కోటి 84 టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులు నమోదయ్యాయి. ఇందులో 51.58 లక్షల టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఆదాయ నిష్పత్తిలో 9.15 శాతం ఆక్వా రంగం నుంచే వస్తోంది. ట్రంప్ విధించిన టారిఫ్‌ల కారణంగా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వీరిని ఆదుకునేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలిసమావేశం అనంతరం పార్టీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వైద్యరంగం బలోపేతం కోసం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకొచి్చన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు. ఈ ప్రైవేటీకరణను ఆపాలని తాము కేంద్రం దృష్టికి తీసికెళ్లామన్నారు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం లేదంటూ స్పష్టత ఇవ్వాలని సమావేశంలో డిమాండ్ చేసినట్లు వివరించారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్పిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.ఉపాధి హామీ నిధులపై పెదవి విప్పని పెమ్మసానికాగా, ఆరు నెలలుగా ఉపాధి హామీ పథకం డబ్బులు రాక పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సమావేశంలో తాము ప్రస్తావిస్తే, ఇదే సమావేశంలో పాల్గొన్న సంబంధిత శాఖ కేంద్ర మంత్రి పెమ్మసాని.. ఈ సమస్యపై నోరుమెదపలేదని మిథున్ రెడ్డి విమర్శించారు. కూలీలకు ఈఏడాది జూలై 17వ తేదీ నుంచి జరిగిన పనులకు నేటి వరకు డబ్బులు ఇవ్వలేదన్నారు. దాదాపు రూ.350 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేంద్రానికి వివరించినట్లు తెలిపారు. పనిలేని పేదలకు పని కల్పించి డబ్బు ఇవ్వడమే లక్ష్యమైన ఈ పథకానికి సంబంధించి కూడా టీడీపీకి చెందిన వారే రాజ్యమేలుతున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. కూలీలు చేయాల్సిన పనిని వారిచేత చేయించకుండా, టీడీపీ నేతలు తమ సొంత వారి మిషన్లు పెట్టి పనులు చేస్తున్నట్లు విమర్శించారు. ఇలా దొంగ మస్టర్లు వేసుకుని బిల్లులు కాజేస్తున్నట్లు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా.. ఆ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. -
ఢిల్లీ.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రసంస్థతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. అరెస్టైన ముగ్గురు తీవ్రవాదులు నార్త్ ఇండియాకు చెందిన వారని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లలో వీరిని అదుపులోికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల గురుదాస్ పూర పోలీస్ స్టేషన్ పై బాంబుతో దాడి చేసింది ఈ టెర్రరిస్టులేనని స్పెషల్ సెల్ అడిషనల్ సీపీ ప్రమోద్ కుమార్ కుశ్వాహా పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో హార్గున్ ప్రీత్ సింగ్ (పంజాబ్), వికాస్ ప్రజాపతి (మధ్యప్రదేశ్) ఆరిఫ్ (ఉత్తరప్రదేశ్) రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. వీరు కొన్ని ప్రదేశాలను టార్గెట్ చేసుకున్నారని ఆ ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి పలు వీడియోలు చిత్రీకరించారని పేర్కొన్నారు. వీరందరిని షాబాద్ బట్టి అనే వ్యక్తి బయిటి నుండి ఆదేశాలు ఇచ్చేవాడని సీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ లకు ఆయన స్వయంగా గాని ఆయన అనుచరుల ద్వారా గాని నడిపించేవారన్నారు.టెర్రరిస్ట్ గ్రూప్ రిక్రూట్ మెంట్ కోసం సామాజిక మాధ్యమాలను వాడారని వాటి ద్వారానే యువకులను ఉగ్రవాదులుగా నియమించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న టెర్రరిస్టులు ఉగ్రవాదుల విషయంలో కొంత సమాచారం ఇచ్చారని త్వరలో వాటి ఆధారంగా మరిన్ని అరెస్టులు జరుగుతాయని సీపీ ప్రమోద్ కుమార్ కుశ్వాహ పేర్కొన్నారు. -
ఢిల్లీలో ఆందోళన కలిగిస్తున్న క్యాన్సర్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గాలి నాణ్యతలు పలు మార్లు తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పటికీ కేంద్రం తీసుకునే చర్యలు ఫలించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో అడెనోకార్సినోమా అనే ఉపిరితిత్తుల క్యాన్సర్ రకం కేసులు ఢిల్లీ వాసులలో అధికంగా నమోదవుతున్నాయి. ధూమపానం అలవాటు లేని వారిలోనూ ఈ కేసులు అధికంగా నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది.ఢిల్లీ నగరం చాలాకాలంగా గాలి నాణ్యత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అధిక సంఖ్యలో వాహనాలతో పాటు పరిసర ప్రాంతాలలో పంటవ్యర్థాలు కాల్చివేయడం తదితర చర్యలతో అక్కడ తీవ్రమైన గాలి కాలుష్యం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు దాని నివారణకు ఎన్ని చర్యలు చేపట్టిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఇటివల అక్కడ నమోదవుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. సాధారణంగా సిగరెట్ ఇతరాత్ర దురలావాట్ల ద్వారా అధికంగా సంభవించే లంగ్ క్యాన్సర్ కేసులు ధూమపానం అలవాటు లేని వారిలోనూ అధికంగా నమోదవుతున్నాయి.ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 1998లో లంగ్ క్యాన్సర్ కేసులు 90 శాతం దాదాపు సిగరెట్ అలవాటు ఉన్నవారికే వచ్చేవని తెలిపాయి. అదే 2018లో క్యాన్సర్ కేసులు నమోదైన వారిలో దాదాపు 60 నుంచి 70శాతం మంది ధూమపానం అలవాటు లేని వారని తెలిపింది. ఈ గడిచిన దశాబ్దాల కాలంలో గాలినాణ్యత పూర్తిగా క్షీణించడంతోనే ఈ విధంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.2025లో ది లాన్సెంట్ జరిపిన అధ్యయనం ప్రకారం అడినోకాన్సిరోమా అనే క్యాన్సర్ రకం గాలిలో నాణ్యత క్షీణించడం వల్లే అధికంగా ఏర్పడుతాయని స్టడీ తెలిపింది. అయితే సిగరెట్ అలావాటు లేని వారిలోనూ ఈరకం క్యాన్సర్ కేసులు అక్కడ అధికంగా వెలుగు చూస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని గాలి కాలుష్యమే ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణమని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. యువకులు, మహిళలలో ఈ రకం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దానికి తోడూ ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఈక్యాన్సర్ కేసులపై ప్రజలకు అవగాహాన కల్పించి ప్రభుత్వం తగిన నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో గాలి కాలుష్య నివారణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
నా లిమిట్స్ నాకు తెలుసు: డీకే శివకుమార్
సాక్షి బెంగుళూరు:గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలని వేడెక్కించిన కర్ణాటక పాలిటిక్స్ ఇప్పుడు కాస్త చల్లబడ్డట్లు కనిపిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్యతో తనకు విభేదాలు ఏమి లేవని డిప్యూటీ సీఎం డీ.కే శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసన్నారు. తమ పార్టీ నేతల దృష్టంతా 2028లో పార్టీని అధికారంలోకి తేవడం పైనే ఉందన్నారు.కర్ణాటక కాంగ్రెస్‌లో పుట్టిన అంతర్గత ముసలం గత కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే శివకూమార్ మధ్య ట్వీట్ల యుద్ధం తీవ్రంగానే నడిచింది. తనను ఐదు సంవత్సరాల కొరకు ప్రజలు ఎన్నుకున్నారని సిద్ధ రామయ్య, మాట నిలబెట్టుకోవడం కంటే గొప్పది మరోటి ఉండదని శివకుమార్ కామెంట్స్ చేశారు. కాగా ప్రస్తుతం శివకుమార్ మాట్లాడే తీరు చూస్తుంటే ఈ విషయంలో ఆయన కొంచెం మెత్తబడ్డట్లే కనిపిస్తుంది.డీ.కే శివకుమార్ మాట్లాడుతూ "ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ అధ్యక్షుడిగా నా పరిధులేంటో నాకు తెలుసు. ఇప్పటి వరకూ తామేప్పుడు భేదాభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం. కర్ణాటక ప్రజలకు వారి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలున్నాయి. వాటిని నెరవేర్చడం కోసం మేమంతా కలిసి పనిచేయాలనుకుంటున్నాం. 2028, 2029లో అధికారం సాధించడమే మా ముందున్న గమ్యం. దానికోసం మేం పనిచేస్తున్నాం. వివిధ సమస్యలపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం". అని శివకుమార్ అన్నారు.కాగా నవంబర్ 20న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడవడంతో సీఎం మార్పు జరగనుందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం మార్పు జరిగేలా అగ్రిమెంట్ జరిగిందని దానికనుంగానే నిర్ణయం తీసుకోనున్నారని ఊహాగానాలు చెలరేగాయి. కాగా ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకూమర్ ఇద్దరూ నేతలు సైతం అధిష్ఠానందే ఫైనల్ డెసిషన్ అనడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఊపిరి తీసుకున్నట్లు కనిపిస్తుంది.ఈ వివాదం పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే త్వరలోనే పార్టీ హైకమాండ్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
ఢిల్లీలోని టిగ్రి ఎక్స్ టెన్షన్ లో భారీ అగ్నిప్రమాదం
-
అన్నా, చెల్లెలు సజీవ దహనం
ఢిల్లీ ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రి ఎక్స్టెన్షన్ నాలుగు అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారరు. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దుర్మరణం చెందిన వారిలో ఇద్దరు అన్నా చెల్లెళ్లు సజీవ దహనం అయ్యారు. బిల్డింగ్ యజమాని సతీందర్, ఆయన చెల్లెలు అనితలు అగ్ని ప్రమాదం బారిన పడి మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరిగిందని పసిగట్టి తేరుకునేలోపే నిమిషాల్లో ఆ బిల్డింగ్‌ను మంటలు చుట్టుముట్టాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న నాలుగు ఫైరింజన్లు.. మంటలన అదుపులోకి తెచ్చాయి. అప్పటికే ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీస్ అధికారులు. కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. -
కర్ణాటక సీఎం చేంజ్? రేపు ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య
-
ముఖ్యమంత్రి పీఠంపై డీకే. శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
ఆపరేషన్ ఢిల్లీ.. తెలంగాణ ఈగల్ టీం బిగ్ సక్సెస్
హైదరాబాద్: దేశ రాజధానిలో తెలంగాణ ఈగల్ టీమ్ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో కీలక ఆధారాలను సేకరించింది. పెద్ద ఎత్తున నడుస్తున్న డ్రగ్స్ దందాను గుర్తించిచామన్న అధికారులు.. రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో మల్నాడు రెస్టారెంట్, మహీంద్రా యూనివర్సిటీ కేసులను విచారించగా ఈ డ్రగ్స్ మాఫియా బయటపడింది. ఢిల్లీలో 20 ప్రాంతాలతో పాటు నోయిడా, గ్వాలియర్, విశాఖలో తనిఖీలు నిర్వహించాం. ఒక్క ఢిల్లీలోనే 16 విక్రయ కేంద్రాలను గుర్తించాం. యాభై మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నాం. వీళ్లలో చాలామందిని డిపోర్ట్ చేయించే ఉద్దేశంలో ఉన్నాం. నైజీరియాకు చెందిన నిక్కీ ఆధ్వర్యంలో ఈ దందా నడిచింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుంది ఈ నెట్వర్క్. ఇప్పటిదాకా సుమారు 2 వేల మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించాం. ప్రముఖ కొరియర్, పార్శిల్స్ సర్వీసులతోనే ఈ వ్యవహారం నడిచింది. గార్మెంట్స్, కాస్మోటిక్స్, షూల మధ్యలో ఉంచి పంపిణీ చేశారు.వందలాది మ్యూల్ అకౌంట్లు చేర్పాటు చేసి లావాదేవీలు నడిపారు. సుమారు 2,000సార్లు లావాదేవీలు జరిపినట్లు గుర్తించాం. 59 మ్యూల్ అకౌంట్లు సీజ్ చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నాం. హైదరాబాద్‌కు చెందిన 11 మంది డ్రగ్స్ పెడ్లర్లను గుర్తించి అరెస్ట్ చేశాం అని ఈ భారీ ఆపరేషన్ వివరాలు మీడియాకు వెల్లడించారు. -
