మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ | Who is Makhanlal Sarkar PM Modi took blessings From Him Video Details | Sakshi
Sakshi News home page

మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ

May 9 2026 11:52 AM | Updated on May 9 2026 12:22 PM

Who is Makhanlal Sarkar PM Modi took blessings From Him Video Details

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ఉదయం ప్రమాణం చేశారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓ పెద్దాయన్ని శాలువాతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాదాభివందనం చేశారు. ‘‘బెంగాల్‌లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పా కదా.. వచ్చింది’’ అంటూ మోదీ ఆ పెద్దాయనతో అన్నారు. ఆయన పేరు మఖన్‌లాల్‌ సర్కార్‌. పశ్చిమ బెంగాల్‌లోనే అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్త. ఆయన నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది.

బెంగాల్‌కు చెందిన మఖన్‌లాల్‌ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్‌ రాజకీయ విభాగంగా.. 1951లో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ భారతీయ జనసంఘ్ (BJS) స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో మఖన్‌లాల్‌ అందులో చేరారు. "ఒక దేశం, ఒక జెండా" అనే నినాదంతో 1952లో కశ్మీర్‌లో జాతీయ జెండా ఎగరేయడానికి ముఖర్జీ ప్రయత్నించారు. ఆ సమయంలో మఖన్‌లాల్‌ కూడా ఉన్నారు. ఈ ఉద్యమంలో ఆయన అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.

ఆ తర్వాత.. 1977లో బీజేఎస్‌ జనతా పార్టీలో విలీనమై తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)గా రూపాంతరం చెందింది. టెక్నికల్‌గా మఖన్‌లాల్‌ బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బెంగాల్‌లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో గౌరవసూచీకంగా ప్రధాని మోదీ ఆయన్ని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement