హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. పలు అభివృద్ధి కార‍్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మే 10వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు మోదీ బెంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరతారు.
మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపై నుంచే పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైటెక్ సిటీకి వెళ్తారు. 3.45-4.15 గంటల మధ్య అక్కడి సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు.
తిరిగి 4.40 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40-5.25 గంటల మధ్య రిజర్వ్ సమయం ఉంటుంది. 5.30 గంటలకు మోదీ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో ఉంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జామ్ నగర్‌కు తిరిగి వెళ్తారు.
ప్రధానమంత్రి మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత, ట్రాఫిక్, బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. కాన్వాయ్ మార్గాలను పరిశీలించి అవసరమైన రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు.