నిర్ణయాత్మక ఘట్టం ‘సిందూర్’
న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక, నిరోధక చర్యల్లో ఆపరేషన్ సిందూర్ ఒక నిర్ణయాత్మక ఘట్టమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభివరి్ణంచారు. ఈ ఆపరేషన్ ద్వారా మన సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిసొచ్చాయని అన్నారు. శాంతిని సాధించడంలో భారత్ అత్యంత దృఢంగా, అదే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నట్లు తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన ‘చాణక్య డిఫెన్స్ డైలాగ్’కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. మనదేశం ఆనాదిగా ‘వసుధైవ కుటుంబం’అనే సూత్రానికి కట్టుబడి ఉన్నట్లు గుర్తుచేశారు. ప్రపంచ దేశాలతో శాంతియుత సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. భారత్ కేవలం శాంతిని కోరుకుంటున్నట్లు మన దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, మన సైనిక దళాలు ఉమ్మడిగా నిరూపిస్తున్నట్లు స్పష్టంచేశారు. మరోవైపు దేశ సరిహద్దులను, ప్రజలను కాపాడుకోవడంలో ఎంతమాత్రం రాజీపడడం లేదని పేర్కొన్నారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించడంలో మన సైనిక దళాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. జవాన్ల పనితీరు, దేశభక్తిని కొనియాడారు. దేశ అభివృద్ధికి సైన్యం కీలకమైన ఆధారంగా నిలుస్తోందని వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనలో సైన్యం చురుగ్గా పనిచేస్తోందని గుర్తుచేశారు. నేడు ప్రపంచమంతటా శాంతికి, ఘర్షణకు మధ్య విభజన రేఖ చెదిరిపోతోందని పేర్కొన్నారు. అందుకే సైనిక దళాలపై బాధ్యత మరింత పెరుగుతోందని వెల్లడించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’లక్ష్య సాధనకు తోడ్పాటు అందించాలని సైన్యానికి రాష్ట్రపతి పిలుపునిచ్చారు. -
డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్
-
ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం బిగ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ ఈగల్ టీమ్ దేశ రాజధానిలో గురువారం భారీ ఆపరేషన్ చేపట్టి సూపర్ సక్సెస్ అయ్యింది. ఏకకాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహించి.. 50 మందిని అదుపులోకి తీసుకుంది. వీళ్లంతా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న నైజీరియన్లని తేలింది. ఢిల్లీ పోలీసుల(సీసీఎస్) సహకారంతో తెలంగాణ ఈగల్ టీం ఈ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. వంద మంది స్థానిక పోలీసులు, 124 మంది ఈగల్ టీం సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. సుమారు 20 ప్రాంత్లాలో సోదాలు జరిపింది. తనిఖీల్లో డ్రగ్ కింగ్‌పిన్, డ్రగ్ సేల్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్లు పట్టుబడ్డారు. వీళ్ల నుంచి భారీగా మత్తు పదార్థాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఈగల్ టీం వరుసగా మెరుపు దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు లింకుల నేపథ్యంలోనే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పాటు గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖలోనూ స్థానిక పోలీసుల సహకారంతో అంతరాష్ట్ర ఆపరేషన్స్ చేపట్టినట్లు సమాచారం. -
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు
సాక్షి, ఢిల్లీ: ప్రైవేట్ మెడికల్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. గురువారం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు ధృవీకరించారు. సీబీఐ కేసు ఆధారంగానే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఎన్ఎంసీ ప్రమాణాలు పాటించకుండానే అప్రూవల్స్ నేపథ్యంతో ఈ రైడ్స్ జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం మెడికల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మెడికల్ కళాశాలల ప్రతినిధులను సీబీఐ ప్రశ్నించింది కూడా. ఈ క్రమంలో ఇవాళ ఇటు ఈడీ ప్రత్యక్ష దాడులకు దిగడం గమనార్హం.తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డాకుమెంట్లను పరిశీలిస్తున్న అధికారులు.. మెడికల్ సీట్ల కేటాయింపులు సహా పలు అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ : ఎంతవరకు సేఫ్, ఎలా బుక్ చేసుకోవాలి?
Delhi’s First Hot-Air Balloon Ride న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో మొట్ట మొదటి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లు ప్రారంభం కానున్నాయి. దీనికి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA ) మంగళవారం బాన్సేరాలో ట్రయల్ రన్‌ను కూడా ప్రారంభించింది. ఢిల్లీలో వినోద, సాహస కార్యక్రమాలను విస్తరించే చర్యల్లో భాగంగా వీటిని అసిత రివర్ ఫ్రంట్, యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ,కామన్వెల్త్ గేమ్స్ (CWG) విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో అదనపు లాంచ్ సైట్లను ప్లాన్ చేశారు. విజయవంతమైన ట్రయల్ రన్ల తర్వాత నవంబర్ 29 నుండి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లను ఢిల్లీ వాసులు ఎంజాయ్ చేయవచ్చు.యమునా నది ఒడ్డున ఆహ్లాదంగా యమునా నది ఒడ్డున ఉన్న ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) బాన్సేరా పార్క్‌లో సర్టిఫైడ్ నిపుణుల పర్యవేక్షణ, కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌లతో శనివారం నుండి ఈ రైడ్స అందుబాటులోకి రానున్నాయి. మెరుగైన ఎంటర్టైన్మెంట్,ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తొట్టతొలిగా వీటిని ప్రారంభింస్తున్నామని, ఢిల్లీని మరింత శక్తివంతమైన నగరంగా మార్చే దిశగా ఇదొక అడుగు అధికారులు చెబుతున్నారు. ఈ బెలూన్ రైడ్లతో, ఢిల్లీ పర్యాటక రంగం మరింత ఆకర్షణీయంగా మారుతుందని అంచనా. ఈ నేపథ్యంలో అసలు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఏంటి? ఎలా ఉంటాయి? ఎంతవరకు సురక్షితం లాంటి విషయాలను చూద్దాం.అసలేంటీ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ నిర్వహణను చాలా సురక్షితంగా, పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. వేడి గాలిని బెలూన్ రైడ్‌లో ఉపయోగిస్తారు. హాట్ ఎయిర్ బెలూన్లలో 3 కీలక భాగాలు, ఒక బెలూన్ (ఎన్వలప్), ఒక బుట్ట , బర్నర్లతో కూడిన సాధారణ వాహనాలు. ఇవన్నీ చాలా బలమైన మెటల్ కేబుల్స్ ద్వారా కలుపుతారు. తద్వారా ఎక్కడా లూజ్‌గా లేకుండా దృఢంగా ఉండేలా చేసుకుంటారు.ఎలా ఎగురుతుంది?బెలూన్ కింద ఇంధనాన్ని మండించి, వేడి గాలితో నింపడం ద్వారా ఇవి పనిచేస్తాయి. ఆ వేడి గాలి లిఫ్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది.వేడి గాలి ద్వారా లిఫ్ట్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా హాట్ ఎయిర్ బెలూన్లు ఎగురుతాయి. వీటికి వాడే ప్రాథమిక ఇంధనం ప్రొపేన్. ఇది ఒక రకమైన ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG). ప్రెషరైజ్డ్ ట్యాంకులలో నిల్వ చేసి దీన్ని మండిస్తారు. అలా లోపల గాలి బయటి గాలి కంటే వేడిగా, తక్కువసాంద్రతతో ఉన్నప్పుడు, బెలూన్ పైకి లేచి పైకి లేస్తుంది. ఎత్తును నిర్వహించడానికి, పైలట్ క్రమానుగతంగా బర్నర్‌ను మండిస్తాడు.Happy to share that the trials for Delhi’s first ever Hot Air Balloon rides, today at DDA’s Baansera Park on the Yamuna were successful. To be run by a qualified & professional operator, the balloon rides meet the highest standards of safety parameters. This new… pic.twitter.com/IQn1hd0s1L— LG Delhi (@LtGovDelhi) November 25, 2025 క్యూబిక్ అడుగుకు దాదాపు 7 గ్రాముల లిఫ్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. తగినంత సూపర్ హీట్ గాలితో, సాధారణంగా 77,000 నుండి 600,000 క్యూబిక్ అడుగుల వరకు, బెలూన్ టేకాఫ్ తీసుకోవచ్చు. బెలూన్లను వేర్వేరు ఎత్తులలో కనిపించే వివిధ వాయు ప్రవాహాలపై ఆధార పడి పైలట్లు నావిగేట్ చేస్తారు.పైలట్ బెలూన్‌లో నిరంతరం మారుతున్న ఉష్ణోగ్రతను ఉపయోగించి ఎత్తునుసర్దుబాటుచేసుకుంటూ దానిని నియంత్రిస్తారు. అలాగే "ఎన్వలప్ ఆఫ్ సేఫ్టీ" మార్గదర్శకాల ప్రకారం, పైలట్లను మాదకద్రవ్యాలు, మద్యం సేవించారా అనేది కచ్చితంగా చెక్ చేస్తారు.ప్రొఫెషనల్ ఆపరేటర్లు, అత్యున్నత భద్రతా ప్రమాణాలు బెలూనింగ్ ,విమానయాన-సంబంధిత వినోద సేవలలో ముందస్తు అనుభవం ఉన్న సర్టిఫైడ్ ఆపరేటర్‌ను DDA నియమించింది. ఈ బృందం అనేక టెస్టింగ్ కార్యక్రామలను కూడా నిర్వహించింది. ప్రతీ రైడ్‌కు ముందు భద్రతా తనిఖీలుంటాయి. హాట్ ఎయిర్ బెలూన్లు టెథర్ చేస్తారు. అంటే అవి ఎక్కేటప్పుడు నేలకు లంగరు వేయడం తోపాటు, చుట్టు పక్కల అందమైన నగర దృశ్యాలు అన్నివైపుల నుంచి కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి అన్ని నియమాలు, కార్యాచరణ అంతా భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉంటుందని అధికారులు తెలిపారు.ఎంత ఛార్జ్ చేస్తారుప్రతి బెలూన్ రైడ్ ధర 15-20 నిమిషాల వ్యవధిలో ఒక్కొక్కరికి రూ. 3,000 (పన్నులు మినహాయించి). వాతావరణ పరిస్థితులను బట్టి ఆపరేటర్ ప్రతిరోజూ రెండు స్లాట్లను నడుపుతారు,ఉదయం ఒకటి ,సాయంత్రం ఒకటి. ప్రతి ట్రిప్‌కు సామర్థ్యం బాస్కెట్‌కు దాదాపు నలుగురు వ్యక్తులకు పరిమితం.ఎలా బుక్ చేసుకోవాలి:ఢిల్లీలోని హాట్-ఎయిర్ బెలూన్ రైడ్ల కోసం బుకింగ్‌లను ప్రతి సైట్లో DDA నియమించిన ప్రైవేట్ ఆపరేటర్ నిర్వహిస్తారు. బాన్సేరా పార్క్‌లో పనివేళలలో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. థ్రిల్లోఫిలియా వంటి సైట్ల ద్వారా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.ప్రమాదాల మాట ఏంటి? హాట్ ఎయిర్బెలూన్లో కూర్చొని మేఘాల్లో, ఆకాశ తీరంలో విహరిస్తూ.. సుందర దృశ్యాలను వీక్షించడం అద్భుతమైన జీవితకాల అనుభూతి. అయితే కొండకచో కొన్ని ప్రమాదాలు సంభవించిన దాఖలాలు కూడా లేకపోలేదు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అందించిన 2022 డేటా ప్రకారం, 1964లో అమెరికాలో మొత్తం 775 హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదాలు నమోదయ్యాయి. వాటిలో 70 మాత్రమే మరణాలు సంభవించాయి. 2000-2011 మధ్య కొన్ని ప్రమాదాలుచోటు చేసుకున్నాయి. కమర్షియల్ హాట్ ఎయిర్ బెలూన్ ఎగరడం చుట్టూ ఉన్న నిబంధనలు సడలించిన మూలంగానే ఇవి జరిగినట్టు 2013 అధ్యయనంలో తేలింది. 2016లో టెక్సాస్‌లోని లాక్హార్ట్లో జరిగిన ప్రమాదంలో వేడి గాలి బెలూన్ విద్యుత్ లైన్లను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుని 16 మంది మరణించారు. ఈ సంఘటన తరువాత "ఎన్వలప్ ఆఫ్ సేఫ్టీ" లాంటి కొన్ని సేఫ్టీ నిబంధనలను మరింత కఠినతరం చేశారు.2025లో ప్రమాదాలుజూన్లో బ్రెజిల్‌లోని ప్రియా గ్రాండేలో ఒక హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకుని కూలిపోయింది.ఎనిమిది మంది మరణించారు, మరో 13 మంది గాయపడ్డారు.ఇహ్లారా లోయ సమీపంలోని మధ్య టర్కీలో రెండు హాట్ ఎయిర్ బెలూన్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా, 31 మంది పర్యాటకులు గాయపడ్డారు. గాలిలో అకస్మాత్తుగా మార్పు ప్రమాదానికి కారణమని అంచనా.మెక్సికోలోని జకాటెకాస్లో జరిగిన ఒక ఉత్సవంలో నేలపై ఉండగానే హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకుంది. ఒక వ్యక్తి చనిపోయాడు. మంటల్లో చిక్కుకున్న ఇద్దర్ని రక్షించి, తీవ్రమైన గాయలతో అతను చనిపోయాడు. మేఘాల మధ్య విహరించడం అనే ఆనందం అనుభవించిన వాళ్లకి మాత్రమే అర్థమయ్యే థ్రిల్. ఇటీవలి సంవత్సరాలలో హాట్ ఎయిర్ బెలూన్ విహారయాత్రలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇలాంటి సాహసాలు కొంత రిస్క్‌తో కూడుకున్నవే. అయినా హాట్ ఎయిర్ బెలూన్ అనుభవాన్ని ప్లాన్ చేసేటప్పుడు రైడర్లు కూడా సేఫ్టీ మెజర్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చిన్న పిల్లలను లేదా గర్భిణీ స్త్రీలను ఇలాంటి ప్రయాణాలకు దూరంగా ఉంచటం ఉత్తమం. భయాలు, బెంగలు లేకుండా హాట్ఎయిర్ బెలూన్ రైడ్‌ను ఆస్వాదించడమే. హ్యాడీ రైడ్ అండ్ థ్రిల్. -
బిజినెస్ టైకూన్ కోడలి అనుమానాస్పద మరణం
ఢిల్లీ: Pan Masala Baron Daughter In Law Dies ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కమల పాసంద్ పాన్ మసాలా బ్రాండ్‌తో పాపులర్ అయిన కమల్ కోడలు దీప్తి చౌరాసియా (Deepti Chaurasia) (40) దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని వసంత విహార్‌లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారని తెలుస్తోంది.Delhi | Kamla Pasand company owner Kamal Kishore's daughter-in-law, Deepti Chaurasia (40), died allegedly by suicide last evening. Her body was found hanging. Police have recovered a diary in which she mentions a dispute with her husband, Harpreet Chaurasia. Deepti married…— ANI (@ANI) November 26, 2025 దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో దీప్తి చనిపోయి కనిపించారు. చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆమె గదిలో సూసైడ్ నోట్ లభించింది. తన మరణానికి ఎవరికీ సంబంధం లేదంటూనే, రిలేషన్లో ప్రేమ, నమ్మకం లేకపోతే, ఇక జీవితానికి అర్థం ఏముంది? అని తన నోట్లో పేర్కొనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు భర్త హర్‌ప్రీత్ చౌరాసియాతో విభేదాలున్నట్టు పేర్కొన్నా డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై పోలీసులు ఇంకా బహిరంగ ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: H-1B వీసా స్కాం సంచలనం : ఏకంగా 220000 వీసాలా?కాగా దీప్తి, కమల్ కిషోర్ కుమారుడు హర్‌ప్రీత్ చౌరాసియాను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కమల్ కిషోర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, కమల్ కిషోర్ చౌరాసియా. ఇది కమలా పసంద్, రాజ్శ్రీ బ్రాండ్ పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తుల రంగంలో పనిచేస్తుంది. ఫ్యామిలీ స్పందనకమలా పసంద్ కుటుంబ న్యాయవాది రాజేందర్ సింగ్ దీనిపై వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమననారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. ఆమెకు పూర్తి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు కుటుంబాలు ఈరోజు కలిసి దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది రెండు కుటుంబాలకు తీరని లోటు. సూసైడ్ నోట్లో ఎటువంటి ఆరోపణ లేదు. దీనికి బాధ్యులుగా ఆమె ఎవరినీ ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆత్మహత్యకు కారణమేమిటో మాకు తెలియదు. పోలీసులకు సహకరిస్తున్నామని రాజేందర్ తెలిపారు. -
కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం.. రంగంలోకి రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత ఐదురోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ పట్టువీడకపోవడంతో వ్యవహారం మరింత జఠిలంగా మారుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్నంతా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక రాజకీయంపైనే వరుస భేటీలు నిర్వహించిందని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. అందునా.. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలతో రాహుల్ స్వయంగా చర్చలు జరిపినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయన నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు ఢిల్లీకి చేరుకున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. కర్ణాటక కాంగ్రెస్‌లోని ఇరు వర్గాల వాదనలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను రాహుల్‌కు వివరించారు. దీంతో.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ పంచాయితీకి తెర పడే అవకాశం కనిపిస్తోంది. -
సిద్ధరామయ్యను తప్పించాల్సి వస్తే..
పవర్ షేరింగ్ ఫార్ములాపై రకరకాల ఊహాగానాలు.. రోజుకో కొత్త ప్రచారం నడుమ కర్ణాటక రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. గ్రూప్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకుంటున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. నాయకత్వ మార్పు జరిగితే పార్టీకి నష్టమా? లాభమా? అని తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ క్రమంలో మూడో అభ్యర్థి అంశంపైనా ఓ స్పష్టత వచ్చింది.కర్ణాటక సీఎంను ఎట్టి పరిస్థితుల్లో మార్చే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం లేదు. అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు లాభనష్టాలను బేరీజు వేసుకుంటోంది. అంతిమ నిర్ణయం అగ్రనేతల చేతుల్లోనే ఉండడంతో అది అంత ఈజీ కాదని ఇప్పటికే ఏఐసీసీ వర్గాలు ఓ స్పష్టత వచ్చేశాయి. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనుక తప్పిస్తే ఆ అవకాశం డీకే శివకుమార్‌నే వరించనుందట!. ఈ పంచాయితీలోకి మరో సామాజిక వర్గం, మూడో అభ్యర్థికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని పార్టీ వర్గాల లీకులతో ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.మూడో అభ్యర్థి అవకాశాలు ఇప్పటికిప్పుడు అస్సలు కనిపించడం లేదని.. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు నేతల మధ్యే పోటీ నెలకొందని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్యకు మాస్ లీడర్‌గా అన్ని వర్గాల నుంచి ఆదరణ ఉందని ఆయన వర్గీయులు వాదిస్తున్నాయి. అదే సమయంలో.. డీకే శివకుమార్ బలాలను కూడా ఆయన మద్ధతుదారులు ఢిల్లీ పెద్దలకు నివేదించారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న డీకేశి నేతృత్వంలో వచ్చే ఎన్నికలకు వెళ్లడం పార్టీకి కలిసొస్తుందని వాళ్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి సామర్థ్యాలను అధిష్టానం సీరియస్‌గానే పరిశీలించాలనే భావిస్తోంది. తాజాగా శివకుమార్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య కాస్త పెరిగింది. వాళ్లలో కొందరు ఇవాళ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి తమ డిమాండ్ వినిపించారు. ఈ పరిణామంతో సిద్ధూ వర్గం అప్రమత్తమైంది. అయితే.. ఇది ఇక్కడ(కర్ణాటక) చర్చించే విషయం కాదని.. దానికంటూ ఓ సమయం, సందర్భం ఉంటుందని.. పబ్లిక్‌గా ఈ అంశం గురించి మాట్లాడొద్దని ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేడర్‌కు స్పష్టం చేశారు. అయినా కూడా పలువురు నేతలు మైక్ ముందుకు వచ్చి నాయకత్వ మార్పుపై తమ అభిప్రాయాలు చెబుతున్నారు. దీంతో సీఎం చైర్ హైడ్రామా ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది. -
ఢిల్లీలో వాయు కాలుష్యంపై నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రమాదస్థాయిలను మించిన వాయు కాలుష్యంపై చేపట్టిన ఆందోళన తీవ్ర గందరగోళానికి, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇండియా గేట్ వద్ద సోమవారం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఆందోళకారులు అడ్డుకోబోయిన పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ఘటనలపై పోలీసులు 22 మంది అరెస్ట్ చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా అక్కడా పోలీసు అధికారులపై దాడికి దిగారు. దీంతో, విధులకు ఆటంకం కలిగించడంతోపాటు మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారంటూ వీరిపై సన్సద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌తోపాటు, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిరసనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడికి దిగడం తామెన్నడూ చూడలేదని ఓ అధికారి తెలిపారు. ‘ఇండియా గేట్ వద్ద నిరసనలకు అనుమతి లేదు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాము. జంతర్‌మంతర్ వద్ద ముందుగా అనుమతి తీసుకుని ఎవరైనా ఆందోళనకు దిగొచ్చని చెప్పాం. వినకుండా, బారికేడ్లపై నుంచి దూకి వెళ్లి రోడ్డుపై బైటాయించి, ట్రాఫిక్‌కు అవరోధం కలిగించారు. వాహనదారులు కోరినా అక్కడి నుంచి వారు కదల్లేదు’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘పైపెచ్చు, దురుసుగా ప్రవర్తించారు. మాపై దాడికి దిగారు. పెప్పర్ స్ప్రేను వాడారు. నిరసనకారుల దాడిలో గాయపడిన పోలీసులకు చికిత్స చేయించాం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, చర్యలు తీసుకుంటాం’అని ఆయన వివరించారు. ఇటీవల ఏపీలో ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు నేత హిడ్మాను, అమర్ రహే హిడ్డా, లాంగ్ లివ్ హిడ్మా అంటూ పోస్టర్లతో కొందరు నినాదాలు చేయడం పైనా దృష్టి సారించామన్నారు. కాగా, ఇండియా గేట్ వద్ద పోలీసులపై దాడికి దిగిన 22 మందికి సోమవారం ఢిల్లీ కోర్టు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరో వ్యక్తిని, అతడి వయస్సు నిర్ధారణ అయ్యేంత వరకు అబ్జర్వేషన్ హోంకు తరలించాలని ఆదేశించింది. కాగా, గాలి కాలుష్యంపై నిరసన చేపట్టిన ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్ అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యానికి కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా మారిందని, ప్రభుత్వం మాత్రం నీళ్లు చల్లడం, క్లౌడ్ సీడింగ్ అంటూ కంటితుడుపు చర్యలు చేపడుతోందని ఆరోపించింది. -
సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధం?!
నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. కర్ణాటక రాజకీయంలో బడా ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదేపదే చెబుతూ వచ్చిన ఆయన.. ఇవాళ సరికొత్తగా మాట్లాడడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను. ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. నేను మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని అన్నారాయన. నవంబర్ 20వ తేదీన నుంచి కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పవర్ షేరింగ్ ఫార్ములా ద్వారా సీఎం రేసులో ఉన్న సిద్దూ, డీకేశిలను చల్లార్చిందనే ప్రచారం ఒకటి ఉంది. రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే మద్దతుదారులు ఆయనకు సీఎంపగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా.. అనుభవాన్ని,సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. డీకే శివకుమార్‌కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్లంతా మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతా వాళ్ల చేతుల్లోనే..కర్ణాటకలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ(పీసీసీ చీఫ్ మార్పు సహా) చేపట్టాలని సిద్ధరామయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం సీటు పంచాయితీ తేల్చిన తర్వాతే ఆ పని చేయాలంటూ డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. ‘‘నాలుగైదు నెలల కిందటే హైకమాండ్ నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తనకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని.. అయితే రెండున్నరేళ్ల పాలన పూర్తి అయ్యేదాకా ఆగాలని భావించానని’’ సిద్ధరామయ్య ఇవాళ మీడియాకు తెలిపారు. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా(రెండున్నరేళ్ల తర్వాత సీఎం సీటు వదులకునేందుకు సిద్ధపడ్డారా?) అనేది ఒకటి ఉందా?.. అందుకు మీరు అంగీకరించారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. ఆయన వస్తేనే..కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్‌తో రీప్లేస్ చేయాలంటూ కొంత కాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. శనివారం సిద్ధూ వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే.. అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఖర్గే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
దడ పుట్టించిన కాబూల్ విమానం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో ప్రధాన భద్రతా లోపం కారణంగా కాసేపు అలజడి చెలరేగింది. కాబూల్ నుండి వచ్చిన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎఫ్జీ 311 ల్యాండింగ్ కోసం కేటాయించిన రన్‌వేను కాకుండా, టేకాఫ్‌ల కోసం (బయలుదేరే విమానాల కోసం) ఉద్దేశించిన రన్‌వేపై పొరపాటున ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 12.06 గంటలకు జరిగిన ఈ సంఘటనలో, ఎయిర్‌బస్ ఏ310 విమానానికి రన్‌వే 29ఎల్లో ల్యాండింగ్‌కు అనుమతి లభించింది.కాబూల్ విమానం అనుమతికి విరుద్ధంగా రన్‌వే 29ఆర్‌పై ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. రన్‌వే 29ఆర్ అనేది విమానాలు టేకాఫ్ కావడానికి మాత్రమే ఉపయోగించే రన్‌వే. ‘29ఆర్ నుండి విమానం టేకాఫ్ కావాల్సి ఉన్నందున ప్రమాదం చోటుచేసుకోలేదు. అదృష్టవశాత్తూ ఎఫ్జీ311 దానిపై ల్యాండ్ అయినప్పుడు బయలుదేరబోయే ఏ జెట్ కూడా రన్‌వేపై లేదు’ అని అధికారులు వెల్లడించారు.ఆ సమయంలో 29ఆర్ నుండి ఏ విమానాలు టేకాఫ్ కాకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాగా ఈ ఘటనపై విమానయాన అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనను తీవ్రమైన కార్యాచరణ ఉల్లంఘనగా పేర్కొంటూ, భారత అధికారులు అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్‌కు లేఖ రాయనున్నారు. ఢిల్లీ విమానాశ్రయ భద్రతా ప్రమాణాలను, అంతర్జాతీయ విమానయాన నియమాలను ఉల్లంఘించిన ఈ ఘటనపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇది కూడా చదవండి: రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై పాక్ ఉలికిపాటు -
ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మా అనుకూల నినాదాలు, పోస్టర్లు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేటు వద్ద పలువురు నిరసనలు దిగారు. ఈ నిరసనల్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మా ఫొటోలు, ఆయన అనుకూల నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణంగా పలువురిపై ఢిల్లీలో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదివారం పలువురు.. ఇండియా గేటు వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుకూల వ్యాఖ్యలతో ప్లకార్డులు, ఫొటోలు దర్శనమిచ్చాయి. నిరసనకారులు.. బిర్సా ముండా నుండి మాద్వి హిద్మా వరకు మన అడవులు, పర్యావరణపై పోరాటం కొనసాగింది. మన బిడ్డలను మనమే చంపుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాటం కొనసాగుతుంది. రెడ్ సెల్యూట్ టూ హిడ్మా.. అమర్ రహే అంటూ పోస్టర్‌ను ప్రదర్శించి నినాదాలు చేశారు.Protesters against Air Pollution in Delhi suddenly started raising slogans in support of Indian Naxalite Hidma; says "Long live Comrade Hidma"Delhi's air quality hit severe levels Sunday, with AQI around 400, prompting hybrid school classes and health alerts for vulnerable… pic.twitter.com/7cg6aeTRc1— Sujal Singh (@sujalsingh_x) November 23, 2025ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు చేరుకోగా నిరసనకారులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులపై నిరసనకారులు పెప్పర్‌స్ప్రే ప్రయోగించారు. దీంతో పోలీసులు.. వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. #WATCH | Delhi: A group of protesters holds a protest at India Gate over air pollution in Delhi-NCR. They were later removed from the spot by police personnel pic.twitter.com/DBEZTeET0U— ANI (@ANI) November 23, 2025 -
Delhi: మోగిన ప్రమాద ఘంటికలు..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈరోజు (సోమవారం) ఉదయం గాలి నాణ్యత (ఏక్యూఐ)కనిష్ట స్థాయికి క్షీణించింది. రాజధాని నగరమే కాకుండా దాని పొరుగు ప్రాంతాలు కూడా తీవ్రమైన కాలుష్య వర్గం అంచునకు చేరాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీలో సగటు ఏక్యూఐ 397 వద్ద ఉంది. ఇది తీవ్ర వర్గానికి చేరుకునేందుకు కొద్ది దూరంలోనే ఉంది. ఢిల్లీ మహానగరంలోని 39 పర్యవేక్షణ కేంద్రాలలో 20 కేంద్రాలు ఇప్పటికే తీవ్రమైన కాలుష్యాన్ని నమోదు చేశాయి. రోహిణి (458), జహంగీర్‌పురి (455), ఆనంద్ విహార్ (442) తదితర ప్రాంతాలు వాయు కాలుష్యానికి హాట్స్పాట్లుగా నిలిచాయి.ఢిల్లీలోని అత్యధిక ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న దృష్ట్యా.. ప్రజారోగ్యం ప్రమాదంలో పడినట్లు స్పష్టంగా వెల్లడవుతోంది.ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నోయిడా ఏక్యూఐ 413కు చేరి, తీవ్రమైన (Severe) వర్గంలోకి చేరింది. ఘజియాబాద్‌లో 432 ఏక్యూఐ నమోదై అత్యంత విషపూరితమైన గాలి తాండవిస్తోంది. ఈ ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలు ఆదివారం నాటి నివేదికలతో పోలిస్తే మరింత క్షీణించించాయనే విషయం స్పష్టమవుతోంది. గ్రేటర్ నోయిదాలో 399 ఏక్యూఐ నమోదయ్యింది. ఇది తీవ్ర కాలుష్య స్థాయిని సూచిస్తోంది.కాగా గురుగ్రామ్ (291), ఫరీదాబాద్ (239)లలో కాలి నాణ్యత పేలవమైన (Poor) కేటగిరీలో ఉంటూ, తమ పొరుగున ఉన్న ప్రాంతాల కంటే కొంత మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య పలువురు నిరసనకారులు ఇండియా గేట్ వద్ద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే వారిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు పోలీసులు వారిపై చిల్లీ స్ప్రేను ఉపయోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిరసనను నిర్వహించిన ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్.. ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర విమర్శలు గుప్పించింది.గాలి నాణ్యత స్థిరంగా తీవ్రమైన వర్గంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం కాలుష్యానికి కారణాలను పరిష్కరించడంలో విఫలమైందని వారు ఆరోపించారు. నీటి స్ప్రింక్లర్లు, క్లౌడ్ సీడింగ్ లాంటి దీర్ఘకాలిక, పరిష్కారం లేని విధానాలను అమలు చేస్తోందని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు.ఇది కూడా చదవండి: చలి చంపేస్తోంది.. అక్కడ ‘0’ డిగ్రీలు -
నేడు ఢిల్లీకి సీఎం
సాక్షి, హైదరాబాద్/వికారాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే ఆయన హైదరాబాద్‌కు వస్తారని, అక్కడి నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటకు వెళ్లి సైనిక్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని ఎన్కేపల్లి గేటు సమీపంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్‌షెడ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడంతోపాటు అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్‌జైన్, సిక్తా పటా్నయక్, వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా, సీఎంఈఓ అధికారి వాసుదేవరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. -
వివాహాల్లో సరికొత్త లగ్జరీ ట్రెండ్..! హ్యాంగోవర్ రాకుండా..
పెళ్లిళ్లలో అతిథులను కట్టిపడేసేలా ఆతిథ్యం ఇవ్వడం గురించి విని ఉంటారు గానీ ఇలాంటిది విని ఉండరు. ఏకంగా పెళ్లికి వెళ్లగానే అక్కడ కాస్త ఎక్కువ తిని, తాగి అలసిపోతాం కామన్. అలా అలసిపోయి హ్యాంగోవర్‌కి గురికాకుండా ఉండేలా అక్కడే ట్రీట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లగ్జరీ ట్రెండ్ హవా వివాహాల్లో హైలెట్‌గా నిలవనుంది. వామ్మో ఇదేంటి ఆఖరికి వచ్చిన అతిథుల ఆరోగ్యం బాగోగుల కూడా అంటే తడిసిమోపుడవుతుందా కదా అంటారా..! అయినా సరే డోంట్ కేర్ అంటూ ..ఈ ట్రెండ్‌కే సై అంటోంది యువత.అలాంటి ట్రెండ్ న్యూడిల్లీలోని రాజౌరి గార్డెన్లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన హెయిర్ క్లినిక్ కయాన్ ఆ పెళ్లికి వచ్చేసిన అతిధులకు ఐవీ బార్(క్లినిక్ మాదిరి సౌకర్యం) ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan) IV బార్ అంటే..విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ వంటి వాటిని నేరుగా సిరల్లోకి ఎక్కించేందుకు (IV ఇన్ఫ్యూషన్) వీలు కల్పించే ఒక క్లినిక్ లేదా సౌకర్యం. ఇది ఎందుకంటే పెళ్లికి విచ్చేసిన అతిధులు అక్కడ వడ్డించే భోజనం, ఆల్కహాల్ ఎక్కువగా లాగించేసి ఉత్సాహంతో ఆడిపాడి సందడి చేస్తారు. దాంతో కాసేపటికే అలిసిపోయి హ్యాంగోవర్ లేదా తలనొప్పితో బాధపడుతుంటారు. అలా ఇబ్బంది పడకూడదని ఈ ఐవీ బార్లు ఏర్పాటు చేస్తున్నారట. వీటి సాయంతో తలనొప్పి లేదా హ్యాంగోవర్‌తో ఇబ్బందిపడే వాళ్లకు ఈ గ్లూటాతియోన్ షాట్లను అందిస్తారు. దీని వల్ల రీహ్రైడ్రైట్ అయ్యి..యాక్టివ్‌గా మారతారట. అలాగే పెళ్లిళ్లలో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారని ప్రస్తుతం ఈ ట్రెండ్‌ని ఎక్కువగా ఫాలోఅవుతున్నారట. సదరు కయాన్ బృందానికి హ్యాంగోవర్ రాకుండా ఉండేలా చేయలేమని, కేవలం నిర్వహిస్తామని క్లియర్‌గా స్పష్టం చేసింది. పాపం ఆ పెళ్లిలో సర్వీస్ అందిస్తున్న ఐవీబార్ కయాన్ బృందానికి ఇప్పటికీ వందలకొద్ది ప్రశ్నలు వచ్చాయట ఆ హ్యంగోవర్ సమస్యపై. తాము ఆల్కహాల్ తాగొద్దు అని సలహ ఇవ్వలేం గానీ దానివల్ల వచ్చే హ్యాంగోవర్‌ని తగ్గించే ప్రయత్నం చేయగలమని సమాధానం చెప్పడం విశేషం. అంతేకాదండోయ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లుబాటు అయ్యే హెల్త్ ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఐవీ బార్ బృందాన్నే ఏర్పాటు చేస్తున్నారట. అంటే డీ హైడ్రేషన్ బారిన పడకుండా పెళ్లిళ్లల్లో సేవలు కూడా అందించేస్తున్నారన్నమాట. ఆఖరికి హైడ్రేషన్ సేవ కూడా వచ్చేస్తోందన్నమాట. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడమా? లేక అతిథుల పట్ల కేరింగ్నా తెలియని కన్ఫ్యూజన్ అంటూ కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan)(చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!) -
కేసుల కొండ కరిగిస్తా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల నెత్తిన గుదిబండగా తయారైన కేసుల సత్వర పరిష్కారంపై దృష్టిసారిస్తానని కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టికరించారు. నవంబర్ 24వ తేదీన సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సూర్యకాంత్ శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు పిచ్చాపాటీ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రాధాన్యాలకు సంబంధించిన ఆయన తన మనసులోని మాటలను బయటపెట్టారు. ‘‘నా ముందున్న తొలి, అత్యంత ముఖ్యమైన సవాల్ ఏదైనా ఉందంటే అది పేరుకుపోయిన కేసుల కొండ. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కుప్పలుతెప్పలుగా పడి ఉన్న పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించడంపై దృష్టిసారిస్తా. ఒక్క సుప్రీంకోర్టులోనే ఏకంగా 90,000 కేసులు పరిష్కారం కోసం ఫైళ్లలో మూలుగుతున్నాయి. అసలు ఇన్ని కేసులు పెరిగేదాకా ఏం చేస్తున్నట్లు? అపరిష్కృతంగా పడి ఉండటానికి కారకులు ఎవరు? బాధ్యతారహితంగా వ్యవహరించింది ఎవరు? అనే అంశాల జోలికి వెళ్లదల్చుకోలేదు. కానీ వీటిని సత్వరం పరిష్కరించాల్సిందే. పేరుకుపోయిన పెండింగ్ కేసుల సంగతేంటి? అని హైకోర్టులు, ట్రయల్ కోర్టుల నుంచి నివేదికలు తెప్పిస్తా’’అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమం ‘‘కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ బాటలో పయనించడం చాలా మంచిది. వాస్తవానికి మధ్యవర్తి త్వం అనేది సమస్యలు, కేసులు పరిష్కృతం కావడా నికి అత్యంత చక్కటి మార్గం. కేసుల కొండ కరగాలంటే మధ్యవర్తిత్వ అస్త్రాన్ని ప్రయోగించక తప్ప దు. ఇది కేసుల పరిష్కార వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈమధ్యే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ సైతం మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ఇప్పు డు దేశం మొత్తం ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. భారత్‌లోని బహుళజాతి సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థలు సైతం ఇదే బాటలో పయనించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి’’అని అన్నారు. నా ఒక్క తీర్పుతో 1,200 కేసులు పరిష్కారం ‘‘ఢిల్లీలో భూ సమీకరణకు సంబంధించి ఒకే తరహా కేసులు చాలా ఉండిపోయాయి. నేనిచి్చన ఒక్క తీర్పుతో ఏకంగా 1,200 కేసులు ఒకేసారి పరిష్కారమయ్యాయి. కీలకమైన చట్టపర, రాజ్యాంగ అంశాలతో ముడిపడిన చాలా కేసులు హైకోర్టుల వద్ద పేరుకుపోయాయి. వీటికి నేను సుప్రీంకోర్టులో విస్తృతస్థాయిలో రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటుచేసి పరిష్కారం చూపుతా’’అని అన్నారు. ఈస్థాయికి వచ్చాక అవి ఏపాటి? తమకు వ్యతిరేకంగా వచి్చన తీర్పులపై రాజకీయనేతలు లేదా కొన్ని వర్గాల వాళ్లు చేసే విమర్శలపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ‘‘ఇటీవలికాలంలో న్యాయమూర్తులపైనా నిందలు వేస్తున్నారు. కోర్టుల తీర్పులను సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుబడుతున్నారు. జడ్జీలను ఎగతాళి చేస్తూ ట్రోలింగ్ పెరిగింది. అయినాసరే వృత్తి ధర్మం పాటిస్తూ న్యాయమూర్తులు ముందుకు సాగిపోతారు. సుప్రీంకోర్టు జడ్జి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన మేం ఇలాంటి చవకబారు అంశాలను అస్సలు పట్టించుకోము. నా దృష్టిలో సామాజికమాధ్యమం అనేది అసమాజ మా ధ్యమంగా తయారైంది. ఆన్లైన్ వేధింపులు, వ్యాఖ్యానాలను పట్టించుకోను. ఇవి నాపై ప్రభా వం చూపబోవు. వీటి వల్ల అస్సలు ఒత్తిడికి గురికాను. జడ్జీలు, తీర్పులపై సది్వమర్శను మాత్రమే నేను లెక్కలోకి తీసుకుంటా’’అని అన్నారు. కాలుష్యమున్నా కాలు బయటపెడతా ‘‘దేశరాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. పొగచూరినా సరే పాదం కదపాల్సిందే. వాతావరణం ఎలాగున్నా సరే రోజు ఉదయం మారి్నంగ్‌వాక్ చేస్తా. ఖచి్చతంగా దాదాపు గంటసేపు బయట నడుస్తా’’అని అన్నారు. -
ఇన్ఫ్రా, ఇంధన రంగ నిపుణులతో ఆర్థిక మంత్రి భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఢిల్లీలో మౌలిక రంగం, ఇంధన రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) బడ్జెట్‌పై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్కాన్స్ ఎండీ ఎస్.పరమశివన్, షాపూర్జీ పల్లోంజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ డైరెక్టర్ మనీష్ త్రిపాఠి, జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ ఎండీ కె.నారాయణరావు, జేఎం బక్సి గ్రూప్ డైరెక్టర్ సందీప్ వాద్వా, ఇన్ఫ్రా విజన్ ఫౌండేషన్ సీఈవో జగదన్‌షా తదితర కంపెనీల సారథులు ఇందులో పాల్గొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సీతారామన్ రానున్న 2026–27 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి 11వ ముందస్తు సమావేశాన్ని ఇన్ఫ్రా, ఇంధన రంగాల నిపుణులతో నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ, షిప్పింగ్ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డ్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు హాజరయ్యారు’’అని ఆర్థిక శాఖ తన పోస్ట్‌లో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ 2026–27 బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ప్రాధాన్యం నెలకొంది. డిమాండ్, ఉపాధి కల్పనను పెంచడం, దేశ జీడీపీని 8 శాతం వృద్ధి రేటుకు చేర్చడం వంటి ప్రధాన సవాళ్లు ఆర్థిక మంత్రి ముందున్నాయి. వ్యవసాయం, ఎంఎస్‌ంఎఈలు, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ మార్కెట్ రంగాల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇప్పటి వరకు బడ్జెట్ ముందస్తు సమావేశాలు నిర్వహించడం గమనార్హం. -
ఢిల్లీ బాంబుపేలుళ్లకు హమాస్‌తో లింకులు?
ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులో ఉగ్రవాదుల కుట్రకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోని లాకర్లను ఆయుధాలు, ఇతర మందుగుండు సామాగ్రిని భద్రపరిచేందుకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లుగా ఎన్ఐఏ విచారణలో తేలింది. సరిగ్గా గాజాలో హమాస్ ఈ విధంగానే జరిగిందని ఒక వేళ ఈ ఉగ్రవాదులకు హామాస్‌తో లింకులున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తుంది.ఆసుపత్రులంటే ఎంతో మందికి ప్రాణాలు పోసే దేవాలయాలు. అటువంటి వైద్యశాలలను ఉగ్రవాదులు సంఘ విద్రోహా చర్యలకు కేంద్రస్థానంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఎర్రకోట బాంబు దాడిలో అరెస్టైన మహమ్మద్ షకీల్ జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తారు. అతను అరెస్టైన అనంతరం షకీల్ విధులు నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఐఏ బలగాలు సోదాలు చేశాయి. ఆ ఆసుపత్రి లాకర్లో ఒక ఏకే-47 మిషన్ గన్‌తో పాటు మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి. ఈ విషయంపై మరింత లోతుగా ఎన్ఐఏ విచారణ చేపట్టింది.దీంతో అనంత్ నాగ్, బారముల్లా, బుడ్గాం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆయుధాలు నిల్వ చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఆసుపత్రులలో మారణాయుధాలు దాచిపెడతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ప్రణాళిక గాజాలో హామాస్ చేసిందని దానిని వీరు కాఫీకొట్టారా లేదా ఆ ఉగ్రవాద సంస్థతో ఇక్కడి ఉగ్రవాదులకు సంబంధాలున్నాయా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది గాజాలో హమాస్ ఆల్ షిపా అనే ఆసుపత్రి కింద తన స్థావరాన్ని నిర్మించింది. దీనిని ఇజ్రాయిల్ సైన్యాలు గుర్తించగా అందులో పెద్దఎత్తున ఆయుధాలు బయిటపడ్డాయి.ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లోనూ ఉగ్రవాదులు ఆసుపత్రులను ఆయుధాలు దాచడానికి వాడాలని ప్రయత్నించడంతో ఎన్ఐఏ వారి సంబంధాలపై అనుమానం వ్యక్తం చేస్తుంది. -
కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
ఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్కూల్స్‌లో స్పోర్ట్స్ యాక్టివిటీస్‌ను నిషేధిస్తూ నిర్ణయించింది. పెరిగిపోతున్న వాయుకాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం.. శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, వాయు కాలుష్యంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కారణంగా విద్యార్థులు, ప్రజలకు శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే. #BREAKINGSupreme Court flags “gas chamber” conditions for kids, orders ban on outdoor sports in schoolsSC directs CAQM to immediately stop outdoor sports in NCR schools due to hazardous air, calls November–December events unsafe for childrenBench to monitor Delhi air… pic.twitter.com/z8qcPvIeOd— Nabila Jamal (@nabilajamal_) November 19, 2025కాగా, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. ఈ నేపథ్యంలో.. పాఠశాలల స్పోర్ట్స్, అథ్లెటిక్స్ కార్యక్రమాలను వాయిదా వేసేలా ఆదేశించడాన్ని పరిశీలించాలని ‘వాయునాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM)’కు సుప్రీం కోర్టు సూచించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యంపై దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.నవంబరు, డిసెంబరు నెలల్లో అండర్-16, అండర్-14 విద్యార్థులకు ఇంటర్ జోనల్ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) దృష్టికి తీసుకెళ్లారు. కాలుష్యం గరిష్ఠ స్థాయిలో ఉండే ఈ నెలల్లో ఇటువంటి ఈవెంట్స్‌కు అనుమతించడం.. స్కూల్ పిల్లలను గ్యాస్ ఛాంబర్లో ఉంచడంతో సమానమేనని వాదించారు. ఈ సమయంలో బహిరంగ క్రీడా కార్యకలాపాలు నిర్వహించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. వాయు కాలుష్యం తక్కువగా ఉండే నెలల్లో క్రీడాపోటీలు నిర్వహించేలా స్కూళ్లను ఆదేశించాలని ‘సీఏక్యూఎం’కు సూచించింది. -
పవర్ పాలిటిక్స్ వేళ డీకే ఆసక్తికర ట్వీట్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కర్ణాటక సర్కార్ ఏర్పడి నిన్నటితో రెండున్నరేళ్లు పూర్తైంది. దీంతో పవర్‌షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్ధరామయ్యను గద్దె దించి.. తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా.. తన అనుచరులను అధిష్టానంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. డీకే శివకుమార్‌కు కర్ణాటక ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు మంత్రుల మద్దతు ఉంది. ఇందులో పది మంది తాజాగా ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వాన్ని మార్చాల్సిందేనని హైకమాండ్‌ను వాళ్ల కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అప్పాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. మరోవైపు.. సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకోవాలంటూ డీకే శివకుమార్ సోదరుడు, డీకే సురేష్ కోరుతున్నారు.నాయకత్వ మార్పు ప్రయత్నాల్లో వేగం పెంచిన డీకే.. ఈ ఉదయం ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘‘ఎక్కడ ప్రయత్నాలు ఉంటాయో.. అక్కడ ఫలితం ఉంటుంది ... ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు’’ అంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశారు. ಎಲ್ಲಿ ಶ್ರಮ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಫಲವಿದೆ, ಎಲ್ಲಿ ಭಕ್ತಿ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಭಗವಂತ ಇದ್ದಾನೆ.. pic.twitter.com/7HyiIPWk1y— DK Shivakumar (@DKShivakumar) November 21, 2025అయితే ఐదేళ్లు సీఎంగా తానే కొనసాగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణకు అనుమతి కోరిన ఆయన.. తన వర్గీయులను కూడా ఢిల్లీకి పంపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణతో అసమ్మతికి చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. పీసీసీ చీఫ్ పదవి నుంచి శివకుమార్‌ను తొలగించే ప్రయత్నాల్లో ఆయన సగం సక్సెస్ అయినట్లు సమాచారం. ఇక.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇప్పట్లో నాయకత్వ మార్పిడి లేదని సంకేతాలు ఇస్తోంది. ఎవరినీ ఢిల్లీకి రావొద్దని కోరింది. అయినప్పటికీ.. ఇరు వర్గాల ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే నాయకత్వం మార్పిడిపై తుది నిర్ణయం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీదేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందే తమకు శిరోధార్యమణి మరికొందరు ఎమ్మెల్యేలు చెబుతుండడం గమనార్హం. దీంతో.. సిద్ధూ, డీకే.. అధిష్టానం.. ఇలా మూడు వర్గాలుగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీలినట్లు స్పష్టమవుతోంది. -
ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య.. తండ్రి సంచలన ఆరోపణలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో టీచర్ల వేధింపులు భరించలేక విద్యార్థి శౌర్య పాటిల్ (16) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో విజ్ఞప్తి చేశాడు. దీంతో, హెడ్ మాస్టర్ సహా మరో నలుగురు సిబ్బందిని స్కూల్ యాజమాన్యం విధుల నుంచి తప్పించింది. అయితే, సస్పెన్షన్‌కు ముందు శౌర్య ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి పాఠశాలలో పరిస్థితులను అంచనా వేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ విద్యా శాఖ అధికారులు తెలిపారు.మరోవైపు.. శౌర్య పాటిల్ తండ్రి ప్రదీప్ పాటిల్ తాజాగా మాట్లాడుతూ..‘నా బిడ్డను టీచర్లే బలి తీసుకున్నారు. వారిని కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదు. సస్పెన్షన్ తాత్కాలికం మాత్రమే. ఎఫ్ఐఆర్లో వారి పేర్లను చేర్చి ఉపాధ్యాయులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నా. మరికొద్ది రోజుల్లోనే మా అబ్బాయిని వేరే పాఠశాలకు పంపించేందుకు సిద్ధమయ్యాం. ఈ విషయాన్ని శౌర్యకు కూడా చెప్పడంతో సరే అన్నాడు. కానీ, పాఠశాల నుంచి మేము వెళ్లిపోతున్నామనే కారణంతో టీచర్లు ఇలా వేధింపులకు గురి చేశారు. వారి వేధింపుల కారణంగా కలత చెంది ఇలా చనిపోయాడు. ఇకపై పిల్లలతో ఏ ఉపాధ్యాయుడు అలా ప్రవర్తించకూడదనే సందేశాన్ని మనం పంపాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని సెయింట్ కొలంబాస్ పాఠశాలలో టీచర్ల వేధింపులు భరించలేక మెట్రో స్టేషన్ నుంచి దూకి పదో తరగతి విద్యార్థి శౌర్య పాటిల్(16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా తన సూసైడ్ నోట్లో.. ‘అమ్మా నన్ను క్షమించు. స్కూల్ సిబ్బంది వేధింపులకే నేనీ పని చేస్తున్నా. మరణించాక నా అవయవాలు ఏమైనా పనికి వస్తే వాటిని అవసరమైన వారికి అమర్చండి. అమ్మా.. నీ హృదయాన్ని చాలాసార్లు బాధపెట్టా. ఇప్పుడు ఆఖరిసారిగా చేస్తున్నా’ అంటూ పేర్కొన్నాడు.ఇక, విద్యార్థి ఆత్మహత్యపై రాజేంద్ర నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సదరు విద్యార్థి స్నేహితులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకుల నుండి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. కాగా, విద్యార్థి ఆత్మహత్య ఘటన దేశ రాజధానిలో చర్చనీయాంశంగా మారింది. -
ఉగ్రవాదులుగా విద్యావంతులు, మేధావులు.. మరింత ప్రమాదకరం
ఢిల్లీ: 2020 దేశరాజధాని అల్లర్ల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. మేధావులు ఉగ్రవాదం వైపు అడుగులేస్తే.. వాళ్లు మరింత ప్రమాదకరంగా మారతారని కోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా నిందితులు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్‌ను తిరస్కరించాలని కోరారు.సుప్రీం కోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ‘‘వాళ్లు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ మధ్య కాలంలో డాక్టర్లు, ఇంజినీర్లు తమ వృత్తులు వదిలి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. మేధావులు ప్రభుత్వ సహాయంతో డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారు. తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటారు. అలాంటి వారు సాధారణ ఉగ్రవాదుల కంటే మరింత ప్రమాదకరులు’’ అని అన్నారాయన.ఈ సందర్భంగా నిందితుడు షర్జీల్ ఇమామ్ 2019–2020లో సీఏఏకు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రసంగాల వీడియోలు కోర్టులో ప్రదర్శించారు. ఈ అల్లర్లు సహజమైనవి కావని.. పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర అని వివరించారు. నిందితులు ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యారని.. బెయిల్ ఇవ్వడానికి కొత్త కారణాలు కనిపించడం లేవని పేర్కొన్నారు.అల్లర్ల నేపథ్యం..కేంద్ర ప్రభుత్వం 2019లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్(CAA)ను 2019లో ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాఫ్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన మౌజ్‌పూర్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘నిరసనకారుల్ని అణచివేయాలి. లేకుంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం’’ అని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తర ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి.2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మైనారిటీలే ఉన్నారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని.. రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు అయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.ఫేక్ ఎవిడెన్స్‌పై విమర్శలు..2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మొత్తం 695 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ కింది కోర్టుల్లో ఇవి విచారణ జరిగాయి. 116 కేసుల్లో ఇప్పటికే తీర్పులు వెలువడ్డాయి. 97 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ క్రమంలో.. పోలీసులు సమర్పించిన వాటిల్లో నకిలీ ఆధారాలు, కల్పిత సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టులు గుర్తించారు. ప్రత్యేకించి.. 17 కేసుల్లో ఫేక్ ఎవిడెన్స్‌ను కోర్టులు హైలైట్ చేశాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.తాజాగా ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలిన ఘటనలో 12 మంది మరణించారు. ఇది ఉగ్రదాడి అని, ఆత్మాహుతి దాడికి పాల్పడింది జమ్ముకశ్మీర్ పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ విచారణలో తేలింది. అంతేకాదు.. ఉమర్‌కు పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో సంబంధాలున్నట్లు తేలింది. అయితే ఈ పేలుళ్లకు కొన్నిగంటల ముందు భారీ ఉగ్రకుట్రను ఫరీదాబాద్+జమ్ము కశ్మీర్ పోలీసులు చేధించారు. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనూ పలువురు వైద్యులను అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులోనూ పలువురు వైద్యులు అరెస్ట్ అయ్యారు. దీంతో విద్యావంతులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వైట్‌కాలర్ టెర్రరిజంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
గ్రీన్ ఐడియా: పేదింటి తల్లలు కోసం..!
చిన్న వయసు నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు రాఘవ్ రాయ్. ‘మోర్ దెన్ ప్లే’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమం కోసం ఒకరోజు పేద పిల్లలకు ఫుట్‌బాల్ ఆట నేర్పించడానికి ఢిల్లీలోని నిజాముద్దీన్ బస్తీకి వెళ్లాడు. ప్రాక్టీస్ కోసం వచ్చిన పిల్లలు బలహీనంగా ఉన్నారు. బాగా అలిసిపోయినట్లు ఉన్నారు. వారు తినేది...చౌకైన జంక్‌ఫుడ్.పిల్లలతో మాట్లాడినప్పుడు రాయ్‌కు అర్థమైనది ఏమిటంటే, వారికి పోషకాహారం గురించి బొత్తిగా అవగాహన లేదు అని. తన అనుభవాన్ని స్వచ్ఛంద సంస్థ ‘మోర్ దేన్ ప్లే’ వ్యవస్థాపకుడు జైదీప్ భాటియాతో పంచుకున్నాడు. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని ఎన్నోసార్లు సమావేశం అయ్యారు. ‘ఏంచేస్తే బాగుంటుంది?’ అనే కోణంలో పరిశోధించారు.పోషకాహార లోపోనికి ఒక పరిష్కారంగా కిచెన్ గార్డెన్ ఐడియా వచ్చింది. ప్రతి బిడ్డకు పోషకాలతో కూడిన భోజనం ఉండేలా బస్తీలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేయడమే ఆ ఐడియా. ‘గార్డెన్స్ ఆఫ్ హోప్’ అలా ఆవిర్భవించింది. ‘ఇంటింటా కిచెన్ గార్డెన్’ లక్ష్యంతో పనిచేస్తోంది గార్డెన్స్ ఆఫ్ హోప్. ‘మీరు సొంతంగా కూరగాయలు పండించుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది’ అని ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ ప్రచారాన్ని మహిళలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అర్బన్ ఫార్మింగ్ కన్సల్టెన్ట్, కిచెన్ గార్డెన్స్ ఎక్స్పర్ట్ జూలీ సహాయం తీసుకున్నారు. జూలీ, రాయ్ గల్లీ గల్లీకి తిరిగారు.జూలీ మాటలతో ఎంతోమంది తల్లులలో మార్పు వచ్చింది. ‘ఏమిటి? ఎందుకు? ఎలా?’ ఇలా పలు కోణాలలో కిచెన్ గార్డెన్స్ గురించి ప్రశ్నలు అడిగి ప్రయత్నం మొదలుపెట్టారు. ఇప్పుడు గల్లీలలో ఎన్నో ఇళ్లలో కిచెన్ గార్డెన్లు కనిపిస్తున్నాయి.మార్పు..పోషకాహార లోపంతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. ఆ పేదింటి తల్లుల దుఃఖాన్ని దగ్గరి నుంచి గమనించిన ఫుట్‌బాల్ కోచ్ రాఘవ్ రాయ్ ‘కిచెన్ గార్డెన్’ ఐడియాతో ముందుకు వచ్చాడు. దిల్లీలో గల్లీ గల్లీ తిరిగాడు. మహిళలు ఎవరూ అతడి మాటలనుమొదట సీరియస్‌గా తీసుకోలేదు.అర్బన్ ఫార్మింగ్ కన్సల్టెన్ట్, కిచెన్ గార్డెన్స్ ఎక్స్పర్ట్ జూలీ మాటలతో వారిలో మార్పు వచ్చింది. ఢిల్లీలో ఎన్నో బస్తీలలోని మహిళలు తమకు ఉన్న పరిమిత స్థలంలోనే కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. రసాయన కూరగాయలకు దూరంగా ఆరోగ్యకరమైన, పౌష్టికాహారాన్ని సొంతం చేసుకుంటున్నారు... View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: బాలీవుడ్ టు కార్పొరెట్ వరల్డ్) -
‘ఏడ్చినా.. పట్టించుకోను’.. టీచర్ వేధింపులకు విద్యార్థి బలి
న్యూఢిల్లీ: పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి ఎదురైన అవమాన భారానికి ఒక విద్యార్ధి బలయ్యాడు. ఢిల్లీలోని ఒక ప్రముఖ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం అందరిలో విషాదాన్ని నింపింది. మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆ బాలుడు.. తన ఆత్మహత్యకు పాఠశాల ఉపాధ్యాయుల వేధింపులేనని కారణమని ఆరోపిస్తూ ఒక సూసైడ్ నోట్‌ను వదిలివెళ్లాడు. ఈ ఘటన తల్లిదండ్రులను, స్థానికులను తీవ్రంగా కలచివేసింది.కుమారుడిని కోల్పోయిన తండ్రి సదరు పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు, పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తన కొడుకును మానసికంగా హింసించడం వల్లే ప్రాణాలను తీసుకున్నాడని ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతూ పోలీసులకు తెలిపాడు. ప్రతిరోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం 7.15 గంటలకు ఆ బాలుడు పాఠశాలకు వెళ్లాడు. అయితే మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలో గాయాలతో ఆ బాలుడు పడి ఉన్నట్లు తండ్రికి ఫోన్ వచ్చింది. బాలుడిని ఆస్పత్రికి తరలించే లోపే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుని తండ్రి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘గత కొద్ది రోజులుగా నా కుమారుడిని పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు. మంగళవారం ఒక డ్రామా క్లాసులో నా కుమారుడు పడిపోతే, ఒక టీచర్ అతనిని అవమానించి, అతిగా నటిస్తున్నావని ఎగతాళి చేశారు. దీంతో నా కుమారుడు ఏడవడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ, ఆ టీచర్ నువ్వు ఎంత ఏడ్చినా పట్టించుకోను అని అన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రిన్సిపాల్ అక్కడే ఉన్నా, తన కుమారునిపై వేధింపులను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తండ్రి ఆరోపించారు.10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో, స్కూల్ ఉపాధ్యాయులు వేసే మార్కుల విషయంలో ఇబ్బంది ఎదురుకాకూడదనే ఉద్దేశంతో తాము పాఠశాల యాజమాన్యంపై గట్టి చర్య తీసుకోలేకపోయామని తండ్రి తెలిపారు. పరీక్షలు అయ్యాక వేరే స్కూల్లో చేరవచ్చని తన కుమారునికి హామీ ఇచ్చానని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాలుని బ్యాగులో దొరికిన సూసైడ్ నోట్లో.. తన అవయవాలు పని చేసే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయాలని కోరాడు. అలాగే ఈ లెటర్ చదివినవారు ఈ నంబర్‌కు కాల్ చేసి, తాను చేసిన పనికి చింతిస్తున్నానని, పాఠశాలలో జరిగిన దానిని తట్టుకునేందుకు తనకు వేరే మార్గం లేదని భావిస్తున్నానని తెలిపాడు.తన పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లను తెలియజేస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని, తద్వారా మరే విద్యార్థీ తనలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా చూడాలని వేడుకున్నాడు. లేఖలో ఆ టీనేజర్ తన కుటుంబాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్నయ్యకు, తండ్రికి క్షమాపణలు చెప్పాడు. ఎల్లప్పుడూ తనకు మద్దతుగా నిలిచిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ, తండ్రిని, సోదరుడిని చక్కగా చూసుకోవాలని కోరాడు. ఒకవైపు పరీక్షల ఒత్తిడి, మరోవైపు టీచర్ల వేధింపులతో కుంగిపోయిన ఆ విద్యార్థి బలవన్మరణంతో తోటి విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: భారత్‌పై దాడికి జైష్ కుట్ర.. నిధుల సేకరణకు పిలుపు -
ఇదెక్కడి దురాచారం?
న్యూఢిల్లీ: ఇస్లాం మతాచారం ప్రకారం భర్త నెలకోసారి చొప్పున తలాక్ చెబుతూ మూడు నెలల వ్యవధిలో భార్యకు విడాకులిచ్చే తలాక్ ఏ హసన్ పద్ధతిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దాని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి విడాకుల పద్ధతిని నాగరిక సమాజం అంగీకరించడం సహేతుకమేనా అంటూ పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఇస్లాంలో ఎన్ని విడా కుల పద్ధతులు ఉన్నదీ లిఖితపూర్వకంగా తమకు కూలంకషంగా వివరించాల్సిందిగా ఇరు పక్షాలకూ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ‘మేమేదో ఒక ప్రబలమైన మతాచారాన్ని రద్దు చేయబో తున్నామని భావించరాదు. కానీ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే తలాక్ ఏ హసన్ వంటి దురాచారాలను సరిదిద్దేందుకు కోర్టులు తప్పక జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది‘ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇదేం దుస్థితి?తలక్ ఏ హసన్ బాధితురాలైన బేనజీర్ హీనా అనే ఢిల్లీకి చెందిన పాత్రికేయురాలు ఈ సందర్భంగా తన వాదనను స్వయంగా ధర్మాసనానికి వినిపించారు. ‘ఈ పద్ధతిలో భర్త నేరుగా భార్యకు తలాక్ చెప్పే పని కూడా లేదు. ఆయన తరఫు లాయర్, లేదా మరే ఇతర వ్యక్తి అయినా భార్యకు నెలకోసారి తలాక్ చెప్పవచ్చు. దేశ రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక మారుమూల ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళలు ఇలాంటి దురాచారాలకు ఇంకెంతగా బలవుతున్నదీ అర్థం చేసుకోవచ్చు‘ అని ఆవేదన వెలిబుచ్చారు. ఆమె మాజీ భర్త తరఫు లాయర్ తలాక్ ఏ హసన్ ను సమర్థిస్తూ వాదనలు వినిపించబోగా జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఏ విధంగా చూసినా ఇదసలు మహిళల గౌరవాన్ని కాపాడే చర్యేనా? 2025లో కూడా ఇలాంటి వాటిని అనుమతించడం ఏ మేరకు సబబు? వీటిని మీరెలా సమర్థిస్తారు?‘ అని ప్రశ్నించారు. ‘తలాక్ కోసం లాయర్ ను సంప్రదించగలిగిన వ్యక్తి, అదే విషయమై నేరుగా భార్యతో మాట్లాడేందుకు ఇబ్బందేమిటన్నది అర్థం కావడం లేదు. ఇకముందు బహుశా లాయర్లే విడాకులు ఇచ్చేస్తారు కాబోలు!‘ అంటూ దుయ్యబట్టారు. ‘తన హక్కుల కోసం కోర్టు మెట్లెక్కిన హీనా ధైర్యానికి సెల్యూట్. తనో జర్నలిస్టు గనుక ఇక్కడిదాకా రాగలిగింది. అంతటి అవగాహన, వెసులుబాటు లేని పేద, అణగారిన ముస్లిం మహిళల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అన్యాయపు మతాచారాలకు మౌనంగా బలి కావాల్సిందేనా?‘ అంటూ ఆవేదన వెలి బుచ్చారు. తర్వాతి విచారణకు మాజీ భర్త హాజర య్యేలా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇస్లాంలో అత్యంత ప్రబలంగా ఉన్న ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2917లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడం తెలిసిందే. -
భారత్‌లో మరోసారి ఆత్మాహుతి దాడికి జైషే కుట్ర
ఢిల్లీ: ఎర్రకోట బాంబు తరహాలో భారత్‌లో మరోసారి ఆత్మాహుతి దాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్- మహమ్మద్ ప్రయత్నిస్తుందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆదాడి కోసం పాకిస్థాన్‌లో విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి.ఎర్రకోట బాంబు పేలుళ్లపై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్ ఉగ్ర సంస్థ ఎర్రకోట కారు బాంబు తరహాలో భారత్‌లో మరో ఆత్మాహుతి దాడి (ఫిదాయిన్)కు ప్రణాళికలు రచించిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఆ దాడికోసం డిజిటల్ మార్గాల ద్వారా విరాళాలు సేకరిస్తుందని అందులో సదాపే అనే పాకిస్థాన్‌కు చెందిన యాప్ కూడా ఉందని తెలిపింది. ఫండ్ రుసుము పాకిస్థాన్ కరెన్సీలో 20వేలు భారత్(రూ.6400) ఉన్నట్లు పేర్కొంది. ఈ డబ్బులను ఉగ్రవాదుల ఖర్చులకోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం.వీటితో పాటు ఉగ్రవాదులకు చలికాలపు కిట్ ముజాహిద్ ఇచ్చే వారినెవరినైనా జిహాదీలుగా పరిగణిస్తారని జిహాదీల మరణానంతరం వారిపై శ్రద్ధ కనిపించేవారిని సైతం జిహాదీలుగానే గుర్తిస్తున్నట్లు దర్యాప్తులో వివరాలు తెలిసాయి. ఇటీవల ఎర్రకోటలో జరిగిన బాంబు దాడులలో టెర్రర్ డాక్టర్ గ్రూప్‌కు డిజిటల్ మార్గంలోనే నిధులు అంది ఉండవచ్చని దానిపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నామని ఎన్ఐఏ బృందాలు పేర్కొన్నాయి.కాగా ఇటీవల ఫరీదాబాద్ అక్రమ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్. షహీన్ సయీద్ ఈ దాడికి ఫండ్ చేసిందని ఎన్ఐఏ బృందాలు అనుమానిస్తున్నాయి. ఈ బాంబు పేలుళ్ల కేసులో షహీన్ సయీద్‌ను మేడమ్ సర్జన్ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. జమాత్ - ఉల్- ముమినాత్ అనే యూనిట్లో ఆమె సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం. -
‘పిల్లల్ని గ్యాస్ చాంబర్లో పెట్టినట్లే అవుతోంది’
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యంపై సీజేఐ ధర్మాసనం బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కాలుష్యం నడుమ స్కూల్ పిల్లలను గ్యాస్ చాంబర్లో పెట్టినట్లే అవుతోందని.. కాబట్టి ఇలాంటి సమయంలో క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించింది. దేశ రాజధానిలో కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. పాఠశాల పిల్లలను గ్యాస్ చాంబర్లో పెట్టినట్లే అవుతోంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ఈ సమయంలో స్పోర్ట్స్ ఈవెంట్ల పెట్టొద్దు. క్రీడా కార్యక్రమాలను కాలుష్యం లేని ప్రాంతాల్లో నిర్వహించాలి. నవంబర్-డిసెంబర్ నెలల్లో నిర్వహించాల్సిన స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా వేయించండి అని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో స్కూళ్లలో స్పోర్ట్స్ ఈవెంట్లను వాయిదా వేయించాలని, గాలి నాణ్యత మెరుగయ్యాకే వాటిని నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM)కి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
భారత్‌పై దాడికి జైష్ కుట్ర.. నిధుల సేకరణకు పిలుపు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) భారతదేశంపై మరో ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడికి సిద్ధమవుతోంది. ఈ దాడి కోసం ప్రత్యేకంగా నిధులు సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు ‘ఎన్డీటీవీ’కి తెలిపాయి. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు దాడి దర్యాప్తులో ఈ విషయం వెలుగుచూసింది. జైష్ నేతలు ‘సదాపే’(పాకిస్తాన్ బ్యాంకింగ్ యాప్) లాంటి డిజిటల్ మార్గాల ద్వారా నిధులు సేకరణకు పిలుపునిచ్చారు.జైష్ ఈ దాడుల కోసం మహిళల నేతృత్వంలో ఒక దళాన్ని కూడా సిద్ధం చేయనున్నదని తెలుస్తోంది. జైష్‌కు ఇప్పటికే మహిళా విభాగం ఉంది. ఉగ్ర సంస్థ నేత మసూద్ అజార్ సోదరి సాదియా ఈ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నారని సమాచారం. ఎర్రకోట దాడిలో కీలక నిందితురాలు డాక్టర్ షాహినా సయీద్ అలియాస్ 'మేడమ్ సర్జన్' కూడా ఈ యూనిట్లో సభ్యురాలిగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ‘జిహాదీ’ ఆత్మాహుతి దళం కోసం జైష్ 20 వేల పాకిస్తానీ రూపాయలు (సుమారు రూ.6,400) చొప్పున విరాళాలు డిమాండ్ చేస్తోంది. ఈ డబ్బును ‘ముజాహిద్) (పోరాట యోధుడు) కోసం శీతాకాలపు కిట్‌ను కొనడానికి ఉపయోగిస్తారు. ఇందులో బూట్లు, సాక్స్, పరుపు, టెంట్ మొదలైనవి ఉంటాయి.జైష్, లష్కర్ ఎ తోయిబా (ఎల్ఈటీ) వంటి ప్రధాన ఉగ్రవాద గ్రూపులు సమన్వయంతో కొత్త దాడులకు సిద్ధమవుతున్నాయని తాజా నిఘా సమాచారం సూచిస్తున్నది. ఈ రెండు సంస్థలకు పాకిస్తాన్ సైన్యం, డీప్ స్టేట్ నుండి నిధులు, మద్దతు లభిస్తున్నాయి. ఈ డిజిటల్ నిధుల నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక విచారణ ప్రారంభించాయి. కాగా ఎర్రకోట కారు బాంబు దాడి నవంబర్ 10న జరిగింది. ఈ చారిత్రక కట్టడం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 పేలింది. ఈ పేలుడులో15 మంది మృతి చెందారు. కారు నడిపిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ కూడా మృతిచెందాడు.ఇది కూడా చదవండి: ‘ముస్లింలు, క్రైస్తవులు.. అంతా హిందువులే’: మోహన్ భగవత్ -
అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈ-పాస్‌పోర్ట్: కేంద్రం
న్యూఢిల్లీ: నకిలీ, డూప్లికేట్ పాస్‌పోర్ట్‌ల తయారీకి అడ్డుకట్టవేయడంతోపాటు అదనపు ఫీచర్లు జోడిస్తూ అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటి జారీని వేగవంతం చేసింది. ఇప్పటికే 80 లక్షల ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ పూర్తయిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.పాత పాస్‌పోర్ట్‌లు 2035 ఏడాది దాకా లేదంటే వాటి ఎక్స్‌పయిరీ తేదీ ఉన్నంత వరకు మనుగడలో ఉంటాయని పేర్కొంది. కరెన్సీ నోట్లపై అత్యంత సూక్ష్మంగా ముద్రించే అక్షరాలు, అత్యంత పల్చటి ఆకృతులు, థ్రెడ్ తరహాలో పాస్‌పోర్ట్ పేజీలను అధునాతన భద్రతా ప్రమాణాలతో తయారుచేసినట్లు భారత విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది. దేశ, విదేశాల్లోని పౌరుల కోసం పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(పీఎస్పీ వీ.2.0), గ్లోబల్ పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(జీపీఎస్‌పీ వీ.2.0), ఇ–పాస్‌పోర్ట్‌లు తీసుకురాబోతున్నట్లు విదేశాంగ శాఖ గతంలోనే ప్రకటించడం విదితమే. చిప్, యాంటెన్నాలతో పాస్‌పోర్ట్ కొత్త పాస్‌పోర్ట్ పేజీల పరంగా, ఎల్రక్టానిక్ అంశాల పరంగా అధునాతమైంది. పాస్‌పోర్ట్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) చిప్‌తోపాటు సూక్ష్మస్థాయి యాంటెన్నాను అమర్చారు. ఇవి ఆ పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తి సంబంధించిన డేటాను తనలో ఇముర్చుకుంటాయి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల ప్రమాణాలకు అనుగుణణంగా ఈ ఫీచర్లను జోడించారు. డేటా పేజీలో పోస్‌పార్ట్ ఉన్న వ్యక్తికి సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. దీంతో దీనిని ఫోర్జరీచేయడం అసాధ్యం. -
Delhi Blast Case: ఉగ్రవాది ఉమరు సహకరించిన కీలక వ్యక్తి ఇతడే..
-
Delhi Blast: పేలుడు ఘటనకు ముందు వీడియో రికార్డ్ చేసిన డాక్టర్ ఉమర్
-
ఢిల్లీ కోర్టులకు బాంబు బెదిరింపులు.. విస్తృతంగా తనిఖీలు
న్యూఢిల్లీ సాక్షి, దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ కోర్టులో బాంబు పెట్టామంటూ మెయిల్ సందేశం వచ్చింది. దానితో పాటు పటియాలా హౌస్ కోర్టు, సాకేట్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు భవనాలను ఖాళీ చేయించారు. అక్కడ ఉన్న వారందరినీ హుటాహుటీన ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్స్ తో పాటు ఇతర ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.ఇటీవలే ఎర్రకోట బాంబుపేలుళ్లతో అట్టుడికిపోయిన దేశరాజధానిలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. నగరంలోని మూడు కోర్టులతో పాటు ద్వారకా, ప్రశాంత్ విహార్ లలో ఉన్న సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రదేశాలని ఖాళీ చేయించారు. ప్రత్యేక బృందాలతో సోదాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు భారీ కుట్రలు పన్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ బృందాలు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొవడంతో పాటు ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇంతలోనే ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. -
పథకం ప్రకారమే ఢిల్లీ బ్లాస్ట్? ఉగ్రవాది సంచలన వీడియో
ఢిల్లీ సాక్షి, ఎర్రకోట కారు బాంబు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి ఉమర్ పొరపాటున చేసింది కాదని పథకం ప్రకారమే దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడి గురించి అపార్థం చేసుకుంటున్నారని కాని ఇది ఓబలిదానం అని, చనిపోయే స్థలం, సమయం, గురించి ఆ వీడియోలో మాట్లాడారు. ఈ నెల 10 న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన బాంబుపేలుళ్లలో ఎన్ఐఏ లోతైన దర్యాప్తు చేపడుతుంది. ఈ నేపథ్యంలో కారుబాంబు ఉగ్రవాది ఉమర్ సంచలన వీడియో బయిటపడింది. అందులో ఉమర్ "ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాలి. నాగరిక సమాజం దీన్ని అంగీకరించదు.చావే అంతిమ లక్షం అని భావిస్తేనే అది సాధ్యమవుతుంది. బలిదానం అనేది ఒక ఆపరేషన్ అని ఒక వ్యక్తి తాను నిర్ధిష్ఠ సమయంలో ఫలానా ప్రాంతంలో చనిపోతానని భావించడం . ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు అది విధిరాత అయితే చావుకు ఎప్పుడూ భయపడకూడదు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయి. అటువంటి దాడిని సమాజం ఒప్పుకోదు" అని ఆ వీడియోలో అన్నారు.నవంబర్ 9న ఎర్రకోట బాంబు దాడి జరిగే ఒకరోజు ముందు అల్పాల యూనివర్సిటీలో ఈవీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది ఉమర్ ఈవీడియోలో మాట్లాడిన మాటలు చూస్తుంటే కారుబాంబు బ్లాస్ట్ పక్కా ప్రణాళిక తోనే చేశారని అందుకే అది జరిగే ఒకరోజు మందు ఈ వీడియో చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదికి సంబంధంమున్న అల్ ఫలా యునివర్సిటీపై ఎన్ఐఏ మరింత విస్తృతం చేసింది. వర్సిటీకి విదేశాల నుంచి అందే నిధులపై ఆరా తీస్తుంది. ఈ బాంబు కుట్ర కేసుతో సంబంధమున్న పలువురు వ్యక్తులను ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు.నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన కారుబాంబు పేలుళ్ల కేసులో 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
హమాస్ లా ప్లాన్ చేసిన ఆత్మాహుతి బాంబర్ అరెస్ట్..
-
నవంబర్ 20 ఆ.. అదేంటో జ్యోతిష్కుడిని అడగండి
సాక్షి, బెంగళూరు/ ఢిల్లీ: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి మీడియా ముందు తన అసహనం వ్యక్తం చేశారు. ఆశలు కలిగి ఉండడంలో తప్పేముంది? అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు జోరందుకున్న వేళ.. ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఇప్పుడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లు.. త్యాగాలు చేసినవాళ్లు ఆశలు పెట్టుకోవడం సహజం. అందులో తప్పేముంది? అని మీడియాను ఉద్దేశించి శివకుమార్ వ్యాఖ్యానించారు. నవంబర్ 20న నాయకత్వ మార్పు ప్రకటన ఉంటుందా? అనే ప్రశ్నకు.. అదేంటో జ్యోతిష్యుడినే అడగాలంటూ వ్యాఖ్యానించారాయన. అయితే.. నవంబర్ క్రాంతి, భ్రాంతి అలాంటేవీ లేవని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం భిన్నమైన ఆట సాగుతోంది. ఈ ఊహాగానాలన్నింటికీ నవంబర్ 20 డెడ్‌లైన్‌గా కనిపిస్తోంది. ఆ రోజుకు సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన కాలాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఇతర విషయాల కంటే కూడా ముఖ్యమంత్రి మార్పు అంశమే ఎంతో ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ల ప్రకటనలు, ఢిల్లీ యాత్రలు మరింత సెగలను రాజేశాయి. అంతటా సస్పెన్స్ నవంబర్ 20లోగానే రాజకీయ పెను మార్పులు సంభవిస్తాయని కొందరి వాదన అయితే, అలాంటిది ఏదీ ఉండకపోవచ్చని సీఎం వర్గీయులు చెబుతున్నారు. కానీ వారిలోనూ సస్పెన్స్ కలుగుతోంది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి తన పీఠాన్ని భద్రం చేసుకోవడంతో పాటు అనుచరులకు మంత్రి పదవులు కట్టటెట్టి శివకుమార్ వర్గానికి పెద్ద షాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 20 నుంచి రాహుల్ గాంధీ ముందు రెండు వర్గాలు తమ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని సజావుగా నడిపించడం రాహుల్‌గాంధీ శిబిరానికి అగి్నపరీక్ష అయ్యింది. ఢిల్లీలో డీకే మంత్రాంగం డీసీఎం డీ.కే.శివకుమార్ ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. సీఎం పదవి, మంత్రి పదవుల పంపిణీ గురించి, పార్టీ అంశాల మీద ఆయన చర్చించినట్లు చర్చ నడుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు. ఆ సమయంలో సోదరుడు డీకే సురేశ్‌ను ఆయన వెంటబెట్టుకెళ్లారు. ఖర్గేతో సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. తన చేతిలో ఉన్న కేపీసీసీ అధ్యక్ష స్థానం చేజారకుండా డీకే పావులు కదపడంతో పాటు, ముఖ్యమంత్రి పదవి గురించి మనసులో మాట చెప్పారు. కాగా, సోమవారం ఢిల్లీలో సీఎం సిద్దరామయ్యను కూడా డీకే శివ కలిసి మాట్లాడి, ఆపై బెంగళూరుకు పయనమయ్యారు. వెంటనే సిద్దూ కూడా..మంత్రిమండలి ప్రక్షాళన ముందుకు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సీఎం సిద్దరామయ్య సోమవారం ఢిల్లీకి వెళ్లే ముందుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనతో వరుసగా భేటీ అయ్యారు. అందులో అనేకమంది మంత్రి పదవుల ఆకాంక్షులు ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ప్రదీప్ ఈశ్వర్, అశోక్ పట్టణ్, కాశప్పనవర్, ఏ.ఎస్.పొన్నణ్ణ, కే.ఎస్.రాజణ్ణ తదితరులు ఉన్నారు. రాజణ్ణతో చాలాసేపు మాట్లాడడం కుతుహలానికి దారితీసింది. ఓట్ చోరీ గురించి రాజణ్ణ వ్యతిరేకంగా మాట్లాడి మంత్రి పదవిని పోగొట్టుకోవడం తెలిసిందే. తన గురించి నాయకత్వానికి మంచిగా చెప్పాలని సిద్దరామయ్యను కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ మంత్రి పదవి ఇవ్వాలని మరీ మరీ కోరారు. ఢిల్లీకి వెళ్లాక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం కలిసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు వంటిది ఉండకుండా చూడాలని, ఆ మేరకు హైకమాండ్‌ను ఒప్పించాలని కోరినట్లు సమాచారం. -
ఆశలు నెరవేర్చే పార్టీలనే నమ్ముతారు
న్యూఢిల్లీ: సదుద్దేశంతో ముందడుగు వేసి, తమ ఆశయాలను నెరవేర్చే రాజకీయ పార్టీలనే ప్రజలు విశ్వసిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో ఆరో రామ్‌నాథ్ గోయంకా స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వామపక్ష పార్టీనా, మితవాద పార్టీనా అనేది ముఖ్యంకాదు. అభివృద్ధి విధానాలతో ఏ పార్టీ అయితే ముందుకెళ్తుందో ఆ పార్టీలకు మాత్రమే భవిష్యత్తు ఉంటుందని బిహార్‌లో తాజా శాసనసభ ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. ప్రాంతీయ పార్టీల సారథ్యంలో కేంద్రంలో లేదా రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాల దృష్టి మొత్తం అభివృద్ధి మీదనే ఉండాలి. భారతదేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెద్దగానే ఉంటాయని బిహార్ ఎన్నికలు నిరూపించాయి. అధికారం చేపట్టి సదుద్దేశంతో సత్కార్యాలు చేసే రాజకీయ పక్షాల వెంటే ప్రజలు నడుస్తారు. మళ్లీ వాళ్లకే ఓటేస్తారు. అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుంటారు. విదేశాల నుంచి తమ రాష్ట్రానికే భారీ పెట్టుబడులు వచ్చేలా బడా కంపెనీలను ఆకర్షిస్తూ, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే రాష్ట్ర ప్రభుత్వా లను ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది’’ అని అన్నారు. ఎలక్షన్ మోడ్ కాదు ఎమోషనల్ మోడ్‘‘బీజేపీ ఎప్పుడూ ఎన్నికల మీదే దృష్టిపెడుతుందని కొందరు అ భాండాలు వేస్తున్నారు. నిజానికి మేం ఎలక్షన్ మోడ్‌లో ఉండబోం. ఎన్నికల ప్రచారంవేళ ప్రజలతో మమేకమయ్యే ఎమోషనల్ మోడ్‌లో ఉంటాం. రోజూ 24 గంటలూ అభివృద్ధి, ప్రజల భావోద్వేగాల గురించే పట్టించుకుంటాం. అందుకే ప్రతిసారి మాకు విజయం దక్కుతోంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. ‘‘ నక్సలిజం, మావోయిస్ట్ టెర్రరిజంకు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ దేశంలో ఉనికిని కోల్పోతోంది. కేవలం విపక్షపార్టీగా మాత్రమే మిగిలిపోతోంది. గత ఐదు దశాబ్దాల్లో దేశంలో ప్రతి రాష్ట్రం మావోయిస్టుల దురాగతాలను చవిచూసింది. దేశ రాజ్యాంగాన్ని నమ్మని అలాంటి వాళ్లను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది’’ అని మోదీ ఆరోపించారు.


