మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్‌ భేటీ  | PM Narendra Modi Meets Russia FM Sergey Lavrov In New Delhi, Discusses Ukraine, West Asia And Global Issues | Sakshi
Sakshi News home page

మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్‌ భేటీ 

May 15 2026 4:27 AM | Updated on May 15 2026 10:09 AM

PM Narendra Modi Meets Russia FM Sergey Lavrov in New Delhi

న్యూఢిల్లీ:  రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా పరిణామాలతోపాటు పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. వివాదాలు, సంఘర్షణల పరిష్కారానికి సంప్రదింపులు, దౌత్య మార్గాలకే భారత్‌ స్థిరంగా కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 లావ్రోవ్‌ను నందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాల పురోగతిపై తాజా సమాచారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశానని వెల్లడించారు. రష్యా అధినేత పుతిన్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని లావ్రోవ్‌ను మోదీ కోరారు.  

మోదీని కలిసిన ‘బ్రిక్స్‌’విదేశాంగ మంత్రులు
  బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీని కలిశారు. ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చారు. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్‌ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ, బ్రెజిల్‌ మంత్రి మౌరో, ఇండోనేíÙయా మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా మంత్రి రోనాల్డ్‌ లామోలా ఉమ్మడిగా మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు బ్రిక్స్‌దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సు గురువారం ప్రారంభమైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement