‘మీ కన్నీటి జల్లుకు.. భయమనే ముల్లుకు గుడ్‌ బై చెప్పండి’ | PM Modi Hit Out At Mamata Banerjee Sarkar In West Bengal Campaign | Sakshi
Sakshi News home page

‘మీ కన్నీటి జల్లుకు.. భయమనే ముల్లుకు గుడ్‌ బై చెప్పండి’

Apr 26 2026 6:32 PM | Updated on Apr 26 2026 6:52 PM

PM Modi Hit Out At Mamata Banerjee Sarkar In West Bengal Campaign

కోల్‌కతా: ఈసారి పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం సాగుతోంది.  ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి.. రెండో విడతకు సిద్ధమైన తరుణంలో మోదీ ప్రచారం మరింత ఊపదుకుంది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీనే లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఈరోజు(ఆదివారం, ఏప్రిల్‌ 26వ తేదీ) మమతా బెనర్జీ కీలకంగా భావించే నియోజకవర్గాల్లో పర్యటించిన మోదీ.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పటికీ పరిస్థితుల్లో ఏమీ మార్పులేదని, ఈసారి కచ్చితంగా ప్రభుత్వం మారాల్సిందేనన్నారు. 

‘ పశ్చిమ బెంగాల్‌ ఎక్కడా చూసినా అమ్మ కన్నీటి జల్లే కనిపిస్తుంది. మనిషి అనేవాడు భయమనే ముల్లుపై అడుగులు వేస్తూ జీవిస్తున్నాడు. ఇక్కడ మట్టి ద్రోహల చెరలో ఉంది. ప్రధానంగా మహిళలకు రక్షణ కల్పించడంలో మమతా బెనర్జీ సర్కార్‌ పూర్తిగా  విఫలమైంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పట్ల అరాచకాలే కన్పిస్తున్నాయి. 

కోల్‌కతా ఆర్జీ కార్‌ ఆస్పత్రిలో ఓ యువ మహిళా డాక్టర్‌ను దారుణంగా పాడుచేసి చంపేశారు. ఇక కోల్‌కతా నగరానికి 20 కి.మీ దూరంలో ఉన్న కమ్దునిలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు.  ఈ తరహా ఘటనలే పశ్చిమ బెంగాల్‌లో కనిపిస్తున్నాయి.  ఇటువంటి ప్రభుత్వం మీకు కావాలా.. లేక మహిళలకు అండగా ఉండే మా ప్రభుత్వం కావాలా?, ప్రభుత్వాన్ని మార్చి చూడండి’ అంటూ బెంగాల్‌ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement