హైదరాబాద్: ‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్‌రెడ్డి అన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడబోను’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ ప్రసంగానికి ముందు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఆ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ మోదీ పై విధంగా వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు.
కాగా, మోదీ ప్రసంగిస్తూ.. ‘‘గుజరాత్‌కు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో తెలంగాణకు అంతే నిధులు ఇస్తాం. దీంతో తెలంగాణకు అందుతున్న నిధుల్లో సగం కోత పడుతుంది. కాబట్టి మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో అది సాధ్యం కాదు. మీరు కూడా నాతో కలిసి రండి సైబరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు రూపాయలు కేటాయించాం. తెలంగాణలో జాతీయ రహదారులు రెట‍్టింపు అయ్యాయి. ఇప్పుడు బడ్జెట్‌లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. దేశంలో టెక్స్‌టైల్ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్‌టైల్స్ రంగానికి ఊతమిస్తుంది.
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇప్పుడు తెలంగాణ రైల్వే బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. 2014లో ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్ రూ.1000 కోట్లు మాత్రమే. హైదరాబాద్ అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించాం. రోడ్లు, రైల్ కనెక్టివిటీని పెంచాం. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని చెప్పారు.


