Narendra Modi
-
సహకారమే మన బలం
గోథెన్బర్గ్: సహకారమే మన బలమని భారత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ ఆదివారం స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్స్సన్తో సమావేశమ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించాయి. భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ ప్రజల ప్రయోజనం కోసం కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించారు. వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సంప్రదింపులు జరిపారు. సహకారమే మన బలమని ఉద్ఘాటించారు. రెండో రోజుల పర్యటన నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి ఆదివారం ఉదయం స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌కు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఆయన ప్రయాణించిన విమానానికి స్వీడన్ ఎయిర్‌పోర్స్ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి. గోథెన్బర్గ్ ఎయిర్‌పోర్టులో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్స్‌సన్ సాదర స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడానికి స్వీడన్‌లోని ప్రవాస భారతీయులు తరలివచ్చారు. మోదీ రాకను పురస్కరించుకొని నిర్వహించిన సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మోదీ, క్రిస్టర్స్‌సన్ మధ్య ప్రతినిధుల స్థాయి భేటీ జరిగింది. ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న నూతన మార్గాలపై చర్చించారు. హరిత పరివర్తన, కృత్రిమ మేధ(ఏఐ), వర్ధమాన సాంకేతికతలు, స్టార్టప్‌లు, సప్లై చైన్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ చర్యలు సహా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై భారత్, నెదర్లాండ్స్ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ప్రధాని మోదీకి ‘పోలార్ స్టార్’ గౌరవం ప్రధాని మోదీ స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషి, దూరదృష్టి కలిగిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రకటించారని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం ద హేగ్: అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ఇకపై ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నెదర్లాండ్స్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి రోబ్ జెటెన్తో సమావేశమయ్యారు. ఇరుదేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రక్షణ, అరుదైన ఖనిజాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం 17 ఒప్పందాలపై భారత్, నెదర్లాండ్స్ సంతకాలు చేశాయి. పశ్చిమాసియా పరిణామాలపై ఇద్దరు ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరాలో అంతరాయాల వల్ల ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. భేటీ తర్వాత వారిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ పురస్కారాన్ని అందజేస్తున్న స్వీడన్ యువరాణి విక్టోరియా -
గోల్డ్ కొనాలా.. వద్దా..
‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ పిలుపుతో కొనుగోళ్లు ఆపాలని కొందరు , ఏడాది పాటు వాయిదా వేయాలని మరికొందరు చర్చలకు దిగారు ఇప్పటికే కొనేశాంగా మరి అమ్మేయాలా అని అనేకమంది సందిగ్ధంలో పడ్డారు. సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఈటీఎఫ్‌లుగా కొంటున్నవారు ఏంచేయాలో తోచక అయోమయంలో పడ్డారు. అయితే ప్రధాని పిలుపు ఒక రకమైన కొనుగోలుదారులకు పూర్తిగా వర్తిస్తుంది. మరొక వర్గం కొనుగోలుదారులకు అంతగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి తాము ఏ రకమైన బయ్యర్లో తెలీదు. అది తెలిస్తే మీరు బంగారం కొనాలో, అమ్మాలో, కొనసాగించాలో నిజంగా ఏంచేయాలో స్పష్టమవుతుంది. క్రూడ్, చమురు దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యంపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోదీ గత వారం చేసిన బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలన్న పిలుపును బాధ్యత గల పౌరులుగా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. పతనమవుతున్న రూపాయి , పశ్చిమ ఆసియాలో అస్థిర పరిస్థితి, పెరుగుతున్న దిగుమతి బిల్లు వంటి కారణాలను ప్రధాని ప్రస్తావించారు. అయితే ఈ పిలుపునకు అందరూ ఒకేరకంగా స్పందించాల్సిన అవసరంలేదు. సరదాగా, ఆడంబరం కోసం, ఫ్యాషన్‌గా ప్రదర్శించుకునేందుకు మీరు నగలు కొనేవారైతే ఈ పిలుపు మీకు పూర్తిగా వర్తిస్తుంది. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకుంటే ఆపడానికి ఆలోచించాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం...ప్రధాని పిలుపు అసలు అర్థం ఏమిటి?భారతదేశం వినియోగించే బంగారంలో 99 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే వస్తుంది. దేశంలో గణనీయమైన స్థాయిలో బంగారం తవ్వకం జరగదు. నగలు, నాణేలు, బార్లు ఏ రూపంలో అయినా బంగారం కొనడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి డాలర్ల రూపంలో దిగుమతులకే వెళ్తుంది. డాలరు మారకంలో రూపాయి విలువ 96 స్థాయికి పతనమై ఒకవైపు దిగుమతి బిల్లు పెరుగుతున్న సమయంలో బంగారం డిమాండ్ పెరగడం ఆర్థిక పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోంది. ఎందుకంటే బంగారం దిగుమతులకు ప్రభుత్వం డాలర్లలోనే చెల్లిస్తుంది. డిమాండ్ పెరిగితే డాలర్లు భారీగా బయటకు వెళ్తాయి. దాంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే కీలకమైన దిగుమతులైన చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ ఖరీదవుతాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది చివరికి సాధారణ కుటుంబాలపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రధాని పిలుపులో భావోద్వేగం కన్నా గణాంకాలకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.ఎవరి కోసం...ఈ పిలుపు అత్యంత ప్రభావం చూపేది జ్యువెలరీ కొనుగోలుదారులపైనే. ఎందుకంటే నగలలో బంగారం విలువతో పాటు 10 నుంచి 15 శాతం వరకు మేకింగ్ చార్జీలు, జీఎస్టీ కూడా ఉంటాయి. ఇవి తిరిగి రికవర్ కాని ఖర్చులు. అంటే నగలను పెట్టుబడిగా భావించే వారు , కొనుగోలు చేసిన క్షణం నుంచే తమ సంపదను అంతకన్నా ఎక్కువ శాతంగా అంచనా వేస్తారు. నగలు అనేవి వినియోగం కోసమే. పెట్టుబడి కోసం కాదు. అందుకే ప్రధాని పిలుపు వీరిని ఉద్దేశించి చేసిందిగా గమనించాలి.బంగారం పని సంపద పెంచడం కాదు ...రక్షణ ఇవ్వడంప్రధాని పిలుపును పాటించాలా వద్దా అనుకునే ముందు, మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం అసలు ఏ పని చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు ఉండటం సరైనదిగా పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు భావిస్తారు. అది సంపదను వేగంగా పెంచడానికి కాదు. ఒక రకమైన ఇన్సూరెన్స్‌లా పనిచేయడానికి. ఈక్విటీలు దీర్ఘకాలంలో సంపదను పెంచుతాయి. డెట్ ఇన్స్ట్రుమెంట్లు మూలధనాన్ని కాపాడి వడ్డీ ఇస్తాయి. బంగారం పని మాత్రం వేరు. రూపాయి బలహీనపడినప్పుడు లేదా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారం సాధారణంగా తన విలువను నిలబెట్టుకుంటుంది. ఆసమయంలో ఇతర పెట్టుబడులను కాపాడేది బంగారం. ఆ పరిస్థితులకు హెడ్జింగ్‌గా బంగారాన్ని అలొకేషన్‌లో ఉంచుతారు.నగలు, ఈటీఎఫ్‌లు ఎస్‌జీబీలు పూర్తిగా భిన్నందిగుమతుల స్థాయిలో చూస్తే బంగారం అంటే బంగారమే. దేశంలో జ్యువెలరీ తయారీ దారులు గోల్డ్ బార్లు దిగుమతి చేసుకుని నగలుగా మారుస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు , గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా తమ యూనిట్లకు బ్యాకింగ్‌గా ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతి భారంలో పెద్ద తేడా ఉండదు. ఇక్కడ అసలు తేడా దిగుమతుల్లో కాదు. దానికి చేసే వ్యయంలో ఉంది.గోల్డ్ఈటీఎఫ్లు – మ్యూచువల్ ఫండ్లు గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా ఫిజికల్ గోల్డ్ దిగుమతులపైనే ఆధారపడతాయి. వీటి విషయంలో మేకింగ్ చార్జీలు ఉండవు. గోల్డ్ విలువపై జీఎస్టీ ఉండదు. తిరిగి అమ్ముకోవడం కూడా తేలిక.ఎస్జీబీలే నిజమైన మినహాయింపుసావరిన్ గోల్డ్ బాంండ్ల (ఎస్జీబీ)కు మాత్రమే నిజమైన ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. బాండ్ల విషయంలో ప్రభుత్వం బంగారం ధరలకు అనుసంధానమైన ఒక పేపర్ ఇన్స్ట్రుమెంట్ను జారీ చేస్తుంది. ఇందులో ఫిజికల్ గోల్డ్ కొనుగోలు లేదా దిగుమతి అవసరం ఉండదు. ఇష్యూ సమయంలో కొనుగోలు చేసిన వారు ఎనిమిదేళ్లు హోల్డ్ చేస్తే, 2.5 శాతం వార్షిక వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో ట్యాక్స్ ఫ్రీ లాభాన్ని పొందేవారు. అయితే ఇప్పుడు కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూలు ఆగిపోయాయి. చివరిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం కొత్త ట్రాంచ్ను విడుదల చేసింది.ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?మీ గోల్డ్ ఈటీఎఫ్‌లు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లను కలిపి లెక్కించండి. నగలను లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే అవి వినియోగానికి ఉద్దేశించినవి. మొత్తం పెట్టుబడుల్లో బంగారం శాతం ఎంత ఉందో చూడండి. అది 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 శాతం కంటే తక్కువైతే పోర్ట్‌ఫోలియో సమతుల్యత కోసం కొంత కొని పెంచుకోవచ్చు.10 శాతం దాటితే కొంత తగ్గించి ఆవచ్చే డబ్బును ఈక్విటీ, డెట్ లేదా క్యాష్ వైపు మార్చడం మంచిది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మార్కెట్ టైమింగ్ వల్ల ఈ పనిచేయడంలేదు. రీబ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తున్నాం. బంగారాన్ని ఇన్సూరెన్స్‌లా చూడండి. ఇన్సూరెన్స్‌ను ఎవరైనా అవసరం వచ్చినప్పుడు కాదు, ముందుగానే కొనుగోలు చేస్తారు. బంగారంపై పెట్టుబడి కూడా అంతే.. పెరుగుతున్నపుడు కొనడం సరైన పెట్టుబడి విధానం కాదు. ప్రధాని పిలుపు బంగారం వినియోగం కోసం కొనేవారి విషయంలో సరైనదే. ముఖ్యంగా నగలు కొనేవారు దానిని సీరియస్‌గానే తీసుకోవాలి. ఇప్పటికే 5 నుంచి 10 శాతం సరైన గోల్డ్ అలొకేషన్ కలిగిన పెట్టుబడిదారు తన పోర్ట్‌ఫోలియోను కదిలించాల్సిన పనిలేదు. మొదటి నుంచి పెట్టుబడి ప్రణాళిక సరైనదైతే ఇప్పుడు చేయాల్సింది దానికి కట్టుబడి ఉండటమే.చరిత్ర ఏం చెబుతోంది?2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ బాండ్ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. దాంతో రూపాయి సహా అనేక ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలు బలహీనపడ్డాయి. 2020 కరోనా సంక్షోభం, 2022 ఎనర్జీ క్రైసిస్ సమయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సందర్భంలో రూపాయి బలహీనపడగా, ఈక్విటీలు నష్టపోగా, గోల్డ్ ధరలు మాత్రం పెరిగాయి. ఆ సమయంలో కొంత బంగారం కలిగి ఉన్న పోర్ట్‌ఫోలియోలు మాత్రమే సంక్షోభాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఇక్కడ గమనించాల్సింది ఒకటే బంగారం మిమ్మల్ని ధనవంతులను చేయడానికి కాదు, మీ సంపద పెంచడానికి కాదు మార్కెట్ కష్టకాలంలో మీ ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని.– సాక్షి, వెల్త్ డెస్క్ -
గగనతలంలో మోదీకి స్వీడన్ యుద్ధ విమానాల ఎస్కార్ట్
గోతెన్‌బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనకు ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని సూచిస్తూ స్వీడన్ గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ప్రవేశించిన సమయంలో ఆ దేశ గ్రిపెన్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.గ్రిపెన్ యుద్ధ విమానం గగనతల రక్షణ, శత్రు లక్ష్యాలపై దాడులు, గూఢచారి సమాచార సేకరణ వంటి పలు విధుల్లో ఉపయోగపడుతుంది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, క్షిపణి దాడి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.ఈ విమానాలకు వేగంగా టేకాఫ్ తీసుకోవడం, చిన్న రన్‌వేలపై కూడా పనిచేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై నుంచి కూడా ఆపరేట్ చేసేలా దీనిని రూపొందించారు. గ్రిపెన్లో అధునాతన డేటా లింక్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఇతర యుద్ధ విమానాలు, ఆర్మీ, రాడార్ కేంద్రాలతో వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.స్వీడన్లో 2 రోజుల పర్యటన స్వీడన్ నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ పర్యటనల్లో కీలక దౌత్య కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన ఉత్సాహంతో కనిపించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మే 17-18 తేదీల్లో స్వీడన్లో పర్యటిస్తున్నారు.ఈ రెండు రోజుల కీలక పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఈ సమావేశాన్ని కీలక దౌత్య ఘట్టంగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని నార్డిక్ (ఉత్తర యూరప్ ప్రాంతంలో ఉన్న దేశాల సమూహం) దేశంలో పర్యటన చేపడుతున్నారు. నార్డిక్ దేశాల్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ దేశాలు ఉంటాయి.“2018లో జరిగిన తొలి ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని గతంలో స్వీడన్ పర్యటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ప్రధాని క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భారత్-స్వీడన్ సంబంధాలన్నింటినీ సమీక్షించి కీలక రంగాల్లో కొత్త సహకార అవకాశాలను గుర్తించనున్నారు.ఈ ఉన్నతస్థాయి చర్చలు భారత్, స్వీడన్ మధ్య ఆర్థిక, వాణిజ్య సత్సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది. సాంప్రదాయ వాణిజ్య రంగాలకే పరిమితం కాకుండా.. గ్రీన్ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల బలోపేతం, రక్షణ తయారీ, అంతరిక్ష సహకారం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై కూడా చర్చలు జరగనున్నాయి.ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో యూరప్‌లో ప్రముఖ దేశంగా స్వీడన్‌కు గుర్తింపు ఉంది. భవిష్యత్ రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.#WATCH | Swedish Gripen fighter jets escort PM Narendra Modi’s plane as he enters SwedenPM Modi is visiting Gothenburg, Sweden, on May 17-18 at the invitation of Swedish Prime Minister Ulf Kristersson. pic.twitter.com/m2Rgoxg3x8— ANI (@ANI) May 17, 2026 -
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
ఐపీఎల్ 2026 సీజన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు ఈ డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రాన్ని జపించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బాఘేల్ తాజాగా స్పందించారు. సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ.. ఐపీఎల్‌ను వెంటనే నిలిపివేయాలని మోదీని కోరారు. స్టేడియాలకు వేలాది మంది అభిమానులు ప్రయాణించడం వల్ల భారీగా ఇంధనం వినియోగమవుతోందని, విదేశీ ఆటగాళ్లకు డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయని, బెట్టింగ్ కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు."ప్రధానమంత్రి గారు, వెంటనే ఐపీఎల్‌ను ఆపేయండి. దీంతో ఇంధనం ఆదా అవుతుంది. విదేశీ కరెన్సీ చెల్లింపులు తగ్గుతాయి. బెట్టింగ్ కూడా ఆగుతుంది" అంటూ బాఘేల్ తన పోస్టులో రాసుకొచ్చారు.బాఘేల్ చేసిన ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు బాఘేల్ వర్షన్‌ను సమర్దిస్తూ ఐపీఎల్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీ కేవలం మాటలకే పరిమితం కాకుండా పొదుపు మంత్రాన్ని ఆచరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై నెట్టింట డిబేట్లు నడుస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఐపీఎల్ నిర్వహకులు నుండి గానీ ఎలాంటి స్పందన లేదు.కాగా, దేశంలో ఇటీవల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. త్వరలో ఈ పెంపు మరింత ఎక్కువ కానుందన్న సంకేతాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలో ఇంధనంతో ముడిపడి ఉన్న ఐపీఎల్‌ను కొనసాగించడం సబబు కాదని సగటు భారతీయుడు అభిప్రాయపడుతున్నాడు.మరోపక్క ఇంకో వర్షన్ కూడా వినిపిస్తుంది. టోర్నీ ముగియడానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఈ దశలో సస్పెండ్ చేస్తే భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ ఆదాయం, ఫ్రాంచైజీల వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. -
గొప్ప కలలున్నాయి
ద హేగ్: భారత్ అంటే అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పునకు లోనవుతోందని తెలిపారు. భారతదేశ ఆకాంక్షలు ఇకపై సరిహద్దులకే పరిమితం కాబోవని అన్నారు. ప్రధాని మోదీ శనివారం నెదర్లాండ్స్‌లో పర్యటించారు. రాజధాని ద హేగ్‌లో ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. భారత్ నేడు గొప్ప కలలు కంటోందని, దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో దేశం అవకాశాలకు మారుపేరుగా మారిందన్నారు. సాంకేతికతతోపాటు మానవతా దృక్పథంతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. మన దేశం ఎంత ప్రాచీనమైనదో, అంతే ఆధునికంగా కూడా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. భారత్‌లోని పూర్వీకుల స్వగ్రామాలతో మళ్లీ అనుబంధం పెంచుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రవాస భారతీయులకు సూచించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’దిశగా సాగుతున్న ప్రయాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల మన దేశ శక్తిసామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని వెల్లడించారు. ‘ఇదీ మోదీ గ్యారంటీ’అంటూ నెదర్లాండ్స్‌లోని భారతీయులకు, భారత మూలాలున్న ప్రజలకు హామీ ఇచ్చారు. అద్భుతాలు సృష్టిస్తున్న స్టార్టప్‌లు ‘‘ఈ రోజు మన దేశం చాలా పెద్ద ఎత్తున కలలు కంటోంది. కేవలం మార్పును కాదు.. ఉత్తమమైన మార్పును కోరుతోంది. అత్యంత వేగవంతమైన మార్పు కావాలని ఆకాంక్షిస్తోంది. ఆకాశమే హద్దుగా ఉన్నతస్థాయికి ఎదగాలని యువత భావిస్తోంది. ఇండియాలో స్టార్టప్ వ్యవస్థ బలోపేతం కావడానికి ఇదే అసలు కారణం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలో ఉంది. 2014లో కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 125కి చేరుకుంది. తులిప్‌లు, తామర పువ్వులు భారతదేశ ఆకాంక్షలు కేవలం దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని, హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా నిలవాలని, ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా మారాలని తపన పడుతోంది. దేశం నేడు గొప్ప మార్పును వీక్షిస్తోంది. ఇటీవలే ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సును విజయవంతంగా నిర్వహించాం. అంతకంటే ముందు జీ20 సదస్సు జరిగింది. ఇవి కేవలం ఒక్కసారి జరిగిన సంఘటనలు కావు. అతిపెద్ద కార్యక్రమాలు నిర్వహించడం నేటి భారతదేశపు లక్షణంగా, విశ్వాసంగా మారింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య బంధం విడదీయరానిది. ఇంధన భద్రత నుంచి జల భద్రత వరకు ఇరుదేశాలు సన్నిహితంగా సహకరించుకుంటున్నాయి. నెదర్లాండ్స్ తులిప్‌లకు, భారత్ తామర పువ్వులకు ప్రసిద్ధి. మూలాలు నీటిలో ఉన్నా, భూమిలో ఉన్నా.. సరైన పోషణతో వృద్ధి చెందగలవని తులిప్, తామర పువ్వులు మనకు సందేశాన్నిస్తున్నాయి. భారత్, నెదర్లాండ్స్ భాగస్వామ్యానికి కూడా ఇదే పునాది. ఓటింగ్‌లో కొత్త రికార్డులు గర్వకారణం అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం నుంచి 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యింది. ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఓటింగ్‌లో కొత్త రికార్డులు నమోదవుతుండడం గర్వంగా ఉంది. బెంగాల్ చిరుతిండి ఝాల్మురీ నెదర్లాండ్స్ దాకా చేరిందో లేదో ఇక్కడి భారతీయులే చెప్పాలి. నేను ఇక్కడికి రాగానే నినాదాలతో నన్ను స్వాగతించిన విధానం అమితంగా ఆకట్టుకుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ దంపతులతో మోదీ భేటీ నెదర్లాండ్స్ రాజు విల్లెమ్–అలెగ్జాండర్, రాణి మక్సిమా దంపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాయల్ ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీలో భారత్–నెదర్లాండ్స్ సంబంధాలపై చర్చించారు. చోళుల రాగి ఫలకాలు భారత్‌కు అప్పగింత 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలను నెదర్లాండ్స్ శనివారం భారత్‌కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రోబ్ జెటెన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్‌లో లీడెన్ ప్లేట్లుగా పిలిచే అనైమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ–1 తన కుమారుడైన రాజరాజ చోళ–2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వపు ముఖ్యమైన కళాఖండాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ–1 కాలానికి సంబంధించినవని చెబుతున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టి ఉంచారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్ నుంచి నెదర్లాండ్స్‌కు చేరాయి. రాగి ఫలకాలు తిరిగి భారత్‌కు అందడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన క్షణమని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇన్నాళ్లూ ఈ రాగి ప్లేట్లను భద్రపర్చినందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, లీడెన్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. -
నీట్ అవకతవకలపై ప్రధానికి కేతిరెడ్డి లేఖ
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ (యూజీ) పరీక్ష అవకతవకల అంశంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్ష రద్దులు, పునఃపరీక్షల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమైన విద్యార్థులు పరీక్ష అనంతరం ఎదురైన వివాదాల వల్ల నిరాశ, ఆందోళనకు లోనవుతున్నారని తెలిపారు.దేశంలోని అనేక మంది విద్యార్థులు కోచింగ్, ప్రయాణం, వసతి కోసం భారీగా ఖర్చు పెట్టి పరీక్షలకు హాజరయ్యారని, ఇప్పుడు మళ్లీ అదే పరీక్షా ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించే ముందు పరీక్షా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, భద్రంగా, బాధ్యతాయుతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ఏడాది ఏర్పడిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కనీసం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే అయినా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్య ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. -
‘‘ప్రతి ఏడాది భారత్‌లో ఆ రికార్డులు బద్దలవుతున్నాయి’’
ది హేగ్: ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ ఆర్నాల్డస్ జెట్టెన్‌తో సమావేశం కానున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి.ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో రియర్ అడ్మిరల్ లుడ్గర్ బ్రుమ్మెలార్, అజుటెంట్ జనరల్, హిస్ మజెస్టీ ది కింగ్ సైనిక విభాగం చీఫ్, డచ్ విదేశాంగ మంత్రి టామ్ బెరెండ్సెన్, నెదర్లాండ్స్‌లో భారత రాయబారి కుమార్ తుహిన్, డచ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు మోదీకి స్వాగతం పలికారు.వాణిజ్యం, పెట్టుబడులు, నీరు, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకే పరిమితం కాకుండా భారత్-నెదర్లాండ్స్ సహకారం గత కొన్నేళ్లలో బాగా పెరిగింది. సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, విద్య, సముద్ర రంగాల్లో భాగస్వామ్యం బలపడిందని విదేశాంగ శాఖ తెలిపింది.నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. “ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80–90% ఓటింగ్ నమోదైంది. మహిళలు కూడా భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు... ప్రతి ఏడాది ఓటింగ్ రికార్డులు బద్దలవుతున్నాయి. 2014లో భారత్‌లో కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవి. ఇప్పుడు భారత్‌లో దాదాపు 125 క్రియాశీల యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. స్టార్టప్‌లు ఇప్పుడు కృత్రిమ మేధస్సు, రక్షణ, అంతరిక్ష రంగాల్లో విశేషంగా పని చేస్తున్నాయి. పరిశోధన, ఆవిష్కరణల సంస్కృతి ఇప్పుడు మరింత విస్తరిస్తోంది.ఇప్పుడు భారత్ పెద్ద పెద్ద కలలు కంటోంది. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్ల రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారత యువత ఆశిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లోనే ఉంది. ఆధునిక భారత్ ఎన్నడూ లేని మార్పుల దశలో సాగుతోంది. ప్రపంచంలోనే ప్రభుత్వ నిధులతో నడిచే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని దేశం అమలు చేస్తోంది.సరిగ్గా ఇదే రోజు 2014 మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దశాబ్దాల తర్వాత పూర్తి మెజారిటీతో స్థిర ప్రభుత్వాన్ని భారత్ పొందబోతోందని అప్పుడే స్పష్టమైంది. కోట్లాది మంది భారతీయుల విశ్వాసం నన్ను ఆగనివ్వకుండా చేస్తోంది.. అలసట చెందకుండా చేస్తోంది.. నిరంతరం ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా... 12 ఏళ్లు ప్రధానమంత్రిగా సేవలు అందించాను... ప్రజాస్వామ్య ప్రపంచంలో 25 ఏళ్ల పాటు కోట్లాది ఓటర్ల మద్దతు దక్కింది... ఇది నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మీ ఆశీర్వాదం. అదే నా అతిపెద్ద సంపద’’ అని మోదీ అన్నారు. -
పెట్రో ధరల పెంపు.. కేంద్రంపై రేవంత్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెట్రో ధరల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. అలాగే, యువత ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పెట్రో ధరల పెంపుపై స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్..‘పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదు. ధరల పెంపుతో నిత్యాసరాల రేట్లు పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తుంది. అనేక రంగాలపై దీని ప్రభావం పడుతుంది. మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, యువత ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయింది.ఎన్నికలు ముగిసిన పది రోజులకే లీటరుకు మూడు రూపాయలకు పైగా పెంచడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇది ముమ్మాటికీ విశ్వాస ఘాతుకం. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా చెప్పుకుంటారు?. పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప… ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలింది. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరింది’ అని మండిపడ్డారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుంది. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల…— Revanth Reddy (@revanth_anumula) May 16, 2026 -
భారత్‌కు ఇంధన భద్రత
అబూదాబీ: పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం అబూదాబీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్తో సమావేశమయ్యారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంతోపాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కీలక ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. భారత్‌లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ ముందుకొచ్చిందని మోదీ వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మొదట యూఏఈలో పర్యటించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అబూదాబీలో ఉన్నారు. యూఏఈ అధ్యక్షుడితో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. యూఏఈపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అరబ్ ఎమిరేట్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితిని యూఏఈ సంయమనంతో ఎదుర్కొన్న తీరు నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ గుర్తుచేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని తేల్చిచెప్పారు. వివాదాలు, ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏడు రంగాల్లో వ్యూహాత్మక సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. యూఏఈ పర్యటనలో భాగంగా ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, అధునాతన సాంకేతికత వంటి రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇది భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. భారత్‌లో భారీగా పెట్టుబడులకు యూఏఈ సిద్ధం కావడం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. యూఏఈలో సంక్షిప్తమైన, అత్యంత ఫలవంతమైన పర్యటన జరిగిందన్నారు. భారత్–యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తన సోదరుడు అల్–నహ్యాన్తో చర్చించానని పేర్కొన్నారు. ఈ పర్యటన ఫలితాలు ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి శ్రేయస్సుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు ఉద్ఘాటించారు. అంతకుముందు అబూదాబీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి అల్–నహ్యాన్ స్వయంగా స్వాగతం పలికారు. మోదీ పర్యటనకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధి భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పరిరక్షించే బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజరŠవ్స్ లిమిటెడ్ వ్యూహాత్మక సహకారమే లక్ష్యంగా అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల భారత్‌కు ఇంధన భద్రత చేకూరుతుంది. భారతదేశ పెట్రోలియం నిల్వలను పెంపొందించడంతోపాటు ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలను బలోపేతం చేయడానికి అబూదాబీ సంస్థ సహకరిస్తుంది. ఇండియాకు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా, ఆర్థిక స్థిరత్వం, ఇంధన భాగస్వామ్యం లక్ష్యంగా ఎల్పీజీ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, నూతనఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, జాతీయ, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పైనా సంతకాలు చేశారు. గుజరాత్లో ఓడ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, ఓడరేవులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరో ఒప్పందం కుదిరింది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇంకో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్‌లో ఏఐ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఒక సూపర్ కంప్యూటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి ఆరో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించినది ఏడో ఒప్పందం. మోదీ విమానానికి ఎస్కార్ట్‌గా యూఏఈ యుద్ధ విమానం ప్రధాని మోదీ పట్ల యూఏఈ ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత యూఏఈకి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానం ఎయిర్‌పోర్టు దాకా ఎస్కార్ట్‌గా వచ్చింది. ఇది భారతీయులందరికీ దక్కిన గౌరవమని మోదీ యూఏఈ అధ్యక్షుడితో చెప్పారు. ఎయిర్‌పోర్టులో తనకు స్వయంగా స్వాగతం పలికిన అల్–నహ్యాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
మోదీ చెప్పినా వినట్లేదు.. బంగారం కొనేందుకు ఎగబడుతున్న జనం..
-
పెట్రో ధరల పెంపు.. కేంద్రం తొలి స్పందన ఇదే..
ఢిల్లీ: దేశంలో పెట్రో రేట్ల పెంపుపై కేంద్రంగా తొలిసారిగా స్పందించింది. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. అన్ని దేశాల కంటే భారత్‌లోనే పెట్రో రేట్లు తక్కువగా పెరిగాయని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ..‘పశ్చిమాసియా పరిణామాలతో చమురు ధరలు పెరిగినా భారత్ మాత్రం ప్రజలపై భారం మోపలేదు. మిగతా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను 20-100 శాతం పెంచాయి. కానీ, భారత్‌లో మాత్రం పెట్రోల్‌పై 3.2 శాతం, డీజిల్‌పై 3.4 శాతం పెరిగింది. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. ఇది బాధ్యతతో కూడిన పరిపాలన. ఇది ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం. నాయకత్వంలో, భారతదేశం ఆర్థిక స్థిరత్వాన్ని, ప్రజా సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూనే ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.As the world battled rising fuel costs after the West Asia conflict, India stood apart. While several countries witnessed petrol & diesel hikes ranging from 20% to nearly 100%, India limited the increase to just +3.2% for petrol & +3.4% for diesel.Even as Brent crude crossed… pic.twitter.com/nbyiBbhhC9— Kiren Rijiju (@KirenRijiju) May 15, 2026ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్ నుంచి(ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది.భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. -
పొదుపా పాడా.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు చెప్పడంతో సామాన్యుడిపై పిడుగు గ్యారెంటీ అనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్లే.. మొన్న కమర్షియల్ గ్యాస్.. నిన్న పాలు, కూరగాయలు.. రేట్లు పెరుగుతూ వచ్చాయి. తాజాగా.. ఇంధన ధరలు పెరగడంతో విపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎన్నికలు కావడంతో ప్రధాని మోదీ వసూళ్లు మొదలుపెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. మోదీని ద్రవ్యోల్బణం మనిషి(Mehngai Man Modi)గా అభివర్ణిస్తూ.. ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడింది. ఇంధన పొదుపు పేరిట కొత్త డ్రామాలకు తెర తీశారని.. విదేశీ ప్రయాణాలు వద్దంటూనే ఇప్పుడు ఆయనే విదేశాలకు వెళ్లాడని ఆ పార్టీ కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పెరుగుదలను దయనీయమైన పరిస్థితిగా పేర్కొంది. అదే సమయంలో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తుందా? అని ప్రశ్నించింది. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ సర్కాన్‌ను సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశారు. పెట్రోల్ రేట్లు పెరగడం.. సైకిల్(సమాజ్‌వాదీ గుర్తు)నే భవిష్యత్తు అంటూ కార్టూన్ షేర్ చేశారు.దేశవ్యాప్తంగా పెట్రో రేట్లు తప్పవనే ఊహాగానాలు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలయ్యాక అది ఉండొచ్చని అంతా భావించారు. ఈ మధ్యలో పెంపు వార్తలను కొట్టేసిన కేంద్రం.. సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికలయ్యాక ప్రధాని మోదీ ఇంధన పొదుపు వ్యాఖ్యలు చేయడం.. ఆ వెంటనే కేంద్ర పెట్రోలియం శాఖ సైతం పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ పెట్రోల్, డీజిల్‌పైన రూ.3 చొప్పున పెంపును ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. -
యూఏఈకి బయిలుదేరిన మోదీ
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనకు బయిలుదేరారు. ఈ రోజు ( శుక్రవారం) నుంచి ఈ నెల 20 వరకూ ఆయన పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో మోదీ పర్యటించనున్నారు. ఆయా దేశాధినేతలతో కీలక చర్చలు ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు.ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ తొలుత యూఏఈకి వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. అనంతరం అబుదాబిలో యూఏఈ అధినేతతో భోజనం చేస్తారు. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఇంధనంపై ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ నుంచి భారత్‌కు అధికంగా చమురు సరఫరా జరిగేలా ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. యూఏఈ పర్యటన తర్వాత యూరప్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు. -
నిష్పాక్షిక ఎన్నికలు రాజ్యాంగంలో భాగం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల విధానం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వతంత్ర ఎన్నికల కమిషన్‌తోనే ఇది సాధ్యమంది. స్వతంత్రంగా కనిపిస్తేనే చాలదు. అది కచ్చితంగా స్వతంత్రంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై ఆఖరు రోజు గురువారం వాదనలు కొనసాగాయి.ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సిఫారసు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుందంటూ కేంద్రం సవరించిన నిబంధనలు 2024 జనవరిలో అమల్లోకి వచ్చాయి. ఈ త్రిసభ ఎంపిక కమిటీలో అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రభుత్వం చేర్చింది. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పైవ్యాఖ్యలు చేసింది.అయితే, ఈసీ నియామకాల విషయంలో పార్లమెంట్‌కు పూర్తి అధికారముందని, న్యాయ వ్యవస్థ జోక్యం తగదని అటార్నీ జనరల్ వెంకటరమణి గట్టిగా వాదించగా ఈ విషయంలో ‘మా లక్ష్మణ రేఖ ఏమిటో మాకు తెలుసు. మేం ఎన్నటికీ ఆ గీత దాటము’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్ భేటీ
న్యూఢిల్లీ: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా పరిణామాలతోపాటు పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. వివాదాలు, సంఘర్షణల పరిష్కారానికి సంప్రదింపులు, దౌత్య మార్గాలకే భారత్ స్థిరంగా కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లావ్రోవ్ను నందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాల పురోగతిపై తాజా సమాచారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశానని వెల్లడించారు. రష్యా అధినేత పుతిన్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని లావ్రోవ్ను మోదీ కోరారు. మోదీని కలిసిన ‘బ్రిక్స్’విదేశాంగ మంత్రులు బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీని కలిశారు. ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చారు. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, బ్రెజిల్ మంత్రి మౌరో, ఇండోనేíÙయా మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా మంత్రి రోనాల్డ్ లామోలా ఉమ్మడిగా మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు బ్రిక్స్దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సు గురువారం ప్రారంభమైంది. -
పొదుపు సత్యాగ్రహం పనికొచ్చేనా?
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 11 నిర్దిష్ట అభ్యర్థనలు చేశారు. మరీ అవసరమైతే తప్పించి బంగారం కొనవద్దు, విదేశీ విహారయాత్రలకు వెళ్ళ వద్దు అన్నారు. ఎరువులు, వంటనూనెల వాడకం తగ్గించమన్నారు. సౌర శక్తితో నడిచే పంపుల ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. దీన్ని ప్రభుత్వం ధరలను పెంచేందుకు చేస్తున్న ముందస్తు సన్నాహంగా చాలామంది భావిస్తున్నారు. కానీ, మోదీ ప్రసంగంలో అంతకుమించిన పెద్ద ఆశయమే ఉంది. విదేశీ మారక ద్రవ్యాన్ని (ఫారెక్స్) సంరక్షించుకోవడాన్ని సిసలైన జాతీయ ఉద్యమంగా మార్చాలన్నది ఆయన కోరిక. మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. అలాంటి స్ఫూర్తితో మొత్తం జాతిని సమీకరించాలని ప్రధాని భావన. జాతీయ జెండాను ఎగురవేయడం దేశభక్తిని ఎలా చాటుతుందో... విదేశీ మారకద్రవ్య సంరక్షణకు తోడ్పడటం కూడా అంతే దేశభక్తి పూర్వకమైన చర్యకిందకు వస్తుందని ఆయన చెబుతున్నారు. ప్రధాని అభిమతం అభినందించదగిందే. ముడి చమురు, ఎరువుల తయారీకి అవసరమైన వస్తువులు, బంగారం, వంట నూనెలకు మనం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఈ బలహీనతను గుర్తించి దశాబ్దాలు గడుస్తున్నా విరుగుడు చర్యలను తీసుకున్నది లేదు. మోదీ దాన్ని ఇప్పుడు స్పష్టంగా వివరిస్తున్నారు. దైనందిన ‘ఫారెక్స్’ చెల్లింపులకు వ్యక్తిగత బాధ్యతను జోడిస్తున్నారు.గత ఉదంతాలులాల్ బహదూర్ శాస్త్రి 1965లో ఆహారం విషయంలో ఇదే తరహాలో పిలుపునిచ్చారు. దేశం యుద్ధాన్ని, ఆహార ధాన్యాల కొర తను ఎదుర్కొంటున్న ఆ కాలంలో సోమవారం సాయంత్రాలు స్వచ్ఛందంగా ఉపవాసం ఉండవలసిందిగా శాస్త్రి విజ్ఞప్తి చేశారు. సోషలిస్టు పార్లమెంటేరియన్ మధు లిమాయే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళారు. జాతీయ సంక్షోభాల సమయంలో స్వచ్ఛందంగా నిరాడంబర జీవితాన్ని గడపడం పౌరుల రాజ్యాంగపరమైన విధిగా లిమాయే ఒక సందర్భంలో పార్లమెంట్లో పేర్కొన్నారు. గాంధీ ఉప్పు సత్యాగ్రహం నైతిక శక్తిని సమీకరించుకోవడంలో ఉప్పుపై బ్రిటిష్ వాళ్ళు వేసిన పన్ను కూడా కొంత దోహదపడింది. ఉప్పుపైన పన్నుకన్నా దారుణమైన తిరోగమన చర్య మరొకటి ఉండదు. పైగా, అది పేదలను మరింత దెబ్బతీసింది. ఈ రకమైన అన్యాయం కారణంగానే గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టవలసి వచ్చింది. కానీ, ‘ఫారెక్స్’ సంరక్షణ ఉద్యమం ఏదో అన్యాయానికి వ్యతిరేకంగా చేపడుతున్నది కాదు. అసలది స్వభావరీత్యానే తిరోగ మనమైనది. విదేశీ పైకం తక్కువ ఉన్నవారిని బాధను మాత్రం ఎక్కువ పంచుకోవాల్సిందిగా కోరుతోంది.లోపించిన సమానత్వంప్రధాని 11 అభ్యర్థనలను ఈ కోణం నుంచే చూడాలి. విదే శాలకు విహారయాత్రలకు వెళ్లడం, విదేశాల్లో ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళి పెళ్ళిచేసుకోవడం వంటివి పునరాలోచించవలసిన అవసరం ధనికులకే ఉంది. పేదవాళ్ళకు అది సంబంధం లేని విషయం. ఎలక్ట్రిక్ వాహనానికి మళ్ళాలన్నా దాన్ని కొనగలిగిన శక్తి ముందు ఉండాలి. ఇంటి నుంచి పనిచేయడం వైట్‌కాలర్ వృత్తి నిపుణులకు ఉన్న అవకాశం. దినసరి కార్మికులకు కాదు. వంట నూనె విలాసవంతమైన సరుకు కాదు. దాని వినియోగాన్ని తగ్గించుకోమనడం సాధా రణ ప్రజానీకానికి రుచించని విషయం. ప్రధాని అభ్యర్థనలలో కొన్ని సంపన్నులను దృష్టిలో పెట్టుకుని సరిగ్గా చేసినవే. మిగిలినవి మాత్రం దామాషాకు మించి త్యాగాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతిరోజూ దాదాపు 1,600 నుండి 1,700 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయి. గత పది వారాల్లో ఈ నష్టం ఒక లక్ష కోట్లు దాటింది. పెట్రోల్ మీద లీటరుకు రూ. 14, డీజిల్ మీద రూ. 18 చొప్పున నష్టం వస్తోంది. సామాన్యులపై భారం పడకుండా ఎక్సైజ్ సుంకంలో పెడుతున్న కోతల వల్ల కోశాగారానికి నెలకు రూ. 14,000 కోట్లకు పైగా ఖర్చవు తోంది. ఎరువులపై సబ్సిడీలు రూ. 1.71 లక్షల కోట్లుగా బడ్జెట్ వేసుకున్నారు. ఇప్పుడవి రూ. 35,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లను మించిపోయేవిగా ఉన్నాయి. బంగారం దిగుమతులు తగ్గించుకోవడం, విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవడం వంటివి కరెంట్ అకౌంట్‌కు నిజంగానే సహాయపడతాయి. కానీ, ఇంధన ధరల పెంపు పూర్తిగా భిన్నమైంది. అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ప్రభుత్వ ఆదాయ సమీకరణకు కూడా ఒత్తిడి పెరుగుతోంది. పన్నులు కట్టాలని ఆదాయ పన్ను శాఖ చేసిన డిమాండ్ కొన్ని అప్పీళ్లలో చెల్లుబాటు అయింది. దాని ప్రకారం రూ. 2.57 లక్షల కోట్ల వసూలుపై దృష్టి పెట్టవలసిందిగా 2026–27 ఆదాయ పన్ను శాఖ కేంద్ర కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తోంది. దీని ప్రకారం ‘పాన్’ కార్డులను ఆధారం చేసుకుని టాప్ 10 వేలమంది ఎగవేతదార్ల లావాదేవీలను పరిశీలిస్తారు. వర్గీకరించని బకాయిలు కూడా పెద్ద మొత్తంలో రూ. 7.88 లక్షల కోట్లుగా ఉన్నాయి. వాటిని జూలై నాటికి వర్గీకరించాలని నిర్ణయించారు. ముంబయ్ (రూ. 1.65 లక్షల కోట్లు), ఢిల్లీ (రూ. 1.21 లక్షల కోట్లు) వంటి మహా నగరాల నుంచే చాలా పన్నులు వసూలు కావలసి ఉన్నాయి. ఇలా బడా కంపెనీలు, పెద్ద మనుషుల నుంచి వసూలు కావలసిన పన్నులే రూ. 9 లక్షల కోట్ల మేరకు ఉండగా, వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవా లని ప్రభుత్వం ఎలా అడుగుతోంది? సమానత్వం లోపించిన నిరా డంబరత దేశభక్తి కిందకు రాదు.ఆదాయ మార్గాలుఅత్యధిక ఆదాయాలు ఉన్నవారిపై తాత్కాలికంగా సంక్షోభ సర్చార్జినీ, ప్రస్తుత కల్లోల పరిస్థితుల నుంచి లాభం పొందుతున్న కమోడిటీ ట్రేడర్లు, దేశీయ చమురు శుద్ధి కంపెనీలు వంటి సంస్థలపై విండ్‌ఫాల్ లెవీనీ విధించవచ్చు. సంపద పన్ను విధానాన్ని రూపొందిస్తే బహుళ ప్రయోజనాలు నెరవేరుతాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)లో సభ్యత్వం ఉన్న దేశాలు ఒడంబడిక నియమంగా 90 రోజులకు సరిపడ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వులు ఉంచు కుంటాయి. మన దేశ నిల్వలు ప్రస్తుతం సుమారు 9 నుంచి 10 రోజుల డిమాండ్‌ను తీర్చగలిగినవిగా మాత్రమే ఉన్నాయి. మొత్తం చమురు నిల్వలు (వాణిజ్యపరమైనవి, రిఫైనరీల వద్ద ఉన్నవి కూడా కలిపితే) దాదాపు 74–75 రోజులకు సరిపోవచ్చు. సమానత్వం విషయంలో నైతికంగా అభిశంసనకు తావులేనివి కాబట్టే, గాంధీజీ ఉద్యమాలు సఫలమయ్యాయి. ఇది భారతదేశపు ‘ఫారెక్స్’ సత్యాగ్రహమైతే, ఆశయానికి తగ్గట్లుగానే దాని రూప కల్పన కూడా ఉండాలి. భారాన్ని పంచుకోవడంలో అది ప్రగతిశీల మైనదిగా ఉండాలి. అమలులో నిష్కర్షత్వం చూపాలి. సంస్థాగత మైన విరుగుడు, ధరల పెంపుదలలో నిజాయతీ లేకుండా స్వచ్ఛందంగా ఎవరెంత సంయమనం పాటించినా ఫలితం ఉండదు. అజీత్ రానాడేవ్యాసకర్త ఆర్థికవేత్త (‘ద బిలియన్ ప్రెస్’ సౌజన్యంతో) -
ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురువారం లేఖ రాశారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించాలని ఆ లేఖలో కోరారు. గ్రామీణ మహిళలకు అత్యధిక ఉపాధి ఇస్తున్న రాష్ట్ర టెక్స్టైల్ రంగం సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు పెరిగి తీవ్ర సంక్షోభం ఏర్పడిందని విజయ్ తెలిపారు.“తమిళనాడు భారత్‌లోనే టెక్స్టైల్, అపారెల్ ఎగుమతి చేసే అతిపెద్ద రాష్ట్రం. లక్షలాది మంది ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ రంగంపై ఆధారపడుతున్నారు. ఇటీవల పత్తి ధరలు, దాని ప్రభావంతో నూలు ధరలు పెరగడం వల్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం దీనికి ప్రధాన కారణం” అని ఆయన లేఖలో రాశారు.గత 2 నెలల్లో పత్తి ధరలు 25 శాతం పెరిగాయని తెలిపారు. ఒక్క క్యాండీ ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగిందని చెప్పారు. నూలు ధరలు కూడా కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగాయని, దీనివల్ల పరిశ్రమకు ముడి సరుకు కొరత తీవ్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు.“గత 2 నెలల్లో పత్తి ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగింది. ఇది 25 శాతం పెరుగుదల. అదే సమయంలో నూలు ధర కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ముడి సరుకు నిరంతర సరఫరా దిగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం ఉంది” అని ఆయన తెలిపారు. వ్యవసాయం తర్వాత టెక్స్టైల్స్, అపారెల్ రంగం అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగమని ముఖ్యమంత్రి విజయ్ తెలిపారు.“ఇలాంటి పరిస్థితుల్లో సుంకం లేకుండా పత్తి దిగుమతులకు అనుమతి ఇస్తే ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోగలదు. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోకుండా కాపాడడం, టెక్స్టైల్ విలువ స్థిరత్వాన్ని కాపాడటం ప్రభుత్వంపై ఉన్న బాధ్యత” అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని 0 శాతానికి తగ్గించి ముడి సరుకు లభ్యతకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు. -
మోదీ పిలుపుతో.. హర్ష్ గోయెంకా కీలక సూచనలు!
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో.. పొదుపు, ఖర్చుల విషయంపై నరేంద్ర మోదీ కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు.ఖర్చులను, ప్రయాణాలను తగ్గించుకోవాలని, వర్క్-ఫ్రమ్-హోమ్‌ను ప్రోత్సహించాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరివర్తనను వేగవంతం చేయాలని హర్ష్ గోయెంకా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక నోట్ ద్వారా వెల్లడించారు.విదేశీ ప్రయాణాలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలని, దేశీయ విమాన ప్రయాణాలను కూడా తగ్గించాలని సూచించారు. అంతే కాకుండా.. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లి సమావేశాలు నిర్వహించదానికి బదులు, ఆన్లైన్ సమావేశాలను నిర్వహించాలని కోరారు. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని అన్నారు.We in RPG have responded to our PM’s call with austerity and responsible resource allocations. I hope other corporates will follow suit. pic.twitter.com/Bhv0RVUFjq— Harsh Goenka (@hvgoenka) May 14, 2026ఉద్యోగుల పని విధానంలో కూడా మార్పులు సూచించారు. ఇంటి నుంచే పని చేయగల ఉద్యోగులను ''వర్క్ ఫ్రమ్ హోమ్'' విధానంలో పనిచేయాలని ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఈ విధానం విజయవంతంగా అమలైనందున, ఇప్పుడు కూడా అది ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ.. సంస్థకు సంబంధించిన భవిష్యత్ వాహనాలన్నీ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించారు. దీని ద్వారా ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు కార్‌పూలింగ్ లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
2 వాహనాలతో మోదీ కాన్వాయ్ 8 వాహనాలతో లోకేష్ కాన్వాయ్
-
ఢిల్లీలో వర్క్ ఫ్రమ్ హోమ్..!
ఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఇందన పొదుపు పాటించాలనే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అందుకు శ్రీకారం చుట్టింది ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించి తద్వారా ఇంధనం వాడకాన్ని తగ్గించాలనే యోచనతో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోమ్‌కు నడుంబిగించింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఈ మేరకు గురువారం( మే 14వ తేదీ) ఆదేశాలు జారీ చేసిన సీఎం రేఖా గుప్తా.. దీన్ని రేపట్నుంచే(శుక్రవారం) నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంధన పొదుపు, సమర్థవంతమైన పాలనను ప్రోత్సహించేందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ రాజధానిలో ‘మేరా భారత్ మేరా యోగ్దాన్’ (నా భారతదేశం, నా సహకారం) ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. అదే సమయంలో ప్రతి సోమవారాన్ని 'సోమవారం మెట్రో'గా పాటిస్తామని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ మెట్రోలో ప్రయాణిస్తారని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షిప్తంగా..ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయంరేపటి నుంచి నిర్ణయాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశంసీఎం కాన్వాయ్ లో వాహనాలు నాలుగుకు తగ్గింపునాలుగు వాహనాల్లో రెండు ఎలక్ట్రిక్ వాహనాలునా భారతదేశం- నా సహకారం ఉద్యమాన్ని ప్రారంభించిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంప్రతి సోమవారం "మండే మెట్రో " నిర్వహించనున్న ప్రభుత్వంమంత్రులు అధికారులు ఉద్యోగులు అందరూ ఢిల్లీ మెట్రోలోనే రావాలని ఆదేశంసామాన్య ప్రజలు వారంలో ఏదో ఒక రోజును నో వెహికిల్ డే నిర్వహించాలని ఆదేశంఆరు నెలల వరకు పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయొద్దని నిర్ణయంట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 10% పెంపుఏడాది విదేశీ ప్రయాణాలు పూర్తిగా రద్దు90 రోజులపాటు మై ఇండియా మై కాంట్రిబ్యూషన్ ఉద్యమం -
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే బాగుంటుందన్న ప్రధాని
-
కేంద్రం.. ఆమోదమా? తిరస్కారమా?
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ పై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అనుమతి కోసం ఇప్పటికే సీఎం రేవంత్ సహా అధికారుల బృందం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీఎం మరోసారి ప్రధాని మోదీతో మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ 4 రోజుల వ్యవధిలో రెండోసారి కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏడాది కాలంగా ఈ భేటీలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి.. .. సీఎం సహా అధికారుల బృందాలు ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. ఇటీవలి సమావేశాలు మెట్రో రెండో దశపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించినట్లుగా తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి టేకోవర్ చేసింది. రుణాల రీఫైనాన్సింగ్‌తో పాటు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు జూన్‌తో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రెండో దశపై కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు కార్యాచరణను వేగిరం చేసింది.ఇంకా ఎన్నాళ్లు..?రెండోదశకు ప్రణాళికలను రూపొందించి, కేబినెట్ ఆమోదంతో దాదాపు 18 నెలల క్రితమే కేంద్రం అనుమతి కోసం డీపీఆర్‌లను అందజేశారు. ఇటీవల పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి కేంద్రం అనుమతులను అందజేసింది. హైదరాబాద్‌లో రెండో దశను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే రెండో దశలో పేర్కొన్న ‘ఏ’, ‘బి’ విభాగాల కోసం డీపీఆర్‌లను అందజేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి డీపీఆర్‌లు అందలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మొదటి దశ స్వాధీనంతో పాటు వివిధ అంశాలపై కేంద్రానికి స్పష్టమైన నివేదిక అందజేశారు. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సమర్పించింది. దాదాపు రూ.48 వేల కోట్లతో అంచనాలను రూపొందించారు. మొదట.. రెండో దశలోనే ఈ కారిడార్లన్నీ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. కానీ, ఇటీవల సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీకి మూడో దశలో చేపట్టాలని కోరారు. మరోపు మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు అందజేసేందుకు ఏడాది క్రితమే సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి సావరిన్ గ్యారెంటీ లభించక ప్రతిష్ఠంభన నెలకొంది. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా.. మెట్రో రెండో దశ పనులతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రారంభించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికలు సవాల్‌గా మారాయి. పాతబస్తీలో మెట్రో విస్తరణకు భూ సేకరణతో పాటు, రోడ్డు విస్తరణ చేపట్టారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గాన్ని మొదట పూర్తి చేయనున్నారు. కానీ, రెండో దశపై కేంద్రం స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. దీంతో హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
పసిడిపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న బంగారం దిగుమతులు, విదేశీ మారకద్రవ్యంపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన రెండు రోజులకే ఈ దిశగా కఠిన చర్యలకు దిగింది. తగ్గిపోతున్న రూపాయి విలువను కాపాడేందుకు, అవసరం లేని దిగుమతులను కట్టడి చేసేందుకు పసిడి, వెండిపై దిగుమతుల సుంకాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 6 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం చేసింది. ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. బుధవారం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఆభరణాలు, వాటి విడిభాగాలు, కాయిన్లు, కడ్డీలు సహా భౌతిక రూపంలోని దిగుమతులు అన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకీ చర్యలు..? ⇒ కస్టమ్స్ డ్యూటీ పెంచడానికి అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితులను ప్రభుత్వం కార ణంగా పేర్కొంది. అంతర్జాతీయ సంక్షోభాల్లో అవసరంలేని దిగుమతులను నియంత్రించడం స్థూల ఆర్థిక స్థిరత్వానికి సాయం చేస్తుందని అధికారుల వాదన. ⇒ డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టమైన 95.75 స్థాయికి పడిపోయింది. 2025 డిసెంబర్లో 90 స్థాయిలో ఉంటే, ఐదు నెలల్లోనే 6% పతనమైంది. దీంతో దిగుమతులకు మరిన్ని రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం రూపాయి విలువ 84.2 స్థాయిలో ఉండడం గమనార్హం. ⇒ పశ్చిమాసియాలో ఘర్షణలతో సరఫరా సమస్యలు ఏర్పడి, అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. భారత్‌కు ప్రధాన సరఫరా మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరా తగ్గిపోయింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 108 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఈ ధర 70 డాలర్లలోపే ఉండడం గమనార్హం. దీంతో ఎరువుల ధరలూ భారీగా ఎగిశాయి. ⇒ భారీ ధరలపై ముడి చమురు, ఎరువులు, బంగారం దిగుమతుల కోసం డాలర్ల అవసరం అనూహ్యంగా పెరిగింది. దీంతో రూపాయి విలువ బక్కచిక్కిపోతోంది. ఫలితంగా విలువైన విదేశీ మారకం నిల్వలు తరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 27 నాటికి 728.49 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకం నిల్వలు మే 1 నాటికి 690 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కరెంట్ ఖాతా లోటు విస్తరించే రిస్క్ ఏర్పడింది. ⇒ ఆయిల్ అండ్ గ్యాస్ తర్వాత దిగుమతి చేసుకుంటున్న రెండో అత్యంత విలువైన కమోడిటీ పసిడే. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అయిన ముడి చము రు, ఎరువులు, వంట నూనెలు, పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులకే ప్రాధాన్యం ఇస్తూ, అంత అవసరం లేని బంగారం, వెండి ఇతర విలువైన లోహాల డిమాండ్‌ను తగ్గించాలన్నది కేంద్ర సర్కారు యోచన. ⇒ ప్రపంచంలో చైనా తర్వాత భారతే పసిడిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. ఇది ఏటా 700–800 టన్నుల మధ్య ఉంటోంది. 2025–26లో విలువైన లోహాల దిగుమతుల విలువ అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024–25)తో పోల్చి చూస్తే 26.7% పెరిగి 102.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో పసిడి దిగుమతులే 71.98 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. పరిమాణం పరంగా మాత్రం 4.75% తగ్గి 721.03 టన్నులుగా ఉంది. ధరలు పెరిగినప్పటికీ ప్రజల కొనుగోళ్ల విలువ తగ్గలేదని ఈ డేటాతో స్పష్టమవుతోంది. ⇒ తాజా సుంకాల పెంపుతో దిగుమతులు (పరిణామం పరంగా) 10–15% తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా యి. గతంలో సుంకాలు పెంచిన సందర్భాల్లోనే దిగుమతులు తగ్గడం గమనార్హం. ⇒ అధిక సుంకాలతో పసిడి అక్రమ రవాణా పెరిగే ప్రమాదమూ ఉంటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ హెచ్చరించింది. ⇒ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఆర్బీఐ సహా అన్ని సెంట్రల్ బ్యాంక్‌లు విదేశీ మారకం ఆస్తుల్లో బంగారానికి వెయిటేజీని పెంచడం విశేషం. ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇక గృహాల్లో అయితే 30,000 టన్నులు (5 ట్రిలియన్ డాలర్ల విలువ) ఉండొచ్చని అంచనా.సుంకాలు ఇలా.. బంగారం, వెండిపై 5 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి చేరింది. ఒక శాతంగా ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ)ను 5 శాతానికి పెంచారు. మొత్తం కలసి 15 శాతానికి చేరింది. ఇక విక్రయాలపై 3 శాతం జీఎస్టీ కూడా కలుపుకుంటే పసిడి, వెండిపై స్థూల పన్ను భారం ఇంతకుముందున్న 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగింది. ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి కస్టమ్స్ సుంకం పెరగ్గా, దీనికి 3 శాతం జీఎస్టీ జోడిస్తే మొత్తం పన్ను 18.86 శాతానికి చేరినట్టయింది. ధరలు పెరిగిపోవడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడనుంది. అసలు పూర్తి ప్రభావం జూన్ నెల డేటాలో కనిపించనుంది. ఇప్పటికే ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం పెరుగుదలలో బంగారం, వెండి ధరల పాత్ర ఉండడం గమనించొచ్చు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే స్పందిస్తూ.. 10 గ్రాముల బంగారంపై పన్నుల భారం రూ.27,000కు చేరుకున్నట్టు (జీఎస్టీ కూడా కలసి) చెప్పారు. భారం ఎంతంటే..⇒ దిగుమతి పసిడి/వెండి విలువ (ఇన్వాయిస్ ధర, బీమా, రవాణా చార్జీ) రూ.1,00,000 ⇒ దీనిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%= రూ.10,000 ⇒ సర్‌చార్జీ/ఏఐడీసీ బేసిక్ డ్యూటీ 5% = రూ.5,000 ⇒ మొత్తం = 1,15,000 ⇒ దీనిపై 3 శాతం జీఎస్టీ = రూ.3,450 ⇒ పన్ను అనంతరం మొత్తం విలువ రూ.1,18,450 -
మోదీ కాన్వాయ్ ‘తగ్గింపు’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, నాయకులు పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని మోదీ ఇటీవల హైదరాబాద్ పర్యటనలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఇటీవల దేశీయ పర్యటనల్లో ఈ మార్పు కనిపించింది. ఎస్పీజీ ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన భద్రతా అంశాలను కొనసాగిస్తూనే వాహనాల తగ్గింపు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ పర్యటన తర్వాత గుజరాత్, అస్సాం పర్యటనల్లో మోదీ వాహన శ్రేణిలో వాహనాలు తగ్గిపోయాయి. కాన్వాయ్‌ని 50 శాతానికి కుదించాలని, సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. శిలాజ ఇంధనాలతో నడిచే కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దని సూచించినట్లు తెలిపారు. అయితే, కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించినప్పటికీ ప్రధాని భద్రత విషయంలో ఎలాంటి తగ్గింపు లేదని ఎస్పీజీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానమంత్రి పిలుపునకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తనతోపాటు రాష్ట్ర మంత్రుల కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇంధన వినియోగంలో తెలివిగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. తన కాన్వాయ్ పరిమాణాన్ని కనిష్ట స్థాయికి తగ్గించుకుంటున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. మంత్రులు సైతం ఇదే బాటలో నడవాలని సూచించారు. ఇంధన పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యక్తిగత వాహనాలను పక్కనపెట్టి, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. వాహనాలతో ర్యాలీలు చేయొద్దన్నారు. బస్సులు, మెట్రో సేవలను ఉపయోగించుకోవాలి ఢిల్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉపయోగించే అధికారిక వాహనాలపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా పరిమితులు విధించారు. ప్రైవేట్ వాహనాలకు బదులుగా కార్‌పూలింగ్ విధానం పాటించాలని, బస్సులు, మెట్రో సేవలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఢిల్లీ నగర ప్రజలను కోరారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కూడా తన కాన్వాయ్‌ని తగ్గించాలని, ముఖ్యంగా భద్రతాపరమైన అంశంలో అనవసరంగా వాహనాలను ఉపయోగించకూడదని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులు, ప్రజాప్రతినిధులందరూ పొదుపు చర్యలపై వెంటనే దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అధికారిక పర్యటనల కోసం విమానాలను ఉపయోగించే ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి ముందస్తుగా అనుమతి పొందాలని మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు సూచించింది. తాను ఇకపై హెలికాప్టర్లు, విమానాలకు బదులుగా రైళ్లు, రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటానని గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ వెల్లడించారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి అధికారిక కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గిస్తానని తెలిపారు. విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలన్న ప్రధానమంత్రి విజ్ఞప్తి నేపథ్యంలో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్లు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్‡్ష సంఘ్వీ పేర్కొన్నారు. తాను ఉపయోగించే వాహనాల సంఖ్యను సగానికి తగ్గించుకున్నానని, అవసరమైనప్పుడు మాత్రమే అధికారిక పర్యటనలు చేపడతానని బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరీ ప్రకటించారు. తన కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించానని, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలిపారు. హిమాచల్ గవర్నర్ కవిందర్ గుప్తా లోక్ భవన్‌ను ఇంధన పరిరక్షణ ప్రాంతంగా ప్రకటించారు. ఇంధన పొదుపు ఉద్యమానికి నాయకత్వం వహించాలని విశ్వవిద్యాలయాలకు విజ్ఞప్తి చేశారు. -
మోదీ కామెంట్స్ వేళ బంగారం వ్యాపారులు ఏం చేస్తున్నారంటే?
పాత బంగారం మార్పిడి పథకాలపై నగల వ్యాపారులు దృష్టి సారించారు. భారత్‌లో విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవడానికి బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి విషయం తెలిసిందే. దీంతో ఆభరణాల రంగం బంగారం రీసైక్లింగ్, మార్పిడి పథకాల వైపు అడుగులు వేస్తోంది. డిమాండ్‌ను పూర్తిగా తగ్గించే బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.“దిగుమతి సుంకం సవరణ అనేది అతిపెద్ద విధాన మార్పు. ఇది సరఫరా వ్యవస్థ మొత్తం ఖర్చులను పెంచుతుంది. కానీ వినియోగదారులు బంగారాన్ని ఎలా వినియోగించాలో మళ్లీ ఆలోచించే అవకాశాన్ని కూడా ఇది ఇస్తోంది. పాత బంగారం తీసుకొచ్చి కొత్త నగలతో మార్చుకోవాలని మా వినియోగదారులను బలంగా ప్రోత్సహిస్తున్నాం’’అని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించుకుంటూ కొత్త డిజైన్లు పొందేందుకు ఇది ఉత్తమ మార్గాల్లో ఒకటని అంటున్నారు.పాత బంగారం మార్పిడిలో ఆఫర్లు తనిష్క్ సంస్థ తన పాత బంగారం మార్పిడి కార్యక్రమాన్ని #ఓల్డ్గోల్డ్న్యూఇండియా ప్రచారంతో పెంచుకుంది. కల్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇటీవల ‘నేషన్ ఫస్ట్ - గోల్డ్4ఇండియా ఇనిషియేటివ్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. పాత బంగారం మార్పిడి, తక్కువ బరువు ఉన్న 18 క్యారెట్ నగల వినియోగం, గోల్డ్ మానిటైజేషన్ పథకాలు, బంగారం పునర్వినియోగ కార్యక్రమాలపై సంస్థ దృష్టి పెట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థకు చెందిన 342 దుకాణాల్లో వినియోగదారులు వాడని, పాడైన, పాత నమూనాల నగలను మార్చుకునేలా ప్రోత్సహిస్తారు. దీంతో కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన బంగారం అవసరం తగ్గుతుంది.ఇటీవల ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం దిగుమతి ఖర్చులు, ప్రస్తుత ఖాతా లోటు, బంగారం ధరల పెరుగుదలపై ఆందోళనలు మరింత పెంచింది. ప్రస్తుత ఖాతా లోటు అంటే.. విదేశాలకు చెల్లింపులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయం మధ్య తేడా వల్ల ఏర్పడే లోటు. భారత్ దిగుమతి బంగారంపై ఎక్కువగా ఆధారపడటంతో, కొత్తగా కొనుగోలు చేయడానికి బదులు ఇళ్లలో వాడని బంగారాన్ని కొత్త నగలుగా మార్చుకోవాలని వ్యాపారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక సుంకం తాత్కాలికంగా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపొచ్చు. కానీ, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వొచ్చు. “భారత్‌లో బంగారం దిగుమతి సుంకం పెంపు స్థానిక ధరలను పెంచి, కొంతకాలం కొనుగోళ్లు తగ్గించే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచ అనిశ్చితి, దేశీయ కరెన్సీ ఒత్తిళ్ల సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుంది” అని నిపుణులు తెలిపారు.గతంలో దిగుమతి సుంకం 15 శాతం ఉన్నప్పుడు కనిపించినట్లే.. అక్రమ రవాణా మళ్లీ పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో దిగుమతి బిల్లు తగ్గి విదేశీ మారక నిల్వలకు తాత్కాలిక మద్దతు లభించొచ్చని చెబుతున్నారు.భారత్ మొత్తం దిగుమతి బిల్లులో బంగారం వాటా దాదాపు 9-10 శాతం ఉండటంతో, కొత్త దిగుమతుల బదులు దేశంలో ఇప్పటికే ఉన్న బంగారాన్ని పునర్వినియోగం చేయడం, మానిటైజేషన్‌పై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలకు ఆభరణాల రంగం అనుగుణంగా ముందుకు సాగుతోంది.“భారత్‌లో ఇళ్లలో దాదాపు 25,000 టన్నుల వాడని బంగారం ఉందని అంచనా. అందులో కొంత భాగాన్నైనా నమ్మకమైన మానిటైజేషన్ వ్యవస్థ ద్వారా వినియోగంలోకి తీసుకొస్తే దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది” అని నిపుణులు తెలిపారు. -
అచ్చం ప్రధానిలాగే చేసిన సీఎం
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తూ పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం శాసనసభలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ సువేందు అధికారి శాసనసభకు చేరుకున్నారు. సభలోకి ప్రవేశించే ముందు, గౌరవ సూచకంగా శాసనసభ మెట్లపై సాష్టాంగ నమస్కారం చేశారు.కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మే 9న జరిగిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాష్టాంగ నమస్కారం చేస్తూ వేదికపై ప్రజలకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని అందించినందుకుగానూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన అలా చేశారు. ఆ సమయంలో మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.బాధ్యతలు చేపట్టిన వెంటనే పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం, 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం చేపట్టేందుకు సరిహద్దు భద్రతా దళానికి భూమి కేటాయించడం వాటిలో ఉన్నాయి.నందిగ్రామ్ స్థానానికి రాజీనామాపశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారి తాను భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేస్తానని బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పూర్తిగా ఓడించడమే కాకుండా.. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆమె కంచుకోటలాంటి భవానీపూర్‌లో ఓడించింది. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె 15,000కుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు భవానీపూర్ నుంచే సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. -
మోదీ వ్యాఖ్యలపై గోల్డ్ షాప్ ఓనర్స్ రియాక్షన్
-
ఇంధన కొరత.. భారీగా తగ్గిన మోదీ కాన్వాయ్
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా తన కాన్వాయిలోని కార్ల సంఖ్యను భారీగా తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కేవలం రెండు వాహనాల్లోనే తన కాన్వాయి ఉండనున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న వేళ పెట్రోల్, డీజీల్ వాడకం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అదే విధంగా పలువురు కేంద్రమంత్రుల కాన్వాయిలోని వాహనాల సంఖ్య సైతం భారీగా తగ్గింది. హోంశాఖ మంత్రి అమిత్ షా కాన్వాయి మూడు వాహనాలకు తగ్గగా రక్షణ శాఖ మంత్రి కాన్వాయి 11 వాహనాల నుంచి నాలుగు వాహనాలకు తగ్గించారు. కాగా ఇటీవల దేశ ప్రజలకు పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని సైతం స్వయంగా ఆ నిబంధనలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఇటీవల హైదరాబాద్‌లోని బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని దేశానికి కీలక సూచనలు చేశారు. " పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డీజీల్ ధరలు తీవ్రంగా పెరిగాయి. ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి ఎలక్టిక్ వాహనాల వైపు మళ్లాలి" అని సూచించారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi has reduced his convoy size significantly. Reduction in vehicles was done while maintaining essential security components as per SPG protocol. pic.twitter.com/kuC9OfyAxN— ANI (@ANI) May 13, 2026 -
మీ ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్?
న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో మద్దతు ధరలకు 2,60,000 కోట్ల రూపాయల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్ల రూపాయలు కేటాయింపులకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. సర్కేజీ - ధోలేరా మధ్య సెమీ హై స్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి 20,065 కోట్ల రూపాయల కేటాయింపుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం కు ఆధునికరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.కేంద్ర సర్కార్ నిర్ణయాలుఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు(క్వింటాలుకు)వరి సాధారణ రకం రూ.2441వరి గ్రేడ్ ఏ రూ.2461హైబ్రిడ్ జొన్నలకు రూ. 4023మల్దండి జొన్నలు రూ. 4073 సజ్జలు రూ.2900రాగులు రూ.525 మొక్కజొన్న రూ.2410కందులు రూ.8450 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం (క్వింటాలుకు)వరి సాధారణ రకం రూ.2441వరి గ్రేడ్ ఏ రూ.2461హైబ్రిడ్ జొన్నలకు రూ.4023మల్దండి జొన్నలు రూ.4073 సజ్జలు క్వింటాలు రూ.2900రాగులు రూ.525 మొక్కజొన్న క్వింటాలు రూ.2410కందులు క్వింటాలు రూ.8450పెసర్లు రూ.8780మినుములు రూ.8200పత్తి (మధ్యరకం) రూ.8267కాటన్ లాంగ్ రకం రూ.8667వేరుశనగ రూ.7517పొద్దుతిరుగుడు రూ.8343సోయాబీన్ రూ.5708నువ్వులు రూ.10,346ఒడిసలు రూ.10,052 -
వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన
కొవిడ్ పరిణామాల తర్వాత ఐటీ ఉద్యోగులు తిరిగి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బాట పట్టిన తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు కార్పొరేట్ ప్రపంచంలో చర్చకు తెరలేపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును గౌరవిస్తూ తమ సంస్థలో తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ప్రధాని పిలుపుదేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, పౌరులు, సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు, నేషన్ ఫస్ట్ అనే గ్రాఫిక్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో మోదీ తెలిపిన వివరాల ప్రకారం.. అనవసర ప్రయాణాలను తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేయడాన్ని ప్రోత్సహించాలి. విదేశీ ప్రయాణాలు, వంట నూనె వినియోగం, బంగారం కొనుగోళ్లపై నియంత్రణ అనే అంశాలున్నాయి.‘ఒక సంస్థగా మేము ఇటీవలి కాలంలో పూర్తిస్థాయిలో కార్యాలయం నుంచి పనిచేసే విధానానికి మారాం. అయితే, ప్రధాని విజ్ఞప్తి నేపథ్యంలో మేము మా నిర్ణయాన్ని పునసమీక్షించుకోబోతున్నాం’ అని వెంబు స్పష్టం చేశారు.ఆచరణలో జోహోశ్రీధర్ వెంబు తన పోస్ట్‌లో జోహో ఇప్పటికే అంతర్గతంగా తీసుకుంటున్న మార్పులను కూడా వివరించారు. ‘సంస్థకు చెందిన పొలాల్లో సహజ సిద్ధమైన సాగు పద్ధతులను అవలంబిస్తున్నాం. డీజిల్ వినియోగాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని చెప్పారు. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయింది.శ్రీధర్ వెంబు ప్రతిపాదన కేవలం ఒక కంపెనీ నిర్ణయంగా చూడలేమని, అది దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన భారాన్ని తగ్గించే ఒక వ్యూహాత్మక అడుగు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మరిన్ని ఐటీ దిగ్గజాలు ఇదే బాటలో నడిస్తే భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే, దీనివల్ల ప్రభావితమయ్యే అసంఘటిత రంగ కార్మికులకు సరైన పరిష్కారం అందించాలి.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
బంగారం రేటు మరింత పెరగబోతుంది..
-
నేను రబ్బర్ స్టాంప్‌ను కాదు: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తదుపరి నూతన సారథి ఎంపిక ప్రక్రియలో అవలంభించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలను తనకు తెలియజేయని కారణంగా ఉన్నతస్థాయి ఎంపిక ప్యానెల్లో ఇకపై భాగస్వామిగా కొనసాగబోనని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు.మంగళవారం ఢిల్లీ ప్రధాని అధికార నివాసం 7, లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో జరిగిన భేటీలో ప్యానెల్ సభ్యుని హోదాలో రాహుల్ పాల్గొన్నారు. ప్యానెల్ చైర్పర్సన్ ప్రధాని మోదీ, సభ్యునిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. ‘‘ఏఏ అంశాల ప్రాతిపదికన తుది అభ్యర్థులను ఎంపికచేశారనే కీలక సమాచారాన్ని ఇచ్చేందుకు సెలక్షన్ కమిటీ నిరాకరించింది. తద్వారా ఎంపిక ప్యానెల్ భేటీని ఎన్డీఏ సర్కార్ అలంకారప్రాయంగా మార్చింది. ఇలాంటి పక్షపాత ప్యానెల్లో నేను కొనసాగబోను. కొనసాగి విపక్షనేతగా రాజ్యాంగబద్ధ బాధ్యతను విస్మరించజాలను. అందుకే నా విముఖతను స్పష్టంగా తెలియజేస్తున్నా’’ అని రెండు పేజీల లేఖలో రాహుల్ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు.ఇదిలా ఉండగా.. మే 24వ తేదీతో ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో స్వీయ మదింపు పత్రాలు సహా ప్రభుత్వ నిఘా నివేదికలను పరిశీలించి తుది అభ్యర్థుల జాబితా పరిశీలనకు ఎంపిక ప్యానెల్ సమావేశంకాగా రాహుల్ తన విముఖత వ్యక్తంచేశారు. I have written to the Prime Minister recording my dissent from the CBI Director selection process.I cannot abdicate my constitutional duty by participating in a biased exercise.The Leader of Opposition is not a rubber stamp. pic.twitter.com/WfSt5gGPPR— Rahul Gandhi (@RahulGandhi) May 12, 2026 -
మోదీ బంగారం కొనొద్దు అనటానికి ముఖ్య కారణాలు ఇవే..!
-
ప్రధాని మోదీ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చెప్పిన పొదుపు సూత్రాలను పాటించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే.. ప్రభుత్వ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని సూచించారు.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్(తెలంగాణ) వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ప్రధాని మోదీ పలు పొదుపు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంధన వినియోగాన్ని తగ్గించాలని.. సొంత వాహనాలకు బదులు కార్‌పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని.. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించాలని అన్నారు. అయితే దానిని ఆచరించడంలో భాగంగా.. ప్రధాని మోదీ ఇప్పుడు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలనుకుంటున్నారు. ఇంధన పొదుపు, మితవ్యయ (austerity) చర్యలలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఈ మేరకు ఎస్పీజీ (Special Protection Group)కి కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించాలని.. భద్రతా ప్రమాణాలు తగ్గకుండా, అవసరమైన వాహనాలు మాత్రమే ఉండాలని పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి కానీ కొత్త వాహనాలు కొనరాదని సూచించినట్లు సమాచారం అందుతోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించమని ఆదేశించారు. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్‌శర్మ తన కాన్వాయ్‌లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు. మరోవైపు.. కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా ఇంధన పొదుపు చర్యలు పరిశీలిస్తున్నాయి. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కూడా తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు. -
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
-
కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. ఆంక్షలు రాబోతున్నాయా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఎగదోసిన చమురుసంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారతీయులు సైతం తమ వంతు బాధ్యతగా పొదుపు మంత్రం పఠించాలని గత రెండ్రోజుల్లో ఇటు తెలంగాణలో, అటు గుజరాత్లో ప్రధాని మోదీ హితబోధ చేశారు. మోదీ ‘పొదుపు’ ప్రసంగాల వేళ బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీకానున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చనే వార్తలు ఇప్పుడు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెట్రో ధరల పెంపుతో పాటు మరికొన్ని పొదుపు చర్యలపై ప్రధాని బుధవారం ప్రకటన చేసే అవకాశముంది. రెండ్రోజులుగా ప్రధాని పొదుపు మంత్రం ఉపదేశిస్తుండటంతో విపక్షాల నుంచి వెల్లువెత్తిన విమర్శలపై ప్రభుత్వం తరఫున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) మంగళవారం దీటుగా స్పందించింది. చమురు సంక్షోభం దెబ్బకు డజన్ల కొద్దీ దేశాలు అనుసరిస్తున్న పొదుపు చర్యలనే ప్రధాని సూచించారని సోదాహరణంగా వివరించింది. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) ఇటీవల ఇచ్చిన నివేదికలను బహిర్గతంచేసింది. దీనిప్రకారం 40 దేశాలు ఇంధన వినియోగం, ప్రజల వాహనాల అతి వాడకం, ఇతర రాకపోకలపై ఆంక్షలు విధించాయి. మూడు దేశాలు తమ ప్రజలకు ఎల్పీజీ వాడకం తగ్గించుకోవాలని, సిలిండర్‌ను సగం వరకే నింపుకోవాలని సూచించాయి. ఎలక్ట్రిక్ లేదా పీఎన్జీకి మారాలని హితబోధ చేశాయి. 18 దేశాలు ప్రజల రవాణాపై పరిమిత ఆంక్షలు విధించాయి. ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రం హోం)చేయాలని 13 దేశాలు సూచించాయి. ఇల్లు, ఆఫీసుల్లో తక్కువ లైట్లు ఆన్‌చేయాలని, ఏసీలను 25 డిగ్రీసెల్సియస్ కంటే తక్కువ పాయింట్లకు పెట్టుకోవద్దని పలు దేశాలు ప్రజలకు సూచించాయి. స్కూళ్లు, కాలేజీలు మూసేసి విద్యార్థులకు కేవలం ఆన్లైన్లోనే పాఠాలు బోధించాలని, తద్వారా విద్యార్థులు, సిబ్బంది, టీచర్ల ప్రయాణాలకు ఇంధనం ఆదా అవుతుందని పలు దేశాలు సూచించాయి.పలు దేశాల్లో పొదుపు చర్యలు ఇలా..ఇంధన వినియోగంపై సూచనలుపెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది కార్యాలయాలకు రాకుండా ఆపాలని పలు దేశాలు నిర్ణయించాయి. అందుకోసం పాకిస్తాన్ వారంలో నాలుగు రోజులు వర్క్ ఫ్రమ్ హోంను ప్రవేశపెట్టింది. మొత్తం సిబ్బందిలో సగం మంది ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. ఇండోనేసియాలో శుక్రవారాలు ఇంటి నుంచే పనిచేయాలి. కాంబోడియా, లావో, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, పెరూ, ఈజిప్ట్ సైతం ఇలాంటి చర్యలే చేపట్టాయి.ఏసీ కూలింగ్పై పరిమితులుప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఏసీలను 25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ పాయింట్ పెట్టొద్దని బంగ్లాదేశ్ కరాకండీగా చెప్పేసింది. సింగపూర్(25), కాంబోడియా (24–25), మలేసియా(25), శ్రీలంక(26), థాయిలాండ్(26) అదే బాటలో పయనించాయి. జోర్డాన్ ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వాడకంపై నిషేధం విధించింది.విద్యాసంస్థల నిర్వహణపై..బంగ్లాదేశ్‌లో అన్ని విశ్వవిద్యాలయాలనూ మూసేశారు. శ్రీలంకలో బుధవారం సెలవులు అమలుచేస్తున్నారు. పాకిస్తాన్లో స్కూళ్లు, కాలేజీల్లో 100 శాతం ఆన్లైన్ విధానం అమలుచేస్తున్నారు.విద్యుత్ వాడకం తగ్గింపు..5స్టార్ రేటింగ్ వంటి అత్యంత తక్కువ విద్యుత్‌తో పనిచేసే ఉపకరణాలనే వాడాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. వంట, స్నానం కోసం గ్యాస్‌తో నడిచే బాయిలర్లకు బదులు సోలార్‌తో పనిచేసే వ్యవస్థలను వాడాలని నెదర్లాండ్స్ ప్రజలకు సూచించింది. థాయిలాండ్‌లో తక్కువ అంతస్తులున్న ఆఫీసుల్లో లిఫ్ట్‌లను ఆపేసి మెట్లు ఎక్కాలని సూచిస్తున్నారు. వీధి దీపాల విద్యుత్ కోతలను పెంచారు. ఎల్పీజీ ఆధారిత గీజర్లకు బదులు సోలార్ గీజర్లు వాడాలని బ్రిటన్ సూచించింది. రవాణాపై ఆంక్షలు..దక్షిణకొరియాలో వాహనాలను సరి, బేసి సంఖ్య ఆధారంగా వేర్వేరు రోజుల్లో అనుమతిస్తున్నారు. శ్రీలంకలో ఆరోజుకు క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన వాహనమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. రోజు విడిచి రోజు వాహనం రోడ్డు మీదకు తేవాలని మయన్మార్ సూచించింది. బయోడీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తామని ఇండోనేసియా తెలిపింది. సోలార్ వ్యవస్థల వినియోగం..సోలార్ వ్యవస్థలను ఇళ్లు, కార్యాలయాలపై బిగించుకోవాలని, ఎల్ఈడీ లైట్లను వాడాలని బ్రిటన్, నెదర్లాండ్స్ సూచించాయి. సోలార్ ఎనర్జీ బిగించుకుంటే ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తామని స్పెయిన్ ప్రకటించింది. పొదుపు చర్యలు..ఎల్పీజీ సిలిండర్లను సగమే నింపి ఇస్తామని నేపాల్, మాల్దీవుల ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. పాకిస్తాన్ రాత్రి 8 గంటల తర్వాత మార్కెట్ సముదాయాలకు కరెంట్‌ను కట్ చేస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత ఆహారం, తినుబండారాల దుకాణాలకు విద్యుత్ సరఫరాను నిలిపేస్తోంది. భారీ ప్రకటనలు ఉండే హోర్డింగ్, బిల్‌బోర్డ్‌లకు రాత్రిళ్లు ఈజిప్ట్, శ్రీలంక కరెంట్‌ను నిలిపేస్తున్నాయి. -
బంగారం, వెండిపై కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, వెండి విషయంలో కేంద్రం షాకిచ్చింది. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ (మే 13) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల బంగారం, వెండి, ఫ్లాటినం.. ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత్ ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 6 శాతంగా ఉంది. అయితే తాజా నిర్ణయంతో దాన్ని 16 శాతానికి పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం బంగారం ధర రూ. 1,53,990 ఉంది. కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి వాటిపైనా సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్‌పై 5% కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్‌పై 5.4% సుంకం విధించారు. అదే సమయంలో, రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24% పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9 శాతంగా ఉంది. ఇక బంగారం సరఫరాలో స్విట్జర్లాండ్ 40% వాటాతో మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ 16%, దక్షిణాఫ్రికా దాదాపు 10% వాటాతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
మోదీ వార్నింగ్‌తో వణికిన మార్కెట్లు
(సాక్షి, బిజినెస్): ‘ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ఎలక్ట్రిక్ వాహనాలను, ప్రజా రవాణాను మరింతగా ఉపయోగించుకోండి. వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ వస్తువులు వద్దు... స్వదేశీయే ముద్దు’ అంటూ ప్రధాని మోదీ తాజాగా ఎత్తుకున్న పొదుపు రాగంతో మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాకటం.. రూపాయి విలువ పాతాళానికి జారిపోతుండటం.. ద్రవ్యోల్బణం సెగలు రేగటంతో ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లలో ‘బేర్’ బాజా మోగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడీపీ వృద్ధికి చిల్లు పడొచ్చని ఆర్థిక నిపుణుల వార్నింగ్‌లు మొదలయ్యాయి. ఇవన్నీ కలిసి మార్కెట్లను వణికిస్తుండటంతో గత రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి కావడం ఇన్వెస్టర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడిచమురు, బంగారం, ఎరువులతో సహా అనేక కమోడిటీల ధరలు ఇప్పటికే భారీగా ఎగిశాయి. ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ముడి చమురు రేటు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతోంది. డాలర్లను అధికంగా వెచ్చించాల్సి రావడంతో మన చేతి ‘చమురు’ వదులుతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో రూపాయి ఇంకా పడిపోతోంది. మన దిగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా క్రూడ్, పసిడి, ఎరువులు, వంటనూనెలదే కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే మోదీ వీటి కొనుగోళ్లు, వాడకాన్ని తగ్గించేందుకు పొదుపు మంత్రాన్ని జపించారు. ఎకానమీలో నెలకొన్న బలహీనతలకు ఇది అద్దం పడుతోందన్నది నిపుణుల మాట. మార్కెట్లకు షాక్...: మోదీ సూచనలను జరగబోయే పరిణామాలకు వార్నింగ్‌గా భావించిన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. సోమవారం రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరికాగా, మంగళవారం మరో రూ.10 లక్షల కోట్లు ఎగిరిపోయాయి. మోదీ సూచనల ప్రభావానికి తోడు ఇరాన్‌తో సీజ్ఫైర్ గాల్లో దీపమంటూ.. ట్రంప్ చేసిన ప్రకటనతో మడిచమురు ధరలు భగ్గుమనడం ఈ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. గోల్డ్ రిటైల్ సంస్థలు, ట్రావెల్, వినియోగ వస్తువుల షేర్లు వరుసగా రెండో రోజూ పడిపోవడం గమనార్హం. పసిడి కొనుగోళ్లపై గందరగోళం... బంగారాన్ని ఏడాది పాటు కొనొద్దంటూ స్వయంగా మోదీయే చెప్పడంతో జనానికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తులం రూ.1.85 లక్షల ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకిన పుత్తడి. ఇప్పుడు రూ.1.5 లక్షల స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగానూ ఔన్స్ 5,600 డాలర్లను తాకి ప్రస్తుతం 4,600 డాలర్ల వద్ద ఉంది. అయితే, రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడంతో దేశీయంగా పసిడి రేట్లు పెద్దగా దిగిరాలేదు. భారతదేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 9 శాతం. మనం వినియోగించే బంగారంలో దిగుమతుల వాటా ఏకంగా 90 శాతం. అంటే ఏటా 700–800 టన్నులు. దీనికి భారీగా డాలర్లు వెచ్చించాల్సి రావటంతో మన ఫారెక్స్ నిల్వలకు గండి పడుతోంది. గడిచిన రెండు నెల్లల్లో దాదాపు 38 బిలియన్ డాలర్లు తగ్గి మన నిల్వలు 690.69 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది రూపాయి పతనాన్ని పెంచుతోంది. దీనికి అడ్డకట్టవేయడానికే మోదీ పొదుపు మంత్రం ఎత్తుకున్నారు. కాకపోతే రేటు మరింత పెరిగితే కొనలేమేమోనన్న ఆందోళనలో ఉన్న సామాన్యుల్లో ప్రధాని ప్రకటన గందరగోళాన్ని పెంచింది. యుద్ధం మళ్లీ తీవ్రమైతే బంగారం దూసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనుగోళ్లకు బ్రేక్ వేసేందుకు అవసరమైతే దిగుమతి సుంకాన్ని (ప్రస్తుతం 6 శాతం) కూడా ప్రభుత్వం పెంచవచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చేస్తే బంగారం రేట్లు దేశీయంగా మరింత భగ్గుమంటాయి. మరోపక్క, పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరిస్తే ఆభరణాల పరిశ్రమపై ప్రభావం పడి, లక్షల మంది ఉపాధి కోల్పోవచ్చన్న ఆందోళనలూ ఉన్నాయి. క్రూడ్ పైపైకి.. త్వరలో పెట్రో వాత! కాల్పుల విరమణ తర్వాత కాస్త శాంతించిన క్రూడ్ రేట్లు మళ్లీ యుద్ధ భయాలతో భగ్గుమన్నాయి. మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 109 డాలర్లను తాకింది. చమురు సెగతో ఎఫ్ఎంసీజీతో సహా ఇప్పటికే దేశీయంగా పలు ఉత్పత్తుల ధరలు ఎగబాకుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ నష్టాల నేపథ్యంలో నేడోరోపో పెట్రో వాత ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ రెండు రోజుల క్రితం జపించిన పొదుపు మంత్రం నేపథ్యంలో బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. పెట్రో రేట్లను పెంచితే ద్రవ్యోల్బణం మరింత ఎగబాకి, వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని.. ఎకానమీ మరింత మందగమనంలోకి జారిపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మోదీ పొదుపు సూచనలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తాయని.. క్రూడ్ రేట్లు 100 డాలర్ల పైన ఎక్కువ కాలం ఉంటే జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌తో సహా పలు రేటింగ్ ఏజెన్సీలు ఈ ఏడాది వృద్ధి రేటుకు కోత వేయటం తెలిసిందే. 6– 6.5 శాతానికే వృద్ధి పరిమితమవుతుందన్న అంచనాల నేపథ్యంలో మోదీ పొదుపు పిలుపు ప్రభావంతో 6 శాతం కిందికి పడిపోవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. రూపాయి విలవిల.. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ రూపాయి జారుడుబల్లపైనే ఉంది. చమురు రేట్ల దెబ్బతో దిగుమతుల బిల్లు పెరగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క, విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా దేశీ కరెన్సీని వణికిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా రూ.2 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు విక్రయించడం గమనార్హం. 2025 చివర్లో డాలర్‌తో 90 స్థాయిలో ఉన్న రూపాయి... ఇపుడు 95కి చేరింది. ఏడాది కాలంలో దాదాపు 10 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఆసియాలో దారుణంగా పడిపోయిన కరెన్సీ మనదే. కాగా, మంగళవారం మరో 40 పైసలు పడ్డ రూపాయి.. సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టమైన 95.68కి జారిపోయింది. రూపాయి ఇలా పతనమవటం దిగుమతుల బిల్లు మరింత పెరిగేలా చేస్తోంది. ఎందుకంటే దిగుమతుల కోసం డాలర్ల రూపంలో చెల్లించడానికి మనం మరిన్ని రూపాయలు ఖర్చు చేయాలి కదా!!. ఎరువులు, వంట నూనెల మంట! యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో రవాణా ఆగిపోవటంతో దేశంలో ఎరువుల రేట్లకు రెక్కలొస్తున్నాయి. మన యూరియా దిగుమతుల్లో 75 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి. ఇక డీఏపీ దిగుమతుల్లో సౌదీ వాటా 40 శాతం. 2025–26లో భారత్ ఏకంగా 14.5 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు సరఫరాపరమైన ఇక్కట్లు.. రూపాయి తీవ్ర పతనంతో ఈ దిగుమతులు మరింత భారమై, దేశీయంగా రేట్లు ఎగబాకుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు సమాయత్తమవుతున్న రైతులు రేట్ల పెరుగుదలకు తోడు తగినంత సరఫరా ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, వంటింట్లో వంటనూనెల మంట మండుతోంది. భారత్ వంటనూనెల అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2025–26లో 19.5 బిలియన్ డాలర్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంది. రూపాయి వాతతో దేశీయంగా రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎరువులు, వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ మోదీ పిలుపునివ్వడం గమనార్హం. -
బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో.. దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో 1967లో కూడా ఇందిరా గాంధీ ఇలాంటి ప్రకటన చేశారని, సూచించే ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఇటీవల.. ఒక పాత న్యూస్ ఫ్రంట్ పేజీ అంటూ ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో 1967 జూన్ 6 తేదీకి చెందిన 'ది హిందూ' పత్రికలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ''బంగారం కొనొద్దు, జాతీయ క్రమశిక్షణ పాటించండి'' అని పిలుపునిచ్చినట్లు చూపించారు. కానీ ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే, డిజిటల్‌గా మార్పు చేసిన ఫోటో అని స్పష్టమైంది.నిజం ఏమిటంటే?సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ ఫోటోపై ది హిందూ స్వయంగా స్పందించింది. ''జూన్ 6, 1967 నాటి ‘ది హిందూ’ పత్రిక ముఖపత్రం అని చెప్పుకుంటున్న, డిజిటల్‌గా మార్పులు చేసిన ఒక చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇది మా ఆర్కైవ్స్‌లోని అసలైన పేజీ కాదని మేము స్పష్టం చేస్తున్నాము. పాఠకులు జాగ్రత్త వహించాలని, షేర్ చేసే ముందు సరిచూసుకోవాలని ‘ది హిందూ’ కోరుతోంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.📢 A digitally altered image purporting to be a front page of The Hindu from June 6, 1967, is currently circulating on social media. We wish to clarify that this is not an authentic page from our archives. The Hindu urges readers to exercise caution and verify before sharing.— The Hindu (@the_hindu) May 12, 2026అసలు 1967 జూన్ 6 నాటి పత్రికలో ఉన్న ప్రధాన వార్త ఏమిటంటే.. ''అప్పట్లో మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు''. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అని ది హిందూ క్లారిటీ ఇచ్చింది.ఇందిరా గాంధీ బంగారంపై నియంత్రణలు పెట్టారా?వైరల్ అవుతున్న ఫోటో నకిలీదే అయినప్పటికీ.. అప్పటి ప్రభుత్వం బంగారంపై నియంత్రణలు పెట్టిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే 1960లలో భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం, బంగారం స్మగ్లింగ్ సమస్యలు ఉండేవి. ఆ పరిస్థితుల్లో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ''గోల్డ్ కంట్రోల్ యాక్ట్'' ప్రవేశపెట్టినట్లు సమాచారం.ఈ చట్టం.. ప్రజలు బంగారు బార్లు, నాణేలు కలిగి ఉండటాన్ని పరిమితం చేసింది. బంగారం కొనుగోలు, నిల్వపై కఠిన నియంత్రణలు అమలు చేసింది. స్మగ్లింగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంది. అయితే 1990లో ఈ యాక్ట్ రద్దు అయింది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది! -
72 గంటల్లోనే అద్భుతమైన ధ్యాన క్షేత్రం తొలి కార్యక్రమం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అద్భుతమైన 'ధ్యాన మందిరం', తన మొట్టమొదటి భారీ కార్యక్రమానికి సిద్ధమైంది. మే 13, 2026న గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి నేతృత్వంలో "ప్రపంచ శాంతి కోసం గురుదేవ్‌తో కలిసి ధ్యానం" అనే అంతర్జాతీయ కార్యక్రమం జరగనుంది.'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్'లో ప్రతిష్టాత్మక ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన 72 గంటలలోపే, ఆ అద్భుతమైన ధ్యాన క్షేత్రం తన మొదటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ధ్యాన కార్యక్రమంలో 182 దేశాల నుండి లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా మరియు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొననున్నారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక ధ్యాన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుంది.ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఆధ్యాత్మికత , మానసిక ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక యుగంలో ఒత్తిడి, అనిశ్చితి ఎదుర్కొంటున్న యువతకు ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దిక్సూచిలా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. "మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత కలిగిన యువత ద్వారానే అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మించబడుతుంది" అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యేక ధ్యాన కేంద్రాలలో ఒకటైన దీని వెనుక ఉన్న స్ఫూర్తి గురించి మాట్లాడిన మోదీ సంకల్పం స్పష్టంగా ఉన్నప్పుడు, సేవాభావంతో పని చేసినప్పుడు, ప్రతి ప్రయత్నం సరైన ఫలితాన్ని ఇస్తుందంటూ కొనియాడారు."ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ఏళ్లుగా ఒక మహావృక్షంలా విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో జీవితాలను ప్రభావితం చేస్తోందని ప్రశంసించారు.45 ఏళ్ల వేడుకలుఈ గ్లోబల్ మెడిటేషన్ ఈవెంట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న నెల రోజుల వేడుకల్లో భాగంగా జరుగుతోంది. మే 13న జరిగే 'ది వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్' కార్యక్రమం, 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల రోజుల పాటు జరిగే వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంతో మజుందార్; కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ఉత్తరాఖండ్ గవర్నర్ నంద్ కిషోర్ యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్,రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, హిరానందాని గ్రూప్ ఛైర్మన్ నిరంజన్ హిరానందానిలాంటి ప్రముఖులు హాజరు కానున్నారు.ఈ ప్రపంచ స్థాయి ధ్యాన కార్యక్రమం, వివిధ కాల మండలాలు , ఖండాలలో విస్తరించి ఉన్న లక్షలాది మందిని ఒకే క్షణంలో సామూహిక మౌనం మరియు ఆత్మపరిశీలన కోసం ఏకం చేస్తుందని ఆశిస్తున్నారు. "అంతర్గత శాంతి మాత్రమే బాహ్య ప్రపంచంలో శాంతిని తీసుకురాగలదు" అనే సందేశాన్ని గురుదేవ్ గత నాలుగున్నర దశాబ్దాలుగా చాటుతున్నారు.బెంగళూరులోని ఈ ధ్యాన మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది, ఇది శాంతికి మరియు మానసిక వికాసానికి కేంద్ర బిందువుగా మారనుంది. -
100 ఏళ్ల బజాజ్: 1.30 లక్షల ఉద్యోగులు!
భారతదేశపు అత్యంత పురాతన వ్యాపార సంస్థలలో ఒకటిగా, 148 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అతిపెద్ద గ్రూపులలో ఒకటిగా ఉన్న బజాజ్ గ్రూప్, నేడు 100 ఏళ్ల వ్యాపార ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి ఆర్థికాభివృద్ధి వరకు దేశ గమనంతో ముడిపడి ఉన్న ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, పరోపకారి, పారిశ్రామికవేత్త అయిన జమ్నాలాల్ బజాజ్ 1926లో ముంబైలో ఈ గ్రూప్‌ను స్థాపించారు. మహాత్మా గాంధీ ఐదవ దత్తపుత్రుడిగా పేరుగాంచిన ఆయన వేసిన పునాదులతో, నేడు బజాజ్ గ్రూప్ దేశంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒకరికి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 1,30,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.100 కంటే ఎక్కువ కంపెనీలు, 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతులు.. త్వరలో ఆరోగ్య సంరక్షణ (healthcare) రంగంలోకి అడుగుపెట్టబోతున్న బజాజ్ గ్రూప్, ఆటోమొబైల్స్, ఆర్థిక సేవలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజినీరింగ్ రంగాలలో భారత అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకంద్ వంటివి ఈ గ్రూపులోని కొన్ని లిస్టెడ్ కంపెనీలు.దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ, బజాజ్ కుటుంబానికి పంపిన సందేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు, "బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, ఈ మైలురాయితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏ సంస్థకైనా వందేళ్ల ప్రయాణం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది కేవలం ఆ సంస్థ దీర్ఘకాలిక ఉనికిని మాత్రమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ, తరతరాల పాటు తన ప్రాముఖ్యతను కాపాడుకునే సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.జమ్నాలాల్ బజాజ్ నాయకత్వంలో ప్రారంభమైన బజాజ్ గ్రూప్, మన దేశ అభివృద్ధిలోని అనేక దశలలో భారతదేశ పారిశ్రామిక మరియు ఆర్థిక రంగంలో ఒక భాగంగా ఉంది. ఇది వివిధ రంగాలలో కార్యకలాపాలు సాగిస్తూ.. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేవలు అందించే ఒక వైవిధ్యభరితమైన కంపెనీగా ఎదిగింది.గడిచిన దశాబ్దాలుగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు సామాజిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇలాంటి మైలురాళ్లు గతంలో అందించిన కీలక సహకారాలను గుర్తు చేసుకోవడానికి, అలాగే వృద్ధి, సుస్థిరత, అందరినీ కలుపుకునిపోయే పురోగతి పట్ల నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం.తయారీ రంగం, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి పోటీతత్వంలో భారత్ నూతన ఆకాంక్షలతో ముందుకు సాగుతోంది. బజాజ్ గ్రూప్ వంటి లోతైన మూలాలు, అనుభవం ఉన్న సంస్థలు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.ఈ చిరస్మరణీయ సందర్భంలో బజాజ్ గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాబోయే కాలంలో కూడా దేశాభివృద్ధిలో ఈ సంస్థ నిరంతర పురోగతిని మరియు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, శిశు ఆరోగ్యం, విద్య, రక్షణపై దృష్టి సారించిన బజాజ్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాలు (CSR), ఇప్పటివరకు 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ శతాబ్ది వేడుకల్లో బజాజ్ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సాయంత్రం వేళ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ కుటుంబం పోషించిన పాత్ర నుంచి, వర్తక వ్యాపారం నుంచి తయారీ.. ఆర్థిక సేవల రంగం వైపు సాగిన మార్పు వరకు, అలాగే నేడు వారి వ్యాపారాలు ముందుండి నడిపిస్తున్న సరికొత్త సాంకేతికత వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమం ముఖ్యాంశాలలో బజాజ్ కుటుంబ సభ్యుల ప్రసంగాలు, గ్రామీ అవార్డు గ్రహీత మరియు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపోజర్ రికీ కేజ్(Ricky Kej) మరియు ఆయన బృందం ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు జమ్నాలాల్ బజాజ్ మరియు మహాత్మా గాంధీపై రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘కథ్నీ కర్నీ ఏక్సీ’ (Kathni Karni Eksi) అనే చిత్రాన్ని ప్రదర్శించారు. ‘100 ఇయర్స్ ఆఫ్ బజాజ్’ లోగోను ఆవిష్కరించారు. -
ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని ప్రతిపాదనపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని ప్రకటనను కొంత మంది సమర్థిస్తుండగా, మరి కొంత మంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోళ్లు ఆపేస్తే నగల పరిశ్రమ నాశమవుతుందని, కోట్లాది మంది ఉపాధికి దూరమవుతారని భయాందోళనలు చెందుతున్నారు.ఈ నేపథ్యంలో బంగారం దిగుమతులను తగ్గించడానికి టైటాన్ సీఎఫ్ఓ అశోక్ సోంతాలియా ఓ పరిష్కారాన్ని సూచించారు. మన దేశంలో పోగుపడి ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమతులను తగ్గించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. బిజినెస్ టుడేతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ''ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన ప్రభావం బంగారం కొనుగోళ్ల వైపు ఉంటుందా, సరఫరా వైపు మళ్లుతుందా అని వేచిచూస్తున్నాం. బంగారం దిగుమతుల గురించే కేంద్ర సర్కారు ఎక్కువ ఆందోళనగా ఉన్నట్టు కనబడుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఈ సమస్యను అధిగమించడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలు ఉన్నాయి. మన దేశంలో ప్రజల దగ్గర, దేవాలయాలు, లాకర్లలో పెద్ద మొత్తంలో ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమతులను గణనీయంగా తగ్గించవచ్చ''ని అశోక్ సోంతాలియా పేర్కొన్నారు.నిశితంగా పరిశీలిస్తున్నాంబంగారం కొనుగోళ్లు హఠాత్తుగా నిలిచిపోతే కోట్లాది మంది ఉపాధికి విఘాతం కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అశోక్ సోంతాలియా చెప్పారు. తమ ప్రతిపాదనను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రధాని ప్రకటన ప్రభావం బంగారం కొనుగోళ్లపై ఎలా ఉంటుందో చూడటానికి రెండు వారాలు వేచి చూస్తామన్నారు. అలాగే పసిడి కొనుగోళ్ల నియంత్రణ ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటన చేస్తుందో చూడాలన్నారు. ఈ రెండు అంశాలను వారం పది రోజుల పాటు నిశితంగా గమనిస్తామన్నారు.చదవండి: ఓబీసీ క్రిమిలేయర్ కిరికిరి తేలింది!పసిడి అమ్మకాల నియంత్రణలో నరేంద్ర మోదీ సర్కారు సమగ్ర దృక్పథంతో వ్యవహరిస్తుందన్న నమ్మకాన్ని అశోక్ సోంతాలియా (Ashok Sonthalia) వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలతో పాటు నగల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఆభరణాల పరిశ్రమ కూడా నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.జీజేసీ అభ్యంతరంకాగా, పుత్తడి కొనుగోళ్లను నియంత్రించాలన్న ప్రధాని మోదీ ప్రకటనపై అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగారం అమ్మకాలు తగ్గితే ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కరవుతుందని ఆందోళన చెందింది. అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారం పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల రంగాలతో పాటు లాజిస్టిక్స్, జ్యుయెల్లరీ డిజైన్, ఈ- కామర్స్ తదితర రంగాలు కూడా దెబ్బతింటాయని అంచనా వేసింది. విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దుఅమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన విపత్తు నెలకొందని, దీన్ని అధిగమించడానికి దేశ ప్రజలకు 7 రకాల చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్క్ ఫ్రం హోమ్, బంగారం కొనుగోళ్ల నిలిపివేత, ప్రజా రవాణా వాడకం, పరిమితంగా వంట నూనెలు, విదేశీ వస్తువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయం, విదేశీ పర్యటనల రద్దు వంటి అంశాలను ప్రధాని ప్రస్తావించారు. Nation First Duty Above Comfort!PM @narendramodi gave 7 important appeals to strengthen India during challenging global times prioritize work from home wherever possible, reduce fuel consumption, avoid foreign travel for a year, adopt Swadeshi products, cut down cooking oil… pic.twitter.com/jhDGYTarH6— MyGovIndia (@mygovindia) May 10, 2026 -
మోదీ మాట.. అదే బాటలో ఐటీ కంపెనీలు!
కరోనా విపత్తు రోజుల మాదిరి తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) విధానానికి మళ్లాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మర్నాడే ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ ఇందుకు అనుకూలంగా స్పందించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఐటీ కంపెనీలు రిమోట్ లేదా హైబ్రిడ్ వర్క్ నమూనా (కొన్ని రోజులు కార్యాలయం, కొన్ని రోజులు ఇంటి నుంచి)కు వీలుగా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ విధులు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.‘‘పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో కంపెనీలు క్యాంపస్‌లలో ఇంధన నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయి. అవసరం లేని వసతుల వినియోగాన్ని క్రమబద్దీకరించుకుంటున్నాయి. అవసరానికి అనుగుణంగా రిమోట్, హైబ్రిడ్ పని నమూనాలతో ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి’’అని నాస్కామ్ తన ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా పరిణామాలను గమనిస్తున్నామని.. పరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వంతో సంప్రదిస్తూ, సమన్వయంతో దీన్ని అధిగమిస్తామని పేర్కొంది.నాస్కామ్‌లో 3,500 ఐటీ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కొన్ని అంశాలపై పిలుపునివ్వడం తెలిసిందే. కరోనా సమయంలో అనుసరించిన వర్చువల్ (ఆన్లైన్) సమావేశాలు, సదస్సులతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మళ్లాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. -
‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఘాటుగా స్పందించారు. పొదుపు చర్యలు అధికారంలో ఉన్నవారితోనే ప్రారంభం కావాలని హితవు పలికారు.ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో తన 'గోవిష్ట్ యాత్ర' సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజలను ఖర్చులు తగ్గించుకోవాలని కోరేముందు, ప్రభుత్వమే ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ డాలర్ విలువ రూ. 100కు చేరువవుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడాలి, వర్క్ ఫ్రం హోం, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మంత్రపై ఆయన గట్టి చురక లేశారు.ముందు రూ. 8,000 కోట్ల విమానాన్ని అమ్మండిధర్మం అనేది ఇంటి నుండే మొదలవ్వాలి (Austerity begins at home)" అన్న అవిముక్తేశ్వరానంద ముందు రూ. 8,000 కోట్ల విలువైన విమానాన్ని అమ్మేసి, తక్కువ ఇంధనం ఖర్చయ్యే విమానాలను వాడాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు ఆవుల సంఖ్య తగ్గి పోతోందంటూ యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో గోవధను అరికట్టడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. కేరళ (8%), పశ్చిమ బెంగాల్ (15%), జార్ఖండ్ (24%) వంటి రాష్ట్రాల్లో ఆవుల జనాభా పెరగగా, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం గణనీయంగా తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకించారు. గోవధకు పాల్పడే వారి నుంచి డబ్బులు తీసుకుంటూ కొందరు నాయకులురాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఓటర్లు నమ్మకూడదని పిలుపునిచ్చారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజు కంటే సన్యాసి పదవి చాలా ఉన్నతమైనదని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ద్వారా తన ఉన్నత స్థానం నుండి కిందకు దిగజారారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఒక సీఎం మాత్రమే, సన్యాసి(పీఠాధిపతి) కాదంటూ విమర్శించారు. అలాగే యూపీ ప్రభుత్వ గోశాలల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నాయకులు ,రాజకీయ పార్టీలు గోవధను అరికట్టడంలో విఫలమయ్యారు. అందుకే, తాము గోవులను ప్రేమించే ఓటర్లను సంప్రదించి,వారిలో అవగాహన కల్పిస్తున్నా మన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, గోవుల సంరక్షణ, వాటి గౌరవాన్ని పునరుద్ధరించడంపై ఓటర్లలో అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని శంకరాచార్యులు తెలిపారు.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?కాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్దం, హర్మోజ్ జలసంధి మూసివేత సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఆ ఏడాదిందా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్వామి అవిముక్తేశ్వరానంద ఘాటుగా స్పందించడం గమనార్హం. ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్,స్పెషల్ ఏంటంటే? -
బంగారం కొనాలా.. వద్దా.! అయోమయంలో మా వెన్నెల
-
అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం
గౌహతి: అస్సాం రాజకీయాల్లో మరో అధ్యాయం మొదలయ్యింది. గౌహతిలోని ఖానాపరా పశువైద్య కళాశాల ప్రాంగణం ఈ అద్భుత ఘట్టానికి వేదికైంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుక యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. మంగళవారం ఉదయం 11:40 గంటలకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సమక్షంలో హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం రాజకీయాల్లో కాంగ్రెసేతర నాయకుడెవరూ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 57 ఏళ్ల శర్మ ఆ రికార్డును తిరగరాశారు. గతంలో ప్రఫుల్ల కుమార్ మహంత రెండుసార్లు సీఎంగా పనిచేసినప్పటికీ, ఆ పదవీకాలాల మధ్య విరామం ఉంది. తద్వారా వరుసగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా శర్మ రికార్డు సృష్టించారు. #WATCH | Guwahati: BJP's Himanta Biswa Sarma takes oath as the Chief Minister of Assam for the second consecutive term at Veterinary College ground in Khanapara pic.twitter.com/K5sGEN7jVF— ANI (@ANI) May 12, 2026హేమాహేమీల సమక్షంలో..ఈ చారిత్రక ఘట్టానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విదేశీ ప్రతినిధులు, ముఖ్యంగా భారతదేశానికి అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అస్సాంలోని 17 వైష్ణవ మఠాల మఠాధిపతుల ఆశీర్వచనాల మధ్య శర్మ ప్రమాణం చేశారు. లక్షలాది మంది ప్రజలు ఈ వేడుకను వీక్షించడానికి తరలిరావడంతో గౌహతి జనసంద్రమైంది. మంత్రుల ప్రమాణంశర్మతో పాటు అజంతా నియోగ్, రామేశ్వర్ తేలి, అతుల్ బోరా (ఏజీపీ), చరణ్ బోరో (బీపీఎఫ్)లు మంత్రులుగా ప్రమాణం చేశారు. రంజిత్ దాస్‌ను స్పీకర్‌గా ఎంపిక చేయనున్నారు. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీయే కూటమి ఏకంగా 102 సీట్లను కైవసం చేసుకుని, తిరుగులేని మెజారిటీని సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితం కావడంతో, ఈసారి అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష నేత హోదా పొందే అవకాశం కూడా ఏ పార్టీకి లభించకపోవచ్చు. -
WFH: మోడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సలహా వెనుక ?
-
మమతను ముంచిన ముస్లింలు.. BJPని గెలిపించిన హిందూ ఓటు బ్యాంకు
-
బంగారం కొనకండి ఎందుకంటే..
-
ఎదుటివారికి చెప్పేటందుకేనా ప్రధాని నీతులు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ కొన్ని చర్యలు చేపడతారని ,అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని భావించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా? లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం.ఒక ఏడాదిపాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం అసాధారణమేమీ కాకపోయినా, భవిష్యత్తులో వీటి ధరలు పెంచుతారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా తొమ్మిది పాయింట్లపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.వీటన్నిటిని దేశ భక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు. కాని ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలంగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కాని ఆలా చేయలేకపోతున్నారే అన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడుతోంది.దాదాపు మూడు నెలలుగా గల్ఫ్ లో యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు, ఇరాన్ కు మద్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచం అంతటా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా అంతర్జాయతీయ పరిణామాలు అందరిని కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచాల్సి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఊహించారు.కాని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్రం తరపున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. కానీ.. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడింది. ప్రధాన మంత్రే ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చన్నది ఎక్కువ మంది అంచనాగా ఉంది.ఇక ఈ పొదుపు సూత్రాలు చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ,డీజిల్ వాడకం తగ్గించుకోండని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పారు. సొంత వాహనాలను వదలి మెట్రో,బస్ లను వాడాలని చెప్పారు. ఆక్షేపణ లేదు. ఈ సమస్య గురించి ఆయనకు ముందుగానే తెలుసు కదా! అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరి? లక్షల మందిని సమీకరించి, వారందరిని వాహనాలలో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరం అవుతాయో ఆయనకు తెలియదా?ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి, తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురును వాడవచ్చా! రెండున్నరేళ్ల తర్వాత జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసమో, లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాలలో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా!ముందుగా దానిని మెరుగు చేయకుండా బస్సుల్లో వెళ్లండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది. మోదీ చెప్పిన సూత్రాలలో బంగారం కొనుగోలు చేయవద్దని చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూమతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్నివేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి.వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉంది. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని అన్నారు. బాగానే ఉంది. కాని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్నివేల కోట్ల అప్పు చేస్తున్నది మోదీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించే యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి, పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా!హైదరాబాద్‌లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా! ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో! చదరపు అడుగుకు రూ.18 వేల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది.ఈ నిర్మాణాలలో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తోందో తెలియదు. ఒక్క అద్దాలకే రూ.2540 కోట్లు వెచ్చించబోతున్నారే. అవన్ని ఇండియాలో తయారయ్యేవా? లేక దిగుమతి చేసుకోవల్సి ఉంటుందా? వంట నూనెలు తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు.ఇన్నేళ్ల పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం అవమానమే. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్,రష్యా యుద్దం మూడేళ్లుగా జరుగుతోంది. త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే, పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. ఇదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్య కాలంలో చిత్రమైన శిక్షణల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీకి కలిసి వచ్చేది ఏమి ఉందో ఎవరికి తెలియడం లేదు.ప్రభుత్వ ఖజానా పై కోట్ల భారం పడుతోంది.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగుల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి. కాని వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ది అర్ధం అవుతుంది.కాని ఎన్నికల సమయంలో ఒక రకంగా ,ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారి తీస్తుంది.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్‌తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ, అప్పటికన్నా విలువ దాదాపు రెండు రెట్లు తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు.ప్రధాని చెప్పిన నవ సూత్రాలపై లోక్ సభ లో విపక్ష నేత రాహోల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్దం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిని ఆయన తొలుత తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు.తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి,అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రధాని ప్రయాణించే మార్గంలో జిలెటిన్ స్టిక్స్
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించే రోడ్డు సమీపంలో జిలెటిన్ స్టిక్స్ బాక్స్ లభించడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎన్ఎస్జీ) రంగంలోకి దిగాయి. లోహిత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద పోలీస్ శాఖ, పలు దర్యాప్తు సంస్థల ఫోన్ నంబర్లు ఉండటం గమనార్హం. ఇతడు ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ చేసేవాడని తెలిసింది. అతన్ని పోలీసులు విచారించగా.. ‘నాకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తెలుసు. ఎన్ఐఏ డైరెక్టర్ తెలుసు. సీబీఐ డైరెక్టర్ కూడా తెలుసు.డీజీపీతో మాట్లాడతా’ అంటూ విచిత్రమైన సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. అతడు ఏదైనా ఉద్దేశంతో పేలుడు పదార్థాలను తెచ్చాడా లేక సంచలనం సృష్టించడానికా? అనేది పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. 3 కేంద్ర బృందాలు బెంగళూరు దక్షిణ జిల్లా (రామనగర) కగ్గలీపుర సమీపంలో జిలెటిన్ స్టిక్స్ పెట్టె లభ్యమైన ఒడేరహళ్లి గేట్ రోడ్డును పరిశీలించాయి. పోలీసులు సీజ్ చేసిన జిలెటిన్ స్టిక్స్ బాక్స్‌ను పరిశీలించి వివరాలు తీసుకున్నారు. అవి తయారైన చోటు, అమ్మిన డీలరు తదితరుల సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసు అధికారులపై చర్యలు? ప్రధాని పర్యటనలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారని పలువురు పోలీసు ఉన్నతాధికారులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. రాష్ట్ర నిఘా విభాగం ఐజీ లాభు రామ్, బెంగళూరు దక్షిణ జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌గౌడ సహా పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. -
భారత్ ఎవరికీ తలవంచదు
సోమనాథ్(గుజరాత్): అమెరికా వంటి అగ్రరాజ్యాలకు సైతం ఏమాత్రం బెదరక భారత్ తన లక్ష్యసాధనలో సఫలీకృతమైందని ప్రధాని మోదీ శ్లాఘించారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలపై అమెరికా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్ ఏమాత్రం తన సంకల్పాన్ని సడలనివ్వలేదని మోదీ గుర్తుచేశారు. గుజరాత్‌లోని ప్రభాస్ పాటన్‌లో అరేబియా సముద్రతీరంలో ఆధునిక సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన అమృత్‌మహోత్సవ్ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సద్భావన మైదాన్‌లో నిర్వహించిన ‘సోమనాథ్ పునర్వైభవానికి 75 ఏళ్లు’సభలో మోదీ ప్రసంగించారు. ‘‘1947లో భారత్ విదేశీపాలకుల నుంచి స్వాతంత్య్రంపొందినప్పటికీ 1951లో సోమనాథ్‌లో ఆధునిక ఆలయంలో ప్రాణప్రతిష్ట జరిగిన క్షణంలోనే నిజమైన స్వేచ్ఛా స్ఫూర్తి దేశం నలుచెరుగులకూ వ్యాపించింది. సోమనాథ్‌లో జరుగుతున్న అమృత్ మహోత్సవం కేవలం ఒక స్మరణీయ కార్యక్రమం కాదు ఇది వచ్చే వెయ్యేళ్లపాటు మనకందించే స్ఫూర్తి సంబరం. మే 11 అనగానే కేవలం ఆధునిక సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం గుర్తుకురాదు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలో 1998లో భారత్ చేపట్టిన అణుపరీక్షలూ ఇదే తేదీన జరిగాయి. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు దేశ అణుశక్తి సామర్థ్యాలు, సత్తాను యావత్ ప్రపంచానికి చాటిచెప్పారు. అణుపరీక్షల భూప్రకంపనలు ప్రపంచదేశాల్లో వణుకుపుట్టించాయి. కొన్ని దేశాల్లో ఆగ్రహజ్వాలలను రగిల్చాయి. అణుపరీక్షలు చేసే హక్కు భారత్‌కు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ పలు దేశాలు హూంకరించాయి. ఆర్థిక ఆంక్షల మాటున భారత్‌ను ఏకాకిని చేసే కుట్రలుచేశాయి. భారత్‌ను అణగదొక్కేందుకు ప్రపంచశక్తులు ఏకమయ్యాయి. కఠిన ఆంక్షలనూ ఇండియాపై మోపారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇంకేదైనా దేశమైతే కూలబడేదే. కానీ భారత్ విభిన్నం. అన్నింటినీ తట్టుకుని భారత్ సగర్వంగా నిలబడింది. అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లున్నా 13న మరోసారి అణుపరీక్షలుచేసింది. మే 11న శాస్త్రవేత్తలు తమ ఆరంభకార్యాలను పూర్తిచేయగా 13న మరోరెండు అణుపరీక్షలుచేసి వాజ్‌పేయీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ రాజకీయ సంకల్పాన్ని రుజువుచేశారు’’అని మోదీ అన్నారు. మూలాలు మర్చిపోవద్దు ‘‘మూలాలను మర్చిపోయిన దేశం పటిష్టంగా ఉండలేదన్న సత్యాన్ని సోమనాథ్ మనకు ప్రబోధిస్తోంది. అద్భుత సోమనాథ్‌ను నాశనంచేసేందుకు చరిత్రలో పలుమార్లు విదేశీ పాలకులు, చొరబాటుదారులు ఎంతగానో ప్రయత్నించారు. పునర్నిర్మించినా మళ్లీ కూల్చేశారు. అయినాసరే ఆలయం పునర్నిర్మితమైంది. ఇది నిరంతరంగా కొనసాగింది. ఆలయాన్ని నాశనంచేసినట్లే దేశాన్ని సైతం కొన్ని శక్తులు బుజ్జగింపు రాజకీయాలతో భ్రష్టుపట్టించాయి. అలాంటి ఆలోచన ధోరణితోనే కొన్ని శక్తులు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవాలనిచూశాయి. జాతి ప్రతిష్ట, గుర్తింపునకు సంబంధించిన ఇలాంటి అంశాల్లోకి ఒక్కోసారి రాజకీయాలు చొరబడుతుంటాయి’’అని అన్నారు. నెహ్రూ వద్దన్నా పటేల్ పట్టుబట్టారు ‘‘ఆలయ నిర్మాణంపై నెహ్రూ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయినాసరే ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్, తొలి రాష్ట్రపతి డాక్టర్రాజేంద్ర ప్రసాద్ ఆధునిక సాంస్కృతిక సౌధం సోమనాథ్ పునర్నిర్మాణానికి పట్టుబట్టి సాధించారు. అయోధ్యలో భవ్యమందిర నిర్మాణానికి పూనుకున్నప్పుడూ ఇలాంటి శక్తులు అడ్డుతగిలాయి. అయినాసరే మనం అభివృద్ధి, వారసత్వ పరంపరను ముందుకు తీసుకెళ్లాల్సిందే. గతంలో ఇలాంటి సాంస్కృతిక కేంద్రాలను నిర్లక్ష్యంచేసిన ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నాం. నేటి భారతంలో సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి అవిభాజ్యాలు. జంటగా పురోభివృద్ధి సాధించాల్సిందే’’అని అన్నారు. ఈ సందర్భంగా మోదీ సోమనాథ్ ఆలయానికి సంబంధించిన స్మారక తపాళాబిళ్లను ఆవిష్కరించారు. దారిపొడవునా జనసందోహం అంతకుముందు జామ్‌నగర్ నుంచి గిర్ సోమనాథ్ జిల్లాకు మోదీ హెలికాప్టర్లో చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ కూడలి దాకా కిలోమీటర్ దూరానికిపైగా పొడవున మార్గంలో మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. దారి పొడవునా సోమనాథ్ వాసులు మోదీకి పూలవర్షం కురిపిస్తూ ఆహ్వానం పలికారు. జెండాలు చేతబట్టుకుని మోదీకి అనుకూలంగా నినాదాలుచేశారు. మార్గమధ్యంలో పలు చోట్ల పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన సంప్రదాయ కళాకారులు సంప్రదాయ నృత్యాలుచేసి స్థానికులను అలరించారు. సోమనాథ్ అనేది దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. ఆలయంలో మోదీ ప్రత్యేక పూజ అంతకుముందు మోదీ సోమనాథ్ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోకి రాగానే పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నరేంద్ర మోదీ గర్భగుడిలో సోమలింగానికి జలాభిషేకం చేశారు. తర్వాత మహాపూజ క్రతువును పూర్తిచేశారు. ఇదే సందర్భంలో దేశంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో పండితులు ఆలయ శిఖరంపై ఉన్న కలశాలకు మహాభిషేకంచేశారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లు గులాబీ పూరేకులతో ఆలయంపై పూలవాన కురిపించారు. ధ్వజపూజ సైతం చేశారు. తర్వాత అక్కడి సందర్శకుల పుస్తకంలో రాశారు. ఓంకార మంత్ర జపించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి పండితులు చెప్పిన సోమనాథ్ అనుబంధ గాథలను మోదీ సైతం విన్నారు. తర్వాత భారతవాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ఒళ్లు జలదరించేలా చేసిన వైమానిక విన్యాసాలను మోదీ తిలకించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భుపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సింఘ్వీ సైతం పాల్గొన్నారు. -
మోదీ పొదుపు మంత్రం.. ఎకానమీకి శుభసూచకం!
సాక్షి, బిజినెస్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం దెబ్బతో క్రూడ్ రేట్లు భగ్గుమనడంతో మన ఆర్థిక వ్యవస్థకు బాగానే సెగ తగులుతోంది. ముడిచమురు ధరలు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు తడిసిమోపెడవుతోంది. మరోపక్క, బంగారం రేట్లు కూడా దూసుకెళ్లడంతో విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు దిగుజారుతున్నాయి. దీని ప్రభావంతో రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి దిగజారి నేల చూపులు చూస్తోంది. తాజాగా 95.28 ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన సూచన దేశవ్యాప్తంగా అటు పరిశ్రమ వర్గాల్లో ఇటు ప్రజల్లో సంచనలం రేపుతోంది. ఎకానమీకి దన్నుగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం పొదుపు చర్యలు పాటించాలంటూ మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని.. పెట్రోలు, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని... ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలన్నారు. అలాగే విదేశీ ప్రయా ణాలను వాయిదా వేసుకోవడం, వంటనూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ చర్యలతో ఆర్థిక వ్యవస్థకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దిగుమతుల భారం తగ్గడంతో కాస్త కరెంట్ ఖాతా లోటు దిగొచ్చి.. రూపాయికి దన్నుగా నిలిచినప్పటికీ, దేశీ యంగా వినిమయం తగ్గడంతో ఎకానమీ మందగించే ప్రమాదం కూడా ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు.బంగారం గుదిబండ...భారతీయులు సహజంగానే పసిడి ప్రియులు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆభరణాల కొనుగోళ్లకు తోడు ఇటీవల పెరిగిన పుత్తడి రేట్లతో పెట్టుబడులకు కూడా మనోళ్లు సై అంటున్నారు. దీంతో బంగారం దిగుమతులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఏటా దేశంలోకి 700–800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 1–2 టన్ను లు మాత్రమే. 90% పైగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దేశ దిగుమతుల్లో ఇది దాదాపు 10% మరోపక్క, ఆపదలో ఆదుకునే సాధనంగా పసిడికి ప్రాముఖ్యత పెరగడంతో సెంట్రల్ బ్యాంకులు కూడా పొలోమంటూ గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాయి. మన ఆర్బీఐ కూడా టన్ను ల కొద్దీ పోగేసుకుంటోంది. ప్రస్తుతం నిల్వలు 880 టన్నులకు చేరాయి. 2005–26లో 72 బిలియన్ డాలర్లు విలువైన బంగారం దిగుమతైంది. దీనివల్ల భారీమొత్తంలో ఫారెక్స్ నిల్వలు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, రేట్లు భారీగా పెరగడంతో ఇటీవల బంగారం దిగుమతులు బాగానే తగ్గుముఖం పట్టాయి. అయితే, రేటు (అంతర్జాతీయంగా ఔన్స్ ప్రస్తుతం 4700 డాలర్లు) అధిక స్థాయిలోనే కొనసాగుతుండటంతో భారీగా డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. మోదీ చెప్పినట్లుగా బంగారం కొనుగోళ్లు తగ్గించుకుంటే, దిగుమతులు దిగొచ్చి.. ఫారెక్స్ నిల్వలకు దన్నుగా నిలుస్తుంది. దీనివల్ల రూపాయి పతనానికి కూడా అడ్డుకట్టపడుతుంది. బంగారం దిగుమతులు 30–40% తగ్గితే 20–25 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయి. 50% తగ్గితే 36 బిలియన్ డాలర్లు సేవ్ అవుతాయి. అంటే ప్రజలు బంగారం కొనడం తగ్గిస్తే దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్ల ప్రవాహం భారీగా తగ్గుతుంది. అయితే, దేశీయంగా కొనుగోళ్లు మందగించడం వల్ల ఆభరణాల విక్రేతలపై ప్రభావం పడుతుందని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, ఫిజికల్ గోల్డ్‌కు బదులు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లు, ఈ–గోల్డ్ రిసీట్స్ వంటి పేపర్ గోల్డ్ రూపంలో కొనుగోలు చేయడం వల్ల అటు దిగుమతుల భారం తగ్గడంతో పాటు పెట్టుబడులకు కూడా కొలిసొచ్చే అంశమని నిపుణులు సూచిస్తున్నారు. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఒక్కసారిగా క్రూడ్ ధరలు భగ్గుమనడం తెలిసిందే. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు 119 డాలర్లకు దూసుకెళ్లింది. రెండు నెలలుగా సగటున 100 డాలర్ల పైనే కదలాడుతోంది. దీంతో క్రూడ్ దిగుమతుల భారం భారీగా పెరిగిపోతోంది. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సి రావడం.. హార్మూజ్ జలసంధిలో అడ్డంకులతో సరఫరా తగ్గడంతో రేట్లు పైపైకి చేరి దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. 2025–26లో మనం 134.7 బిలియన్ డాలర్ల విలువైన క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం గమానార్హం. మన మొత్తం దిగుమతులు 775 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో అత్యధిక వాటా క్రూడ్దే. అయితే, ప్రభుత్వం మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచకుండా ప్రజలపై భారం పడకుండా చూస్తోంది. మరోపక్క, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) కు కొంచెం ఊరటనిచ్చింది. దీనివల్ల కేంద్ర ఖాజానాకు నెలకు రూ.14,000 కోట్ల చిల్లు పడుతోంది. ఇక రేట్లు పెంచకపోవడం వల్ల ఓఎంసీలు రోజుకు సుమారు రూ.1,700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు అంచనా. అంటే గత పది వారాల్లో వాటిపై ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగానే భారం పడినట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే మోదీ పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవాలని, కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని, కార్ పూలింగ్తో పాటు, మెట్రో రైళ్లు ఇతరత్రా ప్రభుత్వ రవాణా సదుపాయాలను వాడాలంటూ సూచించారు. దీనివల్ల అటు క్రూడ్ దిగుమతులకు కాస్త అడ్డుకట్టపడి.. ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ పెట్రో పొదుపు మంత్రంతో సోమవారం ఎలక్ట్రిక్ వాహన కంపెనీ షేర్లు రివ్వుమనడం విశేషం. కాగా, క్రూడ్ ధరలు ఇప్పట్లో శాంతించే అవకాశాలు కనిపించకపోవడం.. మోదీ తాజా సూచనలు చూస్తుంటే, సమీప భవిష్యత్తులో పెట్రో ధరలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదనేది కొంత మంది పరిశీలకుల మాట! ట్రావెల్ రంగంపై ప్రభావం.. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటూ మోదీ సూచించడం కూడా ఫారెక్స్ నిల్వలు కరిగిపోకుండా చూసుకోవడం కోసమే.. ఎందుకంటే, విదేశాలకు వెళ్లాలంటే డాలర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. హోటళ్లను బుక్ చేసుకోవాలన్నా డాలర్లు వెచ్చించాల్సిందే. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినట్లు అంచనా. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మనోళ్లు విదేశీ ట్రిప్పుల కోసం వెచ్చించిన మొత్తం 31.7 బిలియన్ డాలర్లు. అంటే ఆ మేరకు దేశం నుంచి డాలర్లు బయటికి వెళ్లిపోయాయి. మోదీ సూచన పాటిస్తే, ఈ భారం తగ్గుతుంది. అయితే, విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గడంతో ట్రావెల్, ఏవియేషన్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. మార్కెట్లో ఇప్పటికే దీని సెగ తగిలింది. యాత్రా, థామస్ కుక్ వంటి ట్రావెల్ సంస్థల షేర్లతో పాటు ఇండిగో షేరు కూడా 5 శాతం పైగా పడిపోయాయి. ఫారెక్స్ నిల్వలు తగ్గుముఖం... క్యాడ్ పైపైకి పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి చివరల్లో భారత విదేశీ మారక నిల్వలు 728.5 బిలియన్ డాలర్లకు చేరి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేశాయి. క్రూడ్ ధరలు భగ్గమనడం.. దిగుమతుల బిల్లు పెరిగిపోవడంతో ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం సుమారు 690.69 బిలియన్ డాలర్లకు చేరాయి. మరోవైపు ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2026లో భారత కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం (ప్రధానంగా డాలర్లు) మధ్య వ్యత్యాసం) 84.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇది మన జీడీపీలో 2 శాతానికి సమానం. అంటే దేశంలోకి వచ్చే డాలర్ల కంటే బయటికి వెళ్లే మొత్తం భారీగా పెరిగిపోతుందన్నమాట! దీనివల్ల రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
పొదుపు కాలం
ఎన్నికల హోరు సద్దుమణిగి, రాష్ట్రాలన్నిటా ప్రభుత్వాల ఏర్పాటు పూర్తికావస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ పౌరులనుద్దేశించి ఒక హెచ్చరిక లాంటి హితోపదేశం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పర్యవసానంగా ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించటానికి కోవిడ్ కాలంలో అనుసరించిన పొదుపు చర్యలు తప్పనిసరంటూ పౌరులకు సూచించారు. ఆయన చెప్పినవాటిల్లో వర్క్ ఫ్రం హోం, ప్రజారవాణా వ్యవస్థల వినియోగం, ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల నిలిపివేత, విదేశీ ప్రయాణాలు మానుకోవటం, రైతులు యూరియా వాడకాన్ని తగ్గించటం వంటివి ఉన్నాయి. ఇందులో చాలా వరకూ పాటించదగ్గవే. దీనికితోడు ‘పర్యావరణ పరిరక్షణ’ కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు మూసేస్తారు. సోమవారం వెల్లడైన వివరాలనుబట్టి చమురు సంస్థలు రోజూ రూ. 1,700 కోట్లు నష్టపోతున్నాయని తెలుస్తోంది. గత పది రోజుల్లో మొత్తంగా నష్టాలు రూ. లక్ష కోట్ల మేర ఉన్నాయనీ దాని సారాంశం. నిజానికి ఎన్నికల ప్రచారపర్వం మధ్యలో మోదీ ఒకసారి చూచాయగా పరిస్థితి తీవ్రతను చెప్పారు. కానీ ఎన్నికల అనంతరం పెట్రో ధరలు భారీగా పెరుగుతాయనీ, పర్యవసానంగా అన్ని సరుకుల ధరవరలూ ఆకాశాన్నంటుతాయనీ విపక్షాలు ప్రచారం చేయటంతో బీజేపీ బెంబేలుపడి ఇక దాని జోలికిపోలేదు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. పశ్చిమాసియా ఉద్రిక్తత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను బెంబేలెత్తిస్తోంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్, అమెరికాలు దిగ్బంధించటంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. మన దేశం మాత్రమే వీటన్నిటికీ అతీతంగా మనుగడ సాగిస్తుందనీ, మన ఆర్థిక వ్యవస్థ అన్నిటినీ తట్టుకోగలదనీ భావించటం అమాయకత్వం. చైనా మొదలుకొని ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక తదితర దేశాలు ఇప్పటికే రక రకాల చర్యలు అమల్లోకి తెచ్చాయి. చమురు ఎగుమతులన్నీ ఆపేయాలని దేశంలోని చమురుశుద్ధి కర్మాగారాలను చైనా ఆదేశించటంతోపాటు పెట్రో ధరల్ని కూడా పెంచింది. జెట్ ఇంధనం ధరలు పెరగటంతో అక్కడి ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు సర్వీసుల్ని నిలి పేశాయి. ఫిలిప్పీన్స్ మార్చిలోనే జాతీయ ఆత్యయిక స్థితిని ప్రకటించింది. వారానికి నాలుగు రోజుల పనిదినాల్ని ప్రకటించింది. ఆస్ట్రేలియాలో కొన్ని రాష్ట్రాలు ప్రజా రవాణా వ్యవస్థను ఉచిత సర్వీసుగా మార్చటం లేదా టికెట్ ధరలు తగ్గించటం వంటి చర్యలు తీసుకున్నాయి. సొంత వాహనాల వాడకం తగ్గించటమే దీని ఉద్దేశం. శ్రీలంక కూడా వారానికి నాలుగు రోజుల పనివిధానం ప్రకటించి, వారానికి ఒకరోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించటంతోపాటు ఇంధనంపై రేషన్ విధించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్, అమెరికా పంతాలకు పోవటంతో 1,500 నౌకలు నిలిచిపోయాయి. అందులో మన నౌకలు 13 వరకూ ఉన్నాయి. తాజాగా ఇరాన్ ప్రతిపా దనల్ని అమెరికా తోసిపుచ్చడంతో యుద్ధం ఇప్పట్లో సద్దుమణుగుతుందన్న ఆశ అడుగంటింది. ఉన్నకొద్దీ పరిస్థితి ముదరవచ్చు. అందుకే ప్రధాని చెప్పిన పొదుపు చర్యలు తక్షణ కర్తవ్యం. అయితే ఈ ఆచరణ ప్రభుత్వాలపరంగా మొదలుకావాలి. ఆర్భాటాల్లేకుండా శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ ముగించటం, సాధ్యమైనంతవరకూ ప్రత్యేక విమానాల వాడకం ఆపేయటం, సీఎంలు, మంత్రుల కాన్వాయ్‌లలో పదులకొద్దీ వాహనాల వినియోగం వంటివి విరమించుకోవాలి. ఇక ఏపీ వరకూ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ల నివాసాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వారాంతంలో ప్రత్యేక విమానాల్లో వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి దుబారా అవసరమా? మన దిగుమతుల్లో బంగారం, చమురు సింహభాగం ఆక్రమిస్తాయి. 2025–26లో బంగారం దిగుమతుల విలువ 7,200 కోట్ల డాలర్లు. మనకు అవసరమైన చమురులో 90 శాతంమేర దిగుమతి చేసుకుంటున్నాం. మొన్న ఏప్రిల్ 24కు మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 69,000 కోట్ల డాలర్లయితే, ఒక్క వారంలో అంటే... ఈనెల 1 నాటికి అందులో 779 కోట్ల డాలర్లమేర హరించుకుపోయాయి. ఇదే వరస కొనసాగితే సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. అయితే ఏమేరకు పొదుపు అవసరమనేది కూడా చూసుకోవాలి. అది మితిమీరినా ఆర్థికవ్యవస్థకు చేటు తప్పదు. కనుక సమతుల్యత అత్యవసరం. -
ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తన అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల జీవనంపై అప్రకటిత నిషేధం ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘బంగారం కొనొద్దు.. వెకేషన్‌కు వెళ్లొద్దు.. నూనె తినడం తగ్గించాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యం. మోదీ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థ విధానాలే ఇందుకు కారణం. విదే శాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు సలహాలు తీసు కోకుండా ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. దేశంలో సంక్షోభం తలెత్తే అంశాలపై రాహుల్‌గాంధీ ఆరు నెలల నుంచే చెబుతున్నా అంతా సవ్యంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం లేదు. దశ, దిశ లేదు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. గాలి తిని, గాల్లో బతకమని చెప్పి మోదీ వెళ్లిపోయారు. పశ్చిమాసియా యుద్ధంలో మనమేమీ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు..’ అంటూ సీఎం విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో సుదీర్ఘంగా చిట్‌చాట్ చేశారు. మావోయిస్టులను చంపడమే బీజేపీ ఎజెండా ‘బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే ఆ పార్టీ విధానం. ముస్లింలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కారా? వారికి తమ సిద్ధాంతాలను చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మావోయిస్టులను చంపడమే బీజేపీ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది. మేము ప్రాణాలు తీయడానికి వ్యతిరేకం. మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను కూడా ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాం. మనుషుల ప్రాణాలకు మా ప్రభుత్వం విలువ ఇస్తుంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది. మనషులను చంపడం పరిష్కారం కాదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అత్యధికంగా తెలంగాణలోనే లొంగిపోయారు. 818 మంది మావోయిస్టులు రాష్ట్రంలో సరెండర్ అయ్యారు. వందలాది ఆధునాతన ఆయుధాలను అప్పగించారు. అందుకోసం మేం ప్రత్యేక చొరవ తీసుకున్నాం. మేం బుల్లెట్ కాదు బ్యాలెట్ అన్నాం.. లొంగిపోయిన వారికి రక్షణ, వైద్యం, ఆర్థికపరమైన సాయం ప్రభుత్వం అందిస్తుంది. మావోయిస్టుల విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. భూ పంపణీ, ఉపాధి హామీ పథకాల అమలుతో వారి ఉద్యమాలు తగ్గాయి. గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించకపోగా విమర్శించడం దురదృష్టకరం. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం అన్నాం. చివరకు మావోయిస్టులు మా లైన్‌కు వచ్చారు. ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడం దురదృష్టకరం. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతం..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. నేను అడిగిన అంశాలకు మోదీ అంగీకరించారు.. ‘ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా నేను అడిగిన అంశాలకు ప్రధాని అంగీకరించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌కు సాయం చేసిన విధంగానే తెలంగాణకు కూడా మీరు సహకరించాలని కోరా. అందుకు ప్రధాని స్పందిస్తూ.. ‘నీవొక్కడివే చేస్తే అనుకున్న లక్ష్యాలను (3 ట్రిలియన్ ఎకానమీ) సాధించలేవు. నీ కలలు నిజం అవ్వాలంటే మాతో కలిసి వస్తే.. అది సాధ్యం అవుతుంది’ అనే విధంగా అన్నారు. అయితే ఆయన మాటలను ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యా. నన్ను కాదు..రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మోదీ అన్నారు. ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు.. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై మేం చర్చించాం.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందే..అది హక్కు. వాటిని సాధించుకుంటాం. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా నిధులు అడగకుండా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. కొన్ని అంశాల్లో సహకరిస్తున్నా.. మంత్రులను కలిసి ఎన్నిసార్లు అడిగినా అనుమతులు రావడం లేదు. రాష్ట్రాల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంలో సింగిల్‌విండో ఏర్పాటు చేయాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం విధానంపైనే అభ్యంతరాలు ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం అనుసరించే విధానంపైనే ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు, నియోజకవర్గాల పెంపునకు ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయింది. 50 శాతం సీట్ల పెంపునకు ఎలాంటి ఫార్ములా లేదు. 2029లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు కావొచ్చు. అయితే బీజేపీ ఎన్నికల విధానం అంతా జెమినీ సర్కస్‌లా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రధాని అన్నారు. వారిష్టం.. అనందపడనివ్వండి. రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ భవిష్యత్తులో మళ్లీ ఆదే రెండు సీట్లకు పరిమితం అవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మాకు ఒక రాష్ట్రం వస్తే.. వారికి ఒక రాష్ట్రం అదనంగా వచ్చింది అంతే. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది..’ అని సీఎం వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో యాంటీ డ్రగ్ ప్రమాణం ‘రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభోత్సవం రోజున పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం చేయించనున్నాం. అందుకోసం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానిస్తున్నాం. నిపుణులు, విద్యావంతులతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ విలీనంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. తుమ్మిడిహెట్టిపైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. ఇంకా స్పందన రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధానమంత్రి పెద్దరికం వహిస్తే బావుంటుంది. ధాన్యం సేకరణలో సమస్యలు ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ధాన్యం దిగుబడి విపరీతంగా వచ్చింది. ప్రకృతి కారణంగా కూడా సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత ఎక్సెస్ టెండర్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? హామ్ రోడ్ల టెండర్లలో అన్నీ ఎక్సెస్ అని హరీశ్‌రావు వ్యాఖ్యానిస్తున్నారు. 26 శాతం లెస్‌కు వచ్చిన విధంగానే అందరికీ ఇవ్వాలని అంటే.. గతంలో వారు ఎక్సెస్‌కు ఇచ్చిన టెండర్లన్నింటిపై సీబీఐ విచారణకు సిద్ధమా? నాకు ఎవరిపైనా కక్ష లేదు. తప్పు చేసిన వారిని న్యాయస్థానాలు శిక్షిస్తాయి..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీ విషయంలో అలా జరగలేదు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అడవికి రాజునని, వేటాడి చంపే మృగం బలం ఉన్నప్పుడు అలా వ్యవహరించినా.. శక్తి లేనప్పుడు పొదల మాటున, రాళ్ల మాటున దాగి మరణిస్తుందని అంటూ ఇది ఎవరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యానించడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
పెట్రోల్, గ్యాస్ కొరత వచ్చేసిందా? మోదీ వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇంధనం ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.పశ్చిమాసియాలో పరిస్థితులపై సోమవారం ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ ప్రభావం మనపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భయంతో అధికంగా కొనుగోలు చేయొద్దు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) శర్మ మాట్లాడుతూ.. దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. భారత్‌కు వచ్చే ఇంధన దిగుమతుల్లో దాదాపు 90 శాతం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తున్నాయని, అయినా అంతరాయాన్ని తగ్గించే చర్యలు వేగంగా చేపట్టామని చెప్పారు.దేశంలో అన్ని రకాల ఇంధన సరఫరాలు తగినంత ఉన్నాయని, భయంతో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని శర్మ తెలిపారు. ప్రపంచ అనిశ్చితి సమయంలో దేశంపై ఆర్థిక భారం తగ్గించడం, ఇంధన పొదుపు లక్ష్యంతోనే ప్రధానమంత్రి వాటిపై ఆదివారం ఆ పిలుపును ఇచ్చారని చెప్పారు. సరఫరాలపై ప్రభావం అత్యల్పంగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఇంధన పొదుపు లక్ష్యంతోనే..అవసరంలేని ప్రయాణాలు తగ్గించి ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన సందేశాన్ని, సరఫరా కొరతకు ప్రతిస్పందనగా కాకుండా ఇంధన పొదుపు దృష్టితో చూడాలని అధికారులు తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న సమయంలో బాధ్యతాయుతంగా ఇంధనం వినియోగించాలనే ఉద్దేశంతో ఈ పిలుపు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.అనేక దేశాల నుంచి దిగుమతులువిదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇంధన సంరక్షణ, సరఫరా చర్యల్లో భాగంగా భారత్ అనేక దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటనపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బ్రిక్స్ దేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, ప్రణాళికలు ఖరారైన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.పశ్చిమాసియా పరిస్థితులపై భారత్ వైఖరిని కూడా ఆయన మరోసారి వెల్లడించారు. మొదటి నుంచే శాంతి, చర్చలకు భారత్ మద్దతు ఇస్తోందని తెలిపారు. భారత నౌకలు సురక్షితంగా తిరుగు ప్రయాణం చేస్తున్నాయని పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒపేష్ శర్మ తెలిపారు. భారత జెండా ఉన్న 10 నౌకలు ఇప్పటివరకు అదనపు రుసుములు చెల్లించకుండా హార్మూజ్ జలసంధి దాటి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఇంకా 13 భారత జెండా నౌకలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయని, వాటిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నౌక సిబ్బంది సంక్షేమం, వారి అవసరాలను కూడా ప్రతిరోజూ పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, పెట్రో ధరల పెంపుపై మాత్రం కేంద్ర సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. -
మీరు ఆచరించి ప్రజలకు చెప్పండి.. స్పెషల్ ఫ్లైట్స్ లో తిరగకుండా..
-
మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్
-
రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ , కార్ పూలింగ్ను ఉపయోగించాలని కోరడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు , దేశీయంగా ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని మోదీ కోరారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని పౌరులకు చేసిన విజ్ఞప్తి చేశారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) మధ్య చర్చలు కొనసాగుతున్నందున, ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేయడంలో ప్రభుత్వ వైఖరి ఉండబోతోంది అంటున్నారు విశ్లేషకులు.ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానేఅమెరికా-ఇరాన్ ప్రతిష్టంభన మధ్య ముడి చమురు ధరలు పెరగడంతో, చాలాకాలంగా వాయిదా పడుతున్న ఇంధన ధరల పెంపునకు ఇక నాంది పలకవచ్చని అంచనా. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలు తక్కువ ధరకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.ఈ త్రైమాసికంలో రూ. 2 లక్షల కోట్ల వరకు వసూళ్లలో లోటు ఉంటుందని, సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాలు నమోదవుతాయని అంచనా వేయడంతో OMC (చమురు కంపెనీ)లపై ఒత్తిడి పెరుగుతోందని, పౌరులకు మోదీ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల తర్వాత మే 10న పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు.ప్రతిరోజూ రిటైల్ స్టేషన్లకు వచ్చే 6 కోట్ల మందికి పైగా వినియోగదారులకు భారం పడకుండా చూసుకోగలిగామన్నారు.. అంతేకాకుండా, మోదీ ప్రభుత్వం రిటైల్ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ఒక నెలలో రూ. 14,000 కోట్ల ఆదాయ నష్టాలను చవిచూసిందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరిలో 69.01 డాలర్లుగా ఉన్న రిఫైనరీలు చమురును దిగుమతి చేసుకునే సగటు ధర, మే నెలలో 104.68 డాలర్లకు పెరిగిందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా వెల్లడించింది. చమురు సంస్థలు ఈ త్రైమాసికంలో సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర అండర్-రికవరీలను (నష్టాలను) ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ధరలతో చమురు విక్రయాలు ఆర్థికంగా భారమని, కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్పనిసరి అని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం దాదాపు 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు (స్ట్రాటజిక్ మరియు కమర్షియల్) ఉన్నాయి. డిమాండ్‌ను తగ్గించడం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనుఫిబ్రవరిలో బ్యారెల్ ముడి చమురు ధర 69.01 డాలర్లు ఉండగా, మే నెల నాటికి అది 104.68 డాలర్లకు చేరుకుంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇది ఒకానొక దశలో 120 డాలర్లస్థాయిని కూడా దాటేసింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28 నుండి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో చమురు దిగుమతులు భారత్‌కు సవాలుగా మారిపోయింది. -
పెట్రోల్.. డీజిల్.. బంగారంపై మోదీ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఇదే..
-
'ఆయన చేతిని ముద్దాడా.. నా జన్మ ధన్యం..' తనికెళ్ల భరణి ఎమోషనల్
టాలీవుడ్ సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేను రామున్ని చూడలేదు.. కృష్ణుడిని చూడలేదు.. ఆదిశంకరుల్ని చూడలేదు.. వివేకానందుడిని చూడలేదు.. అంటే చూడలేము కూడా అంటూ ట్వీట్ చేశారు. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న నరేంద్ర మోడీని చూశాను.. ముట్టుకున్నాను.. ఆయన చేతిని ముద్దెట్టుకున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతటితో నా జన్మ ధన్యమైందని ప్రధాని నరేంద్ర మోడీ చేతులను పట్టుకున్న ఫోటోలను షేర్ చేశారు. కాగా.. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. తనికెళ్ల భరణి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఫేమస్ అయిన తనికెళ్ల భరణి తెలుగులో కొన్ని వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో రాణిస్తున్నారు. తన నటన, హవాభావాలతో తెలుగులో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.అంటే చూడలేము కూడా.కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.నా జన్మ ధన్యం. pic.twitter.com/UepoVtqxyf— Tanikella Bharani (@TanikellaBharni) May 11, 2026 -
రేవంత్ కు మోదీ ఓపెన్ ఆఫర్
-
బంగారం కొనొద్దు..ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే..
-
మోదీ చెప్పినట్లే.. ఆ దేశంలో జరుగుతోందా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఒకవైపు.. ఆర్థిక, ఇతర రంగాల నిపుణుల విశ్లేషణలు మరోవైపు.. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ అంశంతో ఊగిపోతోంది. ఈ దరిమిలా మోదీ చెప్పినట్లే ఆ దేశంలో జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చమురు ఆదాపై మోదీ ఏమన్నారు.. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను(EV) ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్‌ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.అక్కడ ఏం జరుగుతోంది?ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అని ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీ ఆదివారం ఉదయం రోడ్లపై కార్లు, ఇతర వాహనాలకు కనిపించవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ మాత్రమే ఒక లేన్‌లో తిరుగుతాయి. మరో లేన్‌లో ప్రజలు ఉత్సాహంగా జాగింగ్, సైక్లింగ్, యోగా, సామాజిక కార్యక్రమాలతో వీధులన్నీ నిండిపోతాయి. దీని వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇది స్థానిక ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమైంది.2001లో సెప్టెంబర్ 22న జకార్తాలో కార్ ఫ్రీ డే మొదలైంది. నెదర్లాండ్స్ నుంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల దాకా నడుస్తోంది. జూన్ నుంచి ఉదయం 5.30గం. నుంచి 10గం. దాకా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మోదీ తాజా సూచన కూడా దాదాపు ఇంచుమించుగా ఇక్కడ అమలవుతున్న పాలసీ తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడో తేడా ఉంది. The turnout for Jakarta’s weekly car-free day is incredible! pic.twitter.com/PuTLkpMLbf— Chris Kost (@chriskost) May 10, 2026మోదీ సూచనతో కంపేర్ చేస్తే..జకార్తా కార్ ఫ్రీ డేలో వారానికి ఒకసారి జరిగే.. అదీ కొన్నిగంటలు ఆచరించే పాలసీ నిర్ణయం కాగా, మోదీ సూచనలు భారత దేశంలో ప్రజల నిత్యజీవనంలో పాటించాల్సిన మార్గదర్శకాలుగా ఉన్నాయి. అక్కడి పాలసీ ప్రజలకు ఒక సానుకూల అనుభవం, ఒక ఉత్సవంలా మారింది. ప్రతీ ఆదివారం ఉత్సాహంగా పాల్గొంటారువాళ్లు. ఆ రోజున ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారు. కానీ, మోదీ సూచనలు మాత్రం ప్రజల సంగతి పక్కనపెడితే ప్రతిపక్షాల దృష్టిలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన పిలుపుగా నిలిచాయి. ఇంధన వినియోగం తగ్గించాలనే లక్ష్యం ఒకటే అయినా.. జకార్తా కారు ఫ్రీ డే ప్రజల భాగస్వామ్యంతో, ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది. మోదీ సూచనలు మాత్రం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల త్యాగాన్ని కోరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యం!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశ ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు భారతీయులందరూ ఆర్థిక దేశభక్తిని చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన రాబోయే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పౌరులను కోరారు. విదేశీ మారక ద్రవ్యాన్ని (ఫారెక్స్) ఆదా చేయడం ద్వారా రూపాయి విలువను స్థిరీకరించి దేశ ఆర్థిక పునాదులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విజ్ఞప్తి చేశారు.సంక్షోభ సమయం.. అప్రమత్తత అవసరంపశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతరాయం కలుగుతున్న సరఫరా గొలుసు వ్యవస్థలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘సరఫరా గొలుసుపై ఒత్తిడి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడం మనందరి బాధ్యత’ అని ప్రధాని పేర్కొన్నారు.ముఖ్యంగా భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధ మేఘాల వల్ల ఎరువులు, చమురు ధరలు పెరగడం వల్ల డాలర్ అవుట్‌ఫ్లో పెరిగి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం వంటి ‘అంతగా అవసరం లేని’ (డిస్క్రీషనరీ) దిగుమతులను తగ్గించడం వల్ల వాణిజ్య లోటును అదుపులో ఉంచవచ్చని ఆయన ఆకాంక్షించారు.బలమైన స్థితిలో ఫారెక్స్ నిల్వలుప్రధాని ఈమేరకు విజ్ఞప్తి చేసినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాల ప్రకారం, భారత్ ప్రస్తుతం అత్యంత పటిష్టమైన స్థితిలో ఉంది. మార్చి 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 691.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నిల్వలు దాదాపు 11 నెలల పాటు దేశ దిగుమతి అవసరాలను తీర్చగలవు. భారత్ వద్ద ప్రస్తుతం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇందులో 680.05 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్బీఐ ఇప్పటికే విదేశాల నుంచి స్వదేశానికి రప్పించి భద్రపరిచింది. ఆర్బీఐ వైవిధ్య వ్యూహం వల్ల విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా సెప్టెంబర్ 2025లో 13.92% ఉండగా, అది మార్చి 2026 నాటికి 16.7 శాతానికి పెరిగింది.ప్రధాని సూచించిన మార్గదర్శకాలువిదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి కేవలం బంగారం వాయిదా వేయడమే కాకుండా జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలని ప్రధాని సూచించారు.పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు మెట్రో రైలు, కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి.సాధ్యమైన చోట ఇంటి నుంచే పని విధానాన్ని అనుసరించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చు.విదేశీ వస్తువుల కంటే స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి.వ్యక్తిగత వాహనాల కంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థలను, రైల్వే సరుకు రవాణా సేవలను వినియోగించుకోవాలి.రసాయన ఎరువుల దిగుమతి భారాన్ని తగ్గించేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.‘మనం చేసే ప్రతి చిన్న పొదుపు, దేశాన్ని ప్రపంచ ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుంది’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రయోజనాలే పరమావధిగా పౌరులు స్పందించాలని ఆయన కోరారు.ఇదీ చదవండి: నిప్పులపై నీళ్లు చల్లినట్లు.. బంగారం ధరలు -
చంద్రబాబు ఇంటికే.. మోదీ ఎందుకు వెళ్లారు?
-
మోదీకి టీపీసీసీ చీఫ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటిరిచ్చారు. నరేంద్ర మోదీ దేశానికి కాదు.. కేవలం బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే, తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చిన బీజేపీ బలపడే అవకాశం లేదన్నారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి బహుషా తెలంగాణ పరిస్థితులు తెలియకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులిచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాట్లాడటం ప్రజలకు రుచించదు. తెలంగాణ కాంగ్రెస్‌కు అనుకూలం.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పరిపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావటం ఖాయం అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో సెక్యులార్ల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చినా బీజేపీ బలపడే అవకాశం లేదు. బీఆర్ఎస్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్.. వారితో మాకు కలయిక ఉండదు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలో ఉంటాయి’ అని క్లారిటీ ఇచ్చారు. -
మోదీ సభ.. కదం తొక్కిన కాషాయ దళం (ఫొటోలు)
-
మోదీవి సూచనలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు
వనరులను ఆదా చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన వినియోగం తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, బంగారం కొనకూడదని, మెట్రోలో ప్రయాణించాలని, ఇంటి నుంచే పని చేయాలని ప్రజలకు మోదీ చేసిన పిలుపు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.మోదీ జవాబుదారీతనం కోల్పోయారని పేర్కొంటూ సోమవారం ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు. ‘‘దేశ ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారు #CompromisedPM. 12 ఏళ్లు దేశాన్ని పాలించాక.. ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అనే స్థితికి వచ్చారా?. ఆయన చేసినవి ఉప దేశాలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు. రాజీన పడిన ప్రధాని దేశాన్ని నడపడం కష్టం’’ అని రాహుల్ తన పోస్టులో రాసుకొచ్చారు. मोदी जी ने कल जनता से त्याग मांगे - सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।ये उपदेश नहीं - ये नाकामी के सबूत हैं।12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है - क्या ख़रीदे, क्या न…— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026ఆర్థిక సంక్షోభ భారం ప్రజలపై మోపి.. ప్రధాని మోదీ బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. మరోవైపు మోదీ సలహాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇరాన్–అమెరికా యుద్ధం మూడు నెలలు గడిచినా.. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారు. ప్రజలపై భారాన్ని మోపడం అనైతికం. ఎన్నికలు, రాజకీయాలు మాత్రమే ప్రధాని ప్రాధాన్యం అవుతున్నాయని.. ఆయన వ్యాఖ్యలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుందని సంకేతాలిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. మరో కాంగ్రెస్ నేత ఎంపీ కార్తి చిదంబరం మాట్లాడుతూ.. మోదీ చేసినవి అప్పీల్‌గా లేవని.. తీవ్రమైన ఆదేశాలుగా ఉన్నాయని.. వాటి వెనక కారణాలు చెప్పేందుకు పార్లెమంట్ను ప్రత్యేకంగా సమావేశపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ప్రతిపక్షం డీఎంకే సైతం మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా??
ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యం ఇవ్వండి.. కూరల్లో వంటనూనెకు తగ్గించి వాడండి.. విదేశీ ప్రయాణాలు చేయొద్దని.. ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా? అనేదానిపై ఆర్థిక నిపుణులు స్పందించారు. హైదరాబాద్ సభలో మోదీ ఏం మాట్లాడారు?.. కరోనా టైంలో అలవాటు అయిన వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్ విధానాలను మళ్లీ ఆచరించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చు. ఈవీలను ప్రొత్సహిస్తే మరీ మంచిది. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు ఆపితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి కుటుంబం వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు లాభం. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. రైతులు సహజ వ్యవసాయానికి మారితే దిగుమతులపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అని అన్నారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనవని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యమా? అంటే కష్టమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతకు ప్రతీక. అలాంటి దానిని ఏడాదిపాటు కొనుగోలు నిలిపివేయడం అనేది భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఆచరణలో సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. ఎనర్జీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గడం సాధ్యమే. ఇది కొంత వరకు సాధ్యమే. కానీ ఇది ప్రధానంగా ఐటీ రంగం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. తయారీ, రవాణా రంగాల్లో ఇది అసాధ్యమంటున్నారు. అలాగే రైతులు సహజ వ్యవసాయం వైపు మారడం మంచి ఆలోచనే అయినప్పటికీ.. వాళ్లకు ప్రోత్సాహకాలు, మరింత శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు ఆ భారం భరించే స్థితిలో ఉందా? అని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక వంటనూనె వినియోగం తగ్గించడంపైనా ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనదే. కానీ ప్రజల జీవనశైలిలో మార్పులు తేవడం సులభం కాదు. దీని కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. ఇంధన సంక్షోభం వంటి జాతీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రజల సహకారం కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ రియాక్షన్స్మోదీ పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కు పెట్టింది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తోంది. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మోదీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. అది దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారాయన. -
ఏడాదిపాటు బంగారం కొనొద్దు.. నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు
-
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
-
విజయ్‌కు ప్రముఖుల అభినందనలు
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులతోపాటు శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌లో ప్రధాని మోదీ..‘తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తిరు సి.జోసెఫ్‌కు అభినందనలు. మీ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కలిసి ముందుకు సాగుదాం’అని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ విజయ్‌తో ఫోన్లో మాట్లాడి, అభినందనలు తెలిపారు. ‘టీవీకే చీఫ్ విజయ్‌కు అభినందనలు. తమిళనాడు కొత్త తరాన్ని, కొత్త గళాన్ని ఎంపిక చేసుకుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే ఆదివారం విజయ్‌కు అభినందనలు తెలిపారు. శ్రీలంక, తమిళనాడు నడుమ బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్న విషయాన్ని ఆయన ఎక్స్‌లో గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా విజయ్ను అభినందించారు. ‘టీవీకే అధినేత నాయకత్వంలో రాష్ట్ర రాజకీయ, సామాజికంగా విజయవంతంగా ముందుకు సాగుతుందన్న విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్,, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్లతోపాటు సినీనటులు కమల్ హాసన్, ఆర్.మాధవన్, సత్యరాజ్, ప్రకాశ్ రాజ్ టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం విజయ్‌కు అభినందనలు తెలిపారు. -
అమృతోత్సవ సోమ నాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానం సోమనాథ క్షేత్రానిదే... ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్రలో అరేబియా సముద్ర తీరాన ఉంది. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథ క్షేత్రంగా పేరొందింది. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ ఆకారంలో యుగాల నుంచి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపై అనేకమంది విదేశీపాలకులు లెక్కలేనన్ని సార్లు దండయాత్రలు చేశారు. అయితే ఎన్ని దండయాత్రలకు గురైనా మళ్లీ అన్నిసార్లూ పునర్ నిర్మితమైన క్షేత్రమిది. చంద్రుని పేరుమీదుగా సోమనాథుడుస్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన దక్షప్రజాపతి అశ్విని నుంచి రేవతి వరకు గల 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు రోహిణి ఒక్కదానినీ అనురాగంతో చూస్తూ, మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగాడు. దాంతో... తక్కిన 26 మంది తమ తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు, తమ కష్టాలు తీరే మార్గం చూపమని బ్రహ్మని ప్రార్థించగా ఆయన చంద్రునితో ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించవలసిందిగా చెబుతాడు. బ్రహ్మ దేవుని సలహాను అనుసరించి, భక్తి శ్రద్ధలతో శివుని పూజించిన చంద్రుడికి శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దినమొక కళ చొప్పున పెరుగుతుందనీ అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేరకు సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీ సమేతంగా వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు పరమేశ్వరుడు.అలనాడు స్వర్ణాలయం..ఈ క్షేత్రంలో తనకు శాపవిముక్తి కలిగినందుకు పరమానందభరితుడైన చంద్రుడు సువర్ణంతో పరమేశ్వరునికి ఆలయం నిర్మించాడట. అనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని రావణాసురుడు వెండితో పునర్ నిర్మించగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కలతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత రాజా భీమ్దేవ్ ఈ ఆలయాన్ని రాతితో పునర్నిర్మించాడు. పునఃప్రతిష్ఠకు డెబ్భై ఐదు ఏళ్లు పూర్తిసోమనాథక్షేత్రంలో భారీ సంపద వుండటంతో అనేకసార్లు దండయాత్రలకు గురైంది. క్రీ.శ. 1024లో గజనీ మహమ్మద్ దండయాత్రలో ఆలయం తీవ్ర నష్టానికి గురైంది. అనంతరం స్థానిక పాలకులు తిరిగి నిర్మించారు. దిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ, మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలోనూ ఆలయంపై దాడులు జరిగాయి. జునాగఢ్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తరువాత ఉక్కుమనిషి, భారతదేశ ప్రథమ హోంమంత్రి వల్లభాయ్‌పటేల్ ఆలయాన్ని సందర్శించి పునర్ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. నాటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించారు. ఇది జరిగి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సోమనాథేశ్వరునికి అమృత మహోత్సవాలను జరిపించాలని సంకల్పించడమే కాదు... అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.సోమనాథునికి ప్రధాని ప్రత్యేక పూజలు1951లో బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ జరిగిన నాటి నుండి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో పాల్గొననున్నారు. అంతేకాదు, సోమనాథునికి స్వయంగా అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలు నిర్వహించనున్నారు. నిత్యం పూజలు, హారతులు, సౌండ్ అండ్ లైట్ షోలతో ఆలయం సందడిగా ఉంది. ఆలయ దర్శనం ఉదయం 6:00 నుండి రాత్రి 10:00 వరకు ఉంటుంది, మధ్యాహ్నం 1:00 నుండి 5:00 వరకు దర్శనం ఉండదు. – డి.వి.ఆర్. -
అబ్‌కే బార్ తెలంగాణ
బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదు.. ఒక రాజకీయ నీతి పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారింది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకు వెళ్తోంది. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందు అబద్ధపు హామీలిస్తారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు.సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాక తెలంగాణలోనూ ఆ గెలుపు ప్రకంపనలు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్వాసఘాతుకం, హామీల అమల్లో వైఫల్యం, కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా... మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీవైపు గాలిమార్పు స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ‘అబ్కీ బార్ తెలంగాణ’ (ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం) అంటూ సభికులతో మోదీ నినాదాలు చేయించారు. దశాబ్దాల కింద బీజేపీకి ఎన్నో రాష్ట్రాల్లో ఆదరణ లభించలేదని, అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి రెండుసీట్లు ఉన్నప్పుడు ఒకటి తెలంగాణలో వచ్చిందని గుర్తుచేశారు. ఆ విధంగా బీజేపీ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ఇప్పుడు దేశం నలుమూలలా బీజేపీపై ప్రజల ఆశీర్వాదం పెరుగుతోందని, బీజేపీ గుడ్‌గవర్నెన్స్ మోడల్‌పై ఎన్నికల్లో ప్రజలు ఓటు ముద్రవేశారన్నారు. తెలంగాణ అలాంటి ప్రదేశమైనందున ఇప్పుడు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారని, ఇక అధికారానికి రావడమే తరువాయి అని చెప్పారు. బీజేపీ అభివృద్ధి మోడల్‌పై విశ్వాసం దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మోదీ చెప్పారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అదే విషయం స్పష్టంగా చెబుతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను ఏళ్ల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని ధ్వజమెత్తారు. అదే మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా నడిచిందని, ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అయితే బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదని, ఒక రాజకీయ నీతి పరాజయం పాలైందని మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా కాంగ్రెస్‌ది విభజన రాజకీయం కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను ‘ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్’ (ఎంఎంసీ)గా అభివరి్ణస్తున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలాకాలం క్రితమే అంతం చేసేవారన్నారు. ‘మావోయిస్టు తీవ్రవాదంతో దేశానికి ఎంతో నష్టం జరిగింది. తెలంగాణలోనూ వారి తీవ్రవాద చర్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మావోవాది అంతిమ ఘడియలు సమీపించినా నక్సల్వాదిని రక్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ గత 12 ఏళ్లు కేంద్రంతోపాటు కలిసి పనిచేసే ఉంటే ఎప్పుడో మావోయిస్టుల నుంచి విముక్తి లభించి ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు. ముందుచూపుతో, వికసిత్ తెలంగాణ సాధన దిశగా కృషిచేస్తోందన్నారు. బీజేపీ అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇస్తారు.. ఆకాశం నుంచి చుక్కలు తెంచి ఇస్తామని చెబుతారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు’ అని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు. -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపదని హామీ ఇచ్చారు. తెలంగాణ వికసిస్తేనే దేశం వికసిస్తుందనే నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ.. హెచ్ఐసీసీ వేదికగా రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణను దేశ ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించిన ఆయన ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు.. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు అని పేర్కొన్నారు. అంతకు ముందు నిధుల కేటాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఛలోక్తులు విసిరారు.‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా?‘ అంటూ తెలంగాణకు కేంద్రం ఇస్తున్న భరోసాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను మోదీ గుర్తు చేశారు. ‘పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చిందో రేవంత్‌రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్‌తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఐక్యంగా ముందుకు తీసుకెళ్తోంది.తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది’అని మోదీ అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని ముఖ్యమంత్రికి సూచించారు. మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధి కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల తెలంగాణకు భారీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం నుంచి సహకారం లభించింది. ఇప్పుడు అదే భావనతో తెలంగాణకు కూడా సహకరిస్తున్నాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు స్థానం ఉండకూడదు’అని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్‌ను వికసిత్ భారత్‌లో భాగం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అభివృద్ధే ఎజెండా ‘ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడూ భేదభావం చూపలేదు. గత పదేళ్లలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాలే ఇందుకు నిదర్శనం’అని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలు ముగిశాయని.. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల అభ్యున్నతిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో భుజం భుజం కలిపి నడిస్తే తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. సైబరాబాద్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ఇది దేశంలోనే అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని ప్రశంసించారు.వరంగల్‌లో ఏర్పాటవుతున్న పీఎం మిత్ర పార్క్ (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్) తెలంగాణ పారిశ్రామిక రంగానికి గేమ్ చేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ పార్క్ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. స్థానికంగా తయారయ్యే వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లకు చేరతాయి’అని చెప్పారు. దీంతో తెలంగాణ టెక్స్టైల్ రంగంలో ప్రధాన హబ్‌గా ఎదుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ పాత్ర అత్యంత కీలకం హైదరాబాద్–పనాజీ కారిడార్, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి వంటి ప్రాజెక్టులను ప్రస్తావించిన ప్రధాని.. ‘ఇవి కేవలం రోడ్లు కాదు.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే ఇంజిన్లు’అని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే పెట్టుబడులు పెరుగుతాయని.. తద్వారా యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో తెలంగాణ పాత్ర అత్యంత కీలకమని మోదీ అన్నారు.మాటకు మాట... సీఎం రేవంత్‌రెడ్డి: మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా..’ప్రధాని మోదీ: పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చిందో రేవంత్‌రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్‌తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే బడ్జెట్ రూ. 1,000 కోట్లు కూడా దాటేది కాదు, కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించాం. మీరు కంటున్న కలలు చేరుకోవాలంటే మాతో కలసి రండి.. లేకపోతే ఎప్పటికీ అది సాధ్యం కాదు. -
మీ పెద్ద మనసు చాటుకోండి
సాక్షి, హైదరాబాద్: ‘జాతీయ భద్రత, దేశ అభివృద్ధే మనకు అత్యంత ప్రాధాన్యం. ముందు భారతదేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ.. ఇదే మా నినాదం.. ఇదే మా విధానం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హెచ్ఐసీసీలో జరిగిన అభివృద్ధి ఉత్సవంలో సీఎం ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రంతో కలిసి నడిచేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తరచూ ప్రధానికి పెద్ద మనసు ఉందని చెబుతుంటారని.. ఆ పెద్ద మనసుతో తెలంగాణ పెండింగ్ పనులు, ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలని కోరారు.వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా దేశాన్ని 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై మాట్లాడినప్పుడు రాష్ట్రం కోసం ’తెలంగాణ రైజింగ్–2047’ను రూపొందించామని, ఈ క్రతువులో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి తమకు సహకారం అందడం లేదని, ప్రధాని మోదీ రాకతో తెలంగాణ అభివృద్ధికి కొత్త రూపు వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, తెలంగాణ అభివృద్ధికి పండగ లాంటిదన్నారు. మన్మోహన్ సింగ్ స్ఫూర్తిని కొనసాగించండి.. ‘మీరు (మోదీ) గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాడు మన్మోహన్ ఇచి్చన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా’నని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని, దీనికి కేంద్రం తోడ్పాటు అత్యవసరమని విన్నవించారు. మీరు సమయం కేటాయించండి దేశాభివృద్ధిలో మహానగరాల పాత్ర కీలకమని, ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా మెట్రో నగరాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ సూచించారు. దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ మహా నగరాలను అభివృద్ధి చేయాలన్నారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు వేగవంతం చేసేలా ప్రధాని కార్యాలయంలో ఈ రాష్ట్రాల కోసం ప్రత్యేక ’సింగిల్ విండో టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.‘నా రాష్ట్రం, నా ప్రజల కోసం సానుకూల నిర్ణయాల విషయంలో నేను మిమ్మల్సి, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. మా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు మీ అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. మూసీ నది, మెట్రో రైలు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్–మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారికి సంబంధించి రెండు గంటలపాటు మీరు సమయం కేటాయించి సమీక్షించాలి’అని మోదీని రేవంత్ కోరారు.రాజకీయాలకన్నా రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎప్పుడూ వివక్ష చూపదు’అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హెచ్ఐసీసీలో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకు రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అంకురార్పణ జరగడం రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టమన్నారు.ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు మూడేళ్ల క్రితమే కేంద్రం పచ్చజెండా ఊపిందని, భూసేకరణ పూర్తయి కేబినెట్ ఆమోదం లభించగానే పనులు పరుగులు పెడతాయని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందని, ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ. 220 కోట్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్థాయి సౌకర్యాలతో ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు.2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది మోదీ సంకల్పమని, ఈ మహా యజ్ఞంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్పటి వరకు బంగారం కొనుగోలు చేయొద్దు : ప్రధాని మోదీ
సాక్షి,హైదరాబాద్: బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారింది. అందుకే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవడం మంచిదన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు.ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డిజీల్ ధరలు తీవ్రంగా పెరిగాయి.గ్యాస్,యూరియా ధరలు అమాంతం పెరిగినప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ధరలు పెంచడం లేదు. "ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి" అని మోదీ అన్నారు.ప్రజలంతా ఎలక్టిక్ వాహనాల వైపు మళ్లాలని, వాటినే వినియోగించాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని ఉక్రెయిన్- రష్యా యుద్ధం, పశ్చిమాసియా యుద్ధాలతో సరఫరా చైన్ దెబ్బతింది అని మోదీ అన్నారు. ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని తెలిపారు. వంట నూనెలు ఎరువుల మందులను పూర్తిగా తగ్గించాలని పురుగుల మందులు, ఎరువుల వినియోగాన్ని తక్కువ చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
అందుకే బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తోంది: ప్రధాని మోదీ
హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు. మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘బెంగాల్‌లోని విజయ ఉత్సాహం తెలంగాణలోనూ కనపడుతోంది. తొలిసారి బెంగాల్లో అఖండ విజయం సాధించాం.పుదుచ్చేరిలోనూ మరోసారి ఎన్డీఏనే గెలిచింది. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. నిన్న నేను బెంగాల్లో ఉన్నాను. తొలిసారి అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక విజయోత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది. ఇక్కడ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారు. ఈ రోజు దేశం నలుమూలలా భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం నిరంతరం పెరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ తమ ఆమోద ముద్ర వేస్తున్నారు. నిన్న నేను బెంగాల్లో ఉన్నాను. తొలిసారి అక్కడ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారు. దేశం నలుమూలలా బీజేపీకి ప్రజల నుంచి ఆరదణ నిరంతరం పెరుగుతోంది. బీజేపీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ ఆమోద ముద్ర వేస్తున్నారు. పచ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంతో దేశం అంతా సంబరాలు జరుగుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పెంచింది. పశ్చిమ బెంగాల్‌ను సంకెళ్ల బందీ నుంచి విడదీశాం. ఇక తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్. దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో మాత్రమే ఉంది. అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నైజం. తెలంగాణలో అబద్ధాలతో ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కంటే లెఫ్ట్ అయింది. కాంగ్రెస్ ముస్లిం లీగ్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ ముస్లిం లీగ్ అయింది. మావోయిస్టులను కాంగ్రెస్ ఎన్నో ఏండ్ల నుంచి రక్షిస్తుంది. తెలంగాణ పోలీస్ కేంద్రంతో కలిసి పనిచేసి ఉంటే మావోయిస్టులు ఎప్పుడో ఖతం అయ్యేవారు. కొంత ఆలస్యం అయినా మావోయిస్టులు ఖతం అయ్యారు. కొత్త విజన్, ఆలోచన, వికసిత్ తెలంగాణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని తెలిపారు . -
మోదీ కాన్వాయ్ చూస్తే మైండ్ పోవాల్సిందే
-
Bengaluru : ప్రధాని మోదీ కాన్వాయ్ మార్గంలో పేలుడు పదార్ధాల కలకలం
సాక్షి,బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం బెంగళూరు శివార్లలో జరగనున్న బీజేపీ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు మోదీ కాన్వాయ్ వచ్చే మార్గంలో జెలటిన్ స్టిక్స్ లభ్యమవ్వడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుని జెలటిన్ స్టిక్‌ను నిర్వీర్యం చేసింది.ఈ ఘటనతో సభ ప్రాంగణం చుట్టూ భద్రతా ఏర్పాట్లు మరింత కఠినతరం చేశారు పోలీసులు. అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనం, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని నేపథ్యంతో పాటు ఈ ఘటనకు సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోంది. అధికారులు ఈ ఘటనను భద్రతా లోపంగా కాకుండా, ముందస్తు జాగ్రత్తలతో గుర్తించిన ప్రయత్నంగా పేర్కొన్నారు.ప్రధాని సభకు భారీ జనసందోహం హాజరయ్యే అవకాశం ఉండటంతో, పోలీసులు, ఇంటెలిజెన్స్ సంస్థలు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. భద్రతా సంస్థలు ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నాయి. ఈ ఘటన కుట్రలో భాగమా లేదా స్థానిక స్థాయిలో జరిగినదా అన్నది తెలుసుకోవడానికి అధికారులు పరిశీలిస్తున్నారు. -
‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్ అన్నారు.. నేను కూడా..’’
హైదరాబాద్: ‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్‌రెడ్డి అన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడబోను’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ ప్రసంగానికి ముందు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఆ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ మోదీ పై విధంగా వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు.కాగా, మోదీ ప్రసంగిస్తూ.. ‘‘గుజరాత్‌కు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో తెలంగాణకు అంతే నిధులు ఇస్తాం. దీంతో తెలంగాణకు అందుతున్న నిధుల్లో సగం కోత పడుతుంది. కాబట్టి మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో అది సాధ్యం కాదు. మీరు కూడా నాతో కలిసి రండి సైబరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు రూపాయలు కేటాయించాం. తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. దేశంలో టెక్స్టైల్ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్టైల్స్ రంగానికి ఊతమిస్తుంది.అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇప్పుడు తెలంగాణ రైల్వే బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. 2014లో ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్ రూ.1000 కోట్లు మాత్రమే. హైదరాబాద్ అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించాం. రోడ్లు, రైల్ కనెక్టివిటీని పెంచాం. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని చెప్పారు. -
అదే మా లక్ష్యం.. హైదరాబాద్‌లో మోదీకి చెప్పిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశ ఎకానమీని 2047 నాటికి 30 ట్రిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను నంబర్ 1గా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఫ్యూచర్‌సిటీ, మూసీనది అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం అవసరమని అన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధిపై దృష్టిపెడతామని చెప్పారు. తెలంగాణను నంబర్ 1 చేయడానికి రైజింగ్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.మరోవైపు, గతంలో ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలకు వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదని కిషన్ రెడ్డి చెప్పారు. 2014కు ముందు రోడ్లు ఎలా ఉండేవి?ఇప్పుడు ఎలా ఉన్నాయి? అని అన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్‌రోడ్ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. -
Watch Live: హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన
-
హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఇవాళ ఆ రూట్లలో వెళ్లొద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2,000 మంది శాంతిభద్రతల పోలీసు సిబ్బంది, 620 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక యూనిట్లను మోహరించాయి. పరేడ్‌గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.👉ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..⇒బేగంపేట నుంచి సంగీత్ వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్– ప్యాట్నీ– క్లాక్ టవర్ మీదుగా సంగీత్ చౌరస్తాకు మళ్లిస్తారు. సంగీత్ నుంచి బేగంపేట వెళ్లే వాహనాలకూ ఇదే మార్గంలో మళ్లింపు ఉంటుంది.⇒బేగంపేట నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్, ప్యాట్నీ ఫ్లైఓవర్ల మీదుగా సెయింట్ జాన్స్, ఏఓసీ మార్గాల నుంచి మళ్లిస్తారు. ⇒బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను ఫతేనగర్, అమీర్‌పేట, పంజాగుట్ట నుంచి బేగంపేట మార్గంలోకి మళ్లిస్తారు.⇒బేగంపేట నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయంగా రసూల్‌పురా జంక్షన్, మినిస్టర్ రోడ్డు రాణిగంజ్, సికింద్రాబాద్ వైపు వెళ్లాలి.⇒సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలు క్లాక్‌టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ – సీటీఓ మీదుగా బోయిన్పల్లి వైపు మళ్లిస్తారు.⇒ట్యాంక్ బండ్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ నుంచి సీటీఓ టాడ్బంద్– డైమండ్ పాయింట్ మార్గాల్లో మళ్లిస్తారు.👉ఈ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్.. ⇒నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ నుంచి వచ్చే వాహనాలకు ఐఏఎల్, ఆర్జీఐ స్టేడియం, ఉప్పల్ భగాయత్, రైల్వే డిగ్రీ కళాశాల, ఆర్ఆర్సీ గ్రౌండ్స్ వద్ద పార్క్ చేయాలి.⇒నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ మార్గాల నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్ పరిధిలోని దోభీఘాట్, ఇంపీరియల్ గార్డెన్స్,బోయిన్పల్లి మార్కెట్ యార్డు ఆవరణలో నిలపాలి.⇒మెహిదీపట్నం, మహబూబ్ నగర్, కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ స్టేడియం, బస్‌భవన్, నిజాంకాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ ఆవరణలో పార్కు చేయాలి.⇒సంగారెడ్డి, హైటెక్ సిటీ నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట, నెక్లెస్ రోడ్డు మార్గంలో పార్కు చేయాలి. -
తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్: మోదీ
ప్రధాని మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధాని అయిన రెండేళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానున్నందున మోదీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. -
కాంగ్రెస్‌ది నమ్మక ద్రోహం
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ ఒక విశ్వాస ఘాతుక పార్టీ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ను అధికారం నుంచి దూరం చేయాలని పేర్కొన్నారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి ఆ పార్టీకి పుట్టుకతోనే వచ్చిందని, అధికారం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతోందని నిప్పులు చెరిగారు. 2014 కంటే ముందు కేంద్రంలో పదేళ్లు డీఎంకే మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోవడంతో వెంటనే వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీని ఆశ్రయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కేవలం మిత్రపక్షాలను మాత్రమే వెన్నుపోటు పొడవలేదని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ద్వారా దేశ మహిళలకు ద్రోహం చేసిందని విమర్శించారు. నమ్మక ద్రోహి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత తొలిసారిగా ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చిన మోదీని బీజేపీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖజానాను లూటీ చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్‌లో సఫాయి కారి్మకులకు వేతనాలు ఇవ్వడం లేదని, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కేరళ ఎన్నికల్లో మెజారిటీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయడం సాధ్యపడడం లేదని వ్యాఖ్యానించారు. కేరళలో అధికారం తథ్యం బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే రెండు, మూడుసార్లు ప్రజలు అధికారం అప్పగించేలా తమ పార్టీ పాలన ఉంటుందని ప్రధానమంత్రి తెలిపారు. అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో పదేళ్ల క్రితం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 203 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని వెల్లడించారు. కేరళలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అక్కడ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తంచేశారు. సమాజం క్రియాశీలం అయినప్పుడే.. దేశ నిర్మాణంలో సమాజం క్రియాశీలకంగా పాలుపంచుకుంటే అప్పుడే ప్రభుత్వం విజయం సాధించినట్లు అని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. దేశ ప్రజలు, సమాజం క్రియాశీలం అయినప్పుడే అతిపెద్ద సవాళ్లకు సామూహికంగా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవంతోపాటు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ 70వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవ్య ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించారు. బెంగళూరు కేవలం సాంకేతిక నగరం కాదని, ఇదొక అధ్యాత్మిక నగరమని పేర్కొన్నారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం దేశ సంస్కృతిలో అంతర్భాగాలని చెప్పారు. వీటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. #WATCH | Bengaluru | Prime Minister Narendra Modi says, "I have arrived in Bengaluru today at a time when discussions regarding election results are underway across the country. The formation of an NDA government in Puducherry for the second consecutive time, the formation of an… pic.twitter.com/lFNbQ429aS— ANI (@ANI) May 10, 2026 -
బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం
కోల్‌కతా: పోరాటాల గడ్డ పశ్చిమబెంగాల్లో కమలనాథుల పరిపాలనా శకానికి నాందిపలుకుతూ ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర అగ్రనేత సువేందు అధికారి శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి బీజేపీ నాయకునిగా సువేందు చరిత్ర సృష్టించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి పార్టీల అగ్రనేతల సమక్షంలో అత్యంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి అధికారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. తర్వాత ఉప్పొంగిపోయిన ప్రధాని తమకు అపూర్వ విజయాన్ని అందించిన బెంగాల్ ఓటర్లకు మోకాళ్లపై ఒంగి నేలకు తల ఆన్చి నమస్కారంచేశారు. ఈ సందర్భంగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లోని ప్రమాణస్వీకార ప్రాంగణం జైశ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. భవానీపూర్‌లో మమతా బెనర్జీని మట్టికరిపించి, నందిగ్రామ్‌లో విజయాన్ని సాధించిన సువేందుకు ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత శుభాకాంక్షలు తెలిపారు. సువేందు తర్వాత సీనియర్ బీజేపీ నేత దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తనీయ, క్షుదిరాం టుడు, నితీశ్ ప్రామాణిక్‌లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బ్రాహ్మణ, ఓబీసీ, గిరిజన, కాయస్థ, మథువా, రాజ్‌వంశీ ఇలా ఆరు సామాజిక వర్గాలకు చెందిన నేతలను కేబినెట్లోకి తీసుకుని బీజేపీ తమ సామాజిక సమానత్వాన్ని చాటింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల నేతలకు సమప్రాధాన్యతనిచ్చింది. సోమవారం రాజ్‌భవన్‌లో మరికొందరు నేతలు మంత్రులుగా ప్రమాణంచేయనున్నారు. ప్రమాణంచేసిన మంత్రులకు ఇంకా శాఖలను కేటాయించలేదు. సోమవారం శాఖలను కేటాయించి తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో హాజరైన కమలదళ సభ్యులు తొలిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న క్షణాలను చిరస్మరణీయంగా మార్చాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకోసం భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలను తరలించారు. ప్రాంగణమంతా భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటుచేసి సువేందు, మోదీల పాత ప్రసంగాలను ప్రసారంచేశారు. ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంచేశారు. పార్టీ జెండాల రెపరెపలతో ప్రాంగణం కాషాయమయమైంది. ‘‘ఈరోజు కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నా. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చింది. ఇక టీఎంసీ అరాచకాలకు చెట్లుచీటీ పడుతుంది. సరిహద్దు ఆవలినుంచి చొరబాట్లు ఆగిపోతాయి. అరాచకాలను తట్టుకోలేక నా కుమారుడు సొంత రాష్ట్రం నుంచి వలసపోయాడు. ఇప్పుడు తిరిగొస్తాడు’’అని 80 ఏళ్ల భగవతీదేవి చెప్పారు. హిందు ప్రభుత్వపాలన ఆరంభాన్ని కళ్లారా చూసేందుకు వచ్చానని 70ఏళ్ల నవదీ్వప్ మఠ్‌లో ప్రజ్ఞాన్ మహరాజ్అనే సాధువు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కొలువుతీరే క్షణాలను కళ్లారా చూడాలని కెనడానుంచి వచ్చానని 50 ఏళ్ల వ్యక్తి చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా ఝాల్మురీ.. ప్రచారంవేళ ప్రధాని రుచిచూసిన బెంగాలీ చిరుతిండి ఝాల్మురీ శనివారం ప్రమాణస్వీకార ప్రాంగణంలో అందర్నీ నోరూరించింది. బీజేపీ నేతలు ప్రత్యేకంగా ఈ స్టాళ్లను ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. మరవరాలు, పచ్చి మిరప, మసాలా దినుసులతో ఝాల్మురీ చేస్తారు. దీనిని తినేందుకు పెద్దసంఖ్యలో జనం ఎగబడ్డారు. 20 స్టాళ్లు సరిపోక సొంతంగా కొందరు వ్యాపారులు సైతం స్టాళ్లు పెట్టుకున్నారు. ‘‘ఝాల్మురీ కాస్తంత ఘాటుగాఉంటుంది. కానీ బీజేపీ విజయానికి గుర్తుగా తీపి జోడించాం. అయినా వేగంగా సరుకు అమ్ముడపోయింది’’అని 24 నార్త్పరగణాల జిల్లా నుంచి స్టాల్ పెట్టిన మనీశ్ యాదవ్ చెప్పారు. బీజేపీ జెండా రంగుల్లో తయారుచేసిన రసగుల్లా అయితే హాట్‌కేకులా అమ్ముడుపోయింది. ‘‘మామూలుగా దొరికే ఝాల్మురీ కంటే ఇక్కడి ఝాల్మురీ నిజంగా బాగుంది’’అని కోల్‌కతాలోని గోలీగంజ్ వాసి మంజరి బసు అన్నారు.కదలివచ్చిన తారాలోకం ప్రమాణ స్వీకారోత్సవంలో బెంగాలీ సినీలోకం తరలివచ్చింది. ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి విచ్చేశారు. ప్రసేన్జీత్ ఛట్జీ, జీషు సేన్గుప్తాలతోపాటు శాస్త్రీయ కళాకారులు పండిత్ అజయ్ చక్రవర్తి, డ్యాన్సర్ మమతా శంకర్, నటుడు రిషి కౌశిక్, పాయల్ సర్కార్సహా బెంగాలీ టెలివిజన్ రంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.వాళ్లకు న్యాయం చేయాలి: సీఎం తల్లి సువేందు సీఎంగా ప్రమాణం చేశాక ఆయన తల్లిదండ్రులు గాయత్రి, సిసిర్ అధికారులు అమితానందం వ్యక్తంచేశారు. తూర్పు మేదినీపూర్‌లోని కాంతి పట్టణంలో సొంతింట్లో వాళ్లు మాట్లాడారు. ‘‘మాకొడుకు సీఎం అయ్యాడని మాకంటే ఎక్కువగా బెంగాలీ ప్రజలే సంతోషిస్తున్నారు. సువేందు హయాంలో ఇకనైనా ఆర్జీకర్ వైద్యురాలి హత్యోదంతంలో బాధితులకు న్యాయం జరగాలి. ఇలాంటి అకృత్యాల్లో నిందితులకు కఠినంగా శిక్షలుపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని తల్లి గాయత్రి అన్నారు. సువేందు తండ్రి సిసిర్ గతంలో మూడుసార్లు ఎంపీగా గెలిచారు.బీజేపీ అమరులకు మోదీ నివాళులు గత 15 ఏళ్లలో మమతాబెనర్జీ ప్రభుత్వ హయాంలో టీఎంసీ దాడుల్లో మృతిచెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలకు నివాళిగా ఏర్పాటుచేసిన తాత్కాలిక స్మారకం వద్ద ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అంజలి ఘటించారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో ఈ స్మారకం ఏర్పాటుచేశారు. ‘‘కోల్‌కతాలో ఓవైపు బీజేపీ తొలి సర్కార్ కొలువుతీరుతుంటే మేం మాత్రం తొలుత టీఎంసీ అరాచకపాలనలో అమరులైన బీజేపీ కార్యకర్తలకు నివాళులరి్పంచాం. వీళ్ల త్యాగం సదా మాకు స్ఫూర్తిదాయకం’’అని తర్వాత మోదీ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. వృద్ధ నేతకు మోదీ పాదాభివందనం 98 ఏళ్ల బీజేపీ నేత మఖన్‌లాల్ సర్కార్‌ను బీజేపీ ప్రత్యేకంగా వేదిక మీదకు ఆహ్వానించింది. శాలువా కప్పి ఆయన కాళ్లను ప్రధాని మోదీ మొక్కారు. తర్వాత ఆప్యాయంగా హత్తుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద ముఖర్జీతో కలిసి 1952లో కశ్మీర్లో త్రివర్ణపతాకాన్ని ఎగరేసిన బృందంలో మఖన్‌లాల్ ఉన్నారు. ఈ సందర్భంగా ఈయననూ అరెస్ట్‌చేశారు. ‘‘స్వాతం్రత్యానంతరం జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని ఇప్పటికీ సజీవ స్ఫూర్తిగా ఉన్న అతికొద్ది మందిలో మఖన్‌లాల్ ఒకరు’’అని బీజేపీ కొనియాడింది. 1980లో బీజేపీ ఏర్పడ్డాక పశ్చిమబెంగాల్లోని వెస్ట్ దినాజ్‌పూర్, జల్పాయ్గురి, డార్జిలింగ్ జిల్లాలకు మఖన్‌లాల్ సమన్వయకర్తగా సేవలందించారు. 1981 నుంచి ఏడేళ్లపాటు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. -
నేడే మోదీ సభ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధాని అయిన రెండేళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానున్నందున మోదీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీ నుంచి రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించడంతోపాటు మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభకు భారీ సమీకరణ ద్వారా సత్తా చాటేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులు ఒడ్డి సన్నాహాల్లో తలమునకలైంది. అంచనాలకు మించి జనసమీకరణ, ప్రజలు, కార్యకర్తల హాజరు ద్వారా మోదీ సభను విజయవంతం చేసి సత్తా చాటాలనే పట్టుదలతో పార్టీ శ్రేణులున్నాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని (ఒకటి మిత్రపక్షంతో కలిసి) బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పార్టీపరంగా రాజకీయ అంశాలపై మోదీ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ... మధ్యాహ్నం 2:20 గంటలకు కర్ణాటక నుంచి బేగంపేట విమానాశ్రయానికి రాక. 3 నుంచి 3:30 గంటల మధ్య గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 3:45–4:15 గంటల మధ్య హైటెక్ సిటీ సమీపంలో సింధు హాస్పటల్ ప్రారంభోత్సవం. అనంతరం ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పరామర్శ. సాయంత్రం 4:45 నుంచి 6:15 గంటల మధ్య బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రిజర్వ్ టైమ్. 6:30 నుంచి 7:10 గంటల మధ్య సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభలో ప్రసంగం. రాత్రి 7:20 గంటలకు బేగంపేట నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు పయనం. ప్రధాని ప్రారంభించే/శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే.. ⇒ హైదరాబాద్–పనాజీ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా గుడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు రూ. 3,175 కోట్ల ఖర్చుతో ఎన్‌హెచ్–167 ఫోర్ లేనింగ్ పనులకు శంకుస్థాపన. దీనిద్వారా రవాణా సమయం గంటన్నర దాకా తగ్గనుంది. ⇒ సంగారెడ్డి జిల్లాలో రూ. 2,350 కోట్ల వ్యయంతో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన. హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో 3,245 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఎన్‌హెచ్–65 వెంట చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ⇒ వరంగల్‌లో పీఎం మిత్ర పథకం కింద రూ. 1,700 కోట్లతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. ఇది దేశంలోనే పూర్తిస్థాయిలో పనిచేస్తున్న తొలి పీఎం మిత్ర పార్క్‌గా నిలవనుంది. కేంద్ర ప్రభుత్వ ఫైవ్–ఎఫ్ విజన్‌లో భాగంగా ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్గా పనిచేయనుంది. ప్రతిపాదిత నాగపూర్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్్కప్రెస్ హైవే (ఎన్హేచ్–163 జీ)కి సమీపంలో మేజర్ రైల్వే నెట్వర్క్స్, సీ–పోర్టులకు కనెక్టివిటీ అందించనుంది. ⇒ జాతీయ స్థాయిలో ముఖ్యమైన రూ. 1,535 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. కాజీపేట–విజయవాడ రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో పలు సెక్షన్లను కవర్ (118 కి.మీ) చేయనున్నాయి. రద్దీగా ఉండే గ్రాండ్‌ట్రంక్ కారిడార్‌లో లైన్ కెపాసిటీని పెంపొందించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. దీని ద్వారా వేగవంతమైన రైళ్ల కార్యకటాపాలు, సమయపాలన మెరుగదల, సరుకు రవాణా వేగవంతానికి దోహదపడనుంది. ఈ సందర్భంగా కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. కాజీపేట జంక్షన్లో సాఫీగా రవాణా సాగేలా దోహదపడటంతోపాటు హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు రైళ్ల రాకపోకలు వేగంగా సాగేలా సహాయపడనుంది. ⇒ హైదరాబాద్ శివార్లలోని మల్కాపూర్‌లో రూ. 600 కోట్లతో అభివృద్ధి చేసిన ఇండియన్ అయిల్ టెర్మినల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. ⇒ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన 1,500 పడకల ‘సింధు కేన్సర్ హాస్పిటల్’ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. లాభాపేక్ష లేని సంస్థ ద్వారా కేన్సర్ చికిత్స కేంద్రీకృతంగా మల్టీ–సూపర్ స్పెషాలిటీ క్వార్టర్నరీ కేర్‌ను అందించనున్నారు. -
తెలంగాణ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(మే 10, ఆదివారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనపై ఆయన ట్వీట్ చేశారు.‘‘రేపు మే 10వ తేదీన కర్ణాటక, తెలంగాణలో వివిధ కార్యక్రమాలు పాల్గొంటాను. ఉదయం 11 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటాను. సమాజ సేవకు అంకితమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వివిధ రంగాల్లో అద్భుత కార్యక్రమాలు చేస్తోంది. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని రూ.9500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపన.. రోడ్లు, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, రైల్వేలు, ఇంధనం తదితర రంగాల్లో ప్రధాన ప్రాజెక్టులు....సింధు హాస్పిటల్‌ను దేశానికి అంకితం చేస్తాను. సాయంత్రం హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తాను. బీఆర్ఎస్, కాంగ్రెస్ తప్పుడు పాలనలతో విసిగిపోయిన తెలంగాణ బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీకి తెలంగాణ ప్రజల ఆదరణ పెరుగుతోంది’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ನಾಳೆ, ಮೇ 10 ರಂದು ನಾನು ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಲಿದ್ದೇನೆ.ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ 11 ಗಂಟೆಗೆ, ‘ಆರ್ಟ್ ಆಫ್ ಲಿವಿಂಗ್’ ಸಂಸ್ಥೆಯ 45ನೇ ಸಂಸ್ಥಾಪನಾ ವರ್ಷದ ಸ್ಮರಣಾರ್ಥ ಹಮ್ಮಿಕೊಂಡಿರುವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲಿದ್ದೇನೆ. ಸಮಾಜ ಸೇವೆಯ ಸಂಸ್ಕೃತಿಗೆ ಅನುಗುಣವಾಗಿ, ಈ ಸಂಸ್ಥೆಯು ವಿವಿಧ…— Narendra Modi (@narendramodi) May 9, 2026 -
బెంగాల్ ప్రజలకు మోకరిల్లి.. నమస్కారం చేసిన మోదీ
-
మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ఉదయం ప్రమాణం చేశారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓ పెద్దాయన్ని శాలువాతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాదాభివందనం చేశారు. ‘‘బెంగాల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పా కదా.. వచ్చింది’’ అంటూ మోదీ ఆ పెద్దాయనతో అన్నారు. ఆయన పేరు మఖన్‌లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్లోనే అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్త. ఆయన నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది.బెంగాల్‌కు చెందిన మఖన్‌లాల్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగంగా.. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ (BJS) స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో మఖన్‌లాల్ అందులో చేరారు. "ఒక దేశం, ఒక జెండా" అనే నినాదంతో 1952లో కశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయడానికి ముఖర్జీ ప్రయత్నించారు. ఆ సమయంలో మఖన్‌లాల్ కూడా ఉన్నారు. ఈ ఉద్యమంలో ఆయన అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.ఆ తర్వాత.. 1977లో బీజేఎస్ జనతా పార్టీలో విలీనమై తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)గా రూపాంతరం చెందింది. టెక్నికల్‌గా మఖన్‌లాల్ బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో గౌరవసూచీకంగా ప్రధాని మోదీ ఆయన్ని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. Kolkata, West Bengal: Prime Minister Narendra Modi took blessings and felicitated Makhanlal Sarkar, one of the most senior BJP workers in West Bengal, as he attended the swearing-in ceremony of the new government pic.twitter.com/Yc1FDdlG09— IANS (@ians_india) May 9, 2026 -
సువేందు అధికారి అనే నేను..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల సమక్షంలో ఈ ఘట్టం జరిగింది. సువెందు అధికారి క్యాబినెట్లో మంత్రులుగా ఎమ్మెల్యేలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తానియా, క్షుదీరం తుడు, నిషిత్ ప్రమాణిక్‌లు కూడా ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి సువేందు, ఇతర మంత్రుల చేత ప్రమాణం చేయించారు. దీనికి ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో సువేందు అధికారి బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన బెంగాల్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతోంది. #WATCH | Kolkata | Prime Minister Narendra Modi and CM-designate Suvendu Adhikari pay tribute to Gurudev Rabindranath Tagore on his birth anniversary pic.twitter.com/0f2FiHRAWJ— ANI (@ANI) May 9, 2026సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కోల్‌కతా చేరుకున్న ప్రధాని స్థానిక బీజేపీ సీనియర్ కార్యకర్తలలో ఒకరైన మఖన్ లాల్ సర్కార్‌ను సన్మానించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 1952లో కశ్మీర్లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి వెళుతున్న సందర్భంలో మఖన్ లాల్ సర్కార్ అరెస్టయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వద్ద మిఠాయిలు, కుంకుమ రంగు ‘రసగుల్లాలు’ విక్రయానికి అందుబాటులో ఉంచారు. దీనికి ముందు ప్రధాని మోదీ,సువేందు అధికారి తదితరులు రవీంద్రనాథ్ ఠాగూర్‌కు నివాళులర్పించారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు సీనియర్ ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రధాని అక్కడికి చేరుకోగానే ‘మోదీ, మోదీ’ అనే నినాదాలు ఆ ప్రాంగణమంతటా మార్మోగిపోయాయి. #WATCH | BJP leader Suvendu Adhikari arrives at Kolkata’s iconic Brigade Parade Grounds to take oath as the Chief Minister of West Bengal pic.twitter.com/bDFzrPZzZI— ANI (@ANI) May 9, 2026పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఎన్నికల సంగ్రామంలో సంచలన విజయంతో రాష్ట్రంలో కమలం వికసించింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై భవానీపూర్‌లో అద్భుత విజయం సాధించిన బీజేపీ నేత సువేందు అధికారి, ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్కంఠభరితమైన రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ ఘట్టాన్ని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ఎన్డీఏ అగ్రనేతలు హాజరయ్యారు. క్యాబినెట్ రేసులో సీనియర్లుసువేందు అధికారి నేతృత్వంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో కీలక మంత్రి పదవుల కోసం బీజేపీలోని పలువురు ప్రముఖ నేతలు బలమైన పోటీదారులుగా ఉన్నారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాణిక్, బారక్పూర్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్, ముర్షిదాబాద్ నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే గౌరీ శంకర్ ఘోష్ వంటి కీలక నేతల పేర్లు మంత్రివర్గ కూర్పులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.మంత్రివర్గంలో ఆశావహుల జాబితావీరితో పాటు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారిలో మరికొన్ని ప్రముఖ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు శృతి శేఖర్ గోస్వామి, మాజీ ఎంపీ రూపా గంగూలీ, న్యాయవాది కౌస్తవ్ బాగ్చీతో పాటు దీపక్ బర్మన్, సజల్ ఘోష్, ఇంద్రనీల్ ఖాన్, జాయెల్ ముర్ము లాంటి నాయకులు కొత్త ప్రభుత్వంలో క్యాబినెట్ బెర్తుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. #WATCH | Kolkata | Senior NDA leaders, including Union HM Amit Shah, Uttar Pradesh Chief Minister Yogi Adityanath, Andhra Pradesh CM Chandrababu Naidu and others at Kolkata’s iconic Brigade Parade Grounds, where the swearing-in ceremony of the BJP government in West Bengal is… pic.twitter.com/TlThluxqvd— ANI (@ANI) May 9, 2026 -
అజేయ స్ఫూర్తి సోమనాథ్
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ప్రాంతమూ పవిత్రమైనదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భౌగోళిక హద్దులకు అతీతంగా ఐక్యతా భావంతో అవన్నీ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని వెల్లడించారు. తరచుగా విభజనలతో నిండి ఉండే ఈ ప్రపంచంలో ఈ ఐక్యతా స్ఫూర్తి మునుపెన్నడూ లేనంతగా ప్రాసంగికత కలిగి ఉందని స్పష్టంచేశారు. గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించి, భక్తుల దర్శనాల కోసం తెరిచి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ ఈ మేరకు ఒక వ్యాసం విడుదల చేశారు. సోమనాథ్ ఆలయాన్ని రక్షించడానికి ప్రాణాలను అర్పించిన వారి పోరాటాలు, త్యాగాలు, దానిని పదేపదే పునరుర్మించిన వారి కృషిని ఎన్నటికీ మర్చిపోలేమని ఉద్ఘాటించారు. ప్రతి భారతీయుడి హృదయంలో ఐక్యతా భావన, ఉమ్మడి నాగరిక చైతన్యం సజీవంగా ఉన్నందున సోమనాథ్ ఆలయం మహోన్నత వైభవంతో సగర్వంగా నిలుస్తూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఆలయ వైభవాన్ని పునరుద్ధరించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లెక్కలేనంత మంది వ్యక్తులు కృషి చేశారని కొనియాడారు. దేశంలోని ప్రతి భాగాన్నీ వారు పవిత్రంగా భావించారని తెలిపారు. సోమనాథ్ ప్రాచీన ప్రతిధ్వనులు వినండి వెయ్యేళ్ల అసాధారణ కృషి, త్యాగాలను స్మరించుకుంటూ రాబోయే వెయ్యి రోజులపాటు సోమనాథ్‌లో ప్రత్యేక పూజలు జరుగుతాయని మోదీ వెల్లడించారు. ఈ ఉత్సవాల కోసం చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇస్తుండడం సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సమయంలో భారతీయులు సోమనాథ్‌ను సందర్శించాలని పిలుపునిచ్చారు. సోమనాథ్ తీరంలో నిలబడి దాని ప్రాచీన ప్రతిధ్వనులను వినాలని సూచించారు. భక్తితో ఉప్పొంగిపోవడమే కాకుండా క్షీణించని, అఖండమైన, ఎవరికీ లొంగని నాగరిక స్ఫూర్తి స్పందనను సైతం అనుభూతి చెందుతారని వివరించారు. భక్తులు భారతదేశ అజేయ స్ఫూర్తిని తెలుసుకుంటారని, ఎన్ని కుటిల యత్నాలు జరిగినా భారతీయ సంస్కృతి ఎందుకు అజేయంగా నిలిచి ఉందో అర్థం చేసుకుంటారని తెలియజేశారు. సోమనాథ్‌కు వెళ్తే విజయ దృశ్యాన్ని వీక్షించే అవకాశం లభిస్తుందని, అది కచ్చితంగా మరపురాని అనుభూతినిస్తుందని వెల్లడించారు. సోమనాథ్ ఆలయంపై జరిగిన తొలి దాడికి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఆరంభంలో ఆలయాన్ని దర్శించానని, సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొన్నానని ప్రధానమంత్రి గుర్తుచేశారు. పునరుద్ధరించిన ఆలయాన్ని ప్రారంభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నెల 11న మళ్లీ అక్కడికి వెళ్లబోతున్నానని చెప్పారు. ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే సోమనాథ్‌లో రెండు ముఖ్యమైన ఘట్టాలకు హాజరయ్యే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఉద్ఘాటించారు. వికాస్ భీ... విరాసత్ భీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లో 2001 అక్టోబర్ 31న సోమనాథ్ ఆలయ 50వ వార్షికోత్సవాలు నిర్వహించినట్లు మోదీ గుర్తుచేసుకున్నారు. అదేరోజు సర్దార్ పటేల్ 125వ జయంతి వేడుకలు నిర్వహించామని, అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీ హాజరయ్యారని తెలిపారు. వికాస్ భీ, విరాసత్ భీ(అభివృద్ధి, సంప్రదాయం) అనే సూత్రంతో స్ఫూర్తి పొందామని.. సోమనాథ్ నుంచి కాశీ వరకు, కామాఖ్య నుంచి కేదార్నాథ్ వరకు, అయోధ్య నుంచి ఉజ్జయినీ వరకు, త్రయంబకేశ్వర్ నుంచి శ్రీశైలం వరకు ఆధ్యాత్మిక కేంద్రాలను, వాటి సాంప్రదాయ స్వరూపాన్ని కాపాడుకుంటూనే, అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. -
లక్ష్యం.. 2 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వ హించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను రాష్ట్ర బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జనసమీకరణతో మోదీ సభ విజయవంతానికి కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ చేయని విధంగా ముందస్తు సన్నాహాలు, ఏర్పాట్లలో పార్టీ ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ మోదీ సభ కోసం అన్ని జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, జిల్లా స్థాయి నాయకులను ఇన్‌చార్జ్‌లుగా (ఒక్కో జిల్లాకు పార్టీ నుంచి ఒకరు, ప్రజాప్రతినిధి ఒకరు) నియమించారు.ఏ జిల్లాకు ఆ జిల్లా నుంచి పార్టీ కేడర్, ప్రజలను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతంలో హైదరాబాద్/సికింద్రాబాద్‌లలో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల సభ నిర్వహిస్తే చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచే సమీకరణకు పరిమితమయ్యేవారు. అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర పార్టీ యావత్ యంత్రాంగం ఇందులో నిమగ్నమైంది.జనసమీకరణకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మొదలుకొని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్‌రావు, అర్వింద్ ధర్మపురి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, పైడి రాకేశ్‌రెడ్డి,, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్‌ను సందర్శించిన రాంచందర్‌రావు అక్కడ సాగుతున్న సన్నాహాలు, ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 2 లక్షల మందితో భారీ జనసమీకరణ చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు: బండి సంజయ్ చిక్కడపల్లి: ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉండి.. ప్రత్యే కంగా నిధులు ఇస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ సభను జయప్రదం చేయాలని ఆర్టీసీ క్రాస్‌రోడ్ నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభివృదిŠధ్ పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 10వ తేదీ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనన్నారు. ఈ ర్యాలీలో సికింద్రాబాద్ జిల్లా మహకాళి జిల్లా అధ్యక్షుడు జి.భారత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్ల వేడుకలకు ప్రధాని మోదీ
బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా 182 దేశాల్లో 10 వేలకు పైగా కేంద్రాలతో ఏకంగా కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వసంతంలోకి అడుగుపెడుతోంది. సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలు కూడా దీనికి తోడవడంతో బెంగళూరు ఒక చరిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. ఈ మహా వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో ఈ ఉత్సవాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రధాని మోదీ రాక.. ‘ధ్యాన్ మందిర్’ ప్రారంభంమే 10న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే ఫౌండేషన్ డే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నూతనంగా నిర్మించిన అత్యద్భుత ధ్యాన మందిరాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. అలాగే మానసిక ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక మార్పు లక్ష్యంగా దేశవ్యాప్తంగా చేపట్టనున్న పలు బృహత్తర సేవా కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.182 దేశాల భాగస్వామ్యంమే 10 నుంచి 26 వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు 182 దేశాల నుంచి ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో హాజరుకానున్నారు. మే 13న రవిశంకర్ జన్మదినం సందర్భంగా ‘ప్రపంచ శాంతి కోసం గ్లోబల్ మెడిటేషన్’ నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇదే వేదికపై 182 దేశాల సంస్కృతులను ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలు, భారతదేశంలోని 450కి పైగా జిల్లాల్లో నిస్వార్థ సేవ చేస్తున్న రియల్ హీరోలకు ప్రత్యేక సత్కారాలు జరగనున్నాయి.ఖైదీల సంస్కరణలు..ఈ ఉత్సవాల్లో కేవలం వేడుకలే కాకుండా సామాజిక మార్పుపై ప్రత్యేక దృష్టి సారించారు. మే 25-26 తేదీల్లో ‘ఖైదీల సంక్షేమం - విధానపరమైన సంస్కరణలు’ అనే అంశంపై ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. 1981లో ప్రారంభమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ‘సుదర్శన క్రియ’ లాంటి విధానాల ద్వారా గ్లోబల్ ఎడ్యుకేషనల్, హ్యుమానిటేరియన్ సంస్థగా పేరొందింది.ఇది కూడా చదవండి: సీఎన్ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత -
9న బెంగాల్లో బీజేపీ తొలి సర్కారు
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ యవనికపై భారతీయ జనతా పార్టీ తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మే 9న కోల్‌కతాలోని చారిత్రక ‘బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్’వేదికగా, నవ శకానికి నాంది పలుకుతూ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మే 9న ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. బెంగాల్ సాంస్కృతిక అస్తిత్వానికి నిదర్శనమైన రవీంద్రనాథ్ టాగోర్ జయంతి (మే 9 – 25వ వైశాఖం) రోజు ప్రమాణ స్వీకారం జరగనుండటం విశేషం. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, సమిక భట్టాచార్య, సుకాంత మజుందార్, స్వపన్ దాస్‌గుప్తాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘భూమిపుత్రుడి’కే పట్టాభిషేకం చేయాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ‘రైటర్స్ బిల్డింగ్స్’కు పూర్వవైభవం సుమారు 250 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన, కోల్‌కతా నడి»ొడ్డున ఉన్న ‘రైటర్స్ బిల్డింగ్స్’తిరిగి రాష్ట్ర సచివాలయంగా రూపుదిద్దుకోనుంది. మమతా బెనర్జీ హయాంలో హూగ్లీ నది అవతలి ఒడ్డున నిర్మించిన ‘నబన్నా’నుంచి పరిపాలన సాగగా, ఇప్పుడు అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం, తిరిగి పాత సచివాలయం నుంచే పాలన అందించాలని నిర్ణయించింది. రైటర్స్ బిల్డింగ్స్‌లో మరమ్మతులు పూర్తయ్యే వరకు, కొత్త ముఖ్యమంత్రి అసెంబ్లీ ఆవరణలోని ‘అనెక్స్ బిల్డింగ్’నుంచి పాలనను నిర్వహించే అవకాశం ఉంది. -
భారత్, వియత్నాం మధ్య సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వచ్చే నాలుగేళ్లలో 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యమే లక్ష్యంగా భారత్, వియత్నాం మరో అడుగు ముందుకేశాయి. మూడ్రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న వియత్నాం అధ్యక్షుడు టో లామ్ బుధవారం హైదరాబాద్‌హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు వాణిజ్యం, రక్షణ, అరుదైన మూలకాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, అరుదైన భూఅయ స్కాంతాలు, ఫార్మాసూటికల్స్, విద్య, బ్యాంకింగ్, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి మొత్తంగా 13 ఒప్పందాలపై సంతకాలుచేశారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం పెరగడంతో ఇండో–పసిఫిక్‌లో మారుతున్న పరిణామాలపై ఇరుదేశాధినేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని నేతలు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘దశాబ్దకాలం క్రితమే ఆసియాన్ కూటమి నుంచి భారత్‌కు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిగా మారిన తొలి దేశం వియత్నాం. ఈ పదేళ్లలో మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. అవి ఇప్పుడు విస్తృతస్థాయి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి. భవిష్యత్తులో ఈ బంధాన్ని సమున్నత శిఖరాలకు చేరుద్దాం. సాంస్కృతిక సంబంధాలు మొదలు అనుసంధానత, సామర్థ్యం పెంపు, భద్రత, సుస్థిరాభివృద్ధి, సరఫరా గొలుసుల పటిష్టత దాకా ప్రతిరంగంలో సమన్వయం పెంచుకుంటూ సమున్నత స్థాయికి ఎదుగుదాం. 2030 ఏడాదినాటికి 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్య సామర్థ్యం సాధిద్దాం’’అని మోదీ అన్నారు. మా ద్రాక్ష రుచి చూస్తారు.. ‘‘ఇకపై భారతీయ ఔషధాలు వియత్నాంవాసులకూ అందుబాటులోకి వస్తాయి. భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులు, పశుసంబంధ ఉత్పత్తులు ఇప్పుడు వియత్నాం ప్రజలకు చవగ్గా దొరకనున్నాయి. భారతీయ ద్రాక్ష, దానిమ్మ రుచిని త్వరలోనే వియత్నాంవాసులు రుచి చూడబోతున్నారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా నవీకరిస్తాం. అరుదైన మూలకాలు, భూఅయస్కాంతాలు మొరలు ఇంధనరంగంలో సహకాం ద్వారా కీలక వాణిజ్యం, పెట్టు బడుల్లో సరస్పర సహకారాన్ని మరింత పెంపొందిస్తాం. ఇరుదేశాల కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని పెంచుతాం. ఇండియాలో అమలవుతున్న యూపీఐ పేమెంట్ వ్యవస్థను, వియత్నాంలోని పాస్ట్ పేమెంట్ సిస్టమ్‌తో అనుసంధానిస్తాం. ఇరు దేశాల రాష్ట్రాల మధ్య, నగరాల మధ్య సైతం అనుసంధానం రెట్టింపుకానుంది’’అని మోదీ అన్నారు. -
బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారానికి పీఎం మోదీ
-
భారత్ 'మిషన్ దృష్టి' సక్సెస్: మస్క్ ట్వీట్!
బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీఐ (GalaxEye) రూపొందించిన 'మిషన్ దృష్టి' ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అభినందనలు తెలిపారు.కాలిఫోర్నియా నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే మొదటి 'ఆప్టోసార్' శాటిలైట్‌గా గుర్తింపు పొందింది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ (EO), సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) సాంకేతికతల కలయికతో రూపొందింది.EO సిస్టమ్ ద్వారా.. స్పష్టమైన, వాతావరణంలోని హై క్వాలిటీ ఫోటోలను పొందవచ్చు. SAR సాంకేతికత ద్వారా వర్షం, మబ్బులు, రాత్రి వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ రెండు టెక్నాలజీలు కలిసి ఉండటం వల్ల.. భూమి పరిశీలనలో ఉన్న పరిమితులను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక వసతుల ప్రణాళిక వంటి అనేక రంగాలకు ఉపయోగకరమైన డేటా లభిస్తుంది.Congratulations! 🇮🇳— Elon Musk (@elonmusk) May 5, 2026ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రాజెక్ట్‌ను భారత యువత ప్రతిభకు నిదర్శనంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సాంకేతికత ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. భారత అంతరిక్ష సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావడం దేశానికి మరింత బలం చేకూరుస్తోంది.భవిష్యత్తులో.. గెలాక్స్ఐ సంస్థ ఈ వ్యవస్థను మరింత విస్తరించి 2030 నాటికి 10 ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారతదేశం స్వంతంగా బలమైన భూ పరిశీలన వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
హైదరాబాద్‌లో మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మే 10వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు మోదీ బెంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపై నుంచే పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైటెక్ సిటీకి వెళ్తారు. 3.45-4.15 గంటల మధ్య అక్కడి సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తిరిగి 4.40 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40-5.25 గంటల మధ్య రిజర్వ్ సమయం ఉంటుంది. 5.30 గంటలకు మోదీ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో ఉంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జామ్ నగర్‌కు తిరిగి వెళ్తారు.ప్రధానమంత్రి మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత, ట్రాఫిక్, బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. కాన్వాయ్ మార్గాలను పరిశీలించి అవసరమైన రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. -
MAGAZINE STORY: ఫలితాలు చెప్పిన పాఠాలు
-
బెంగాల్ సీఎం ఎవరు?
-
మోదీ ఉండటం భారత ప్రజల అదృష్టం: ట్రంప్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపునకుగానూ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ ప్రతినిధి కుశ్ దేశాయ్ మీడియాకు వెల్లడించారు. ‘‘బెంగాల్ విజయంపై ట్రంప్ మోదీకి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. గత నెలలో ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ టైంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన వంటి నేత ఉండటం భారత ప్రజల అదృష్టమని అన్నారు’’ అని కుశ్ దేశాయ్ అన్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బ్రేకులు వేస్తూ.. బెంగాల్లో బీజేపీ బంపర్‌హిట్ కొట్టింది. మూడింట రెండొంతులకుపైగా మెజారిటీతో కైవసం చేసుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బెంగాల్లో మెజారిటీ మార్కు 147 కాగా.. బీజేపీ ఏకంగా 206 సీట్లు సాధించింది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది. -
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పత్తి ఉత్పత్తి పెంపు మిషన్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 5,659 కోట్ల రూపాయలతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాషన్ టు ఫారిన్ అనే లక్ష్యంతో మిషన్ ఏర్పాటు చేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎయిర్ లైన్స్ సంస్థల కోసం 5,000 కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎమ్ఈలు, నాన్ ఎంఎస్ఎమ్ఈలకు ఆర్థిక సహకారం కోసం పథకానికి ఆమోదముద్ర వేసింది. చెరుకు పంటకు క్వింటాలు 365 రూపాయల మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వదినారులో షిప్ రిపేర్ ఫెసిలిటీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని వల్ల 5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.రెండు నూతన సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 3,936 కోట్ల రూపాయలతో గుజరాత్లో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. 2,230 మంది నిపుణులకు ఉపాధికి అవకాశం దక్కనుంది. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 34 నుంచి 38కి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇతర నిర్ణయాలు* 2026-27 చక్కెర సీజన్‌కు FRP (Fair & Remunerative Price) రూ. 365/క్వింటాల్‌గా నిర్ణయం* ECLGS-5 కింద రూ. 18,100 కోట్ల ప్యాకేజీకి ఆమోదం* గుజరాత్లో వడినార్‌లో నౌకల మరమ్మతు కేంద్రం – రూ. 1,570 కోట్లు* రెండు కొత్త సెమీకండక్టర్ యూనిట్లకు ఆమోదం (రూ. 3,068 కోట్లు + రూ. 868 కోట్లు)* నాగ్దా–మథుర 3,4వ రైల్వే లైన్ (568 కి.మీ) – రూ. 16,403 కోట్లు* గుంటకల్–వాడి రైల్వే లైన్ (230 కి.మీ) – రూ. 4,758 కోట్లు* బుర్హ్వాల్–సీతాపూర్ రైల్వే లైన్ (103 కి.మీ) – రూ. 2,276 కోట్లు -
థ్యాంక్యూ మోదీజీ: విజయ్
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ ట్వీట్‌కు టీవీకే చీఫ్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మా ఏకైక లక్క్ష్యం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాం. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. Thank you, Hon'ble @PMOIndia, for your greetings. The well-being of our people remains our only goal. Transcending politics, we shall focus on the State's progress and the welfare of people of Tamil Nadu. We look forward to the Union Government’s support in this endeavor. https://t.co/EO4h8qC0hF— TVK Vijay (@TVKVijayHQ) May 5, 2026 -
దీదీ సంచలన కామెంట్స్.. బీజేపీ 100 సీట్లు చోరీ.!
-
ఇరాన్ దాడి అమానుషం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు పొరుగు దేశాలకు పాకుతున్నాయి. తాజాగా యూఏఈలోని కీలకమైన ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్‌పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన తొలి భారీ దాడి ఇదే. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆమోదయోగ్యం కాదు: ప్రధాని మోదీసామాన్య పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో యూఏఈకి భారత్ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. దౌత్యం, పరస్పర చర్చల ద్వారానే అన్ని సమస్యలకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ఇరాన్ తన దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి హార్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి సహకరించాలని కోరింది.డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్ఫుజైరాపై ఇరాన్ ప్రయోగించిన 15 క్షిపణులు, నాలుగు డ్రోన్లను తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఒక డ్రోన్ అక్కడి చమురు కేంద్రంపై పడటంతో మంటలు చెలరేగి, అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. బ్రిటన్‌కు చెందిన రెండు కార్గో నౌకలు సైతం ఈ దాడుల వల్ల మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దాడిపై ఇరాన్ నేరుగా స్పందించకపోయినా.. అమెరికా, యూఏఈలు అకారణంగా బురదలో కూరుకుపోవద్దని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు. Our statement on the attack on Fujairah ⬇️🔗 https://t.co/01Nz7g06FR pic.twitter.com/KQAr8R9ciQ— Randhir Jaiswal (@MEAIndia) May 5, 2026హార్ముజ్ జలసంధిలో రగులుతున్న అగ్నిజ్వాలలుప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్ తీరుతో గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు మండిపోతున్నాయి. అక్కడ చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలకు రక్షణగా తమ బలగాలను పంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. ఇప్పుడు జరుగుతున్న ఈ తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి పూర్తిస్థాయి యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బిగ్ బ్రేకింగ్: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల కమ్యూనిస్ట్, తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ, రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సాంస్కృతిక, రాజకీయ ప్రాముఖ్యతను మేళవిస్తూ.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9న బీజేపీ కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ సమాచారం.మోదీ చెప్పినట్లే..మే 9న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. బరాక్‌పూర్‌లో జరిగిన చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మే 4న తాను తిరిగి వస్తానని, బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ చారిత్రక విజయం తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న ‘భయమెరుగని, తల ఎత్తుకుని జీవించే సమాజాన్ని’ బెంగాల్లో నిర్మిస్తామని అన్నారు.అధికార మార్పిడి ప్రక్రియ ప్రారంభంబెంగాల్లో అధికార మార్పిడికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలు వేగవంతమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎస్.బి.జోషి, సుజిత్ కుమార్ మిశ్రా ఈరోజు (మే 5) ఢిల్లీ నుంచి కోల్‌కతా చేరుకొని, ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్‌కు అందజేయనున్నారు. అనంతరం మే 6న సీఈవో.. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి లాంఛనంగా వివరాలు అందిస్తారు. ఆ వెంటనే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీని గవర్నర్ ఆహ్వానిస్తారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆమెను కోరనున్నారు.బెంగాలీల మనోభావాలకు పెద్దపీటమే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. బెంగాలీలు అత్యంత ముఖ్యమైనదిగా భావించే ‘పొచిషే బోయిశాఖ్’ (రవీంద్ర జయంతి) రోజున ప్రమాణస్వీకారం చేయడం ద్వారా స్థానికుల మనోభావాలకు బీజేపీ పెద్దపీట వేసింది. ఠాగూర్ జయంతి బెంగాల్లో కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది వారి సంస్కృతిలో భాగం. నాలుగున్నర దశాబ్దాల వామపక్ష, టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ రాబోతున్న ఈ పరిణామం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నది. -
BIG QUESTION: బెంగాలీ గడ్డపై కాషాయ జెండా పెద్దోళ్ళకు షాకిచ్చిన విజయ్
-
బెంగాల్లో బీజేపీ విజయం: ఈ రంగాలకు ఊతం!
బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. బీజేపీ ప్రభంజనం సృష్టించింది. చాన్నాళ్ల తరువాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ మార్పు ద్వారా ఆర్ధిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.కేంద్రంలో, రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. దీనికి ఉదాహరణే ఎన్నికల కౌంటింగ్ రోజునే ఇక్కడున్న చాలా కంపెనీల షేర్స్ పెరగడం. దీన్ని బట్టి చూస్తే.. పెట్టుబడిదారులు బెంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాలు), రైల్వేస్ రంగాలు మాత్రమే కాకుండా.. ఎనర్జీ, పవర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా.. రాష్ట్రం మరింత పురోగతి దిశగా అడుగులు వేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇకపోతే.. కొన్ని కంపెనీలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా మమతా బెనర్జీ హయాంలో గుత్తాధిపత్యం చెలాయించిన కంపెనీలు లేదా కాంట్రాక్ట్ సంస్థలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక -
బెంగాల్లో సువర్ణాధ్యాయం మొదలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల నిరీక్షణ తర్వాత సువర్ణాధ్యాయం మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హింస, భయం, బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికి బెంగాల్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన చరిత్రాత్మక విజయాలను ఆయన అపూర్వం, అద్వితీయంగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తొలి ఎన్నికల్లోనే కార్యకర్తలకు ఆయన ఇచ్చిన మార్గదర్శనం సత్తా చాటిందని మోదీ ప్రశంసించారు. ప్రజలే దేవుళ్లు.. బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టిన ప్రజలకు సైతం కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’కి భారత్ ఎందుకు మాతృభూమిగా ఉందో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రపంచానికి చాటిచెప్పాయన్నారు. గతేడాది బిహార్ ఎన్నికల సమయంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ఎన్డీఏ ప్రభంజనం విస్తరిస్తుందని తాను చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని చెప్పారు. గంగామాతతోపాటు బ్రహ్మపుత్ర, కామాఖ్యా మాతల ఆశీర్వాదం తమపై మెండుగా ఉందన్నారు. అందుకే అస్సాం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీకి హ్యాట్రిక్ విజయం సాధ్యమైందన్నారు. పుదుచ్చేరిలో గత ఐదేళ్లలో ఎన్డీఏ అమలు చేసిన విజన్‌కు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇ చ్చారన్నారు. ప్రస్తుతం దేశంలో 23 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, ‘నాగరిక్ దేవో భవ’(ప్రజలే దేవుళ్లు) అనే మంత్రంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. శ్యామాప్రసాద్ కల సాకారం పశ్చిమ బెంగాల్‌ను భారత్‌లో అంతర్భాగంగా ఉంచేందుకు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని ధారపోశారని మోదీ గుర్తుచేశారు. 1951లో ‘దేశం కోసం జీవించాలి, దేశం కోసం మరణించాలి’అన్న ఆశయంతో ఆయన ప్రారంభించిన ప్రస్థానం, నేటి చారిత్రక విజయంతో ఆయన కల సాకారమైందన్నారు. బెంగాల్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని, నేటి నుంచి భయం నుంచి విముక్తి పొందిందని ‘బాంగ్లాయ్ పోరిబోర్తన్ హోయే గెచే’(బెంగాల్లో మార్పు వచ్చేసింది) అని నినదించారు. వందేమాతరం 150వ వసంతంలో భరతమాతకు, బంకించంద్ర ఛటర్జీకి, అరవిందుడికీ బెంగాల్ ఓటర్లు చారిత్రక నివాళి అర్పించారన్నారు. ఇకపై అభివృద్ధి, విశ్వాసం, కొత్త ఆశలు బెంగాల్లో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాయన్నారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారుల ఆటకట్టిస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తొలి కేబినెట్లోనే పేదలకు ఉచిత వైద్యం అందించే ‘ఆయుష్మాన్ భారత్’పథకానికి పచ్చజెండా ఊపుతామని స్పష్టం చేశారు. అంగ్, బంగ్, కలింగ్...ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు యుద్ధ సైరన్లు మోగుతూ, అస్థిరత, అరాచకం రాజ్యమేలుతున్న తరుణంలో, పశ్చిమాసియా సంక్షోభం వెంటాడుతున్నా.. భారత ప్రజలు మాత్రం స్థిరత్వం కోసం ఓటు వేశారని మోదీ విశ్లేషించారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశం ఏకతాటిపై నిలబడి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రాచీన భారతదేశంలో అంగ్ (బిహార్), బంగ్ (బెంగాల్), కలింగ్ (ఒడిశా) రాష్ట్రాలు ఆర్థిక, రాజకీయ, వాణిజ్య మూలస్తంభాలుగా ఉండేవని గుర్తుచేశారు. ఆసియా ఖండం మొత్తం కళింగ ఓడరేవుల ద్వారా వాణిజ్యం సాగేదని, బెంగాల్ సాంస్కృతిక కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. బానిసత్వంలో ఆ స్తంభాలు బలహీనపడ్డాయని, ఇప్పుడు మళ్లీ ఆ మూడు ప్రాంతాల ప్రజలు బీజేపీని ఎంచుకోవడం ద్వారా వికసిత భారత్‌కు బాటలు వేస్తున్నారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.మహిళా వ్యతిరేకులకు గుణపాఠంపార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ పక్షాలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని తాను ముందే హెచ్చరించానని గుర్తుచేశారు. అన్నట్లుగానే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే ఆ ఆగ్రహాన్ని రుచి చూశాయన్నారు. మహిళా విరోధిగా ముద్రపడిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి సైతం యూపీలో మహిళలు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. కేరళలో కమ్యూనిస్టుల పదేళ్ల దుష్పరిపాలనను ప్రజలు తిరస్కరించారని, అయితే వచ్చే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు కూడా మహిళలు తగిన సమాధానం ఇస్తారన్నారు. నేడు దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం లేకపోవడం కేవలం రాజకీయ మార్పు కాదని, ప్రజల ఆలోచనా విధానంలో వచ్చిన భారీ మార్పు అని మోదీ విశ్లేషించారు. యావత్ ప్రపంచం, దేశం కమ్యూనిజాన్ని, అడవుల్లో అంతరించిపోతున్న మావోయిజాన్ని తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం అదే భావజాలాన్ని అక్కున చేర్చుకుంటూ విపరీత దిశలో పయనిస్తోందని ధ్వజమెత్తారు. విపక్షాలవి కేవలం విభజన రాజకీయాలైతే, తమవి విశ్వాసం నింపే రాజకీయాలని వ్యాఖ్యానించారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.మోదీపై చెక్కుచెదరని విశ్వాసం: నితిన్ నబిన్12 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నాయకత్వంపై, మోదీ గ్యారంటీపై ప్రజల్లో నమ్మకం ఏమాత్రం చెక్కుచెదరలేదనడానికి ఈ విజయాలే నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మభూమి అయిన బెంగాల్‌ను మోదీ బీజేపీ మయం చేశారని కొనియాడారు. విజయోత్సవ సంబరాల అనంతరం మంగళవారం నుంచే బీజేపీ శ్రేణులు మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమవుతాయని చెప్పారు. సమావేశం ప్రారంభంలో మోదీకి పూలమాల వేసి సత్కరించేందుకు నబిన్ ముందుకు రాగా, ఆ మాలను మోదీ ఆప్యాయంగా తిరిగి నబిన్ మెడలోనే వేసి నాయకుల పట్ల తనకున్న గౌరవాన్ని, నిరాడంబరతను చాటుకున్నారు. -
బెంగాల్ ప్రజలకు విముక్తి.. విజయోత్సవ సభలో మోదీ
ఢిల్లీ: హింస రాజకీయాల నుంచి బెంగాల్ ప్రజలు విముక్తి కోరుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. హింస రాజకీయాలకు బెంగాల్ ప్రజలు స్వస్తి చెప్పారని పేర్కొన్నారుఢిల్లీలో నిర్వహించిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. భారత్ మదర్ ఆఫ్ డెమెక్రసీ అని ఈ ఎన్నికలు నిరూపించాయని ఐదురాష్ట్రాల ప్రజలు రాజ్యాంగాన్ని గెలిపించారన్నారు. గంగోత్రి నుండి గంగాసాగర్ వరకూ కమలం వికసించిందని బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం ఎంతో గొప్ప విషయమన్నారు. దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారన్నారు. ఈ రోజు భారత్‌కు, బీజేపీకి ఎంతో చారిత్రాత్మకమైన రోజని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ విజయం కోసం ప్రయత్నించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలని తెలిపారు. బెంగాల్లో కమలం విజయం ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు. బెంగాల్లో ప్రజాసామ్య విజయం సాధించామన్నారు. ఈ రోజు ప్రజలకు నిజమైన భరోసా కల్పించాల్సిన రోజని కొనియాడారు. ఐదు రాష్ట్రాల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు. బీజేపీ విజయంలో అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక పాత్ర పోషించారని మోదీ తెలిపారు. బెంగాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తరతరాలుగా అసంఖ్యాక కార్యకర్తలు చేసిన కృషి, పోరాటాలు లేకుండా పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన రికార్డు విజయం సాధ్యమయ్యేది కాదని మోదీ ఉద్ఘాటించారు. వారందరికి మనస్ఫూర్తిగా వందనం చేస్తున్నానని ప్రధాని అన్నారు.మరోవైపు మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అస్సాం ఎన్నికలలో బీజేపీ-ఎన్డీఏ విజయం, అభివృద్ధికి, ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి మా కూటమి ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రజల అచంచలమైన మద్దతుకు నిదర్శనమని.. బీజేపీ నేతలు అన్ని రకాల ప్రతికూలతలను అధిగమించి అభివృద్ధి అజెండా గురించి ప్రజలకు వివరించారన్నారు. ఐదురాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించింది. -
పవర్ పోయింది.. దీదీ పాలనకు చరమగీతం..
-
5 రాష్ట్రాల ఎన్నికలు : మోదీ మ్యాజిక్..ఆ పది కారణాలు!
2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ దళం తన హవాను చాటుకుంది. రెండు అద్భుతమైన విజయాలు, ఉత్సాహభరితమైన కమ్ బ్యాక్ వెరసి ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 3-5 స్కోర్‌లైన్‌ను కైవసం చేసుకోనుంది. లేడీ టైగర్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ప్రజాముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న స్టాలిన్, మరీ ముఖ్యంగా కేరళలో పినరయి విజయ్న్తోపాటు ఇతర నేతలకు కూడా ఇవొక గుణ పాఠంగా చెప్పవచ్చు. రాజకీయ ఉద్ధండులు, సిట్టింగ్ సీఎంలుగా ఉన్న ఈ ముగ్గురి నేతృత్వంలోని ఓటమి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ బీజేపీ ప్రభావం, హవా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాగా, కనిపించని ‘మమత’ దాదాపు 50 ఏళ్లుగా టీఎంసీ లేదా వామపక్షాలు మాత్రమే పాలించిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాగా వేసింది. బలమైన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించి, తొలిసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. వామపక్ష రాష్ట్రం బెంగాల్లో, తమ ఉనికిని విస్తరించుకునే లక్ష్యంతో బయలుదేరిన బీజేపీకి పని చాలా కష్టతరమైంది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుని, రాష్ట్రంలో ఒక నామమాత్రపు పార్టీగా మాత్రమే ఉండేది. ఒక దశాబ్ద కాలంలోనే, బీజేపీ భారత చరిత్రలోనే అత్యంత అద్భుతమైన వృద్ధి పథంలో ఒకటిగా నిలిచింది. బెంగాల్లో రాజకీయ రంగంలో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన మమతా బెనర్జీకి గట్టి దెబ్బ కొట్టింది.చారిత్రాత్మక నాలుగోసారి అధికారం చేపట్టాలని కన్న మమత అభేద్యమైన కంచుకోట, బీజేపీ మాయాజాలం ముఖ్యంగా మోదీ మాయాజాలంతో కూలిపోయింది. అలుపెరుగని మోదీ ర్యాలీలు, ప్రచారం, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారిస్తూ, మోదీ చొరబాటు ఆరోపణలపై టీఎంసీని లక్ష్యంగా చేసుకున్నారు. తనదైన శైలిలో దీదీ (మమత)ని ఎగతాళి చేశారు. దీనికి తోడు క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఆర్.జి. కార్, సందేశ్‌ఖాలి వంటి ఘటనలు, ఓటర్లలో నిరాశ, టీఎంసీ 'తోలాబాజీ'పై పెరుగుతున్న ఆగ్రహం వంటివి ఓటర్లు కొనసాగింపు కంటే "పరివర్తన్" (మార్పు)ను ఎంచుకునేలా చేశాయి. 2024లో ఒడిశాను జయించి, గత నెలలో బీహార్‌లో తమ సొంత ముఖ్యమంత్రిని నియమించుకున్న తర్వాత, తూర్పున బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.కేరళం మార్పుకే పట్టం! దెబ్బకొట్టిన కాంగ్రెస్కేరళంలో కురువృద్ధుడు,ప్రజాదరణనేతగా పాపులర్ పినరయ్ విజయన్‌కు ఈ సారి ప్రజలు భారీ షాకే ఇచ్చారు. తన ప్రత్యర్థి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు వరుసగా రెండు పర్యాయాలు అధికారం ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)పై తన విశ్వాసాన్ని ప్రకటించారు. దీంతో కేరళం ఇప్పుడు తిరిగి యూడీఎఫ్ చేతుల్లోకి వచ్చింది.అవినీతి ఆరోపణలు, వామపక్షాల స్వరూపమే మారుతోందన్న ఆరోపణలతో సతమతమవుతున్న సీపీఎం, మరో ఐదేళ్లపాటు పాలించే అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలోని 140 స్థానాలకు గాను 100 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఆధిక్యంలో ఉంది. ఇది దక్షిణాదిలో తన ప్రాముఖ్యతను కాపాడుకోవాలని చూస్తున్న బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కాంగ్రెస్ ప్రచారంతోపాటు కేరళలో మార్పు పవనాలు వీచాయి. అస్సాం - పుదుచ్చేరిలో, NDA సునాయాస విజయాలు సాధించి, కీలకమైన ఈశాన్య, దక్షిణ కంచుకోటలలో తన పట్టును సుస్థిరం చేసుకుంది.డీఎంకేకి షాక్, అరంగేట్రంలోనే విజయ్ అదుర్స్ తమిళనాడులో, నటుడు-రాజకీయవేత్త విజయ్ టీవీకే పార్టీ, అరంగేట్రంలో బ్లాక్‌బస్టర్ అరంగేట్రంతో విప్లవాత్మక విజయం దూసుకుపోతున్నాడు. ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలకు వెన్నెముకగా ఉన్న డీఎంకే , ఏఐఏడీఎంకే అనే రెండు కూటముల ద్విముఖ ద్రావిడ ఆధిపత్యాన్ని బద్దలు చేసింది. విజయ్ స్టార్ పవర్ ,రెండు ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలపై ఓటర్లలో పెరుగుతున్న అసహనం కారణంగా తమిళనాడులో ఆశ్చర్యకరమైన ఆధిక్యాన్ని అందించాయి. 2026లో నిజమైన మార్పును కోరుకుంటూ, ఓటర్లు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలోని పాత మూస ధోరణుల నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టమవుతోంది. తుదిఫలితాలు, తమిళనాడులో ఎన్నికల అనంతర పొత్తులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉన్నప్పటికీ, ఈ ఎన్నికలకు అసలైన సూపర్‌స్టార్ విజయేనన్నది స్పష్టం.అస్సాంలో హిమంత హ్యాట్రిక్: రాష్ట్రంలోని 126 స్థానాలకు గాను దాదాపు 100 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనే చిన్నపాటి వాదనను కూడా పూర్తిగా తోసిపుచ్చుతూ, అస్సాంలో తన అత్యంత ఆధిపత్య ప్రదర్శనను కనబరచడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై బీజేపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీతో హిమంత మూడోసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు.పుదుచ్చేరిలో కూడా అధికారి బీజేపీ కూటమి మళ్లీ అధికారాన్ని చేపట్టనుంది. అయిదోసారి ఎన్. రంగస్వామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు.ఇండియా కూటమికి కష్టాలేనా?2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొద్దికాలం పాటు ప్రోత్సాహకరంగా పుంజుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈ ఎన్నికల ఫలితాలు మరిన్ని కష్టాలు తప్పవనే సంకేతాలనిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు కేవలం ఒక తాత్కాలిక పరిణామం మాత్రమేనని ఎన్డీఏ నిరూపించడంతో, ఇప్పుడు ప్రతిపక్షం మళ్లీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎందుకంటే, బీజేపీ అన్ని ప్రత్యర్థి పార్టీలను పాతాళానికి తొక్కేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తోంది. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్లను పక్కన పెట్టడంతో, 2029 లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. -
West Bengal Results: బెంగాల్లో బీజేపీ విజయం
-
బీజేపీ కార్యాలయానికి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో వెలువడుతున్న తొలి రౌండ్ల కౌంటింగ్ ట్రెండ్స్‌లో కమలం పార్టీ అద్భుతమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ చారిత్రక విజయాల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.బెంగాల్లో టీఎంసీకి భారీ షాక్పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు కనిపిస్తోంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ వెనుకబడగా, బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ఏకంగా 111 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీఎంసీ కేవలం 69 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై తొలి రౌండ్ ముగిసేసరికి కేవలం 898 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. అదే సమయంలో ప్రతిష్టాత్మక నందిగ్రామ్‌లో సువేందు అధికారి.. టీఎంసీ అభ్యర్థిపై 3,100కు పైగా ఓట్ల ఆధిక్యంతో సంచలనం సృష్టిస్తున్నారు.అస్సాంలో మళ్లీ ఎన్డీఏ హవాఅస్సాం రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమి మరోసారి తన సత్తా చాటుతూ రెండోసారి అధికారం దిశగా పయనిస్తోంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 98 చోట్ల లీడ్‌లో ఉండగా, కాంగ్రెస్ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ ఒంటరిగా 78 స్థానాల్లో, మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. జాలుక్బారి నుంచి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భారీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో వెనుకంజలో ఉండటం గమనార్హం.కీలక నేతల ఆధిక్యం.. ఉత్సాహంలో శ్రేణులుఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైన కౌంటింగ్.. అస్సాంలోని 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. బీజేపీకి చెందిన పలువురు కీలక మంత్రులు రణోజ్ పెగు, పీజుష్ హజారికా, అశోక్ సింఘాల్ తొలి రౌండ్ల నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ప్రద్యుత్ బొర్దొలోయ్, భూపెన్ బోరా కూడా తమ నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉన్నారు. బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో కాషాయ గాలి బలంగా వీస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. -
బెంగాల్ ‘ప్రస్థానం’లో నరాలు తెగే క్లైమాక్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దశాబ్దాల పాటు ఒకే పార్టీకి పట్టం కట్టడం, సుదీర్ఘకాలం పాటు వారికే అధికారం కట్టబెట్టడం ఇక్కడి ‘బాంగ్లార్ మానుష్’ (బెంగాల్ ప్రజల) నైజం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్, వామపక్షాలు, ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇక్కడ ఒక్కొక్కటిగా తమ ప్రాభవాన్ని చాటాయి. అయితే, ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక సరికొత్త హై-వోల్టేజ్ పోరుకు తెరలేపాయి. 15 ఏళ్లుగా ఎదురులేని శక్తిగా కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పుడు దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రూపంలో అత్యంత క్లిష్టమైన సవాలు ఎదురవుతోంది. ‘బెంగాల్లో టీఎంసీకి సూర్యాస్తమయం ఖాయం’ అన్న బీజేపీ అధిష్టానం మాటల వెనుక ఉన్న కథేంటి? అసలు దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయ ప్రస్తానం ఎలా మారుతూ వచ్చిందో ఈ విశ్లేషణలో చూద్దాం.కాంగ్రెస్ శకం: పునాదులు, పోరాటాలుస్వాతంత్య్రానంతరం బెంగాల్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ బలమైన పునాదులు వేసింది. 1947 దేశ విభజన సంక్షోభం తర్వాత డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, విచ్ఛిన్నమైన సమాజాన్ని ఒక్కటి చేయడంతో పాటు ఆధునిక బెంగాల్‌కు ఆకృతినిచ్చారు. సాల్ట్ లేక్ సిటీ నిర్మాణం ఆయన దార్శనికతకు నిదర్శనం. అప్పట్లో కలకత్తా కేవలం రాజధాని మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువు. వందేమాతరం గీతాలాపన నుంచి స్వరాజ్య నినాదం వరకు కలకత్తా వేదికగానే జరిగాయి. అయితే, అంతర్గత విభేదాలు, బంగ్లా కాంగ్రెస్ ఆవిర్భావం, నెహ్రూ, శాస్త్రి వంటి జాతీయ దిగ్గజాల మరణంతో కాంగ్రెస్ పట్టు నెమ్మదిగా సడలుతూ వచ్చింది. 1967 ఎన్నికలు కాంగ్రెస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశాయి.ఎర్రకోట: వామపక్షాల సుదీర్ఘ ఆధిపత్యంజాతీయ స్థాయిలో ఇందిరా గాంధీ బలపడుతున్న సమయంలోనే బెంగాల్ భిన్నమైన మార్గం ఎంచుకుంది. 1977లో జ్యోతి బసు నేతృత్వంలోని వామపక్ష కూటమి (లెఫ్ట్ ఫ్రంట్) బలమైన సైద్ధాంతిక పునాదితో అధికారంలోకి వచ్చింది. ‘ఆపరేషన్ బర్గా’ ద్వారా కౌలుదారుల హక్కులు పరిరక్షించడం, 1978లో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వారు బలమైన ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం (1977-2011) ప్రజాస్వామ్యబద్ధంగా పాలించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా రికార్డు సృష్టించారు. 2000లో బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టినా, క్షేత్రస్థాయిలో ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ఒక కొత్త రాజకీయ శక్తికి మార్గం సుగమం చేసింది.మమతా ప్రభంజనం: దశాబ్దాల కంచుకోట బద్దలుసరిగ్గా అప్పుడే రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసిన సరికొత్త నాయకురాలు మమతా బెనర్జీ. 2011 ఎన్నికల్లో వామపక్షాల దశాబ్దాల ఆధిపత్యానికి తెరదించుతూ, తన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీతో 184 స్థానాలు సాధించి సంచలనం సృష్టించారు. బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె చరిత్రకెక్కారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులను పక్కనపెట్టిన బెంగాల్ ప్రజలు మమతకు బ్రహ్మరథం పట్టారు. కేంద్రంలో వాజ్‌పేయి హయాంలో అధికారంలో ఉన్నప్పటికీ, అప్పట్లో బెంగాల్లో బీజేపీ పాత్ర నామమాత్రమే. 2016 నాటికి 200లకు పైగా సీట్లతో మమత మరింత బలపడ్డారు. ఆమె సంక్షేమ పథకాలు, ప్రజలతో ఉన్న బలమైన అనుబంధం టీఎంసీని అజేయమైన శక్తిగా మార్చాయి.బీజేపీ ఉప్పెన: బలమైన ప్రతిపక్షంగా..2021 అసెంబ్లీ ఎన్నికలతో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రచారం నిర్వహించింది. దీదీ అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, బీజేపీ ఏకంగా 77 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్, వామపక్షాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఒకప్పుడు బెంగాల్లో ఉనికి కోసం పోరాడిన బీజేపీ, అధికార టీఎంసీకి ఏకైక ప్రత్యమ్నాయంగా ఎదగడం రాజకీయంగా, వ్యూహాత్మకంగా అతిపెద్ద మలుపు. ఈ పరిణామం దీదీకి భవిష్యత్ సవాళ్లపై స్పష్టమైన సంకేతం ఇచ్చింది.2026 కురుక్షేత్రం: అధికార మార్పిడి తథ్యమా?ప్రస్తుత 2026 ఎన్నికలు టీఎంసీ, బీజేపీ మధ్య ముఖాముఖీ సమరంగా మారాయి. మునుపెన్నడూ లేనివిధంగా భారీ పోలింగ్ నమోదు కావడం ఉత్కంఠ రేపుతోంది. భవానీపూర్ లాంటి టీఎంసీ కంచుకోటల్లో సైతం బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి, ఏ సీటునూ వదిలిపెట్టేది లేదన్న సంకేతాలిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం బీజేపీకి మొగ్గు చూపుతుండటం దీదీకి కలవరపెట్టే అంశమే. 2021లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన మమత, ఈసారి మరింత కఠినమైన పోరును ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా ఒకే పార్టీని సుదీర్ఘకాలం ఆదరించిన బెంగాల్ ప్రజలు.. ఈసారి మార్పు కోరుకుంటూ కొత్త చరిత్ర లిఖిస్తారా లేక దీదీకే మళ్లీ జై కొడతారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.ఇది కూడా చదవండి: దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం -
బోధనాంశంగా ‘మోదీ తత్వం’
వడోదర: గుజరాత్‌లోని బరోడాలో ఉన్న మహారాజా సయాజీరావ్ విశ్వవిద్యాలయంలో బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనా దక్షతను కీర్తిస్తూ కొత్త బోధనాంశాలను చేర్చారు. జూన్‌తో మొదలయ్యే నూతన విద్యా సంవత్సరంలో బీఏ సోషియాలజీ నాలుగేళ్ల కోర్సును ఆరంభించనున్నారు. ఇందులో నాలుగో ఏడాది పది పేపర్లలో మోదీ నాయకత్వ ప్రతిభ, దేశీయ నాలెడ్జ్ సిస్టమ్, హిందూ రిలీజియస్ స్టడీస్, జాతీయవాదం వంటి పాఠాలను చేర్చారు. రెండేళ్ల సోషియాలజీ పీజీ కోర్సులోనూ ఈ సబ్జెక్టులను పాఠాలుగా బోధించనున్నారు. మాస్టర్స్ కోర్సులో ‘సోషియాలజీ ఆఫ్ ప్యాట్రియాటిజం’కోర్సులో మోదీతత్వాన్ని విద్యార్థులు బోధించనున్నారు. పలువురు సంఘ సంస్కర్తలు, సామాజికవేత్తల జీవితవిశేషాలను విడమర్చి చెప్పబోతున్నామని వర్సిటీలో సోషియాలజీ విభాగ సారథి డాక్టర్ వీరేంద్రసింగ్ వెల్లడించారు. ‘‘మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రధాని మోదీ రాజకీయ చతురత, నాయకత్వ లక్షణాలను విశదీకరించనున్నాం. మ్యాక్స్ వెబర్, మహాత్మాగాం«దీ, మారి్టన్ లూథర్ కింగ్ వంటి మహానాయకుల నాయకత్వలక్షణాలతోపాటు ప్రధాని మోదీకి సంబంధించిన పాఠ్యాంశాలను చాన్నాళ్లపాటు బోధించనున్నాం. డిజిటల్ జాతీయవాదం, పౌరసత్వం, వారసత్వం, ప్రపంచీకరణ, ఉద్యమాలను మోదీ కోణంలో చూపిస్తూ మోదీతత్వాన్ని విద్యార్థులకు బోధిస్తాం. పాత పెద్దనోట్ల రద్దు, డిజిటల్ విప్లవం, ఫాస్టాగ్, జల్ శక్తి శాఖ ఏర్పాటు, యూపీఐ వంటి విప్లవాత్మక సంస్కరణలు తేవడం వాటి ద్వారా కోట్లాది మంది ప్రజలు లబి్ధపొందడం, ఆయా పథకాలకు ప్రజల నుంచి వస్తున్న అమితమైన ఆదరణ వంటి అంశాలను బోధిస్తాం. ‘సోషియాలజీ ఆఫ్ ప్యాట్రియాటిజం’కోర్సులో నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ను విద్యాసంవత్సరంలో గరిష్టంగా 15 గంటలే బోధిస్తారు’’అని ఆయన వెల్లడించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి కార్యకలాపాలు, సమాజంపై దాని ప్రభావాలనూ వివరిస్తామని తెలిపారు. డాక్టర్ వీరేంద్రసింగ్ నీతి ఆయోగ్ లో ప్రజాప్రాజెక్టులను పర్యవేక్షిస్తారు. ఎంఏ విద్యార్థులు గ్రామీణప్రాంతాల్లో చేసిన సర్వేచేశాక వచ్చిన ఫలితాల ఆధారంగా ఇలాంటి వినూత్న పాఠాలను జతచేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. హిందుస్వరాజ్యం గురించి తొలిసారిగా ప్రబోధించిన ఛత్రపతి శివాజీ మహరాజ్, నాటి బరోడా పాలకుడు మహారాజా సయాజీరావ్ గైక్వాడ్–3ల గురించి సహా ఎంతోమంది సంఘసంస్కర్తల పాఠ్యాంశాలనూ కొత్తగా చేర్చామని ఆయన పేర్కొన్నారు. -
టీఎంసీ-బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల నియోజకవర్గంలో 15 బూత్‌లలో రీపోలింగ్ జరుగుతుండగా, టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. సోమవారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు ముందు, తృణమూల్ కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లాలోని ఫల్తాలో స్థానికులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఇదిలా ఉంచితే, మధ్యాహ్నం 2 గంటలకు మగ్రాహత్ పశ్చిమ్‌లో 56.33 శాతం, డైమండ్ హార్బర్లో 54.9 శాతం ఓటింగ్ నమోదవ్వగా, మొత్తం పోలింగ్ శాతం 55.57 శాతంగా ఉంది.పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, సౌత్ 24 పరగణాల జిల్లాలోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీ పోలింగ్ సజావుగా సాగుతోందని స్థానిక ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ ఉత్సాహంగా సాగుతున్నప్పటికీ, సాంకేతిక లోపాలు ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టాయి. డైమండ్ హార్బర్లోని ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ గంటకు పైగా నిలిచిపోయింది. దీనితో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. గత పోలింగ్ రోజున, అలాగే ఈ రోజు కూడా సెలవు పెట్టాల్సి రావడం వల్ల రెండు రోజుల వేతనం కోల్పోయాను అని నిషా మందా అనే మహిళా ఓటరు ఆవేదన వ్యక్తం చేశారు.ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్‌లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, ఈవీఎంలను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేయడం లాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘం పాత పోలింగ్‌ను రద్దు చేసింది. మగ్రాహట్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రత్యేక ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తులను టేపులతో దాచిపెట్టారనే ఆరోపణలు స్థానిక ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ అబ్జర్వర్ల నివేదిక ఆధారంగా, పకడ్బందీ భద్రతా నడుమ శనివారం సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.రీపోలింగ్ వ్యవహారం అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రీపోలింగ్ నిర్ణయాన్ని బీజేపీ వర్గాలు స్వాగతిస్తూనే, మరింత ఎక్కువ బూత్‌లలో అక్రమాలు జరిగాయని, వెంటనే అక్కడ కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేసింది. మరోవైపు, టీఎంసీ నేతలు మాత్రం ఎన్నికల సంఘం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంపై, పనితీరుపై తీవ్ర అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేశారు. ఎలాంటి కనీస పారదర్శకత లేకుండా, తమ పార్టీ ఏజెంట్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య చెలరేగిన పరస్పర ఆరోపణలతో బెంగాల్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. #WATCH | West Bengal Elections | Voters queuing up outside the polling booth at Uttar Yearpur F.P. School in Magrahat Paschim Assembly Constituency in South 24 Parganas district.Re-polling at 11 booths in Magrahat Paschim and four booths in Diamond Harbour for the West Bengal… pic.twitter.com/pBY8NNz7ED— ANI (@ANI) May 2, 2026 -
ఇది మోదీ మేడే గిఫ్ట్, కుంభకర్ణుడిలా రేవంత్..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. -
ప్రధాని యూరప్ పర్యటన 15 నుంచి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో యూరప్‌లో పర్యటించనున్నారు. మే 15 నుంచి 20 వరకు ఆయన నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలలో పర్యటించున్నారు. ఇంధన సరఫరాలను పరిరక్షించడం, పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల కలిగే వాణిజ్య అంతరాయాలను తగ్గించడం, కీలక సాంకేతికతలలో సహకారం బలోపేతం ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సెమీకండక్టర్లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్, వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక అవకాశంగా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాగే, స్వీడన్ పర్యటన సందర్భంగా ఆవిష్కరణల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరుపక్షాలు దృష్టి సారించనున్నాయి. ప్రధాని ఇటలీ పర్యటన వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాలను వేగవంతం చేయనుంది. ఇరు దేశాలు సైనిక పరికరాలను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఒక రక్షణ పారిశ్రామిక చట్రాన్ని రూపొందించే లక్ష్యంతో ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని యూరప్ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. అయితే, పర్యటనకు వెళ్లే లేదా వచ్చే మార్గంలో ప్రధాని మోదీ నాలుగు గంటలపాటు యూఏఈలో ఆగే అవకాశం ఉంది. -
ఐదింటిలో మేమే గెలుస్తాం!
వారణాసి/లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. వచ్చే నెల 4న వెలువడే ఫలితాలు వికసిత్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని, దేశ పురోగతి వేగానికి నూతన శక్తిని ఇస్తాయని అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం తథ్యమని స్పష్టంచేశారు. ప్రధాని బుధవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి హర్డోయిలో జరిగిన సభలో ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఈసారి నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని, గత ఏడు దశాబ్దాల్లో ఇది కనీసం కలలో కూడా ఊహించని పరిణామం అని చెప్పారు. ప్రజాస్వామ్య వేడుకలో నేడు ఒక ముఖ్యమైన రోజు అని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు బెంగాల్లో మొదటి దశ పోలింగ్‌లో జరిగినట్లుగానే రెండో దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతోందని మోదీ తెలిపారు. పోలింగ్ బూత్‌ల ముందు ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయని చెప్పారు. తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలనే ప్రజల ఉత్సాహాన్ని ఈ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని స్పష్టంచేశారు. బెంగాల్లో ఈసారి భయానికి తావులేని వాతావరణంలో ప్రజలు ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇది దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక శక్తివంతమైన చిహ్నమని వ్యాఖ్యానించారు. హక్కుల పట్ల అవగాహన కలిగి, పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే చరిత్రాత్మక, నిర్ణయాత్మక విజయం సాధించిందని మోదీ గుర్తుచేశారు. తాజాగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అద్భుత విజయం సొంతం చేసుకుందని తెలిపారు. దాదాపు 85 శాతం మున్సిపాల్టీలు, పంచాయతీలు బీజేపీకే దక్కాయన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అఖండ విజయం తథ్యమని పునరుద్ఘాటించారు. విపక్ష సమాజ్‌వాదీ పార్టీపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు ఆ పార్టీ వ్యతిరేకమని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలను దూషించే డీఎంకే వంటి పార్టీలతో చేతులు కలిపిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ ఓటు వేసిందని ఆక్షేపించారు. గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం ఉత్తరప్రదేశ్‌లో 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రదాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఆ ఆరు వరుసల అత్యాధునిక రహదారి మీరట్, ప్రయాగ్‌రాజ్‌లను అనుసంధానిస్తుంది. ఈ హైస్పీడ్ కారిడార్ ఉత్తరప్రదేశ్ అంతటా అనుసంధానాన్ని గణనీయంగా పెంచుతుందని, పారిశ్రామిక పెట్టుబడులు, లాజిస్టిక్స్, వ్యవసాయ మార్కెటింగ్, ప్రాంతీయ సమతుల్యతకు ఊతం ఇస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) మోడల్ కింద గంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. ఇందులో 3.2 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్ కూడా ఉంది. వాయుసేన విమానాలు అత్యవసర సమయాల్లో దిగేందుకు దీనిని నిర్మించారు.వారణాసిలో మోదీ రోడ్ షో ప్రధాని మోదీ బుధవారం ఉదయం తన సొంత నియోజకవర్గం వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలికారు. అలాగే కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలు పఠించారు. మోదీకి స్థానిక నాయకులు త్రిశూలం, ఢమరుకం, సంప్రదాయ కండువా బహూకరించారు. బాబా విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేయడం, శివ లింగాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ పౌరుల సుఖ సంతోషాల కోసం విశ్వనాథుడిని ప్రార్థించానని తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ వద్ద చిన్నారులతో మోదీ సంభాషించారు. -
బెంగాల్ దంగల్ మోదీకి దీదీకి మధ్య యుద్ధం
-
‘ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే హ్యాట్రిక్’.. ప్రధాని మోదీ
హర్దోయ్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ‘హ్యాట్రిక్’ విజయం ఖాయమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలోని హర్దోయ్‌లో బుధవారం గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికగా బెంగాల్ ఎన్నికల తీరును, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రశంసిస్తూనే, భవిష్యత్ ఎన్నికల ఫలితాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.యూపీకి జీవనాడి: గంగా ఎక్స్ప్రెస్వేయూపీలోని హర్దోయ్ వేదికగా మీరట్, ప్రయాగ్‌రాజ్ నగరాలను కలుపుతూ నిర్మించిన ప్రతిష్టాత్మక గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ అత్యాధునిక రహదారి గంగామాత ఆశీర్వాదమని, రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేస్తుందని అన్నారు. కేవలం రవాణాకే పరిమితం కాకుండా, ఈ బృహత్తర ప్రాజెక్టు యావత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి (లైఫ్‌లైన్) లాంటిదని మోదీ అభివర్ణించారు. VIDEO | Hardoi, Uttar Pradesh: PM Modi inaugurates 594-km-long Ganga Expressway connecting Meerut to Prayagraj.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/LgDE2YNc3G— Press Trust of India (@PTI_News) April 29, 2026ఏడు దశాబ్దాల్లో తొలిసారి.. భయం లేని బెంగాల్పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్‌పై మోదీ హర్షం వ్యక్తం చేశారు. గత ఆరేడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా, ఎలాంటి భయం లేని వాతావరణంలో బెంగాల్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమన్నారు. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న పొడవైన క్యూ లైన్లే ఇందుకు సాక్ష్యమని అన్నారు. మొదటి దశ తరహాలోనే పోలింగ్ ముగిసేవరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆయన బెంగాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. VIDEO | Hardoi, Uttar Pradesh: PM Modi (@narendramodi) inaugurates Ganga Expressway. The 594-km-long Ganga Expressway, a mega infrastructure project connects Meerut to Prayagraj.The high-speed corridor is expected to significantly boost connectivity across Uttar Pradesh, while… pic.twitter.com/AaqjWKOStO— Press Trust of India (@PTI_News) April 29, 2026మే 4న సంచలనం.. 5 రాష్ట్రాల్లో బీజేపీదే హ్యాట్రిక్ఇటీవలే ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదే జోరుతో రాబోయే మే 4వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ ఘనవిజయం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు అభివృద్ధి వైపే నిలుస్తున్నారని మోదీ పేర్కొన్నారు. -
ఈశాన్యంలో ఆరు క్రికెట్ అకాడమీలు
ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్ శిక్షణ, అభివృద్ధిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో అత్యుత్తమ స్థాయి సౌకర్యాలు ఉన్న ఆరు ఇండోర్ క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేసింది. వీటిని మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకేసారి వర్చువల్‌గా ప్రారంభించారు. ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఇతర బోర్డు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు. రాంగ్పో (సిక్కిం), డోయిముఖ్ (అరుణాచల్ ప్రదేశ్), ఇంఫాల్ (మణిపూర్), మదన్కుర్క్లంగ్ (మేఘాలయ), ఐజ్వాల్ (మిజోరం), దీమాపూర్ (నాగాలాండ్)లలో ఈ అకాడమీలో ఏర్పాటయ్యాయి. జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడే ఈశాన్య రాష్ట్రాల్లో అకాడమీల ఏర్పాటు గురించి ప్రతిపాదన జరిగిందని, ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చిందని బీసీసీఐ ప్రకటించింది. హై పెర్ఫార్మెన్స్ సెంటర్లుగా గుర్తింపునిచ్చిన ఈ ఆరు అకాడమీల్లో ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు, హైటెక్ జిమ్‌లు, ఉష్ణోగ్రత నియంత్రిత స్విమ్మింగ్ పూల్‌లు, నిర్వహణ కోసం ఇతర ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ‘దేశంలో అన్ని ప్రముఖ క్రికెట్ కేంద్రాల్లో లభించే సౌకర్యాలన్నీ ఇప్పుడు ఈశాన్య రాష్ట్ర వర్ధమాన క్రీడాకారులకు అందుబాటులో వచ్చాయి. భవిష్యత్తులో ఇక్కడినుంచి ఎంతో మంది ఉత్తమ ఆటగాళ్లు వెలుగులోకి వస్తారని ఆశిస్తున్నా’ అని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వ్యాఖ్యానించారు. -
వారణాసిలో మోదీ మేనియా.. అదరగొట్టిన మెగా రోడ్‌షో
వారణాసి: యూపీలోని వారణాసి పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. బుధవారం ఉదయం శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. డోలు, సన్నాయి, శంఖారావాల నడుమ పరమశివునికి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు లహురబీర్ క్రాసింగ్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు భారీ సంఖ్యలో పోటెత్తారు. వీధుల గుండా ప్రధాని కాన్వాయ్ వెళుతుండగా.. ‘హర హర మహాదేవ్’, 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని రోడ్‌షో ఆద్యంతం అత్యుత్సాహంగా సాగింది.ఈ పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మీరట్, ప్రయాగ్‌రాజ్ నగరాలను కలుపుతూ హై-స్పీడ్ కారిడార్‌గా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్నే మార్చేయనుంది. తన రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం బనారస్ లోకోమోటివ్ వర్క్స్ మైదానంలో జరిగిన ‘మహిళా సమ్మేళనం’లో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మహిళలు హాజరైన ఈ సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా పాల్గొన్నారు. VIDEO | Varanasi: PM Modi (@narendramodi) offers prayers at Kashi Vishwanath temple.#Varanasi #KashiVishwanath(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/U9gU1ILH9P— Press Trust of India (@PTI_News) April 29, 2026 -
ఈశాన్యం ప్రగతికి యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్
గాంగ్టక్: ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి అష్టలక్ష్ములు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వ విధానం కేవలం ‘యాక్ట్ ఈస్ట్’మాత్రమే కాదని.. ‘యాక్ట్ ఫాస్ట్’కూడా అని స్పష్టంచేశారు. ఈశాన్య రాష్ట్రాలను శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రధాని మోదీ మంగళవారం ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో పర్యటించారు.రాజధాని గాంగ్టక్లో నిర్వహించిన సిక్కిం రాష్ట్రావతరణ 50వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పట్టణాభివృద్ది, విద్యుత్, పర్యావరణం, పర్యాటకం, వ్యవసాయ రంగాలకు సంబంధించి రూ.4,018 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్వర్ణజయంతి మైత్రి మంజరి పార్కులో ఆర్కిడ్ పుష్పాల తోటను సందర్శించారు. ఈశాన్యానికి స్వర్గం సిక్కిం సిక్కిం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే ప్రధాన ఆధారమని ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రంలో అనుసంధానాన్ని మెరుగుపరచడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దీనివల్ల పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా నుంచి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడం, పర్యాటకుల రాకపోకలను పెంచడానికి గాంగ్టక్లో రింగ్ రోడ్ నిర్మించడం సహా సిక్కింలో మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర ఆవతరణ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ 35 నిమిషాలపాటు ప్రసంగించారు. రాష్ట్రానికి రోప్‌వే, స్కైవే ప్రాజెక్టులు రానున్నాయని, నాథులాలో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నట్లు తెలిపారు. సిక్కింలో ప్రకృతి, సంస్కృతి సజీవంగా కనిపిస్తాయని అన్నారు.ఇక్కడి రహదారుల పరిశుభ్రత, గాలి స్వచ్ఛత చూస్తే సిక్కిం ప్రజలు ప్రకృతి పరిరక్షణకు నిజమైన ప్రతినిధులు అని తెలుస్తోందంటూ ప్రశంసించారు. సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాల ద్వారా సిక్కిం సహా ఈశాన్య ప్రాంతం భవిష్యత్ వృద్ధికి, సుస్థిరాభివృద్ధికి కేంద్రంగా మారనుందని వెల్లడించారు. సిక్కిం రాష్ట్రం శాంతి, ఆధ్యాత్మికత, శ్రేయస్సులకు నిలయమని కొనియాడారు. హిమాలయ రాష్ట్రాన్ని సందర్శించాలంటూ పర్యాటకులకు పిలుపునిచ్చారు. సహజసిద్ధమైన అందాలు వీక్షించాలని, ఆర్కిడ్ తోటల్లో విహరించాలని సూచించారు. ఇక్కడ పర్యావరణ అనుకూల పర్యాటక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 1,000 హోమ్‌స్టేలను నిర్మిస్తున్నారని, సాహస పర్యాటక రంగానికి మౌలిక సదుపాయాల పరంగా కూడా ఊతం లభిస్తోందని వివరించారు. ఈ రాష్ట్రం ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఈశాన్యానికి స్వర్గం సిక్కిం అని ఉద్ఘాటించారు. ఫుట్‌బాల్ ఆడిన మోదీ ప్రధాని మోదీ గాంగ్టక్లో విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాకర్ సెషన్ చాలా ఉత్తేజపర్చేలా ఉందని అభివరి్ణంచారు. గాంగ్టక్లో ఈ అందమైన ఉదయం వేళ యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని స్పష్టంచేశారు. తనతోపాటు ఫుట్‌బాల్ ఆడిన విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి మోదీ ఫోటో దిగారు. సిక్కింలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ముఖ్యంగా ఫుట్‌బాల్, ఆర్చరీ రంగాల్లో క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని తెలిపారు. -
సామాన్యుడి పెళ్లికి ప్రధాని శుభాశీస్సులు
రాయచూరు రూరల్(కర్ణాటక): పల్లెటూరులో పెళ్లి చేసుకుంటున్నానని ఓ సామాన్య యువకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పెళ్లి పత్రికను పంపగా అక్కడి నుంచి వరుడికి ప్రత్యుత్తరం లభించిన ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా కానిహాళలో జరిగింది. తాను ఈనెల 13న సవితతో వివాహం నిశ్చితార్థం చేసుకున్నానని, తమరు వివాహానికి హాజరు కావాలంటూ గ్రామానికి చెందిన రాజేష్ నాయక్ అనే సామాన్యుడు పంపిన శుభలేఖకు ప్రధాని కార్యాలయం నుంచి నూతన వధూవరులకు శుభాశీస్సులు పలుకుతూ జవాబు ఇవ్వడం వైరల్‌గా మారింది. భవిష్యత్తులో నూతన దంపతుల వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా గడపాలని ఆ లేఖలో ఆకాంక్షించారు. -
బీజేపీ ప్రభంజనం.. ఎన్నికల్లో భారీ విజయం
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. గుజరాత్‌లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా మరియు పంచాయతీలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల మేరకు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది.గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. పోలింగ్ జరిగిన 15 మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగింటిలో విజయం సాధించి మెజారిటీని నిలబెట్టుకుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లు అయిన మెహసానా, మోర్బి, నడియాడ్, వాపిలలో బీజేపీ విజయాలు సాధించగా, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 15 కార్పొరేషన్లలోని 1,044 సీట్లలో ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 718 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, 88 సీట్లతో ముందుకు సాగుతోంది. మిగతా పార్టీలు ప్రభావం చూపించలేకపోయాయి.అలాగే, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. గుజరాత్‌లోని 84 మున్సిపాలిటీలలో మొత్తం 2624 స్థానాలు ఉండగా.. అధికార బీజేపీ 575 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. మరో 11 స్థానాల్లో ఇతర పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి.Gujarat Election Update-BJP wins Vapi, Navsari, Porbandar, Ahmedabad, Rajkot and Surendranagar Municipal Corporations.It is also leading in remaining Municipal Corporations.— News Arena India (@NewsArenaIndia) April 28, 2026 అహ్మదాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ సాధించిన 11 స్థానాల్లో ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఖాతాను తెరవలేకపోయింది.సూరత్‌లో బీజేపీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.వడోదరలో బీజేపీ 76 స్థానాల ఆధిక్యాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ ఐదు స్థానాలో ఆధిక్యంలో ఉంది.రాజ్‌కోట్‌లో బీజేపీ 20 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.మోర్బి మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఘన విజయం దిశగా ముందుకెళ్తోంది. ఇక్కడ బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఇంకా ఖాతాను తెరవలేకపోయింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 52 స్థానాలు ఉన్నాయి.👉ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 26, 27 తేదీలలో 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలలో పోలింగ్ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 66% ఓటింగ్ నమోదు అయ్యింది.Gujarat Local Body Election Result 2026 #Congratulations All @BJP4Gujarat 🪷🎉🌷BJP : Winning in 90% + seatsAll Others (MM Congress, SP, AIMIM, AAP, ABC, XYZ +++) : < 10% seats#GujaratVotesBJP#gujarattrustsbjp *Municipality ( Total Seats 1044 )BJP :- 43*Congress :-… pic.twitter.com/Ph6G8Ie43r— Bharat Sanghvi Jain (@rajamaka) April 28, 2026 -
గ్రౌండ్లో ప్రధాని మోదీ ‘కిక్’.. గ్యాంగ్‌టక్ షేక్!
గ్యాంగ్‌టక్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ క్రీడా మైదానంలోకి దిగారు. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. సిక్కిం 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవ (స్వర్ణోత్సవ) వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన, ఉదయాన్నే క్రీడా మైదానంలో ఉత్సాహంగా గడుపుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు. చిన్నారులతో సరదాగా ఫుట్‌బాల్ ఆడుతున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.ఉదయాన్నే గ్యాంగ్‌టక్‌లో యువ మిత్రులతో ఫుట్‌బాల్ ఆడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఈ సెషన్‌ను ‘అద్భుతమైన ఉదయం’, ‘ఎనర్జిటిక్ సెషన్’గా ఆయన అభివర్ణించారు. కాగా ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మిజోరాం, మణిపూర్ తదితర ప్రాంతాల్లో క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌కు విశేష ఆదరణ ఉంది. Clearly, an energising football session with these youngsters! pic.twitter.com/Xc99oCylqt— Narendra Modi (@narendramodi) April 28, 2026సిక్కిం స్వర్ణోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి సోమవారం చేరుకున్న మోదీ, ముందుగా రెండు కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం పద్మ అవార్డు గ్రహీతలు, సామాజిక కార్యకర్తలు, కళాకారులు, క్రీడాకారులు తదితర ప్రముఖులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సిక్కిం రాష్ట్ర పర్యావరణ, వృక్షసంపదకు ప్రతీకగా నిలిచే ‘ఆర్కిడేరియం’ను సందర్శించనున్నారు. అలాగే, పల్జోర్ స్టేడియంలో జరిగే స్వర్ణోత్సవ వేడుకల సభలో పాల్గొని, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, పర్యాటకం వంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.ఇది కూడా చదవండి: ‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం! -
బెంగాల్ దంగల్ ప్రచారానికి తెర
-
బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తాను వెళ్లిన ప్రతిచోటా ప్రజల నాడిని గమనించానని, బీజేపీ విజయం ఖాయమని తేలిపోయినట్లు వెల్లడించారు. మే 4 తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. సోమవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్పూర్లో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. రెండో విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. సిండికేట్ రాజ్, రాజకీయ హింస, చొరబాట్లు, ఆర్థిక పతనానికి తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోందని మండిపడ్డారు. తూర్పు భారతదేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ ప్రగతి దేశ అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. తూర్పు ప్రాంతం తన చారిత్రక బలాన్ని, ప్రతిష్టను తిరిగి పొందాలని ఆకాంక్షించారు. మా, మాటీ, మానుష్ ను వదిలేశారు తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ అభివృద్ధి తిరుగుముఖం పట్టింది. బెదిరింపులు, దూషణలు, అబద్ధాలకు ఆ పార్టీ పర్యాయపదంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పెద్దలు నన్ను, రాజ్యాంగబద్ధ సంస్థలను, చివరికి సాయుధ దళాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇష్టానుసారంగా దూషించారు. గత 15 ఏళ్లలో ఏం సాధించారని ప్రశ్నిస్తే ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు. అధికారంలోకి వచ్చేందుకు వాడుకున్న నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేడు వదిలేసింది. మా, మాటీ, మానుష్ను పక్కనపెట్టారు. మహిళలు, రైతులు, యువత కోసం చేసిందేమీ లేదు. ఇది మోదీ గ్యారంటీ కోల్‌కతాను లండన్‌లా మారుస్తామని టీఎంసీ హామీ ఇచ్చింది. కానీ, చొరబాటుదార్లకు అడ్డాగా మార్చేసింది. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తాం. భారతదేశ పౌరులకు రక్షణ కల్పిస్తాం. కుల, మతాలకు అతీతంగా భారతీయులకు రక్షణ ఉంటుంది. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక శరణార్థులుగా వచ్చినవారికి భారత పౌరసత్వం కల్పిస్తాం. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. ఇప్పుడు బెంగాల్ వంతు గతంలో భారతదేశం సుసంపన్నంగా ఉన్నప్పుడు.. దానికి అంగ, బంగా, కళింగ(నేటి బిహార్, బెంగాల్ ఒడిశా) అనే మూడు బలమైన మూలస్తంభాలు ఉండేవి. ఈ మూలస్తంభాలు బలహీనపడినప్పుడు దేశానికి పెద్ద దెబ్బ తగిలింది. తూర్పు ప్రాంతాల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి అసంపూర్ణం. బిహార్, ఒడిశాలో కమలం వికసించింది. ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చింది. ఇక్కడి పరిస్థితి చూస్తూ ఉంటే కమల వికాసానికి అడ్డే లేదని స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్‌కు సేవ చేయడం, భద్రత కల్పించడం, కాపాడడం నా కర్తవ్యం, బాధ్యత’’అని మోదీ స్పష్టంచేశారు.తీర్థయాత్రలాగ గడిచిందిఆడియో సందేశం, బహిరంగ లేఖ విడుదల చేసిన మోదీ పశ్చిమ బెంగాల్లో ర్యాలీల్లో ప్రసంగించినప్పుడు, రోడ్ షోల్లో పాల్గొన్నప్పుడు తాను ఒక తీర్థయాత్రలో ఉన్నట్లుగా భావించానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రచారమంతటా కాళీమాత భక్తుల నుండి లభించిన దైవిక శక్తి, ప్రజల ఆశీర్వాదాలు తనకు ఎంతో బలాన్నిచ్చాయని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోమవారం ఒక ఆడియో సందేశం, బహిరంగ లేఖను విడుదల చేశారు. బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని పునరుద్ఘాటించారు. బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార వేడుకను ప్రజలతో కలిసి జరుపుకుంటానని వివరించారు. తీవ్రమైన ఎండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ తనకు ఏమాత్రం అలసట అనిపించలేదని పేర్కొన్నారు. ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొనడం తీర్థయాత్రకు వెళ్లిన భావన కలిగించిందని స్పష్టంచేశారు. -
దక్షిణాదికి ద్రోహం చేసిన విపక్షాలు
‘‘నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికీ, ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువను కల్పించడానికీ ఉద్దేశించినది. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రజల గొంతుక పార్లమెంటులో బలంగా వినిపించాలంటే డీలిమిటేషన్ అవసరం. ఏ ఒక్క రాష్ట్రానికి, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూనే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం.’’ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన స్థిర సంకల్పం ఇది. కానీ ఏం జరిగింది? మోదీని ఓడించామన్న వికృతానందం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. వారు చెప్పింది దక్షిణాదికి అన్యాయం జరగకుండా చేశామని! వాస్తవంలో దక్షిణాదికి అన్యాయం చేశారు. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే దారుణంగా నష్టపోయేది దక్షిణాదినే. ఏ మాత్రం నిష్పత్తి తగ్గకుండా, పార్లమెంట్ సీట్లు పెంచే 50 శాతం ఫార్ములాను కాలదన్నిన కాంగ్రెస్ తీరుతో దక్షిణాది సమస్యలను ఎదుర్కోబోతోంది. భారతదేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయగల ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఇప్పుడు మళ్లీ ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి బిల్లులో లోక్‌సభ సీట్ల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఉంది. అప్పటివరకూ ఆగకుండా ముందుగానే దక్షిణాదికి న్యాయం చేస్తూ డీలిమిటేషన్ ద్వారా 2029లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని చట్టం చెబుతోంది. ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం ద్వారా విపక్షాలు దక్షిణాది గొంతు కోస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంక్షోభంలో ప్రాతినిధ్య వ్యవస్థభారత ప్రజాస్వామ్య సౌధానికి పునాది వంటి ప్రాతినిధ్య వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఖరారైన 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను నాటి 54.8 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అప్పట్లో సగటున ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించేవారు. గత ఐదు దశాబ్దాల్లో దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగి 145 కోట్లకు చేరుకున్నా, పార్లమెంటులోని సీట్ల సంఖ్య స్తబ్ధుగా ఉండిపోయింది. దీనివల్ల నేడు ఒక్కో ఎంపీ సుమారు 26.70 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ప్రపంచంలోని మరే ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ఒక ప్రజా ప్రతినిధిపై ఇంతటి జనాభా భారం లేదు. ఇది ఓటరుకు, ప్రతినిధికి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కూడా నీరుగారుస్తోంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను 2001 వరకు మార్చకూడదని స్తంభింపజేశారు. జనాభా నియంత్రణ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదనేది నాటి ప్రధానఉద్దేశ్యం. ఆ తర్వాత 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గడువును మరో 25 ఏళ్లు పొడిగించి 2026 వరకు మార్చకూడదని నిర్ణయించారు. ఈ సుదీర్ఘ కాలంలో అనేక కొత్త జిల్లాలు, పట్టణాలు రూపుదిద్దుకున్నా, నియోజకవర్గాల సరిహద్దులు పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించకపోవడం వల్ల ఓటు విలువలో భారీ వ్యత్యాసాలు తలెత్తాయి. ఒక నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరో చోట 30 లక్షల మంది ఉండటం ప్రాతినిధ్య సమానత్వానికి విరుద్ధం. ఈ స్తబ్ధతను బద్దలు కొట్టాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. 2026తో ఈ గడువు ముగియనుండటంతో, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం. ఇది సీట్ల పెంపు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పునర్నిర్మాణ ప్రక్రియ.దక్షిణాదికి న్యాయం జరగాలంటే...మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో ఆమోదం పొందితే సరిపోదు. అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా అమలు కావాలంటే శాస్త్రీయమైన పునర్విభజన ప్రక్రియ కీలకం. రాజ్యాంగంలోని 128వ సవరణ స్పష్టంగా చెబుతున్నట్లుగా, ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించాలి. ఏయే నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలి, వాటిని రొటేషన్ పద్ధతిలో ఎలా మార్చాలి అనే అంశాలు ఊహాజనితంగా కాకుండా, జనాభా లెక్కల ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఈ క్రమానుగత ప్రక్రియను విస్మరించి రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం రాజ్యాంగబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే విపక్షాల వాదన ఆకర్షణీయంగా అనిపించినా, అది ఆచరణలో సమస్యలను సృష్టిస్తుంది. భారత సమాఖ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడటం, జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం మన పార్లమెంటులో సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, అది దక్షిణాది రాష్ట్రాల పాలిట రాజకీయ మరణ శాసనంగా మారుతుందనడంలో సందేహం లేదు. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడంలో విఫలమైన రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక సీట్లు కేటాయించడం అంటే, క్రమశిక్షణతో వ్యవహరించిన దక్షిణాదిని శిక్షించడమే అవుతుంది. ఈ అసమానతను తొలగించడానికి 50 శాతం పెంపు ఫార్ములా ఏకైక పరిష్కార మార్గం. ఈ విధానం ప్రకారం, జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లను నేరుగా 50 శాతం పెంచుతారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య పొలిటికల్ రేషియో ఏమాత్రం మారదు. జనాభా లెక్కల ప్రకారం వెళ్తే తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్ (+13), తెలంగాణ (+9), తమిళనాడు (+20), కర్ణాటక (+14), కేరళ (+10) రాష్ట్రాలకు ఈ ఫార్ములా ద్వారా గణనీయమైన అదనపు సీట్లు లభిస్తాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వానికి అసలైన రక్షణ కవచం. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అవసరం. సీట్ల సంఖ్యను పెంచకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అది మరిన్ని చిక్కులకు దారితీస్తుంది. సీట్ల సంఖ్యను పెంచి, అందులో మహిళలకు సీట్లు కేటాయించడం ద్వారా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తర్కాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ విద్వేషంతో విపక్షాలు పునర్విభజనను అడ్డుకున్నాయి. జనాభా నియంత్రణ అనే దేశభక్తిని పాటించినందుకు దక్షిణాదికి రాజకీయ శిక్ష పడకుండా అడ్డుకోవాల్సిన చారిత్రక బాధ్యతను కాంగ్రెస్, డీఎంకే లాంటి పార్టీలు విస్మరించాయి.ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు -
‘టీఎంసీ పతనం ఖాయం.. మే 4న మళ్లీ వస్తున్నా’
బరాక్‌పూర్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండో విడత పోలింగ్‌కు ముందు బరాక్‌పూర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది రాష్ట్రంలో తన చివరి ఎన్నికల ప్రచారమని ప్రకటించిన ఆయన, మే 4న ఫలితాల తర్వాత బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి తాను తిరిగి వస్తానంటూ ప్రదర్శించిన అచంచల విశ్వాసం అందరి దృష్టిని ఆకర్షించింది.బరాక్‌పూర్‌లో జరిగిన ఈ సభకు ప్రజలు పోటెత్తారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర దారిపొడవునా బారులు తీరిన జనసందోహం తన ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఉదయాన్నే వేలాదిగా తరలివచ్చి తనను ఆశీర్వదించిన ప్రజల ఆప్యాయతను ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందనడానికి, తనలో ఉన్న అపార నమ్మకానికి ఈ జనప్రభంజనమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.టీఎంసీపై తీవ్రస్థాయిలో ధ్వజంఅధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లక్ష్యంగా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీ పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని, రాష్ట్ర అభివృద్ధికి వారి వద్ద ఎలాంటి భవిష్యత్ ప్రణాళిక లేదని మండిపడ్డారు. అధికార పార్టీ నడుపుతున్న ‘సిండికేట్ వ్యవస్థ’ను కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిర్మాణాత్మక పాలనను గాలికొదిలేసి, బెదిరింపులు, దుర్భాషలాడే రాజకీయాలపైనే టీఎంసీ ఆధారపడుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, బెంగాల్‌కు ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఆవశ్యకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.యువతకు ఐదు కీలక హామీలురాష్ట్ర యువతను ఆకర్షించేలా ప్రధాని మోదీ ఉపాధి, సంక్షేమం లక్ష్యంగా ఐదు గ్యారెంటీలను ప్రకటించారు. సకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఖాళీలన్నింటినీ తక్షణమే పూరించడం, నైపుణ్యాభివృద్ధితో కూడిన ఉపాధి కల్పన, 7వ వేతన సంఘం ప్రయోజనాల అమలు, గ్రామాల్లో ఉపాధి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. -
మారనున్న సీన్.. మోదీ సర్కార్‌కు పెద్ద పరీక్షే!
పలు దేశాల్లో పోరాటాలతో ప్రభుత్వాలను గద్దె దించిన ఘనత జెన్ జీదే. అలాంటి తరం భారత్‌లో కొత్త రాజకీయ సమీకరణకు కారణం కాబోతోందా?. రాజకీయాన్ని కేవలం కంటెంట్‌గా చూసే ఈ జనరేషన్.. రాబోయే ఎన్నికల్లో నిజంగానే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోందా?.. అవుననే అంటున్నాయి పలు విశ్లేషణలు.భారత రాజకీయాల్లో 12 ఏళ్ల కిందట నాయకత్వ మార్పు జరిగింది. అప్పట్లో మిల్లెనియల్స్ అనే తరం (1981–1996లో పుట్టినవాళ్లు) పెద్ద ఎత్తున ఓటర్లుగా ఉన్నారు. వారు యూపీఏ పాలనతో విసిగిపోయో.. మార్పు కోసం ఆసక్తిగా ఎదురుచూసో.. ఎన్డీయేకు రెండుసార్లు పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో ఓటర్లలో మూడో వంతుగా, 2019లో దాదాపు 40 శాతంగా ఉండి మోదీ సర్కార్‌ను గెలిపించారు. కానీ, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ సీన్ మారబోతోంది.2024 ఎన్నికల్లో జెన్‌జీ రూపంలో 9 కోట్ల మంది కొత్త ఓటర్లు సరికొత్త రాజకీయ సమీకరణకు సంకేతాలు ఇచ్చారు. ఫలితంగా.. ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చినా మెజారిటీపై ప్రభావం చూపెట్టింది. అయితే మరో మూడేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేది ఈ తరమే. అప్పటికల్లా భారత జనాభా 151 కోట్లకు చేరవచ్చని ఓ అంచనా. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. మిల్లెనియల్స్ + జెన్‌జీ కలిపి 91 కోట్లకు చేరుకుంటుందని.. ఇందులో జెన్‌జీ తరంవాళ్లే అత్యంత పెద్ద వర్గం ఓటర్లుగా(43 నుంచి 47 శాతం) ఉండబోతున్నారు.1997–2012 మధ్య పుట్టిన జెన్‌జీ తరం మోదీ పాలన చూస్తూ పెరిగారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాం గురించి వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు(తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్లు లేకపోలేదు). కాబట్టి ఈ జనరేషన్ బీజేపీ ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఓ వ్యవస్థగానే చూస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ జనాభా సుమారు 2.5 బిలియన్లు, అంటే ప్రపంచ జనాభాలో 30% అన్నమాట. ప్రపంచంలోనే అత్యధికంగా ఒక్క భారతదేశంలోనే 40 కోట్ల దాకా ఈ జనాభా ఉంది. ఇప్పటికే వారు దేశ కార్మిక శక్తిలో నాలుగో వంతుగా ఉన్నారు. 2030 నాటికి వీళ్ల ద్వారా ఎకనమీ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని ఓ అంచనా. సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాజకీయ అవగాహన పొందడం వీరికున్న మరో ప్రత్యేకత.అయితే.. భారత్‌లో దేశీయంగా ఐటీ వృద్ధి మందగించడం, విద్యావకాశాలు తగ్గిపోతుండడం, నిరుద్యోగం రేటు గణనీయంగా పెరగడం, విదేశీ అవకాశాలు కఠినతరం కావడం, ఆర్థిక భద్రత కొరవడడం ఆందోళనను రేకెత్తిస్తోంది. గిగ్, తయారీ రంగాల్లో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ వాదనతో జెన్‌జీ ససేమీరా అంటోంది. ఇది కేవలం విధానపరమైన చర్చ మాత్రమే కాదు.. ఈ జనరేషన్‌కి నిత్యజీవిత సమస్య కూడా.సోషల్ మీడియా ఒకప్పుడు అధికార మార్పుకు కీలకమైన సాధనం. అయితే ఇప్పుడు అదొక విభిన్న వేదికగా మారింది. ఒక కథనాన్ని ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా పలు కోణాల్లో చర్చించేందుకు అక్కడ అవకాశం ఉంటోంది. ఇందులో అత్యధికంగా పాల్గొంటోంది కూడా జెన్‌జీనే.కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కచ్చితంగా భిన్నంగా ఉండబోతున్నాయి. అంటే గత ఎన్నికల్లా బీజేపీ-కాంగ్రెస్‌ల పోలిక కంటే.. ‘‘మాకు మంచి చేసింది ఎవరు?’’ అనే ప్రశ్నే 2029లో వారి ఓటును డిసైడ్ చేయబోతోంది. వీళ్ల తీర్పు గతం ఆధారంగా కాకుండా, ప్రస్తుత ఫలితాలు (ఉద్యోగాలు, విద్య, అవకాశాలు) ఆధారంగా ఉండబోతోంది. ఈ లెక్కన 2029 ఎన్నికలు మోదీ సర్కార్‌కు ఒక పెద్ద పరీక్షగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.పైన చెప్పుకున్నది రాజకీయ అభిప్రాయం ఎంత మాత్రం కాదు. ఇది డేటా ఆధారిత విశ్లేషణ. పీఎల్ఎఫ్ఎస్ (Periodic Labour Force Survey)భారతదేశంలో ఉద్యోగాలు, నిరుద్యోగం, కార్మికశక్తి పాల్గొనడం వంటి అంశాలపై డేటా ఇస్తుంది. కేంద్ర బ్యాంక్ RBI ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై నివేదికలు విడుదల చేస్తుంది. నాస్కామ్(NASSCOM) .. ఐటీ రంగంలో ఉద్యోగాలు, వృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై నివేదికలు ఇస్తుంది. ఈ మూడింటి డేటా ఆధారంగా.. Gen Z Is Not Impressed With Modi | The 2029 Election Warning అనే యూట్యూబ్ వీడియోలో Gen Z ఓటర్ల ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అవకాశాల లోటు గురించి వివరించారు.అలాగే.. ది పయనీర్ పత్రిక రాసిన ఓ వ్యాసంలో(Why Urban Gen Z Voters Prefer Narendra Modi’s Performance-Driven Politics) పట్టణ జెన్‌జీ ఓటర్లు ఫలితాలు, పనితీరు ఆధారంగా రాజకీయాలను అంచనా వేస్తున్నారని విశ్లేషించారు. అలాగే అజంతా అనే ఓ జర్నలిస్టు కమ్ రచయిత్రి ‘Youth and Politics: How Gen Z Is Reshaping India’s Democracy’ అనే వ్యాసంలో జెన్‌జీ రాజకీయ అవగాహన, 2024 ఎన్నికల్లో వారి పాత్ర గురించి, ఆపై సోషల్ మీడియా ప్రభావం, 2029 ఎన్నికల్లో వాళ్ల ప్రభావం ఎలా ఉండబోతోంది అని విశ్లేషించారు. VIDEO Credits: What Does This Data Say -
జనగణన మనందరి బాధ్యత
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం 133వ ’మన్ కీ బాత్’కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఇప్పుడు జరుగుతున్న జాతీయ జనగణన కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు. ఇది అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఖచ్చితంగా ఇందులో భాగస్వాములు కావాలి. తొలిసారిగా ప్రజలు తమ వివరాలను స్వయంగా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించాం. మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతాం. వివరాలు పూర్తి సురక్షితంగా ఉంటాయి’’ అని ప్రధాని హామీ ఇచ్చారు. స్వదేశీ పరిజ్ఞానంతో తమిళనాడులోని కల్పకంలో నిర్మించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ‘క్రిటికాలిటీ’ దశను దాటడం దేశ అణు ఇంధన ప్రయాణంలో చారిత్రక మైలురాయి’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణపై స్ఫూర్తిదాయక చర్యలు జరుగుతున్నాయని ప్రధాని హర్హం వ్యక్తం చేశారు. కచ్ రాణ్ ప్రాంతంలో జరుగుతున్న ప్రకృతి పరిరక్షణ యత్నాలను ప్రత్యేకంగా అభినందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపును సూచించే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని ‘వేవ్స్’ ఓటీటీ వేదికగా అందుబాటులోకి తెచ్చామన్నారు. -
బెంగాల్లో గూండారాజ్
కోల్‌కతా: టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్లో గూండారాజ్ సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను వేధించే గూండాలకు తృణమూల్ ఆశ్రయమిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఠాకూర్‌నగర్, హూగ్లీ జిల్లాలోని అరామ్‌బాగ్‌లో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. ‘‘క్రూరమైన తృణమూల్ ప్రభుత్వం మహిళలను హింసించే గూండాలకు అండగా నిలుస్తోంది. ఈ అరాచకాలను ఇకపై సహించబోమని చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అని అన్నారు. మహిళల భద్రతకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. సందేశ్‌కాళీ బాధితురాలు రేఖా పాత్ర, ఆర్జీ కర్ బోధనాసుపత్రి బాధితురాలైన వైద్యురాలి తల్లి రత్న దేవనాథ్‌కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్లిచ్చిందని ఆయన గుర్తు చేశారు. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక వలస వచ్చినవారికి సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తృణమూల్ చెప్పే అబద్ధాలను నమ్మొద్దని ఆయన కోరారు. మహిళలపై అత్యాచారాలు, హింసకు పాల్పడే దుండగులను మే 4 తర్వాత రాబోయే బీజేపీ ప్రభుత్వం న్యాయస్థానం ముందు నిలబెడుతుందని మోదీ స్పష్టం చేశారు. ‘‘బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఎప్పుడో ఖాయమైంది. రెండో దశ పోలింగ్ ఆ విజయాన్ని సుస్థిరం చేస్తుంది. తొలి దశలో 93 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడంతో తృణమూల్ అహం దెబ్బతిన్నది. ఆ పార్టీ ఇప్పుడు ‘మా, మాటీ, మానుష్’ గురించి మాట్లాడడం మానేసింది. ఎందుకంటే వారి అరాచక పాలనలో మా (అమ్మ) కన్నీరు పెడుతోంది. మాటీ (భూమి)ని ముఠాలు, చొరబాటుదారులకు అప్పగించారు. మానుష్ (ప్రజలు) ఉద్యోగాలు, ఉపాధి కోసం వలస పోవాల్సిన దుస్థితి దాపురించింది’’ అని ఆక్షేపించారు. ‘‘మేం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ బెంగాల్లో అమలు చేస్తామన్నారు. ఈ దిశగా తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటాం’’ అని ప్రకటించారు. ఆలయాల్లో మోదీ పూజలు ప్రధాని మోదీ బెంగాల్ ఠాకూర్ నగర్లో ఠాకూర్‌బారీ ఆలయంలో పూజలు చేశారు. కోల్‌కతాలో ప్రఖ్యాత థన్థానియా కాళీ ఆలయాన్నీ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని దుకాణంలో పూజా సామగ్రి కొనుగోలు చేశారు. అనంతరం ఉత్తర కోల్‌కతాలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. -
‘మీ కన్నీటి జల్లుకు.. భయమనే ముల్లుకు గుడ్ బై చెప్పండి’
కోల్‌కతా: ఈసారి పశ్చిమబెంగాల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి.. రెండో విడతకు సిద్ధమైన తరుణంలో మోదీ ప్రచారం మరింత ఊపదుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు(ఆదివారం, ఏప్రిల్ 26వ తేదీ) మమతా బెనర్జీ కీలకంగా భావించే నియోజకవర్గాల్లో పర్యటించిన మోదీ.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పటికీ పరిస్థితుల్లో ఏమీ మార్పులేదని, ఈసారి కచ్చితంగా ప్రభుత్వం మారాల్సిందేనన్నారు. ‘ పశ్చిమ బెంగాల్ ఎక్కడా చూసినా అమ్మ కన్నీటి జల్లే కనిపిస్తుంది. మనిషి అనేవాడు భయమనే ముల్లుపై అడుగులు వేస్తూ జీవిస్తున్నాడు. ఇక్కడ మట్టి ద్రోహల చెరలో ఉంది. ప్రధానంగా మహిళలకు రక్షణ కల్పించడంలో మమతా బెనర్జీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పట్ల అరాచకాలే కన్పిస్తున్నాయి. కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఓ యువ మహిళా డాక్టర్‌ను దారుణంగా పాడుచేసి చంపేశారు. ఇక కోల్‌కతా నగరానికి 20 కి.మీ దూరంలో ఉన్న కమ్దునిలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ తరహా ఘటనలే పశ్చిమ బెంగాల్లో కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రభుత్వం మీకు కావాలా.. లేక మహిళలకు అండగా ఉండే మా ప్రభుత్వం కావాలా?, ప్రభుత్వాన్ని మార్చి చూడండి’ అంటూ బెంగాల్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. #WATCH | North 24 Parganas, West Bengal: Addressing a public rally in Bangaon, Prime Minister Narendra Modi says, "BJP gives security to sisters and daughters and also gives opportunities. BJP has given a ticket to a sister who is connected to the struggle of Sandeshkhali's… pic.twitter.com/K0jxTup4b8— ANI (@ANI) April 26, 2026 -
ఎన్నికల వేళ.. ప్రధాని మోదీ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల తంతు కొనసాగుతున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో పలు విశేషాలను పంచుకున్నారు. ఆదివారం జరిగిన తన 133వ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో స్వచ్ఛమైన ఇంధనం, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, అణుసామర్థ్యంలో భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని ఆయన వివరించారు.పవన విద్యుత్‌లో పవర్ ఫుల్ రికార్డ్ప్రపంచ పవన విద్యుత్ రంగంలో భారతదేశం సరికొత్త చరిత్ర లిఖిస్తున్నదని ప్రధాని మోదీ ప్రకటించారు. అదృశ్యమైన గాలి శక్తి దేశ పురోగతికి ఎలా చోదక శక్తిగా మారిందో వివరిస్తూ, దేశం ఇటీవల సాధించిన మైలురాయిని గుర్తుచేశారు. ప్రస్తుతం భారత పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 56 గిగావాట్లను దాటిందని, తద్వారా ఈ ఇంధన సామర్థ్యంలో మన దేశం ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరిందని ఆయన తెలిపారు.కల్పక్కం రియాక్టర్.. అణుశక్తిలో అరుదైన ఘనతభారత అణు కార్యక్రమానికి సంబంధించి మోదీ ఒక కీలక ఘట్టాన్ని ప్రస్తావించారు. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’క్రిటికాలిటీ దశకు చేరుకుందని, అంటే రియాక్టర్ ఆపరేషన్ దశ ప్రారంభమైందని వెల్లడించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ రియాక్టర్.. దేశ పారిశ్రామిక వృద్ధి, ఇంధన, ఆరోగ్య రంగాలకు, అలాగే ఆధునిక రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ఇది మన శాస్త్రవేత్తల అద్భుత ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.బుద్ధుని బోధనలు.. ప్రపంచ శాంతికి మార్గంశాస్త్ర సాంకేతిక విజయాలతో పాటు రాబోయే పండుగల గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. మే నెలలో రానున్న బుద్ధ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల పరిస్థితుల్లో గౌతమ బుద్ధుని శాంతి సందేశం ఎంతో ఆవశ్యకమని ఆయన ఉద్ఘాటించారు. శాంతి అనేది మన అంతరంగం నుంచే మొదలవుతుందని, తనను తాను జయించడమే అత్యుత్తమ విజయమన్న బుద్ధుని బోధనలను ప్రధాని గుర్తుచేశారు.ఇది కూడా చదవండి: ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు: ప్రధాని మోదీ -
ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. వాషింగ్టన్ డీసీలోని ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న వేదిక వద్దకు తుపాకులు, కత్తులతో ఒక దుండగుడు చొరబడటం కలకలం రేపింది. ఈ భయానక ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని వ్యాఖ్యానించారు.తుపాకులు, కత్తులతో చొరబాటుశనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో అత్యంత పటిష్ట భద్రత నడుమ ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయుధాలు, కత్తులు ధరించిన ఒక వ్యక్తి అనూహ్యంగా ఈవెంట్ జరుగుతున్న బాల్రూమ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. భూగర్భంలో ఉన్న ఆ బాల్రూమ్ వెలుపల కాల్పుల శబ్దాలు వినిపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణభయంతో అతిథులు టేబుళ్ల కిందకు దూరి తలదాచుకున్నారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేగంగా స్పందించి, దుండగుడిని అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.ప్రధాని మోదీ సంఘీభావంఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా స్పందించారు. ట్రంప్ దంపతులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని.. హింస అనేది ఏ రూపంలో ఉన్నా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఇలాంటి దాడులకు ఏమాత్రం స్థానం లేదని ప్రధాని పేర్కొన్నారు. Relieved to learn that President Trump, the First Lady and Vice President are safe and unharmed following the recent security incident at a Washington DC hotel. I extend my best wishes for their continued safety and well-being. Violence has no place in a democracy and must be…— Narendra Modi (@narendramodi) April 26, 2026 -
‘గంగ’ చుట్టూ బెంగాల్ రాజకీయం..
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రెండో దశ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న వేళ పవిత్ర గంగా నది చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కాలుష్యమయంగా మారిన గంగా నది శుద్ధి, పరీవాహక ప్రాంత ప్రజల జీవనోపాధి, మత్స్యకారుల సమస్యలు, పెరుగుతున్న భూక్షయం వంటి అంశాలు పార్టీలకు రాజకీయ అ్రస్తాలుగా మారుతున్నాయి.బెంగాల్లో ముఖ్యమైన నది అయిన గంగ ఉత్తర నుండి దక్షిణం వరకు సుమారు 520 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 7 జిల్లాల్లోని సుమారు 90 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నది ప్రవహిస్తోంది. తీర ప్రాంతాల్లో 2.80 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నట్లు అంచనా. రెండో దశలో ఎన్నికలు జరుగనున్న ముర్షిదాబాద్, నాదియా, మాల్దా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో గంగా నది ప్రక్షాళన అంశమే ప్రచారాస్త్రంగా మారింది. తృణమూల్‌దే హవా ప్రతి ఏటా వర్షాకాలంలో గంగా నదికి భారీ వస్తోంది. తీర ప్రాంతాల్లో 8,000–10,000 హెక్టార్ల భూమి కోతకు గురై భూక్షయానికి కారణమవుతోంది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వరదల కారణంగా దాదాపు 20 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. పంటలు, ఇళ్లు నష్టపోతున్నారు. నిరాశ్రయులుగా మారుతున్నారు. అధిక వర్షాల సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి భరోసా లేకుండా పోతోంది. దీనికి తోడు పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యం వల్ల తాగునీటి ఇక్కట్లు పెరుగుతున్నాయి.అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, గంగా నదిని పరిశుభ్రంగా మారుస్తామని ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. గంగా పరీవాహక ప్రాంతాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా కనిపిస్తోంది. 2016, 2021 ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 80 శాతానికి పైగా సీట్లు గెల్చుకుంది. 2026 ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని తృణమూల్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తన పట్టు పెంచుకొనేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గంగా నదిపై ఆధారపడిన ఓటర్ల మనసులు గెల్చుకుంటే విజయం తథ్యమని ప్రధాన పార్టీలు నిర్ణయానికొచ్చాయి. ఆ దిశగానే వ్యూహాలు అమలు చేస్తున్నాయి. పోటాపోటీ విమర్శలుగంగా నది చుట్టూ పెనవేసుకున్న సమస్యల పరిష్కారం కోసం తీర రక్షణ గోడల నిర్మాణం, వరద నియంత్రణ ప్రాజెక్టులు, మత్స్యకారులకు ఆర్థిక సాయం, గంగా శుద్ధి ప్రణాళికలు వంటివి ప్రతిసారీ రాజకీయ హామీలుగా తెరపైకి వస్తున్నాయి. గంగా నది వరద నియంత్రణకు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేశామని, మరో రూ.100 కోట్లు మంజూరు చేశామని ఇటీవల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. వరద ప్రభావిత కుటుంబాలకు రూ.1,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. గంగా నది శుద్ధికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న మాదిరిగా బెంగాల్‌కు నిధులు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయినప్పటికీ నది ప్రక్షాళనకు రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీపై సైతం ఎన్నికల ప్రచారంలో గంగా నదిపై దృష్టి పెట్టి ప్రకటనలు చేస్తున్నారు. ‘‘బీహార్ తర్వాత గంగా నది పశ్చిమ బెంగాల్‌ను శుభ్రం చేస్తుంది’’అని వ్యాఖ్యానించారు. బీహార్‌లో పాగా వేశామని, ఇకపై బెంగాలో జెండా ఎగురవేయబోతున్నామని పరోక్షంగా తేల్చిచెప్పారు. నమామి గంగే కార్యక్రమం ద్వారా గంగా శుద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా సహకరించడం లేదని, అందుకే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.నది ప్రక్షాళన కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బెంగాల్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే స్వచ్ఛమైన నది సాకారమవుతుందని ఎన్నికల ప్రచారంలో తేల్చి చెబుతున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం ఆయన గంగా నదిలో పడవపై విహరించారు. ఈ విహారాన్ని సైతం సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. ప్రధానమంత్రి ఢిల్లీలోని యమునా నదికి వెళ్లి స్నానం చేస్తారా? అక్కడ నదిలో ప్రయాణించే సాహసం చేయగలరా? అని సవాల్ విసిరారు. మొత్తానికి గంగా నది వ్యవహారం అధికార, విపక్షాలకు ప్రచార ఆయుధంగా మారిపోయింది. -
తెలంగాణకు ప్రధాని మోదీ.. ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 9న తెలంగాణ పర్యటనకు రానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రానికి ఆయన వస్తారని వెల్లడించాయి. 9న వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తొలిసారిగా మోదీ రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ ఫేజ్–2ను జాతికి అంకితం చేయడంతోపాటు బీబీనగర్ ఎయిమ్స్‌ను కూడా జాతికి అంకితం చేసే అవకాశాలున్నాయి.కాగా, మల్లారెడ్డి ఏఐ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారా? లేదా? అన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు తూళ్ల వీరేందర్‌గౌడ్, అశోక్ వేములతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, అంశాలపై చర్చించినట్టు తెలిపారు. -
‘ఇది ఎన్నికల పోరాటం కాదు.. సిద్ధాంతాల పోరాటం’
హుగ్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మకానికి పెట్టారంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారంలో భాగంగా హుగ్లీ జిల్లాలోని శ్రీరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో ద్వేషాన్ని, భయాన్ని నింపుతారు. ఇది ఎన్నికల పోరాటం కాదు.. సిద్ధాంతాల పోరాటం’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.ప్రధాని మోదీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలపై తీవ్ర స్థాయిలో రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇద్దరివి.. అవినీతి, బెదిరింపులతో ఒకే రకమైన పాలన విధానాలు అంటూ ఆరోపించారు. మమతా బెనర్జీ.. మోదీ కంటే ఏమాత్రం తక్కువ అవినీతిపరురాలు కాదు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రెండూ భయాందోళనలు, అరాచక వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నాయని రాహుల్ అన్నారు.‘‘మమతా నేరుగా బీజేపీతో పోరాడదు కాబట్టే ఈడీ కేసులు లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తనపై అనేక కేసులు నమోదు చేసింది.. కానీ మమతా బెనర్జీపై ఒక్క కేసు కూడా లేదు. ఆమె బీజేపీతో నేరుగా పోరాడకపోవడమే దీనికి కారణమంటూ రాహుల్ ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనను వరుసగా ఐదు రోజుల పాటు 55 గంటల సేపు ప్రశ్నించిందని గుర్తు చేస్తూ.. మమతా బెనర్జీని ఎన్ని గంటల పాటు విచారించారు?’’ అంటూ రాహుల్ ప్రశ్నించారు. తాను ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నానని, తన ఇంటిని లాక్కున్నారని, తన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా తొలగించారని రాహుల్ చెప్పారు. "నాపై 36 కేసులు ఉన్నాయి. ప్రతి 10-15 రోజులకు ఒకసారి జార్ఖండ్, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలకు కోర్టు కేసుల కోసం తిరగాల్సి వస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.‘‘కేవలం కాంగ్రెస్ మాత్రమే బీజేపీతో సైద్ధాంతికంగా పోరాడుతోందని, అందుకే మోదీ తనను, పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ఎప్పుడూ టార్గెట్ చేస్తారు. బెంగాల్ ఎన్నికలు ముగియనివ్వండి. ఆ తర్వాత మోదీ ఒక్క మాట కూడా మమతకు వ్యతిరేకంగా మాట్లాడరు. పశ్చిమ బెంగాల్లో పరిశ్రమలను మమత నాశనం చేశారు. నిరుద్యోగాన్ని పెంచారు ఆరోపించారు. బెంగాల్లో ఉద్యోగం రావాలంటే టీఎంసీలో బంధువులు ఉండాలి. లేకపోతే రాదు’’ అంటూ రాహుల్ విమర్శించారు. -
ఈ అవమానాలు చాలు గూగుల్ లేకుండా బతకలేమా!
-
Viral: మోదీ హత్యకు స్కెచ్..!
-
బీజేపీ పొలిటికల్ గేమ్.. బెంగాల్ తర్వాత ఆ రాష్ట్రమే!
కేంద్రంలోని అధికార బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం పొలిటికల్ గేమ్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే బీహార్ రాజకీయాల్లో బీజేపీకి తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అటు బెంగాల్లో కూడా విజయం బీజేపీదేనని కాషాయ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, తదుపరి బీజేపీ టార్గెట్ పంజాబ్ అనే వార్తలు జాతీయ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీలోకి రాఘవ్ చద్దా సహా పలువురు నేతల చేరికలు అనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే బీజేపీ అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరి పంజాబ్‌లో బీజేపీకి అధికారం అంత సులువు కాదనే విషయాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. బీహార్‌లో సంబరాలు జరుగుతుండగా గంగానది బీహార్ నుండి బెంగాల్‌కు ప్రవహిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించి.. తదుపరి ఎన్నికల పోరుకు సంకేతం ఇచ్చారు. ఇప్పుడు, బెంగాల్ దంగల్ ముగియక ముందే పంజాబ్ యుద్ధం మొదలైంది. బీజేపీ ఎన్నికల రథం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందన్న సంకేతాలిస్తూ.. పంజాబ్‌లో 2027 ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలపై కాషాయ దళం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ పొలిటికల్ గేమ్‌లో భాగంగా పంజాబ్ రాజకీయాల్లోకి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఎంపీలు రాఘవ్ చద్దా, పంజాబ్‌కు చెందిన మరో ఐదుగురు ఎంపీలు బీజేపీలో చేరడం ఈ విషయాన్నే సూచిస్తుంది.బీజేపీ సమస్య.. అయితే, పంజాబ్‌లో బీజేపీ ఎన్నడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. పంజాబ్‌లో బీజేపీకి స్థానిక నాయకుల కొరత ఉంది. పంజాబ్‌లో బీజేపీకి ప్రధాన సవాళ్లు స్థానిక నాయకత్వం లోపం, సిక్కు రైతు వర్గం నమ్మకం పొందడం. అలాగే, దశాబ్దాలుగా శిరోమణి అకాలీ దళ్ (SAD)కు జూనియర్ భాగస్వామిగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. వ్యవసాయ బిల్లుల విషయంలో 2020లో విడిపోవడానికి ముందు శిరోమణి.. బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీకి అధికారం కావాలంటే దానికి రాష్ట్రంతో సంబంధం ఉన్న నాయకులు అవసరం. ప్రస్తుతం పంజాబ్‌లో బీజేపీకి ఉన్న ఏకైక ప్రముఖ నాయకుడు రవ్నీత్ సింగ్ బిట్టు. ఆయన కాంగ్రెస్ నుండి పార్టీలోకి మారారు. దీంతో, పాత నాయకులు, కొత్తగా చేరిన వారి మధ్య విభేదాలు, వ్యూహాత్మక గందరగోళం నెలకొంది.అవకాశాలు.. మరోవైపు.. ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే మరి కొందరు కీలక నేతలు కావాల్సిందే. ఈ విషయంలోనే ఆప్ నుండి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, ఇతర ఎంపీల పాత్ర పంజాబ్‌లో బీజేపీకి ఎంతో కీలకం కానుంది. ఎంపీలు రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, విక్రమ్ సాహ్నే వంటి ప్రముఖులు బీజేపీలో చేరడం ఆమ్ ఆద్మీ పార్టీలో విభజనను చూపిస్తోంది. దీంతో, బీజేపీకి కొత్త ఓటర్లను ఆకర్షించే అవకాశం ఏర్పడింది. రాఘవ్ చద్దా వంటి యువ నాయకులు బీజేపీకి పట్టణ, చదువుకున్న, మధ్యతరగతి ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. అకాళీదళ్ బలహీనతతో సిక్కు మతపరమైన ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లే చాన్స్ కూడా ఉంది. ఇదిలా ఉండగా.. పట్టణ హిందూ ఓటర్లలో కాంగ్రెస్ ప్రభావం తగ్గడం బీజేపీకి ప్రధానంగా లాభం కావచ్చు.బీజేపీ వ్యూహాలు.. రైతు వర్గం నమ్మకం పొందడం బీజేపీకి అత్యవసరం. వ్యవసాయ చట్టాలపై నిరసనల తర్వాత బీజేపీపై రైతు వర్గంలో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతు ఇచ్చే విధానాలు, ఎంఎస్పీ హామీలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బీజేపీ హామీ ఇస్తే అది పార్టీకి మైలేజ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఎంపీల చేరిక కూడా బీజేపీకి ప్లస్ కాగా.. అధికార ఆప్, కాంగ్రెస్ పార్టీలకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.గత ఫలితాలు.. పంజాబ్‌లో 2022లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో 117 అసెంబ్లీలో 92 స్థానాలు గెలిచి, పంజాబ్‌లో తొలిసారి పూర్తి మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పరిమితమైంది. ఇదే సమయంలో శిరోమణి అకాళీదల్ 15 నుంచి 3 స్థానాలకు పడిపోయింది. బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. -
30 నిమిషాల డీల్.. ట్రెండింగ్‌లో పరిణితీ-రాఘవ్ చద్దా జోడి (ఫొటోలు)
-
మోదీజీ.. యమునలో స్నానం చేయండి: మమత సవాల్
కోల్కత్తా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా ప్రధాని మోదీ హుగ్లీ నదిలో పడవ షికారు చేయడం.. గంగా, హుగ్లీ నది గురించి మాట్లాడటంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ప్రధాని మోదీ యమునా నదిలో స్నానం చేయాలని సవాలు విసిరారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గంగానది శుభ్రంగా ఉందని, యమునా మాత్రం కాలుష్యంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. “ఢిల్లీ యమునాలో ఒకసారి స్నానం చేసి చూపించండి. అది పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. మీరు యమునాను శుభ్రం చేయలేరు, కానీ ఇక్కడ గంగానది మీద ఫోటోలు దిగడానికి వస్తారు” అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో ప్రధానమంత్రి పర్యటనను మమతా బెనర్జీ స్వాగతించారు. కానీ నదిని శుభ్రపరచడానికి మరియు దాని నదీ తీరాన్ని సుందరీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రశంసించారు. రాష్ట్రంలో ఓట్లు రాబట్టడానికే ఆయన పడవ ప్రయాణం చేశారని ఆమె ఆరోపించారు. కానీ, బెంగాలీలు అంత అమాయకులు కాదంటూ వ్యాఖ్యానించారు.హూగ్లీలో మోదీ పడవ షికారు.. ఇక, అంతకుముందు ప్రధాని మోదీ.. హూగ్లీ నదిలో కొద్దిసేపు బోటు షికారు చేశారు. అక్కడి రమణీయమైన దృశ్యాలను వెంటతీసుకొచ్చిన తమ కెమెరాలో బంధించారు. గంగానదికి హూగ్లీ ఉపనది. ‘‘గంగానది అనేది ప్రతి ఒక్క బెంగాళీ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. బెంగాల్ ఆత్మలో గంగానదీ సజీవంగా పారుతుంది. యావత్ మానవ నాగరికత స్ఫూర్తిని ఈ పవిత్ర నదీజలాలు వెంట తీసుకొచ్చాయి. ఈరోజు ఉదయం కోల్‌కతాలో హూగ్లీ నది హొయలను నా కెమెరా కంటితో చూశా. కొన్ని జ్ఞాపకాలను ఫొటోలుగా కెమెరాలో బంధించా. విద్యాసాగర్ సేతు, ప్రఖ్యాత హౌరా వంతెనను పడవలో ప్రయాణిస్తూ దగ్గర్నుంచి తిలకించి ముగ్ధుడినయ్యా. హూగ్లీ నదీతీరంలో కాసేపు గడిపి గంగామాత రుణం తీర్చుకునే సదవకాశం సంపాదించా’’అని అన్నారు. తాను తీసిన ఫొటోలను తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.


