హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్‌.. ఇవాళ ఆ రూట్లలో వెళ్లొద్దు! | Hyderabad Police Impose Traffic Restrictions For Pm Modi Visit | Sakshi
Sakshi News home page

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్‌.. ఇవాళ ఆ రూట్లలో వెళ్లొద్దు!

May 10 2026 1:35 PM | Updated on May 10 2026 1:54 PM

Hyderabad Police Impose Traffic Restrictions For Pm Modi Visit

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2,000 మంది శాంతిభద్రతల పోలీసు సిబ్బంది, 620 మంది ట్రాఫిక్‌ పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక యూనిట్లను మోహరించాయి. పరేడ్‌గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

👉ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..
⇒బేగంపేట నుంచి సంగీత్‌ వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్‌– ప్యాట్నీ– క్లాక్‌ టవర్‌ మీదుగా సంగీత్‌ చౌరస్తాకు మళ్లిస్తారు. సంగీత్‌ నుంచి బేగంపేట వెళ్లే వాహనాలకూ ఇదే మార్గంలో మళ్లింపు ఉంటుంది.
⇒బేగంపేట నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్, ప్యాట్నీ ఫ్లైఓవర్‌ల మీదుగా సెయింట్‌ జాన్స్, ఏఓసీ మార్గాల నుంచి మళ్లిస్తారు. ⇒బాలానగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వాహనాలను ఫతేనగర్, అమీర్‌పేట, పంజాగుట్ట నుంచి బేగంపేట మార్గంలోకి మళ్లిస్తారు.
⇒బేగంపేట నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయంగా రసూల్‌పురా జంక్షన్, మినిస్టర్‌ రోడ్డు రాణిగంజ్, సికింద్రాబాద్‌ వైపు వెళ్లాలి.
⇒సికింద్రాబాద్‌ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలు క్లాక్‌టవర్,  ప్యాట్నీ, ప్యారడైజ్‌ – సీటీఓ మీదుగా బోయిన్‌పల్లి వైపు మళ్లిస్తారు.
⇒ట్యాంక్‌ బండ్‌ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్‌ నుంచి సీటీఓ టాడ్‌బంద్‌– డైమండ్‌ పాయింట్‌ మార్గాల్లో మళ్లిస్తారు.

👉ఈ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌.. 
⇒నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌ నుంచి వచ్చే వాహనాలకు ఐఏఎల్, ఆర్‌జీఐ స్టేడియం, ఉప్పల్‌ భగాయత్, రైల్వే డిగ్రీ కళాశాల, ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్‌ వద్ద పార్క్‌ చేయాలి.
⇒నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్‌ మార్గాల నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్‌ పరిధిలోని దోభీఘాట్, ఇంపీరియల్‌ గార్డెన్స్,బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డు ఆవరణలో నిలపాలి.
⇒మెహిదీపట్నం, మహబూబ్‌ నగర్, కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డులోని సంజీవయ్య పార్కు, ఎన్‌టీఆర్‌ స్టేడియం, బస్‌భవన్, నిజాంకాలేజ్, పబ్లిక్‌ గార్డెన్స్‌ ఆవరణలో పార్కు చేయాలి.
⇒సంగారెడ్డి, హైటెక్‌ సిటీ నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట,  నెక్లెస్‌ రోడ్డు మార్గంలో పార్కు చేయాలి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement