వారణాసి: యూపీలోని వారణాసి పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. బుధవారం ఉదయం శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. డోలు, సన్నాయి, శంఖారావాల నడుమ పరమశివునికి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు లహురబీర్ క్రాసింగ్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు భారీ సంఖ్యలో పోటెత్తారు. వీధుల గుండా ప్రధాని కాన్వాయ్ వెళుతుండగా.. ‘హర హర మహాదేవ్’, 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని రోడ్‌షో ఆద్యంతం అత్యుత్సాహంగా సాగింది.
ఈ పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మీరట్, ప్రయాగ్‌రాజ్ నగరాలను కలుపుతూ హై-స్పీడ్ కారిడార్‌గా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్నే మార్చేయనుంది. తన రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం బనారస్ లోకోమోటివ్ వర్క్స్ మైదానంలో జరిగిన ‘మహిళా సమ్మేళనం’లో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మహిళలు హాజరైన ఈ సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా పాల్గొన్నారు.
VIDEO | Varanasi: PM Modi (@narendramodi) offers prayers at Kashi Vishwanath temple.#Varanasi #KashiVishwanath
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/U9gU1ILH9P
— Press Trust of India (@PTI_News) April 29, 2026


