అప్పటి వరకు బంగారం కొనుగోలు చేయొద్దు : ప్రధాని మోదీ | Modi's key statement on gold | Sakshi
Sakshi News home page

అప్పటి వరకు బంగారం కొనుగోలు చేయొద్దు.. దేశ ప్రజలకు మోదీ కీలక సూచనలు

May 10 2026 7:41 PM | Updated on May 13 2026 4:09 PM

Modi's key statement on gold

సాక్షి,హైదరాబాద్‌: బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారింది. అందుకే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవడం మంచిదన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు.

ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డిజీల్‌ ధరలు తీవ్రంగా పెరిగాయి.గ్యాస్‌,యూరియా ధరలు అమాంతం పెరిగినప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ధరలు పెంచడం లేదు. "ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్‌, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి" అని మోదీ అన్నారు.

ప్రజలంతా ఎలక్టిక్‌ వాహనాల వైపు మళ్లాలని, వాటినే వినియోగించాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని  ఉక్రెయిన్- రష్యా యుద్ధం, పశ్చిమాసియా యుద్ధాలతో సరఫరా చైన్ దెబ్బతింది అని మోదీ అన్నారు. ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని తెలిపారు. వంట నూనెలు ఎరువుల మందులను పూర్తిగా తగ్గించాలని పురుగుల మందులు, ఎరువుల వినియోగాన్ని తక్కువ చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement