బోధనాంశంగా ‘మోదీ తత్వం’  | Vadodara MS University introduces Modi Tattva module in sociology syllabus | Sakshi
Sakshi News home page

బోధనాంశంగా ‘మోదీ తత్వం’ 

May 3 2026 5:03 AM | Updated on May 3 2026 5:44 AM

Vadodara MS University introduces Modi Tattva module in sociology syllabus

మహారాజా సయాజీరావ్‌ 

యూనివర్సిటీలో కొత్త కోర్సులు 

ఆర్‌ఎస్‌ఎస్, హిందూయిజం పైనా పాఠాలు

వడోదర: గుజరాత్‌లోని బరోడాలో ఉన్న మహారాజా సయాజీరావ్‌ విశ్వవిద్యాలయంలో బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనా దక్షతను కీర్తిస్తూ కొత్త బోధనాంశాలను చేర్చారు. జూన్‌తో మొదలయ్యే నూతన విద్యా సంవత్సరంలో బీఏ సోషియాలజీ నాలుగేళ్ల కోర్సును ఆరంభించనున్నారు. ఇందులో నాలుగో ఏడాది పది పేపర్లలో మోదీ నాయకత్వ ప్రతిభ, దేశీయ నాలెడ్జ్‌ సిస్టమ్, హిందూ రిలీజియస్‌ స్టడీస్, జాతీయవాదం వంటి పాఠాలను చేర్చారు.

 రెండేళ్ల సోషియాలజీ పీజీ కోర్సులోనూ ఈ సబ్జెక్టులను పాఠాలుగా బోధించనున్నారు. మాస్టర్స్‌ కోర్సులో ‘సోషియాలజీ ఆఫ్‌ ప్యాట్రియాటిజం’కోర్సులో మోదీతత్వాన్ని విద్యార్థులు బోధించనున్నారు. పలువురు సంఘ సంస్కర్తలు, సామాజికవేత్తల జీవితవిశేషాలను విడమర్చి చెప్పబోతున్నామని వర్సిటీలో సోషియాలజీ విభాగ సారథి డాక్టర్‌ వీరేంద్రసింగ్‌ వెల్లడించారు.

 ‘‘మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రధాని మోదీ రాజకీయ చతురత, నాయకత్వ లక్షణాలను విశదీకరించనున్నాం. మ్యాక్స్‌ వెబర్, మహాత్మాగాం«దీ, మారి్టన్‌ లూథర్‌ కింగ్‌ వంటి మహానాయకుల నాయకత్వలక్షణాలతోపాటు ప్రధాని మోదీకి సంబంధించిన పాఠ్యాంశాలను చాన్నాళ్లపాటు బోధించనున్నాం. డిజిటల్‌ జాతీయవాదం, పౌరసత్వం, వారసత్వం, ప్రపంచీకరణ, ఉద్యమాలను మోదీ కోణంలో చూపిస్తూ మోదీతత్వాన్ని విద్యార్థులకు బోధిస్తాం. 

పాత పెద్దనోట్ల రద్దు, డిజిటల్‌ విప్లవం, ఫాస్టాగ్, జల్‌ శక్తి శాఖ ఏర్పాటు, యూపీఐ వంటి విప్లవాత్మక సంస్కరణలు తేవడం వాటి ద్వారా కోట్లాది మంది ప్రజలు లబి్ధపొందడం, ఆయా పథకాలకు ప్రజల నుంచి వస్తున్న అమితమైన ఆదరణ వంటి అంశాలను బోధిస్తాం. ‘సోషియాలజీ ఆఫ్‌ ప్యాట్రియాటిజం’కోర్సులో నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ను విద్యాసంవత్సరంలో గరిష్టంగా 15 గంటలే బోధిస్తారు’’అని ఆయన వెల్లడించారు. 

దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ క్షేత్రస్థాయి కార్యకలాపాలు, సమాజంపై దాని ప్రభావాలనూ వివరిస్తామని తెలిపారు. డాక్టర్‌ వీరేంద్రసింగ్‌ నీతి ఆయోగ్‌ లో ప్రజాప్రాజెక్టులను పర్యవేక్షిస్తారు. ఎంఏ విద్యార్థులు గ్రామీణప్రాంతాల్లో చేసిన సర్వేచేశాక వచ్చిన ఫలితాల ఆధారంగా ఇలాంటి వినూత్న పాఠాలను జతచేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. హిందుస్వరాజ్యం గురించి తొలిసారిగా ప్రబోధించిన ఛత్రపతి శివాజీ మహరాజ్, నాటి బరోడా పాలకుడు మహారాజా సయాజీరావ్‌ గైక్వాడ్‌–3ల గురించి సహా ఎంతోమంది సంఘసంస్కర్తల పాఠ్యాంశాలనూ కొత్తగా చేర్చామని ఆయన పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement