సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో విమా న సర్వీసుల రద్దు నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా రైళ్లలో ప్రయాణిస్తుండగా వారి అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ వ్యక్తి శుక్రవారం సాయంత్రం ఇండిగో ఫ్లైట్‌లో తిరిగి హైదరాబాద్‌కు టికెట్ బుక్ చేసుకోగా ఆ సర్వీసు రద్దయింది. దీంతో చెన్నై వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకోగా అది కన్‌ఫం కాలేదు. టీసీని బతిమిలాడగా సాధారణ చార్జీతోపాటు తనకు కొంత ముట్టజెప్పాలని ప్రయాణికుడిని కోరినట్లు తెలిసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీసీకి ఆ వ్యక్తి మొత్తం రూ. 10,200 నగదు చెల్లించాడు. ఇండిగో విమానాల రద్దుతో ఢిల్లీ–సికింద్రాబాద్ రైళ్లన్నీ కిటకిటలాడుతుండటంతో ప్రయాణికుల వెయిటింగ్ లిస్టే వందల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఏసీ కన్ఫర్మేషన్ కావడం కష్టమంటూ కొందరు టీసీలు ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలిసింది. ఓ ప్రయాణికుడు నిలబడి వెళ్లేందుకు అనుమతించినందుకు టీసీ రూ. 5 వేలు వసూలు చేశాడని సమాచారం.
థర్డ్ ఏసీ వెయిటింగ్ లిస్టు ప్రయాణికుడి నుంచి దండుకున్న టీసీ
ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులను దోచుకుంటున్న వైనం


