ఢిల్లీలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..! | Delhi Announces 2 Days Of WFH A Week In Government Offices | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..!

May 14 2026 4:40 PM | Updated on May 14 2026 5:02 PM

Delhi Announces 2 Days Of WFH A Week In Government Offices

ఢిల్లీ:  ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఇందన పొదుపు పాటించాలనే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అందుకు శ్రీకారం చుట్టింది ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించి తద్వారా ఇంధనం వాడకాన్ని తగ్గించాలనే యోచనతో రెండు రోజుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు నడుంబిగించింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం.  

ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో రెండు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఈ మేరకు గురువారం( మే 14వ తేదీ) ఆదేశాలు జారీ చేసిన సీఎం రేఖా గుప్తా.. దీన్ని రేపట్నుంచే(శుక్రవారం) నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 

 ఇంధన పొదుపు, సమర్థవంతమైన పాలనను ప్రోత్సహించేందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ రాజధానిలో  ‘మేరా భారత్ మేరా యోగ్దాన్’ (నా భారతదేశం, నా సహకారం) ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. 

అదే సమయంలో ప్రతి సోమవారాన్ని 'సోమవారం మెట్రో'గా పాటిస్తామని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ మెట్రోలో ప్రయాణిస్తారని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షిప్తంగా..

  • ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు  వర్క్ ఫ్రం హోమ్
  • వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయం
  • రేపటి నుంచి నిర్ణయాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశం
  • సీఎం కాన్వాయ్ లో వాహనాలు నాలుగుకు తగ్గింపు
  • నాలుగు వాహనాల్లో రెండు ఎలక్ట్రిక్ వాహనాలు
  • నా భారతదేశం-  నా సహకారం ఉద్యమాన్ని ప్రారంభించిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రతి సోమవారం "మండే మెట్రో " నిర్వహించనున్న ప్రభుత్వం
  • మంత్రులు అధికారులు ఉద్యోగులు అందరూ ఢిల్లీ మెట్రోలోనే రావాలని ఆదేశం
  • సామాన్య ప్రజలు వారంలో ఏదో ఒక రోజును నో వెహికిల్  డే నిర్వహించాలని ఆదేశం
  • ఆరు నెలల వరకు పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయొద్దని నిర్ణయం
  • ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్ 10% పెంపు
  • ఏడాది విదేశీ ప్రయాణాలు పూర్తిగా రద్దు
  • 90 రోజులపాటు మై ఇండియా మై కాంట్రిబ్యూషన్ ఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement