సామాన్యుడి పెళ్లికి ప్రధాని శుభాశీస్సులు | Heartfelt Gratitude For inviting Me PM Modi | Sakshi
Sakshi News home page

సామాన్యుడి పెళ్లికి ప్రధాని శుభాశీస్సులు

Apr 28 2026 1:10 PM | Updated on Apr 28 2026 1:55 PM

Heartfelt Gratitude For inviting Me PM Modi

రాయచూరు రూరల్‌(కర్ణాటక): పల్లెటూరులో పెళ్లి చేసుకుంటున్నానని ఓ సామాన్య యువకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పెళ్లి పత్రికను పంపగా అక్కడి నుంచి వరుడికి ప్రత్యుత్తరం లభించిన ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా కానిహాళలో జరిగింది. తాను ఈనెల 13న సవితతో వివాహం నిశ్చితార్థం చేసుకున్నానని, తమరు వివాహానికి హాజరు కావాలంటూ గ్రామానికి చెందిన రాజేష్‌ నాయక్‌ అనే సామాన్యుడు పంపిన శుభలేఖకు ప్రధాని కార్యాలయం నుంచి నూతన వధూవరులకు శుభాశీస్సులు పలుకుతూ జవాబు ఇవ్వడం వైరల్‌గా మారింది. భవిష్యత్తులో నూతన దంపతుల వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా గడపాలని ఆ లేఖలో ఆకాంక్షించారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement