- దేశం నలుమూలలా బీజేపీకి ప్రజల నుంచి ఆదరణ
- బీజేపీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ ఆమోద ముద్ర
హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు. మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘బెంగాల్‌లోని విజయ ఉత్సాహం తెలంగాణలోనూ కనపడుతోంది. తొలిసారి బెంగాల్‌లో అఖండ విజయం సాధించాం.
పుదుచ్చేరిలోనూ మరోసారి ఎన్డీఏనే గెలిచింది. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. నిన్న నేను బెంగాల్‌లో ఉన్నాను. తొలిసారి అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక విజయోత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది.
ఇక్కడ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారు. ఈ రోజు దేశం నలుమూలలా భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం నిరంతరం పెరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ తమ ఆమోద ముద్ర వేస్తున్నారు. నిన్న నేను బెంగాల్‌లో ఉన్నాను. తొలిసారి అక్కడ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారు. దేశం నలుమూలలా బీజేపీకి ప్రజల నుంచి ఆరదణ నిరంతరం పెరుగుతోంది. బీజేపీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ ఆమోద ముద్ర వేస్తున్నారు. పచ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంతో దేశం అంతా సంబరాలు జరుగుతున్నాయి.
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పెంచింది. పశ్చిమ బెంగాల్‌ను సంకెళ్ల బందీ నుంచి విడదీశాం. ఇక తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్. దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో మాత్రమే ఉంది. అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నైజం. తెలంగాణలో అబద్ధాలతో ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కంటే లెఫ్ట్ అయింది.
కాంగ్రెస్ ముస్లిం లీగ్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ ముస్లిం లీగ్ అయింది. మావోయిస్టులను కాంగ్రెస్ ఎన్నో ఏండ్ల నుంచి రక్షిస్తుంది. తెలంగాణ పోలీస్ కేంద్రంతో కలిసి పనిచేసి ఉంటే మావోయిస్టులు ఎప్పుడో ఖతం అయ్యేవారు. కొంత ఆలస్యం అయినా మావోయిస్టులు ఖతం అయ్యారు. కొత్త విజన్, ఆలోచన, వికసిత్ తెలంగాణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని తెలిపారు .


